translateexpand_more

Bhatti Vikramarka News

Latest updates from Telugu Digital news sources.

Eenadu01 Jun, 02:20 pm
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఝార్ఖండ్‌లో పర్యటించిన భట్టి విక్రమార్క.. అక్కడి సీఎం హేమంత్ సోరెన్, స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఓ నివేదికను రూపొందించారు. ఆ నివేదికను తాజాగా కేసీ వేణుగోపాల్‌కు అందజేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Andhra Jyothy28 May, 04:04 pm
త్వరలోనే పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ ల విడుదల

తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో ఆయన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించారు. ఖమ్మం, మే 27: తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధనం) ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ(గురువారం) ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో ఆయన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని, ఇందులో భాగంగా వ్యవసాయ మోటార్ల కోసం 7.5 కిలోవాట్ల సోలార్ యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పైలట్ ప్రాజెక్ట్‌ కింద బోనకల్, కొడంగల్ మండలాల్లో పూర్తిస్థాయిలో ఈ సౌర యూనిట్లను అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందిస్తున్నామని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకున్నామని ఆయన గుర్తుచేశారు. రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు కూడా ఆయన ఒక తీపి కబురు అందించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను త్వరలోనే విడుదల చేస్తామని, ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేశామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం

Andhra Jyothy27 May, 03:40 pm
మహిళల సంక్షేమం గురించి బీఆర్ఎస్ ఆలోచించలేదు

పదేళ్ల పాటు మహిళా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా, మే 27: పదేళ్ల పాటు మహిళా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాటు మహిళా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, చివరకు మహిళల భవిష్యత్తుకు భరోసానిచ్చే 'అభయహస్తం' ప్రాజెక్టును కూడా కాలరాసి పక్కన పడేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా లోకానికి జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేస్తోందని.. అందులో భాగంగానే మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏళ్ల స్వల్ప కాలంలోనే రికార్డు స్థాయిలో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ. 66 వేల కోట్ల రుణాలను ఇప్పించిన ఘన చరిత్ర ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహిళల క్షేమం, వారి ఆర్థిక పురోభివృద్ధే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమంపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల దిగజారుడు ప్రకటనలు చూస్తుంటే అసహ్యం వేస్తోందని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వారి

Andhra Jyothy27 May, 04:05 pm
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. రైతులు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, మే 27: తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని.. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు కూడా పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను, వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే వర్షానికి తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తక్షణమే బాయిల్డ్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుత రబీలో రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ కొనుగోళ్ల ద్వారా రాష్ట్రంలోని 8.15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని, ఇందుకుగాను రూ. 10,097 కోట్ల చెల్లింపులను కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని స్పష్టం చేశారు. రైతులు తమ పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొనుగోలు

Samayam Telugu28 May, 03:04 am
తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. జీరో వడ్డీతో రూ. 1.30 లక్షల కోట్ల రుణాలు

రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2022లో సమయంలో చేరిన సందీప్ పూల.. గత నాలుగేళ్లుగా ఏపీ, తెలంగాణ వార్తలు, విశ్లేషణలతో కూడిన న్యూస్ రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను సందీప్ పూల ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఆకట్టుకునే కథనాలు రాసినందుకు గానూ 2025 మార్చిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. సందీప్ పూల ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్‌లో నాలుగేళ్ల పాటు పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, కుటుంబం, ప్రకృతితో గడపటానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి