translateexpand_more

Andhra News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu30 May, 05:03 am
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను హడలెత్తిస్తోన్న పెద్దపులి

పోలవరం: గత నాలుగు నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను హడలెత్తిస్తోన్న పెద్ద పులి.. మళ్లీ దాడులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తోంది. ఇటీవల రాత్రి వేళల్లో పశువులపై దాడి చేస్తూ ... పోలవరం జిల్లాలో తిరుగుతూ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పెద్దపులి.. మళ్లీ గంగవరం మండలంలోకి ప్రవేశించింది. పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. నిన్న ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్డీపురం పరిసరాల్లో సంచరించింది. గతంలో పులిని బంధించినపుడు .. పులి మెడకు రేడియో కాలర్ పరికరాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పులి ఎక్కడుందనే కచ్చిత వివరాలను తెలుసుకుంటున్నారు. పోలవరం జిల్లాలోని వేములోవ, పిడతమామిడి, రాములుదేవపురం, వడ్డిచెరువు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు పర్యటించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. నాలుగు నెలల్లో 20 పశువులపై పెద్దపులి దాడి చేసిందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రజలు ఒంటరిగా అడవి వైపు వెళ్లవద్దని డీఎఫ్‌వో సూచించారు. పశువులను బయటకు వదలొద్దని విజ్ఞప్తి చేశారు. పులి దాడిలో మృతి చెందిన పశువులకు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆదేశాలతో ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయని... వీలైనంత త్వరలో పట్టుకుంటామని అధికారులు తెలిపారు. దట్టమైన అడవి కావడం వల్ల పులిని బంధించడం కొంత ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల

Vaartha30 May, 06:28 pm
ఇంత నిర్ల క్ష్యం అయితే ఎలా

Minister Kondapalli Srinivas: విజయనగరం, మే 30: అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు ఉండే గదులు ఇంత అస్తవ్యస్తంగా ఉంటే ఎలా? చిన్నారులు, బాలింతలు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉన్నా మీకు పట్టదా? అంటూ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME), గ్రామీణ పేదరిక నిర్మూలన (SERP), ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన తన నియోజకవర్గ పరిధిలోని జామి, గంట్యాడ మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జామి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన సందర్భంగా సిబ్బంది పనితీరు, పరిసరాల పరిశుభ్రత అధ్వాన్నంగా ఉండటంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోగుల ఆన్‌లైన్ రికార్డులను పరిశీలించగా అవి సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిని నిలదీశారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టికను, రోగుల ఓపీ (OP) రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా బాలింతలు, చంటిబిడ్డలు ఉండే ఆపరేషన్ థియేటర్ గది అంతటా రక్తపు మరకలు, దుమ్ము ధూళి పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన మంత్రి.. అక్కడే ఉన్న డాక్టర్ సామ్రాజ్యలక్ష్మి మరియు వైద్య సిబ్బందిపై మండిపడ్డారు. పేషెంట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో కుక్క కాటు, పాము కాటు ఇంజక్షన్ల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి.. రాబోయే వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని, 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి అలసత్వాన్ని వీడాలని, నెల రోజుల్లోగా ఆసుపత్రి సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం జామి

Vaartha30 May, 03:21 pm
వైసిపికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

Ravi Naidu: గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఘోరంగా ఓడించారనే కక్షతోనే నిరుద్యోగ యువతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రతికారేచ్ఛతో వ్యవహరిస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఛైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టిన డీఎస్సీ (AP DSC) నియామకాలపై కేవలం రాజకీయ స్వార్థంతోనే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో “నిరుద్యోగ యువతపై గొడ్డలివేటు” అనే పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సమావేశానికి కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వెయ్యి మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. వైసీపీ చేస్తున్న కుట్రపూరిత ప్రచారం వల్ల రాత్రింబగళ్లు కష్టపడి ఉద్యోగాలు సాధించిన పేద అభ్యర్థులు, వారి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని రవినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. “రాజకీయాలు ఉంటే మాతో తేల్చుకోవాలి గానీ, ఇలా యువత జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం” అని హితవు పలికారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయని జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు తూతూమంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 150 రోజుల్లోనే 15,941 మందికి ఉద్యోగ పత్రాలు అందించిందని, ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఏకంగా 150 కేసులు వేశారని ఆయన గుర్తుచేశారు. Read also: AP DSC: డీఎస్సీ అక్రమాలకు ఆస్కారమే లేదు: కోన శశిధర్ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ వస్తున్న ఆరోపణలను రవినాయుడు పూర్తిగా కొట్టిపారేశారు. క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇచ్చేది ఆయా అసోసియేషన్లు, ఫెడరేషన్లేనని.. వాటిని అన్ని కోణాల్లో