
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో రాజారెడ్డి అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు. కడప, మే 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి (Bhumireddy Rangopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో రాజారెడ్డి అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు. అధికారం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని ఆరోపించారు. అధికారం కోసం హత్యలు.. ఆధిపత్యం కోసం కుట్రలు చేశారని ఆగ్రహించారు. గనుల కోసం ఎంతోమందిని చంపేశారని ఆక్షేపించారు. ఈరోజు (మంగళవారం) కడప టీడీపీ కార్యాలయంలో మీడియాతో రాంగోపాల్‌రెడ్డి మాట్లాడారు. బలవంతంగా మైన్స్‌ను స్వాధీనం చేసుకున్నారని రామగోపాల్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్ కుటుంబం నెత్తుటి కూడు తింటోందని రామగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసుల నుంచి తప్పించుకున్నారు. వైఎస్ కుటుంబం ఎన్నో అరాచకాలు చేసింది. ఎదురు తిరిగిన ఎవరినీ వైఎస్ కుటుంబం వదిలిపెట్టలేదు. హత్యలు చేసి.. స్వాతంత్య్ర సమరయోధులమని చెప్పుకుంటారా?. రాజారెడ్డి బ్రిటిష్ సైన్యం కోసం పనిచేయడం వాస్తవం కాదా..?. అప్పటి మద్రాస్‌లో బాంబు ఘటన తర్వాత రాజారెడ్డి పారిపోయి రాలేదా?. బ్రిటిష్ సైన్యం కోసం పనిచేసి దేశ భక్తులమని చెప్పుకుంటారా?. నరసయ్య హత్య విషయంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని మావోయిస్టులు చంపాలని చూడలేదా?. సచివాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై కాల్పులు జరపలేదా?. దేశ ద్రోహులుగా మీరు పనిచేసింది వాస్తవం కాదా?. అమాయకులను చంపి.. రక్తపుటేరులు పారించింది నిజం కాదా?. బాంబులు లేకుండా మీరు ఏనాడైనా బయటకు వచ్చారా?. మా ఇళ్లను కూల్చినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా?. మా ఆస్తులను కొల్లగొట్టి.. కేసులు పెట్టి హింసించలేదా?. లాకప్‌లో మమ్మల్ని