translateexpand_more

Ravi Teja News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 05:28 am
ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్

డైరెక్టర్ తేజ సంచలన చిత్రం ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, తన గ్లామర్, నటనతో మెప్పించిన హీరోయిన్ రీమా సేన్. ఆ తర్వాత ‘మనసంతా నువ్వే’, ‘అదృష్టం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ, గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కో-స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ , దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కెరీర్‌లో వర్క్ చేసిన స్టార్ హీరోల గురించి రీమా సేన్ మాట్లాడుతూ.. మొదటగా తన తొలి చిత్రం ‘చిత్రం’ , ‘మనసంతా నువ్వే’ కో-స్టార్ ఉదయ్ కిరణ్ గురించి ప్రస్తావించారు. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. ఉదయ్ కిరణ్ చాలా సైలెంట్ పర్సన్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన ఒక ఇంట్రోవర్ట్ (ఎక్కువగా మాట్లాడని వ్యక్తి) అని, సెట్స్‌లో ఎంతో పద్ధతిగా, మర్యాదపూర్వకంగా ప్రవర్తించేవారని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ ఎంతో ప్రైమ్ అండ్ ప్రాపర్‌గా ఉంటూ, "రీమా గారు.. ఎలా ఉన్నారు?" అంటూ చాలా సాఫ్ట్‌గా మాట్లాడేవారని ఆమె తెలిపారు. ఇక మాస్ మహారాజా రవితేజ గురించి రీమా సేన్ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. రవితేజ తనకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరని ఆమె స్పష్టం చేశారు. ‘అదృష్టం’ , ‘వీడే’ చిత్రాలలో రవితేజతో కలిసి నటించిన రీమా.. ఆయనతో ఉన్న బాండింగ్ గురించి చెప్తూ, "రవితేజ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. ఆయనతో నాకు చాలా గొప్ప ఫ్రెండ్‌షిప్ ఉంది"

Telugu Times01 Jun, 01:45 pm
రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' గ్లింప్స్ జూన్ 3న రిలీజ్

మాస్ మహారాజా రవి తేజ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ కోసం దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ‘ఇరుముడి’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైమెంట్ తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే కథనాన్ని అందిస్తూ, రవితేజను కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను జూన్ 3న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ మనసుని తాకేలా ఉంది. ఓ కొండపై కూర్చుని దూరాన్ని వీక్షిస్తున్న హీరో, అతని చిన్నారి కుమార్తె పోస్టర్‌లో కనిపిస్తూ, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ పోస్టర్ వారి ప్రయాణం వెనుక ఉన్న భావోద్వేగ కథపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితర ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, నరేష్ బాబు పి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, ఆధ్యాత్మికత కలగలిసిన ‘ఇరుముడి’ రవితేజ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుంది.

Chitrajyothy01 Jun, 07:14 am
రవితేజ ఇరుముడి’ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

<p>శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటిస్తోన్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ‌కు ఈ సినిమా ఎంతో కీలకమనే విషయం తెలియంది కాదు. కారణం ఆయనకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ ఆశలన్నీ ఇప్పుడీ ‘ఇరుముడి’పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. కచ్చితంగా ఈసారి మాస్ రాజాకు బ్లాక్‌బస్టర్ రాబోతోందంటూ ప్రచారం మొదలైంది. మరోవైపు ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే విషయాన్ని తెలియజేసింది. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మరో ట్రీట్‌ని మేకర్స్ ప్లాన్ చేశారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>జూన్ 3వ తేదీన ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ (Irumudi Glimpse Date)ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో రవితేజ తన కుమార్తెతో కలిసి కూర్చుని ఉన్నారు. వారి బ్యాక్‌ సైడ్ మాత్రమే ఈ పోస్టర్‌లో చూపించారు. ఇప్పుడు రాబోయే గ్లింప్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ అవుతాయని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పాన్-ఇండియన్ పవర్‌హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.</p><br/><p>ఇప్పటి వరకు రవితేజ చేయని ఓ వైవిధ్యమైన పాత్రని ఇందులో పోషిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉందని టీమ్ చెబుతోంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉండబోతోన్నాయని.. దర్శకుడు

TV9 Telugu30 May, 03:16 pm
ఆ స్టార్ హీరో కాళ్లు కడిగి పెళ్లి చేశాను.. కారణం ఇదే.. నటుడు రాజా రవీంద్ర

