
నరసింహ నాయుడు.. తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుత అధ్యాయం 25 సంవత్సరాలు నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్ ప్రధాన పాత్రలలో నటించిన నరసింహ నాయుడు చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ సినిమా విశేషాలు, విజయ రహస్యాలు, తెర వెనుక సంఘటనలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ చిత్రం కేవలం ఒక విజయవంతమైన సినిమా మాత్రమే కాదు, తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్రకు నటుడిని ఎంపిక చేయడం ఒక కీలకమైన చర్చ. పండితేనే సినిమాకు బలమని గుర్తించిన రచయిత చిన్నికృష్ణ, ఎవరూ ఊహించని విధంగా కె. విశ్వనాథ్ పేరును సూచించారు. హెవీ యాక్షన్ మూవీ, ఫ్యాక్షన్ సినిమాలో విశ్వనాథ్‌ను ఒప్పించడం ఎలా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. చిన్నికృష్ణ చెన్నైలోని కూరగాయల మార్కెట్‌లో విశ్వనాథ్‌ను కలిసి కథ, పాత్ర వివరించారు. సత్యనారాయణ లేదా రంగనాథ్ లాంటి నటుల ఛాతిపై విలన్ కాలు పెడితే ప్రేక్షకులకు కోపం రాదని, కానీ విశ్వనాథ్ లాంటి గౌరవనీయ వ్యక్తిపై కాలు పెడితే ఆడిటోరియంలోని ప్రేక్షకులకు ఆగ్రహం వస్తుందని, అదే సినిమాకు పెద్ద బలం అవుతుందని చిన్నికృష్ణ చేసిన లాజిక్ వాదనకు విశ్వనాథ్ అంగీకరించారు. ఆ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా విడుదల కావడానికి రెండు వారాల ముందే బాలకృష్ణ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి, సినిమా విజయంపై తన అపూర్వ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “ఎప్పుడెప్పుడు జనవరి 11 వస్తుందా, నా చెవులు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని వింటాయా అని ఎదురుచూస్తున్నాను” అని చెప్పడం ఆయన జీవితంలో అరుదైన సంఘటన. విడుదల ముందు రెండు సీన్లు బ్యాలెన్స్ ఉన్నప్పుడు, నిడివి ఎక్కువ ఉన్న ఒక


