
Ruhani Sharma: బర్త్ డే.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన హీరోయిన్ రుహాని శర్మ
పుట్టిన రోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ రుహాని శర్మ (Ruhani Sharma) కొన్ని స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది.
© 2026 telugu.digital

పుట్టిన రోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ రుహాని శర్మ (Ruhani Sharma) కొన్ని స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల అదరహో అనే రేంజ్లో జరిగాయి. తెలుగునేలపైనే కాదు తెలుగువారున్న పలు ప్రాంతాల్లో పవన్ పుట్టినరోజు (HBDPawanKalyan)ను ఘనంగా జరుపుకున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సారి మరింత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. ఊరూరా, వాడవాడలా పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఫ్యాన్స్ ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగునేలపైనే కాదు ప్రపంచంలోని నలుమూలల ఉన్న తెలుగువారిలో చాలామంది పవన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం విశేషం. పవన్‌కు దేశప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ భార్య అన్నా, ఆయన నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పలు స్పెషల్ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పవన్ పై ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొందరు సినీజనం కూడా పవన్ పుట్టినరోజున స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేయడం విశేషం. ఇక పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో సాయిధరమ్ పాల్గొని అభిమానులకు ఆనందం పంచారు... చిత్రసీమలోని పలువురు పవన్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ 200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఆయనకున్న అశేష ప్రజాదరణ, స్టార్డమ్, పవర్ ప్యాక్డ్ వ్యక్తిత్వం గురించే అందరూ చర్చిస్తుంటారు. అయితే, తెరవెనుక ఆయనలో ఉన్న అరుదైన మానవతా దృక్పథాన్ని, ఆపన్నుల పట్ల ఆయన చూపించే ప్రేమను ఆవిష్కరిస్తూ ‘ఓజీ’ (OG) చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) సోషల్ మీడియా వేదికగా చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్‌లోని సేవా గుణాన్ని శ్రియా రెడ్డి వివరిస్తూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే పీకే సర్! మీ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా గొప్ప విషయాలు చెబుతుంటారు. కానీ నా మనసులో బలంగా ముద్రపడిపోయినవి మాత్రం.. సైలెంట్‌గా మీరు చేసే మంచి పనులే. ఎదుటివారి మాటలను మీరు వినే విధానం, వారి కష్టాలను గుర్తుపెట్టుకునే తీరు.. అన్నింటికంటే ముఖ్యంగా వారి సమస్యను పరిష్కరించడానికి మీరు రంగంలోకి దిగి కార్యాచరణ చేసే పద్ధతి ఎవరికీ సాధ్యం కాదు. మీరు కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని గుర్తుపెట్టుకుని వెంటనే చేసి చూపిస్తారు’’ అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా చేసిన పలు సంఘటనలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ‘‘భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామానికి రోడ్డు సౌకర్యం గురించి మీతో ప్రస్తావించినప్పుడు.. మీరు శ్రద్ధగా విన్నారు, ఆ సమస్యను పరిష్కరించి చూపించారు. ఓ వృద్ధురాలు తన ఇంటికి మళ్లీ రమ్మని మిమ్మల్ని కోరితే.. ఎన్నో ఏళ్ల

