translateexpand_more

Ap House Site Regularization News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 06:08 am
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం గ్రీన్ సిగ్నల్.. వేల మందికి ఊరట

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. AP Government:చాలా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఫైళ్లు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని చోట్ల భూ వివాదాలు, మరికొన్ని చోట్ల సాంకేతిక కారణాల వల్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా స్థాయిలో ఎలాంటి వివాదాలు లేని ఇళ్లు, ఇళ్ల స్థలాలను వీలైనంత త్వరగా క్రమబద్ధీకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్థానిక స్థాయిలోనే ఎక్కువ కేసులను పరిష్కరించాలని చెప్పారు. అయితే జిల్లా స్థాయిలో పరిష్కారం కుదరని కేసులను రాష్ట్ర క్యాబినెట్ ముందుకు తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ల నుంచి సేకరించాలని అధికారులకు సూచించారు. ఈ నిర్ణయం వల్ల ఇళ్ల స్థలాల యజమానులకు చట్టబద్ధమైన హక్కులు లభించే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో బ్యాంకు రుణాలు, నిర్మాణ అనుమతులు వంటి విషయాల్లో కూడా వారికి సౌలభ్యం కలుగుతుంది. ఇదే సమావేశంలో గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లుల అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. చాలా కాలంగా చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్న బిల్లులను త్వరగా క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశించారు. దీంతో నిర్మాణ రంగానికి కూడా కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి కీలక అడుగుగా భావిస్తున్నారు. త్వరలోనే జిల్లాల వారీగా వివరాలు సేకరించి తదుపరి చర్యలు చేపట్టే అవకాశముంది. ప్రజలు కూడా ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తున్నారు. Also Read:DK Shivakumar: కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ఇదే.. ఇంతకీ ఎవరీ డీకే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Ap House Site Regularization News Keyword | Telugu Digital