translateexpand_more

Andhra Pradesh Politics News

Latest updates from Telugu Digital news sources.

Sakshi30 May, 01:45 pm
ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్‌పై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ప్రభాకర్‌ చౌదరి ఘాటుగా ఆరోపణలు చేశారు. ‘గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనంతపురం అర్బన్

AP7AM01 Jun, 06:12 am
చంద్రబాబు రాజకీయం 'ఎడారి-ఒంటె' కథ లాంటిది

కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాలకు తొలి మహిళా బాధితురాలిని తానేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అనుసరించిన నిరంకుశ విధానాలనే, నేడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తోందని, అరాచకాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండ లభించిందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా మహిళలను రోడ్డున పడేసేలా ప్రవర్తిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' యాప్‌ను కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ విధానాన్ని ఆమె 'ఎడారి - ఒంటె' కథతో పోల్చారు. అవసరమైనప్పుడు కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడం ఆయనకు అలవాటని తీవ్రంగా విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని లాక్కున్న నల్లటి చరిత్ర చంద్రబాబుదేనని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.

Andhra Jyothy01 Jun, 12:46 am
విద్వేషాలు రెచ్చగొడితే బుద్ధి చెప్తాం

కుట్రలతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ వైసీపీని హెచ్చరించారు. విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): కుట్రలతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ వైసీపీని హెచ్చరించారు. కాపు సంఘం పేరుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. విజయవాడలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. గుంటూరుకు చెందిన దాసరి రాము జనసేన కోసం పనిచేశారన్న అభిమానం తమకు ఉందని, ఆ విలువను పోగొట్టుకోవద్దని హితవు పలికారు. నోటికి వచ్చినట్లు వాగొద్దని అంబటి రాంబాబును హెచ్చరించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారు, కూటమి రెండేళ్ల పాలనలో ఏం చేశామో? తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. పవన్‌ కల్యాణ్‌.. కులం కోసం పార్టీ పెట్టలేదని, అందరి అభివృద్ధి, సంక్షేమం కోసం పెట్టారని వివరించారు.

Andhra Jyothy31 May, 01:33 pm
ప్రశ్నపత్రాల లీకేజీల గురించి జగన్ కే బాగా తెలుసు

అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister Anagani Satya Prasad) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్పీపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఆయన ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మెగా డిఎస్సీని అడ్డుకోవడానికి 32 కేసులు వేసి విఫలమైనా గొడ్డలి పార్టీ ఇంకా కుట్రలు ఆపట్లేదని ఎద్దేవా చేశారు.

మెగా డీఎస్సీ 2025ను పూర్తి నిబంధనలు పాటిస్తూ, అవినీతికి. మానవ జోక్యానికి తావు లేకుండా నిర్వహించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆధారాల్లేకుండా ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ, డేటా డిలీట్ చేశారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. గొడ్డలి పార్టీ కుయుక్తులను ఎదుర్కొని రికార్డు సమయంలో, పారదర్శకంగా మెగా డీఎస్సీని మంత్రి నారా లోకేశ్ నిర్వహించారని తెలిపారు. ప్రశ్నాపత్రాలు దొంగలించడం, లీక్ చేయడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికే బాగా తెలుసు అని సెటైర్లు గుప్పించారు. హైదరాబాద్‌లో పదోతరగతి చదివేప్పుడు జగన్ రెడ్డి ప్రశ్నాపత్రం దొంగలించి లీక్ చేయలేదా..? అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Andhra Jyothy31 May, 01:20 am
మహానాడు గ్రాండ్ సక్సెస్

తొలిసారి హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించిన మహానాడు గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భాగస్వాములందరికీ అభినందనలు.. 2న 'సర్'పై ఎమ్మెల్యేలకు అవగాహన అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): తొలిసారి హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించిన మహానాడు గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహానాడును సమర్థంగా నిర్వహించడంలో భాగస్వాములైన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు జోనల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్ముందు పార్టీ తరఫున నిర్వహించే భారీ కార్యక్రమాలకు మహానాడు-2026ను బెంచ్‌ మార్క్‌గా తీసుకోవాలని సూచించారు. ఏపీతో పాటు ఈసారి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మహానాడు బాగా జరిగిందని నేతలు సీఎంకు వివరించారు. మహానాడులో తెలంగాణ టీడీపీ సీనియర్‌ నేత బక్కని నర్సింహులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. ఎంతో చరిత్ర, నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగుజాతి ఒక్కటేనని.. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని సీఎం వ్యాఖ్యానించారు. టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, తెలంగాణలో పార్టీకి ఇప్పటికీ బలమైన కేడర్‌ ఉన్నారని అన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు. మహానాడులో ఆమోదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఎన్నికల సంఘం చేట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)పై అవగాహన కల్పించేందుకు జూన్‌ 2న టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ స్థాయిల్లోనూ నిర్దేశిత

