
Allu Sirish:టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ప్రత్యేక ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలతో పాటు ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజును గుర్తు చేసుకుంటూ శిరీష్ భావోద్వేగంగా స్పందించారు. అల్లు శిరీష్ తన పోస్ట్‌లో 2025 మే 29న, తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు, తమ “పెళ్లిచూపులు” జరిగాయని తెలిపారు. ఆ రోజు రెండు కుటుంబాలు కలిసి తమ పెళ్లి నిర్ణయానికి ఆశీర్వాదాలు అందించాయని చెప్పారు. ఆ ప్రత్యేక క్షణాన్ని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు ఒక సంవత్సరం గడిచిందని, తాము సంతోషంగా వివాహ జీవితం గడుపుతున్నామని పేర్కొన్నారు.అంతేకాకుండా, పెళ్లి తర్వాత కలిసి జాయింట్ బ్యాంక్ అకౌంట్ కూడా ప్రారంభించామని సరదాగా చెప్పారు. గత ఒక సంవత్సరం ఎంతో అందంగా గడిచిపోయిందని, కాలం ఎంత వేగంగా వెళ్లిపోయిందో ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందని తన పోస్ట్‌లో రాశారు. శిరీష్ పంచుకున్న ఫోటోల్లో ఆయన, నయనిక కలిసి కుటుంబ సభ్యులతో కనిపించారు. ఒక ఫోటోలో పెళ్లిచూపుల సందర్భంగా ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, మరో ఫోటోలో కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటో కూడా అభిమానులను ఆకట్టుకుంది. అలాగే ఒక ఫోటోలో స్నేహితులతో కలిసి వేడుక జరుపుకుంటున్న సందర్భం కనిపించింది. అల్లు శిరీష్, నయనిక ప్రేమకథ కూడా ఆసక్తికరంగానే సాగింది. ఇద్దరూ ముందే ఒకరికి ఒకరు పరిచయం ఉన్నప్పటికీ, కుటుంబ వేడుకలో మరింత దగ్గరయ్యారని తెలుస్తోంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. కలిసి ఎక్కువ సమయం గడిపిన తర్వాత తమ మధ్య మంచి అవగాహన ఉందని ఇద్దరూ భావించారు. తరువాత వారు కలిసి చేసిన ఒక విదేశీ