నటుడు రాజా రవీంద్ర తాజా ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రవితేజ కుటుంబంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రస్తావించారు. రవితేజ అత్తకి బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన సమయంలో తన భార్యతో కలిసి వారికి అండగా నిలబడినట్లు తెలిపారు. ఈ సంఘటన వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసిందని ఆయన వివరించారు. హీరోగా నటించిన ఒక చిత్రం విడుదల కాకపోవడం, ఆ తర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉండటం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని రాజా రవీంద్ర గుర్తు చేసుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబ పోషణ కష్టమైందని, అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆ సమయంలో నటుడు సుమన్‌ను కలవగా, ఆయన సీరియల్స్‌లో నటించమని సలహా ఇచ్చారని తెలిపారు. సుమన్ ప్రోత్సాహంతో ఒక సీరియల్‌లో నటించానని, ఆ సీరియల్ చరిత్రలోనే ఆరు పాటలతో, సినిమా తరహాలో భారీగా చిత్రీకరణ జరిగిందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొగల్ గార్డెన్స్ సెట్‌లో 11 రాత్రులు, 12 జనరేటర్లతో పాట షూట్ చేశారని, టీవీలో అప్పుడు అలాంటి భారీ చిత్రీకరణ అద్భుతమని పేర్కొన్నారు. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. తన సినీ కెరీర్‌కు పరుచూరి బ్రదర్స్ ఎంతగానో తోడ్పాటు అందించారని రాజా రవీంద్ర తెలిపారు. వారు తమ సినిమాలలో తన కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించారని, రవీంద్ర అనే పేరుతోనే స్క్రిప్ట్‌లో పాత్రలను రాసేవారని చెప్పారు. వారి మద్దతు వల్లే తాను చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగగలిగానని కృతజ్ఞతలు తెలిపారు.

SkyC Media30 May, 07:00 pm
రవితేజ ఇరుముడి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది

మాస్ మహారాజా రవితేజ 77వ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రవితేజ ఇరుముడి సినిమా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రవితేజ ఒక శక్తివంతమైన అయ్యప్ప భక్తుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయన రెగ్యులర్ మాస్ హీరో ఇమేజ్‌కి భిన్నంగా ఈ పాత్ర సాగనుంది. తండ్రి, కూతుళ్ల మధ్య ఉండే బలమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే మే 2026 నాటికి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కీలకమైన షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దాదాపు ముగింపునకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. దీంతో చిత్ర యూనిట్ తమ దృష్టిని పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పెట్టింది. దీనితో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సినిమాకు సంబంధించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రచార చిత్రాలకు ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి బజ్ లభించింది. రవితేజ ఇరుముడి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో రవితేజను ఒక కొత్త కోణంలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భక్తి, యాక్షన్ డ్రామా కలయికగా ఈ చిత్రం రూపొందుతోంది. రవితేజ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా సినిమా గురించిన చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. రవితేజ కొత్త లుక్స్, సినిమా వైవిధ్యమైన కథాంశం

Chitrajyothy27 May, 12:12 pm
అనిల్ రావిపూడి, రామ్ కాంబో.. సంక్రాంతి సెంటిమెంట్ కు బ్రేక్

అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే హీరో రామ్.. కాంబినేషన్‌లో సినిమా ఫిక్సయిందంటూ, టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు హల్‌‌చల్ చేస్తున్నాయి. అపజయమెరుగని దర్శకుడు, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే హీరో కాంబినేషన్‌లో సినిమా ఫిక్సయిందంటూ.. టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు హల్‌‌చల్ చేస్తున్నాయి. వాస్తవానికి.. ‘రాజా ది గ్రేట్’ (Raja The Great) చిత్రానికి కలిసి పనిచేయాల్సిన ఈ కాంబో.. ఆ సినిమా వచ్చిన దాదాపు పదేళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్నారనేలా టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు, హీరో ఎవరనేది.. ఫై ఫొటో చూస్తుంటే తెలుస్తుందిగా. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)తో, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేసిన ‘రాజా ది గ్రేట్’ చిత్ర కథని మొదట రామ్‌(Hero Ram)కే వినిపించారట. కానీ, సినిమా సెట్ కాలేదు. అప్పటి నుంచి ఈ కాంబోలో సినిమా రాబోతుందనేలా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రచారమే కానీ, ప్రాజెక్ట్ మాత్రం ఓకే కాలేదు. మళ్లీ అలాగే ప్రచారం మొదలైంది. ఈ సారి సినిమా విడుదల ఎప్పుడో కూడా చెబుతూ వార్తలు వండేస్తున్నారు. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి అనేలా గత కొన్ని సంవత్సరాలుగా అర్థం మారిపోయింది. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సక్సెస్ కొడుతూ.. సంక్రాంతి చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి.. ఈసారి ఆ సెంటిమెంట్‌ని పక్కన పెట్టి.. 2027 దసరా బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. రామ్, అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకోనున్న చిత్రం 2027 దసరాకు రిలీజ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఈ కాంబోలో మూవీ సెట్టయిందా? లేదా? అనేదే ఇంత వరకు క్లారిటీ లేదు.. అలాంటిది రిలీజ్ వరకు మ్యాటర్ తీసుకెళ్లి.. ‘సోమలింగం’

TV9 Telugu24 May, 07:24 am
Balakrishna- Ravi Teja: బాలయ్యవదిలేసిన సినిమా.. రవితేజ పూర్తి చేశాడు.. కట్ చేస్తే భారీ డిజాస్టర్

- సినిమా పరిశ్రమలో కథలు చేతులు మారడమనేది సర్వ సాధారణం. - ఒక హీరో కోసం అనుకున్న కథలు, లైన్లు అనుకోకుండా మరో హీరో వద్దకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. - టాలీవుడ్‌లోనూ ఇలాంటివి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి.