Andhra Jyothy01 Jun, 12:24 pm
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. వైసీపీ దుష్ట రాజకీయాలు

నంద్యాల, జూన్01: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడలు సృష్టించి, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల ఉచ్చులో పడకుండా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూటమిలోని పార్టీ నేతలతోపాటు కార్యకర్తలకు ఆయన స్పష్టం చేశారు.

సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా సంజామల మండలం ముదిగేడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహంపై దాడి చేసింది.. వైసీపీ కార్యకర్త జంబులయ్య అని వివరించారు. తాము వైసీపీ మద్దతుదారులమంటూ జంబులయ్య భార్య బాలమ్మ వీడియో రిలీజ్ చేసిందని తెలిపారు. తమకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ శేషయ్య ఉద్యోగం ఇప్పించారని కూడా ఆమె చెప్పిందని పేర్కొన్నారు.

వాస్తవాలు ఇలా ఉంటే ఈ కుట్రలో తెలుగుదేశం పార్టీని ఇరికించే ప్రయత్నం వైసీపీ చేసిందని ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన గొడ్డలి పార్టీ నాయకుడు, నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి.. '

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు.. ఖండించిన ప్రభుత్వం
తిరుమలలో రికార్డు సృష్టించిన భక్తులు
<p

Andhra Jyothy31 May, 03:41 pm
బొల్లా బ్రహ్మనాయుడు.. దొంగ డాక్యుమెంట్లతో భూములు కాజేయాలనుకున్నారు

గుంటూరు జిల్లా, మే 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (TDP MP Lavu Sri Krishna Devarayalu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ డాక్యుమెంట్లతో దోచుకునేందుకు బ్రహ్మనాయుడు ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. దొంగ జీవోలు తయారు చేసి హైడ్రాకు కూడా పంపారని ప్రస్తావించారు. ఈరోజు(ఆదివారం) గుంటూరు జిల్లాలో శ్రీకృష్ణ దేవరాయలు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చేసిన దొంగ పనిని కూడా బొల్లా బ్రహ్మనాయుడు ఒరిజినల్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు. ఆ డాక్యుమెంట్లు తయారు చేసేందుకు డబ్బు సమకూర్చింది బ్రహ్మనాయుడేనని చెప్పుకొచ్చారు.

జలాలపురం, వినుకొండ టౌన్, బ్రాహ్మణపల్లిలో కూడా బొల్లా బ్రహ్మనాయుడు.. అమాయకులను బెదిరించి భూములు లాక్కున్నారని దుయ్యబట్టారు. తిరుమల డెయిరీ అమ్మి వారికి ఇచ్చిన ఎగ్రిమెంట్‌ను తప్పి మరలా డెయిరీ పెట్టి వారిని మోసం చేశారని మండిపడ్డారు. బ్రహ్మనాయుడు సంస్కారం లేకుండా మాట్లాడే వ్యక్తి అని ఆగ్రహించారు. అమాయక రైతుపై 307 కేసు పెట్టి జైలుకు పంపించాడని చెప్పారు. చట్టప్రకారం బ్రహ్మనాయుడుపై చర్యలు తీసుకుంటారని శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

AP7AM31 May, 03:35 pm
జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా సేనా గళం’ ఏర్పాటు... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

