
నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనలో గొడ్డలి పార్టీ కుట్రలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రెస్‌మీట్‌లో బయటపెట్టారు. వైఎస్ విగ్రహా ధ్వంసం వెనుక గొడ్డలి పార్టీ ఉందనే సాక్ష్యాలను మీడియాకు విడుదల చేశారు. అమరావతి, జూన్ 1: నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనలో గొడ్డలి పార్టీ కుట్రలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రెస్‌మీట్‌లో బయటపెట్టారు. వైఎస్ విగ్రహా ధ్వంసం వెనుక గొడ్డలి పార్టీ ఉందనే సాక్ష్యాలను మీడియాకు విడుదల చేశారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య అనే గొడ్డలి పార్టీ కార్యకర్త భార్యకు గత ప్రభుత్వంలోనే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఉద్యోగం ఇచ్చారనే వివరాలను మీడియా ముందుంచారు. తాము, తమ కుటుంబం వైసీపీకి చెందిన వాళ్లమని జంబులయ్య, ఆయన కుటంబసభ్యుల వాంగ్మూలాలను మీడియా కాన్ఫరెన్సులో ప్రదర్శించారు. శవం, సింపతీ, స్టాట్యూ అనేది గొడ్డలి పార్టీ విధానమంటూ మంత్రి అనగాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి వ్యవహారంలో జగన్ పీఏ కేఎన్నార్ ఆస్తుల గుట్టు బయటపడుతోందని మంత్రి తెలిపారు. జగన్ పీఏకే బినామీలు ఉన్నారంటే.. జగన్‌కు ఇంకెంత మంది బినామీలు ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ కార్యకర్త జంబులయ్యతో తీయించి.. దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జంబులయ్య భార్యకు మెప్మాలో గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చారని... నాటి వైసీపీ ఎమ్మెల్యేనే ఆ ఉద్యోగం ఇప్పించారని తెలిపారు. మనుషుల తలకాయలే తీసిన గొడ్డలి పార్టీ నేతలకు.. విగ్రహాల తలలు తీయడం ఓ లెక్క కాదన్నారు. విగ్రహం తలకాయను గొడ్డలి పార్టీ నేతలే తీయించడం.. మళ్లీ ధర్నాలు చేయడం ఆ పార్టీకే చెల్లిందంటూ దుయ్యబట్టారు. శవం, సింపతీ, స్టాట్యూ అనేది గొడ్డలి పార్టీ విధానమంటూ వ్యాఖ్యానించారు. వైఎస్