NTV Telugu27 May, 06:52 am
టాలీవుడ్ లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్ లు.. నాని రవితేజ శర్వా

టాలీవుడ్ బాక్సాఫీస్‌కు రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. జూన్ మొదటి వారంలో (జూన్ 4న) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే, జూన్ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ హవానే నడవడం ఖాయం. ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్‌ను మరింత ఊపులోకి తెచ్చేందుకు పలు క్రేజీ చిత్రాలు క్యూ కట్టబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు (August) నెల బాక్సాఫీస్ లైనప్ ఇప్పుడే చాలా సాలిడ్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు ఆగస్టు స్లాట్లను బుక్ చేసుకోగా.. తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా కూడా ఈ రేసులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఖరారైన డేట్ల ప్రకారం బాక్సాఫీస్ బరిలో ఉన్న సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ ప్రొమిసింగ్ ఫిలిం ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తర్వాత టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న భారీ చిత్రం ‘భోగి’ ఆగస్టు చివరి వారంలో, అంటే ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంది. ఇక గత కొన్ని చిత్రాలతో ఆశించిన విజయాలు అందుకోలేకపోయిన మాస్ మహారాజా రవితేజ.. ఈసారి ఒక వినూత్నమైన కథతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi) కూడా ఆగస్టు రేసులోనే నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ ఫిలిం ‘విశ్వంభర’ కూడా ఆగస్టు రేసులోకి వచ్చే అవకాశం ఉందంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, జూన్‌లో ‘పెద్ది’తో మొదలయ్యే టాలీవుడ్

NTV Telugu27 May, 04:35 am
ఆగస్ట్ రేస్ లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద సరైన సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి‘. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ మూవీని భారీ స్థాయిలో ఆగస్ట్ 2026 లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ నెలలో ఉండే లాంగ్ వీకెండ్స్, పండుగ సెలవులను క్యాష్ చేసుకునేలా రిలీజ్ డేట్‌ను లాక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించబోతున్నాడు మాస్ మహారాజా. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే సున్నితమైన ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, మరియు దైవికమైన అంశాల చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరగనుంది. రవితేజ సరసన తమిళ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఒక ప్రత్యేకమైన ఓల్డ్ ఏజ్ గెటప్‌లో రవితేజ కనిపించే సీన్స్ హైలెట్ గా నిలవనున్నాయి. అలాగే సూపర్ హిట్ భక్తి గీతం ‘విల్లాలి వీరుడు’ సాంగ్ రీమేక్ కూడా ఉండబోతోందని వస్తున్న వార్తలు సినిమాపై హైప్‌ను మరింత పెంచేస్తున్నాయి. మరి ఈ సరికొత్త రస్టిక్ యాక్షన్ అస్త్రంతో రవితేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో తన సాలిడ్ కమ్‌బ్యాక్‌ను ఎలా చాటుకుంటారో చూడాలి.

Samayam Telugu24 May, 04:58 am
బాలయ్యతో మొదలై రవితేజతో చేతుల్లోకి .. 'భీష్మ' టు 'వీర' వెనుక అసలు కథ ఇదే!

1. గతమైన అనుభవం ఉపయోగించాలను: ఆయన సమయం తెలుగులో విద్యాత నిర్వహించడానికి, కన్సల్టెంట్‌గా పనిచేసిన ఆయన

TV9 Telugu31 May, 10:32 am
అప్పుడు నా సినిమాలో క్యారెక్టర్ చేశాడు.. ఇప్పుడు అతని సినిమాల్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్

విలక్షణ నటుడిగా తనకంటూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు నటుడు జగపతిబాబు. అప్పటిలో హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో జగపతిబాబుకు పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉండేవారు. శుభలగ్నం, బడ్జెట్ పద్మనాభం, మావిచిగురు, పెళ్ళి పీటలు వంటి ఫ్యామిలి ఎంటర్టైనర్స్ తో పాటు.. అంతఃపురం , సముద్రం వంటి యాక్షన్ సినిమాలతో మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నారు జగపతిబాబు. కాగా కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన జగపతి బాబు ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న జగపతి బాబు విలన్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. బాలయ్యబాబు నటించిన లెజెండ్ సినిమాలో జగ్గూభాయ్ విలన్ గా అదరగోట్టారు. ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు జగపతి బాబు. విలన్ గా ఆయన అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారు. అరవింద సమేత సినిమాలో బసిరెడ్డిగా, రంగస్థలం సినిమాలో ఫణేంద్రభూపతిగా విలనిజం పండించి భయపెట్టారు జగపతి బాబు.. విలన్ గానే కాదు సహాయక పాత్రల్లోనూ తన నటనతో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం పెద్ది సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు జగపతి బాబు. ఇదిలా ఉంటే జగపతి బాబు హీరోగా నటించిన సమయంలో ఆయన సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఓ నటుడు.. ఇప్పుడు హీరోగా మారాడు. ఇది కూడా చదవండి : బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్ అంతే కాదు ఆ హీరో సినిమాలో ఇప్పుడు జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇంతకూ ఆ హీరో