జనసేన పార్టీలో సరికొత్త అధ్యాయానికి ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు.  సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ... ముఖ్యంగా జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే లక్ష్యంగా ‘సేనా గళం’ అనే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుల, మత రాజకీయాలతో సమాజాన్ని విభజించే ధోరణులకు వ్యతిరేకంగా ఈ కమిటీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అనే పాతకాలపు, బూర్జువా రాజకీయ ధోరణులకు జనసేన చరమగీతం పాడుతుందని తేల్చిచెప్పారు. ఒక కులం వారు విమర్శిస్తే, అదే కులం వారితో బదులిప్పించే పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలిచ్చి, అభ్యుదయ భావాలతో ముందుకు సాగాలన్నదే జనసేన ఉద్దేశమని వివరించారు.సమకాలీన రాజకీయాల్లో కొందరు వ్యక్తులు తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కులం, మతం, ప్రాంతం వంటి సున్నితమైన అంశాల ముసుగు వేసుకుంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత తప్పిదాలకు సామాజిక వర్గాలను బాధ్యుల్ని చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఈ తరహా రాజకీయాలను నేటి యువత (జెన్-జీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.‘సేనా గళం’ కమిటీ.. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, దేశ సమగ్రతకు భంగం కలగకుండా పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపిస్తుందని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, ఆ

Andhra Jyothy31 May, 03:57 am
మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. కత్తులతో రైతుపై దాడికి యత్నం

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం కోల్పోయి రెండేళ్లు గడిచినా ఆ పార్టీ నేతల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. టీడీపీ శ్రేణులు సహా సాధారణ ప్రజలపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరులో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. రైతుపై కత్తులతో దాడికి యత్నించాయి.

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామానికి చెందిన రామదాసు అనే రైతు.. కందుకూరులో పొలం తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే, తనకు తెలియకుండా గ్రామంలో వ్యవసాయం చేయడంపై వైసీపీ నేత బెట్టన గౌడ్ ఆగ్రహించాడు. తన అనుమతి లేకుండా వ్యవసాయం చేయడం ఏంటని ఊగిపోయాడు. అనుచరులతో కలిసి మారణాయుధాలు తీసుకుని రైతు రామదాసు వద్దకు వెళ్లాడు. రైతును చూసిన వెంటనే ఒక్కసారిగా కత్తులతో దాడికి యత్నించారు. వైసీపీ మూకల దాడి నుంచి అతి కష్టం మీద తప్పించుకున్నాడా రైతు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. వైసీపీ నేత బెట్టన గౌడ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనతో కందుకూరు, పాండవగల్లు గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వ్యవసాయం చేయాలంటే వైసీపీ నేతల అనుమతి తీసుకోవాలా? అంటూ మండిపడుతున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్‌.. హత్య కేసు నిందితుడి హతం..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు..

Andhra Jyothy31 May, 01:27 am
ప్రజలకు మంచి చేస్తే జగన్ ఓర్చుకోలేడు

ప్రజలకు జగన్‌ మంచి చేయడని, ఎదుటివారు చేస్తే ఓర్చుకోలేడని, అందుకే మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని.. అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు జగన్‌ మంచి చేయడని, ఎదుటివారు చేస్తే ఓర్చుకోలేడని, అందుకే మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాదెండ్ల బ్రహ్మం అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఐదేళ్ల పాలనలో ఇటు నోటిఫికేషన్లు వేయక.. అటు కంపెనీలను తరిమికొట్టి నిరుద్యోగులను నిలువునా ముంచేసిన దుర్మార్గుడు ఇప్పుడు డీఎస్సీ కోసం రాత్రీపగలు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన 16వేల మంది కష్టాన్ని అవమానిస్తున్నాడు’ అని విమర్శించారు.

AP7AM01 Jun, 07:27 am
పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు.. ఆయ న జీవితం తెరిచిన పుస్తకమంటూ నిర్మాత రామ్ తాళ్లూరి కౌంటర్

ఏపీ డిప్యూటీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇవి కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారాలని, పవన్ కల్యాణ్ ప్రభావాన్ని చూసి ఓర్వలేకనే ప్రత్యర్థులు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలకు దిగుతున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణలోని శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఉన్న భూమి విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జనసేన పార్టీ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు.ఈ వివాదంపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కల్యాణ్ జీవితం త్యాగం, నిజాయతీ, ప్రజాసేవకు నిలువుటద్దమని, ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని పేర్కొన్నారు. ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, ఇలాంటి అసత్య ప్రచారాలతో ఆయనపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయలేరని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి నిందలు వేస్తారని విమర్శించారు.జన్వాడలోని వివాదాస్పద భూమిపై పార్టీ నేతలు స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆ భూమిని పవన్ కల్యాణ్ 2014లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని తెలిపారు. అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మ్యుటేషన్ కూడా చేయించుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఆ భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవని, కేవలం వ్యవసాయ కార్యకలాపాలు, పండ్ల తోటలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని, కబ్జా అనే ఆరోపణ పూర్తిగా నిరాధారమని స్ప‌ష్టం