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం (AP Deputy CM)కు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ బర్త్‌డే అంటే అందరి కళ్లూ ఎదురుచూసేది ఒక్కరి ట్వీట్ కోసమే.. ఆయనే ప్రముఖ నిర్మాత, పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ (Bandla Ganesh)! గతంలో పవన్ కళ్యాణ్ మూవీ ఆడియో ఫంక్షన్లలో బండ్లన్న ఇచ్చిన స్పీచ్‌లు, డైలాగులు ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ పెట్టిన సుదీర్ఘమైన, ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన మార్క్ భక్తిని చాటుకుంటూ బండ్లన్న చేసిన పోస్ట్ చూసి ‘బండ్లన్న మళ్లీ పూనకాలతో పూనకేశ్వరుడిగా మారాడు’ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికెత్తుతూ బండ్ల గణేష్ రాసిన పదాలు అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ‘‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. మీ పేరు వింటే పూనకం… మీ పేరు వింటే పులకం… మీ రూపం చూస్తే పులకింత… మీ మాట వింటే ధైర్యం… మీ అడుగు పడితే సంచలనం! మీరు కేవలం ఒక హీరో మాత్రమే కాదు… కోట్లాది మందికి ఒక బలమైన భావోద్వేగం. మీరు ఒక స్టార్ కాదు… నడిచే ఒక అద్భుత శక్తి. మీరు ఒక సాధారణ పేరు కాదు… కోట్లాది హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర. మీ శిష్యుడిగా మిమ్మల్ని అభిమానించడం నా పూర్వజన్మ సుకృతం
టీవీలో వినోదం అనేది ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్‌లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్‌ను ఇస్తుంది. ఇక రేపు అంటే గురువారం అన్ని ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఉడతా ఉడతా ఊచ్ రానుంది. ఈటీవీ ప్లస్‌లో రాత్రి తొమ్మిదిన్నరకి మీ శ్రేయోభిలాషి రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సందడే సందడి రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు ఓ చినదాన, ఉదయం 10 గంటలకు జగదేకవీరుని కథ, ఒంటి గంటకు మహానగరంలో మాయగాడు, సాయంత్రం నాలుగు గంటలకు మా ఆవిడ కలెక్టర్, ఏడు గంటలకు బలరామకృష్ణులు, రాత్రి పది గంటలకు గుండా, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ ఓ చినదాన మూవీని రిపీట్ మోడ్‌లోనే ప్రసారం చేయనున్నారు.జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు 1940లో ఒక గ్రామం, సాయంత్రం నాలుగున్నరకి జగపతి చిత్రాలు రానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు సాంబ, మూడు గంటలకు రచ్చ రానున్నాయి. జెమినీ మూవీస్‌లో మిడ్ నైట్ ఒకటిన్నరకి స్వప్నలోకం, ఉదయం నాలుగున్నరకి అందరూ దొంగలే, ఉదయం ఏడు గంటలకు రావుగారిల్లు, పది గంటలకు బిల్లా, ఒంటి గంటకు లోఫర్, నాలుగు గంటలకు పూలరంగడు, ఏడు గంటలకు సీమసింహం, రాత్రి పది గంటలకు వేటగాడు ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం 9 గంటలకు నువ్వులేక నేనులేను, సాయంత్రం ఐదు గంటలకు పిండం రానున్నాయి. జీ సినిమాలు ఛానెల్లో ఉదయం 7 గంటలకు స్టూడెంట్ నెంబర్ 1, 9 గంటలకు మిస్టర్ మజ్ను, 12 గంటలకు హనుమాన్, 3 గంటలకు రంగ్

Mega wishes: మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ తన తమ్ముడిపై ఉన్న ప్రేమను, గర్వాన్ని చిరంజీవి చాటుకున్నారు. చిన్నప్పటి నుంచే పవన్‌లో నిబద్ధతతో కూడిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే తపనను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమై.. ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో వేస్తారని కొనియాడారు. తమ కుటుంబంపై పవన్ ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని చిరంజీవి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్తున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటూ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని

Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ను మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి చారిత్రక పాత్రలో సుదీప్ కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. విడుదల చేసిన గ్లింప్స్‌లో సుదీప్ లుక్ రాజసం, గంభీరతతో ఆకట్టుకునేలా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్లో థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సుదీప్ మాస్, యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వంటి చారిత్రక పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుదీప్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రేపు (సెప్టెంబర్ 2) బుల్లితెరపై పవర్ స్టార్ సినిమాలు సందడి చేయబోతోన్నాయి. మామూలుగానే ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్‌లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్‌ను ఇస్తుంది. ఇక రేపు అంటే బుధవారం అన్ని ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ తెలుగు డబ్డ్ మూవీ ద బాయూ, రెండు గంటలకు నువ్వెక్కడుంటే నేనక్కడుంటా రానున్నాయి. ఈటీవీ ప్లస్‌లో రాత్రి తొమ్మిదిన్నరకి బీరువా రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సుస్వాగతం రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు అల్లుడి కోసం, ఉదయం 10 గంటలకు మంచి మనుషులు, ఒంటి గంటకు పిల్ల నచ్చింది, సాయంత్రం నాలుగు గంటలకు అల్లరి ప్రేమికుడు, ఏడు గంటలకు సుస్వాగతం, రాత్రి పది గంటలకు కృష్ణ నటించిన శక్తి, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ అల్లుడి కోసం మూవీని రిపీట్ మోడ్‌లోనే ప్రసారం చేయనున్నారు

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ ప్రాజెక్ట్ ‘OG 2’ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ‘OG 2’ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ పవన్-సుజీత్ కలయికలో ‘OG యూనివర్స్’ను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా గతంలో పలు సందర్భాల్లో బర్త్‌డే రోజు ‘OG 2’ సర్ ప్రైజ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. సుజీత్ ఒక పవర్ఫుల్ యానిమేటెడ్ వీడియో రెడీ చేస్తున్నారనే టాక్ కూడా ఫిలింనగర్ వర్గాల్లో నడిచింది. అయితే ప్రస్తుతానికి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక శబ్దం లేకపోవడం విశేషం. అటు పవర్ స్టార్ కూడా భుజం గాయం కారణంగా ఆయుర్వేదం చికిత్స నిమిత్తం కేరళలో ఉన్నారు. సో బర్త్‌డే సందర్బంగా పెద్ద వీడియో కాకుండా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా చిన్న ప్రమోషనల్ గ్లింప్స్ మాత్రమే విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ఈ పుట్టినరోజుకి పోస్టర్ లేదా గ్లింప్స్ ఇచ్చినా షూటింగ్ మాత్రం ఇప్పుడే ఆశించలేమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పవర్ స్టార్ నుంచి ఎలాంటి బర్త్‌డే సర్ ప్రైజ్ రానుందో చూడాలి

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఆయన చేయడమే కాకుండా, అభిమానులకు, ప్రజలకు కూడా ఆయన ఈ పని చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇంతకీ మెగాబ్రదర్ ఏం చేశారో తెలుసా.. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ (కదంబవాసిని) మొక్కలను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ.. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గమని తెలిపారు. అంతేకాదు, ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుందని తెలుపుతూ.. ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలని కోరుతూ.. సోదరుడు
తెలుగు సినిమా చరిత్రను "చిరంజీవికి ముందు... చిరంజీవి తర్వాత" అని విభజించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. థియేటర్లలో ఈలల వర్షం కురిసినా, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాలన్నా గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మెగాస్టార్ చిరంజీవి . సామాన్య కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి మద్రాసు వీధుల్లో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చిరంజీవి ఆనాడు పరిశ్రమలో దిగ్గజ హీరోల హవా నడుస్తున్న సమయంలో కేవలం తన అద్వితీయమైన నటన, అద్భుతమైన డ్యాన్స్ శైలి, ఫైట్లలో సరికొత్త వేగంతో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ‘పునాదిరాళ్లు’తో తన కెరీర్‌కి పునాది వేసుకున్న చిరంజీవి సుప్రీం హీరోగా కోట్లాది మంది ప్రేక్షకుల మన్ననలు పొంది మెగాస్టార్‌గా రూపాంతరం చెంది ఇప్పుడు ఒక్క కంటిసైగతో యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీనే శాసించే స్థాయికి చేరుకున్నారు. నేడు (ఆగస్టు 22) చిరంజీవి తన 71వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మెగాస్టార్ పుట్టినరోజంటే కోట్లాది మంది అభిమానులకు ఒక పండుగ రోజు.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టిన చిరంజీవికి చిన్న వయసు నుంచే నటనపై ఆసక్తి ఉండేది. దీంతో యుక్త వయసు రాగానే మద్రాస్ చేరుకుని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి 1978లో "పునాదిరాళ్ళు", "ప్రాణం ఖరీదు" చిత్రాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విలన్‌గా, సహాయ నటుడిగా, యాంటీ హీరోగా వైవిధ్యభరిత పాత్రలు పోషించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన "మనవూరి పాండవులు", కె. విశ్వనాథ్ గారి "శుభలేఖ" లాంటి చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి.ఖైదీతో సంచలనం1983లో విడుదలైన "ఖైదీ" చిత్రం తెలుగు చిత్రసీమ గమనాన్ని మార్చేసింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా, చిరంజీవిని మాస్ హీరోగా తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. చిరంజీవి రాకతో తెలుగు సినిమాల్లో యాక్షన్ శైలి మారింది

