
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  స్థానిక నేతలు తీవ్ర కుట్రలకు తెరలేపారని పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ఆదివారం సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ జానీ సైదా, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అవినీతి, భూకబ్జాల చిట్టాను వారు మీడియా ముందుంచారు.రాష్ట్రంలో అలజడుల వెనుక వైసీపీ హస్తంవినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. కావాలనే ఈ విధ్వంసానికి ఒడిగట్టి, రాష్ట్రంలో కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండా అని దుయ్యబట్టారు. వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోర్టు పరిధిలో ఉన్న భూములను కొల్లగొట్టేందుకు దొంగ (ఫోర్జరీ) జీవోలను సృష్టించి, సుమారు రూ. 1500 కోట్ల ప్రజాధనాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.ఈ భారీ కుంభకోణం బండారం బయటపడటంతోనే ఆయన భయంతో పరారయ్యారని పేర్కొన్నారు. బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని రెండెకరాల భూమిని కూడా వైసీపీ నేతలు అక్రమంగా ఆక్రమించారని, ఈ దోపిడీ సొమ్ములో జగన్ మోహన్ రెడ్డి వాటా ఎంతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే తక్షణమే బహిష్కరిస్తారని, కానీ