Andhra Jyothy01 Jun, 09:50 am
గొడ్డలి పార్టీ కుట్రలను బయటపెట్టిన మంత్రి అనగాని సత్యప్రసాద్

నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనలో గొడ్డలి పార్టీ కుట్రలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రెస్‌మీట్‌లో బయటపెట్టారు. వైఎస్ విగ్రహా ధ్వంసం వెనుక గొడ్డలి పార్టీ ఉందనే సాక్ష్యాలను మీడియాకు విడుదల చేశారు. అమరావతి, జూన్ 1: నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనలో గొడ్డలి పార్టీ కుట్రలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రెస్‌మీట్‌లో బయటపెట్టారు. వైఎస్ విగ్రహా ధ్వంసం వెనుక గొడ్డలి పార్టీ ఉందనే సాక్ష్యాలను మీడియాకు విడుదల చేశారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య అనే గొడ్డలి పార్టీ కార్యకర్త భార్యకు గత ప్రభుత్వంలోనే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఉద్యోగం ఇచ్చారనే వివరాలను మీడియా ముందుంచారు. తాము, తమ కుటుంబం వైసీపీకి చెందిన వాళ్లమని జంబులయ్య, ఆయన కుటంబసభ్యుల వాంగ్మూలాలను మీడియా కాన్ఫరెన్సులో ప్రదర్శించారు. శవం, సింపతీ, స్టాట్యూ అనేది గొడ్డలి పార్టీ విధానమంటూ మంత్రి అనగాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి వ్యవహారంలో జగన్ పీఏ కేఎన్నార్ ఆస్తుల గుట్టు బయటపడుతోందని మంత్రి తెలిపారు. జగన్ పీఏకే బినామీలు ఉన్నారంటే.. జగన్‌కు ఇంకెంత మంది బినామీలు ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ కార్యకర్త జంబులయ్యతో తీయించి.. దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జంబులయ్య భార్యకు మెప్మాలో గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చారని... నాటి వైసీపీ ఎమ్మెల్యేనే ఆ ఉద్యోగం ఇప్పించారని తెలిపారు. మనుషుల తలకాయలే తీసిన గొడ్డలి పార్టీ నేతలకు.. విగ్రహాల తలలు తీయడం ఓ లెక్క కాదన్నారు. విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ నేతలే తీయించడం.. మళ్లీ ధర్నాలు చేయడం ఆ పార్టీకే చెల్లిందంటూ దుయ్యబట్టారు. శవం, సింపతీ, స్టాట్యూ అనేది గొడ్డలి పార్టీ విధానమంటూ వ్యాఖ్యానించారు. వైఎస్

NTV Telugu01 Jun, 09:29 am
హామీలు గాలికొదిలేశారు.. సర్కార్ పై సజ్జల తీవ్ర విమర్శలు

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదాయాలు తగ్గిన నేపథ్యంలో చేసిన అప్పులను, ప్రస్తుత ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసిందని సజ్జల పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలకు చేసిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అన్నీ సాధించామని ప్రచారం చేసుకుంటోందని, అయితే వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు. ఈ మేరకు ప్రజల్లో, మేధావుల్లో చర్చ జరిగేలా ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. రేపు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బుక్‌లెట్‌లో ప్రస్తావించిన అంశాలు చాలా స్వల్పమేనని, రాష్ట్రం ప్రస్తుతం పడిపోయిన పరిస్థితి నుంచి గాడిలో పడాలంటే భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాలు పట్టే అవకాశముందని సజ్జల అభిప్రాయపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీనియర్ నాయకులతో చర్చించి ఈ కార్యక్రమాల రూపకల్పన చేసినట్లు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు జగన్ పాలనలో సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజలో నిలిచిందని సజ్జల పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకుండా వదిలేసిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన

