translateexpand_more

Accident Insurance News

Latest updates from Telugu Digital news sources.

Sakshi27 May, 05:10 am
వరుడు కుటుంబం రిటర్న్ గిఫ్ట్ అదుర్స్ ..! మొత్తం గ్రామానికి రూ. 34.6 కోట్ల

వివాహం అనగానే ఓ పండుగ వాతావరణంలో ఉంటుంది. మా ఊర్తో పలాన వాళ్లది పెళ్లి అని అంతా సంతోషంగా చెప్పుకుంటారు కూడా. ఆ ఆనందం పెళ్లి నిర్వహిస్తున్న కుటుంబాలకే చెందినదైనా..ఆ ఊరు లేదా ఆ గ్రామంలోని అందరి కళ్లలో సంతోషం వెల్లివెరిస్తుంది. అయితే ఇక్కడ ఈ వివాహ వేడుక ఈ సంతోషం తమకు మాత్రమే గాక ప్రజలందరూ సంబరపడే ఉండాలని ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌కి యావత్తు గ్రామం ఫిదా అవ్వడమే కాదు..కళ్ల చెమర్చారు. ఆహా మీ వివాహ వేడుక మా ఆర్థిక భద్రతగా మారిందా అని అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని బహదర్‌పురా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మంచి సంగీతం, విందు భోజనంతో పాటు ఈ వేడుక సంతోషం అందరికి చేరువవ్వాలిని అప్పరూపమైన రిటర్న్‌ గిఫ్ట్‌లు అందించింది వరుడు కుటుంబం. వివాహ తంతులో సాంప్రదాయ జ్ఞాపికలు లేదా బహుమతులకు బదులుగా వరుడు సిద్ధేశ్వర్ పేఠ్‌కర్ అతని కుటుంబం గ్రామంలోని 3,465 మంది నివాసితులందరికీ రూ. 34.6 కోట్ల విలువైన ప్రమాద బీమా కవరేజీని బహుమతిగా ఇచ్చారు. అర్హులైన ప్రతి గ్రామస్తునికి భీమా సౌకర్యం.. పేఠ్కర్‌ కుటుంబం స్థానిక గ్రామ పంచాయతీ పేరు మీద గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, అలాగే ఎవరూ మినహాయించబడకుండా ఉండేలా..గ్రామ ఓటర్ల జాబితానే నేరుగా బీమా కంపెనీకి సమర్పించింది. దాంతో అర్హులైన ప్రతి నివాసికి స్వయంచాలకంగా రూ. 1 లక్ష ప్రమాద బీమా లభించేందుకు మార్గం సులభమైంది. ఈ బీమా పాలసీ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది, భవిష్యత్తు పునరుద్ధరణపై చర్చలు కూడా జరగనున్నాయి. అయితే, పాలసీ