
బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, హరీష్ రావును అమెరికా తెలుగుసంఘం (ఆటా) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించింది. ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలనుఈ సందర్భంగా హరీష్ రావుకు వివరించారు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగువారి పరిస్థితులపై చర్చించారు. పదేళ్ల బిఆర్ ఎస్ పాలనలో తెలంగాణ ను దేశంలో నంబర్ వన్ గా నిలిపామని అన్నారు. ఉద్యమంలో ఎన్నారైల పాత్రపై కూడా చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు ప్రజలకు అమెరికాలో ఉండి కూడా ఎలా మద్దతు కూడగట్టారో వివరించారు. హరీష్ రావు ను కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ఇండియా కో ఆర్డినేటర్ వేణు సంకినేని, ఈశ్వర్ బండా ఉన్నారు. ఆటా మహా సభలకు హాజరయ్యేందుకు హరీష్ రావు సానుకూలంగా స్పందించారు.