AP7AM31 May, 10:24 am
నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రభుత్వానికి షర్మిల హెచ్చరిక

నంద్యాల జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె హెచ్చరించారు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.నంద్యాలలోని శ్రీనివాస సెంటర్‌లో వైఎస్ఆర్ విగ్రహంపై ఓ వ్యక్తి దాడి చేసి ధ్వంసం చేశాడని షర్మిల తెలిపారు. పట్టపగలు ఈ ఘటన జరుగుతుంటే, అక్కడే ఉన్న పోలీసులు నిలువరించకపోవడం హేయమైన చర్య అని ఆమె విమర్శించారు. దాడి చేసిన వ్యక్తికి మానసిక స్థితి బాగోలేదని చెప్పి పోలీసులు చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు.ఇది చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు ఉందని షర్మిల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి ఘటనలను చూస్తూ చోద్యం చూడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడితో పాటు, అతని వెనుక ఉన్న శక్తులెవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పాత విగ్రహం స్థానంలో వెంటనే కొత్తది ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో నంద్యాలలో అదే సెంటర్‌లో తాను ఆమరణ దీక్షకు దిగుతానని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.

Andhra Jyothy31 May, 01:22 am
ఎస్ఐఆర్ పై వైసీపీ హడావుడి చేస్తోంది

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం చంద్రబాబు వారితో చెప్పారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై సీఎం అన్నారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై జూన్ 2న వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఐఆర్‌పై వైసీపీ హడావుడి చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి

కరెంట్‌ పోయింది.. ఊపిరి ఆగింది

టీటీడీకి విద్యుత్‌ బస్సు విరాళం

Sakshi29 May, 02:11 pm
కాంగ్రెస్ తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారు

తాడేపల్లి: మోసపూరిత రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నెంబర్‌ వన్‌ అని విమర్శించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. బహిరంగంగా బీజేపీతో ఉంటూ తెరచాటున కాంగ్రెస్‌తో ఉంటున్నారని అం‍బటి విమర్శించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు హాట్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. ఈరోజు(శుక్రవారం, మే 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. బీజేపీని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కాంగ్రెస్‌ సీఎం ఆవిష్కరించడం సిగ్గుచేటు. కాంగ్రెస్‌ సీఎంకి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్‌ పార్టీ బీ టీమ్‌. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ బీ టీమ్‌. ఇలాంటి అనైతిక రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు వైఖరిని బీజేపీ బాగా అబ్జర్వ్‌ చేస్తుంది. రాజ్యసభలో బీజేపీకి సీటు ఇవ్వనని చంద్రబాబు అనటం అందుకు‌ సంకేతం. చీరలిచ్చి మహిళలను మహానాడుకు తీసుకెళ్లారు. డబ్బులిచ్చి జనాన్ని తీసుకెళ్లారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహానాడులో చంద్రబాబును 25%, లోకేష్ ను 75% పొగిడారు. మెగా డీఎస్సీ పేరుతో పోస్టులు అమ్ముకున్న వ్యక్తి నారా లోకేష్. అసలు టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. తర్వాత ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, నారా రామ్మూర్తి నాయుడుని కూడా రాజకీయాల కోసం వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణలను కూడా తొక్కేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇంతకుమించిన వెన్నుపోటుదారుడు ఇంకెవరైనా ఉన్నారా?, అలాంటి వ్యక్తికి జగన్ మీద విమర్శలు చేసే అర్హత లేదు. అప్పట్లో మోదీని దూషించి ఇప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. కేఎన్నార్ మీద

Andhra Jyothy30 May, 12:33 am
మహానాడులో బాగా మాట్లాడారు

మహానాడులో 88 మంది ప్రసంగిస్తే ప్రతి ఒక్కరూ అద్భుతంగా మాట్లాడారని, అదే ఊపుతో ప్రభుత్వ విజయాలను, విపక్ష వైసీపీ దుష్ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు చెప్పారు. మహానాడులో 88 మంది ప్రసంగిస్తే ప్రతి ఒక్కరూ అద్భుతంగా మాట్లాడారని, అదే ఊపుతో ప్రభుత్వ విజయాలను, విపక్ష వైసీపీ దుష్ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు చెప్పారు. సచివాలయంలో శుక్రవారం మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, బీసీ జనార్ధన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌, కె.పార్థసారఽథి అనగాని సత్యప్రసాద్‌తో సీఎం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, మహానాడు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌, వైసీపీ రాజకీయాలపై చర్చించారు. మహానాడులో మాట్లాడిన ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన విషయాన్ని, నిర్దేశిత సమయంలో బాగా చెప్పారని సీఎం ప్రశంసించారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని కూడా అదే స్థాయిలో తిప్పికొట్టాలని చెప్పార