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఆయన ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ ఫెస్టివల్. ఆగస్ట్ 22వ తేదీ వస్తోందంటే చాలు చిరంజీవి అభిమానుల ఆనందం అంబరమంటుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బర్త్‌డే (HBD Chiranjeevi) ఆయన ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ ఫెస్టివల్. ఆగస్ట్ 22వ తేదీ వస్తోందంటే చాలు చిరంజీవి అభిమానుల ఆనందం అంబరమంటుతూ ఉంటుంది. పైగా సక్సెస్ రూటులో సాగుతోన్న మెగాస్టార్.. ఫ్యాన్స్‌కు మరింత ఆనందం పంచుతున్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తను మెగాస్టారే అనేలా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు సైతం షాకిస్తున్నారు. ఏడు పదులు దాటిన తర్వాత హీరోలకు స్టార్ డమ్ తగ్గుతుందంటారు. డెబ్బై ఏళ్ళ వయసులోనూ స్టార్‌గా సక్సెస్ చూసిన వారు అరుదుగానే ఉన్నారు... అలాంటి జాబితాలో చిరంజీవి సైతం చేరారు. ఈ యేడాది సంక్రాంతి సంబరాల్లో టాప్ హిట్‌గా నిలచిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సక్సెస్‌తో ఆ ఫీట్ సాధించారు చిరంజీవి. ఇప్పటి వరకు 70 ఏళ్ళవయసులోనూ టైటిల్ రోల్స్‌తో బంపర్ హిట్స్ చూసిన వారిలో యన్టీఆర్, రజనీకాంత్ ఉన్నారు.. ఇప్పుడు చిరంజీవి కూడా వారి సరసన చేరారు. అదే ఫ్యాన్స్‌కు అమితానందం పంచుతోంది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో చిరంజీవి మరో విశేషాన్నీ సొంతం చేసుకున్నారు. ఆయన రాజకీయాల నుంచి పూర్తిస్థాయిలో సినిమాలకు అంకితమైన తర్వాత మూడు బంపర్ హిట్స్ చూశారు. ఆ మూడు చిత్రాలు సంక్రాంతి సంబరాల్లోనే పాలుపంచుకోవడం విశేషం. 2017లో ‘ఖైదీ నంబర్ 150’, 2023లో ‘వాల్తేరు వీరయ్య’, ఈ యేడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇలా సంక్రాంతికి రిలీజ్ చేసిన చిత్రాలతో చిరు బంపర్ హిట్స్ అందుకున్నారు. ఒకప్పుడు మెగాస్టార్‌గా ఆయన రాజ్యమేలుతున్న సమయంలోనూ వరుసగా సంక్రాంతి సక్సెస్ తో ‘హ్యాట్రిక్’ సాధించారు. ఇప్పుడు అలా వరుస సంవత్సరాల్లో కాకపోయినా, వరుసగా పొంగల్‌కు రిలీజ్ చేసిన సినిమాలతో గ్రాండ్ సక్సెస్ చూశారు చిరంజీవి. అది కూడా విశేషంగా మారింది.. అందుకే