SkyC Media30 May, 06:43 am
ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల నిన్న మే 29, 2026 నాడు ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఢిల్లీలోని 10 జనపథ్‌ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా YS షర్మిల రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సంస్థాగత విషయాలు మరియు భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఇరు నాయకులు చర్చించారు. వైఎస్ షర్మిల గత 2024 లో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరడం జరిగింది. ఆమె పార్టీలో చేరిన తర్వాత అధిష్టానం ఆమెకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా కీలక బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి ఆమె రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైన స్థితిలో కొనసాగుతోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీకి చాలా తక్కువ సీట్లు మాత్రమే దక్కాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడంపై ఇరు నేతలు సుదీర్ఘంగా ఆలోచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరియు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా మాట్లాడారు. దీంతో పాటు పార్టీ అంతర్గత బలోపేతానికి తీసుకోవాల్సిన పలు కీలక చర్యలపై కూడా చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ నుంచి రాష్ట్ర రాజకీయాలపై తాను పలు ముఖ్యమైన సూచనలు తీసుకున్నట్లు షర్మిల స్వయంగా తన సోషల్ మీడియా పోస్ట్‌లో అధికారికంగా పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చే

Vaartha31 May, 08:26 am
చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు

Chandrababu Naidu: ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఆదివారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను వ్యవస్థీకృత అరాచక పాలనగా ఆయన అభివర్ణించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. Read also: AP Weather: ఏపీకి వర్ష సూచన.. 17 మండలాల్లో వడగాల్పుల హెచ్చరిక! ఎన్నికల సమయంలో మహిళల కోసం ప్రకటించిన పథకాలను చంద్రబాబు పక్కన పెట్టేశారని సజ్జల విమర్శించారు. గతంలో జగన్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తే, ఇప్పుడున్న పాలకులు వారిని కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు. కనీసం సంక్షేమ పథకాలను కూడా సరిగ్గా అందించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోగా ఉన్న సౌకర్యాలను కూడా తొలగించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటకలుస్తున్నాయని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సజ్జల ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. Delhi building collaps: సైదులాజాబ్ లో కుప్పకూలిన ఐదంతస్తుల వాణిజ్య భవనం PM Modi: ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని సూచనలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.

Andhra Jyothy01 Jun, 12:26 am
గాదె వెంకటరెడ్డికి కన్నీటి వీడ్కోలు

వయోభారం, అనారోగ్య సమస్యలతో మృతి చెందిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఆయన స్వగ్రామమైన బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జరిగాయి. ఇంకొల్లు, మే 31 (ఆంధ్రజ్యోతి): వయోభారం, అనారోగ్య సమస్యలతో మృతి చెందిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఆయన స్వగ్రామమైన బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జరిగాయి. రాజకీయ నాయకులు, అభిమానులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. సొంత వ్యవసాయ భూమిలో వెంకటరెడ్డికి కుమారులు గాదె మధుసూదన్‌రెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్చూరు ఏఎంసీ చైర్మన్‌ గుంజి వెంకట్రావు తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

SkyC Media30 May, 05:39 am
జనసేన తొలి రాజ్యసభ సీటు రేస్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత స్థితి ప్రకారం రాష్ట్రంలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చేసింది. జూన్ 18వ తేదీన ఈ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కూటమి బలం చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మొత్తం 4 స్థానాలు కూటమికే దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన రాజ్యసభ సీటు ఒకటి ఆ పార్టీకి కేటాయించినట్టు గట్టి సమాచారం అందుతోంది. జనసేన పార్టీ రాజకీయ చరిత్రలోనే ఇది మొదటి రాజ్యసభ సీటు కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక స్థానానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా వేగంగా ముగియాల్సి ఉంది. జూన్ 8 లోపు అభ్యర్థుల నామినేషన్ల దాఖలు పూర్తి కావాల్సి ఉంది. ఈ తక్కువ సమయంలోనే పవన్ కల్యాణ్ తన అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రేసులో ప్రధానంగా లింగమనేని రమేష్ పేరు చాలా బలంగా వినిపిస్తోంది. ఆయన పవన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగా మరియు ఇతర రూపాల్లో పెద్ద ఎత్తున సహాయం అందించారు. లింగమనేనికి టీడీపీ అధినేత చంద్రబాబు మరియు నాదెండ్ల మనోహర్‌తో కూడా మంచి సాన్నిహిత్యం ఉన్నాయి. దీంతో ఈ స్థానానికి ఆయన పేరు దాదాపు ఖరారైనట్టేనని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా ఈ నిర్ణయంపై కాపు సంఘాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని కాంట్రవర్సీలు కూడా లింగమనేని రమేష్ పేరు చుట్టూ తిరుగుతున్నాయి. అయినప్పటికీ పవన్ కల్యాణ్ తన పార్టీ కోసం కష్టపడిన వారి లాయల్టీని రివార్డ్ చేయాలని చూస్తున్నారు. చాలా కాలంగా పార్టీకి అండగా నిలిచిన వ్యక్తిని గౌరవించడం పవన్

Andhra Jyothy28 May, 12:32 pm
కూల గొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గుంటూరు, మే 28: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గుంటూరు రాజధాని అమరావతిలో రెండో రోజు నిర్వహించిన మహానాడులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నీటిపారుదల గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీకి ముందు ఆ తర్వాతే అని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లుపెట్టాలి.. ఎప్పుడు పూర్తి చేయాలో సీఎం చంద్రబాబు ల‌క్ష్యంగా పెట్టారని వివరించారు. గొడ్డలి పార్టీ 5 ఏళ్లల చేయలేని పనులు 23 నెలల్లో చేశామని వివరించారు. చెప్పిన మాట ప్రకారం.. హంద్రీనివా పనులు పూర్తి చేసి తొలి ఏడాదిలోనే 727 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి కృష్ణాజలాలు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌లో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక, ఏపీ సీఎంలు తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తారని తెలిపారు. కేవలం 22 నెలల్లోనే పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్వాసితుల‌కు రూ. 2,250 కోట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పూర్తికానీ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతాంగాన్ని మోసం, దగా చేశాడంటూ వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల నిప్పులు చెరిగారు. కూట‌మి ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు కోసం రూ.2,500 కోట్లు ఖ‌ర్చు చేశామని వివరించారు. రూ. 203 కోట్లతో శ్రీశైలం డ్యాం మరమ్మతులు చేపట్టామన్నారు. 23 నెలల్లో భారీ నీటిపారుదల శాఖలో

Andhra Jyothy25 May, 02:29 pm
Home » Andhra Pradesh » Guntur » Pawan Kalyan Makes Key Remarks at Jana Sena Meeting Says Tamil...

Home » Andhra Pradesh » Guntur » Pawan Kalyan Makes Key Remarks at Jana Sena Meeting Says Tamil Nadu Politics Ran Smoothly Sj ABN , Publish Date - May 25 , 2026 | 07:59 PM ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధిన...

NTV Telugu23 May, 08:36 am
Arava Sridhar Resignation: పవన్‌ కల్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌.. పదవికి రాజీనామా..

- Arava Sridhar Resignation: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. - ఇటీవల మహిళా వివాదంలో అరవ శ్రీధర్ పేరు వినిపించడంతో, పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆయనను అమరావతికి పిలిపించినట్లు సమాచారం. - ఈ భేటీలో తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాలపై అరవ శ్రీధర్..

Andhra Jyothy29 May, 01:14 pm
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. వయోభారం కారణంగా.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..శుక్రవారం హైదరాబాద్‌లోని నివాసంలో మృతి చెందారు. హైదరాబాద్, మే29: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. వయోభారం కారణంగా.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..శుక్రవారం హైదరాబాద్‌లోని నివాసంలో మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1940, జులై 10వ తేదీన ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో గాదె వెంకటరెడ్డి జన్మించారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన.. ప్రజాసేవపై ఉన్న ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1967లో అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. అలా 27 ఏళ్ల వయస్సులో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఆయన వరుస ఓటములను చవిచూశారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 1994లో పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొంది.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్లలో మంత్రిగా పని చేశారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా వెంకటరెడ్డి పని చేశారు. బీజేపీ యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తులసి మొక్క ఎండిపోయిందని బయట పడేస్తున్నారా..?

NTV Telugu28 May, 06:02 am
మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి

TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ మహానాడులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మహానాడులో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఎన్టీఆర్ జయంతి ప్రతి తెలుగువారికి పండుగ రోజు అని పేర్కొన్నారు. సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్, తన క్రమశిక్షణ, కృషి, నిజాయితీతో సినీరంగంలో అగ్రస్థానానికి చేరుకుని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. రైతుబిడ్డగా మొదలై, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పాత్రల ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడిగా ఆయన నిలిచారని గుర్తుచేశారు. అంతేకాకుండా, ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీని దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలిపిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఎన్టీఆర్ పాలన రైతులకు అండగా, మహిళలకు భరోసాగా, కార్మికులకు అభయంగా, యువతకు దిక్సూచిగా నిలిచిందని తెలిపారు చంద్రబాబు. “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే నినాదాన్ని శాశ్వతంగా ప్రజల్లో నాటిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 1983లో యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిన్న జాతీయ

Andhra Jyothy28 May, 04:41 am
రెండో రోజు ఘనంగా ప్రారంభమైన మహానాడు

టీడీపీ మహానాడు రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందే కార్యక్రమం మొదలైంది. అమరావతి, మే 28: టీడీపీ మహానాడు- 2026 రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందే కార్యక్రమం మొదలైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు మహానాడుకు హాజరయ్యారు.

NTV Telugu27 May, 07:14 am
వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

YS Jagan: మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ మరియు అసెంబ్లీ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజల పక్షాన చేపట్టాల్సిన పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. “రెండేళ్ల చంద్రబాబు పాలన మోసపూరితం” కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నాయని, ఈ కాలంలో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని విమర్శించారు జగన్‌.. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. “బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ” అని ప్రజల్లో నిరూపితమైందన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో 143 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా హామీల అమలుపై ఒక్క మాట లేదన్నారు జగన్‌. “ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్” ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేకపోవడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని జగన్ ఆరోపించారు. గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు భారీ పన్నులు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలపై భారం పెరిగిందని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. “వెన్నుపోటుకు రెండేళ్లు” బుక్‌లెట్ విడుదల చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో

Andhra Jyothy28 May, 12:55 pm
ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన

వర్చువల్‌గా మహానాడు అదరగొట్టిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. వర్చువల్‌గా మహానాడు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రెండ్రోజులపాటు వర్చువల్‌ మహానాడు అద్భుతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి, మే28: వర్చువల్‌గా మహానాడు అదరగొట్టిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. వర్చువల్‌గా మహానాడు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రెండ్రోజులపాటు వర్చువల్‌ మహానాడు అద్భుతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. గురువారం మహానాడు ముగింపు సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌ కాదు... కామన్‌ మ్యాన్‌ అని స్పష్టం చేశారు. ఈ 23 నెలల్లో రూ. లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. ప్రతి సంవత్సరం టార్గెట్‌ పెట్టుకుని పనిచేస్తున్నామని వివరించారు. ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరేలా చూస్తున్నామని చెప్పారు. పోకిరీలు, ఆకతాయిల ఆటకట్టిస్తామని ప్రకటించారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తల పార్టీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నాయకులు వస్తారు.. కొందరు కుప్పిగంతులు వేస్తారు.. పార్టీని మోసేది మాత్రం కార్యకర్తలే అని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో కనిపించిందన్నారు. 16 లక్షల 75 వేల మంది వర్చువల్‌గా ఈ మహానాడుకు హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వివరించారు. 18 దేశాల నుంచి ఆన్‌లైన్‌లోకి వచ్చారని పేర్కొన్నారు. రికార్డు సృష్టించడం, తిరగరాయడం, రికార్డులు బద్దలుకొట్టడం టీడీపీకే సాధ్యమని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల బీమా కోసం