translateexpand_more

Blood Pressure News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 05:11 am
దేశంలో బీపీ’ పెరిగిపోతోంది.. 15 ఏళ్లు దాటితే చాలు గుండెపై భారమే

వయసుతో సంబంధం లేకుండా చాలామంది సైలెంట్ కిల్లర్ హైబీపీ బారిన పడుతున్నారు. దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-6) విడుదల చేసిన వివరాల ప్రకారం 15 ఏళ్లు పైబడిన వారిలో అధిక రక్తపోటు వేగంగా పెరుగుతోంది. గత సర్వేతో పోలిస్తే బీపీ బాధితుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుత గణాంకాలు మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి.యువతలో అధిక రక్తపోటుభారతదేశంలో 15 ఏళ్లు దాటిన మహిళల్లో 19.4 శాతం మంది, పురుషుల్లో 22.1 శాతం మంది హైబీపీతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ మందులు వాడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో నివసించే వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. నగరాల్లో ఉండే పురుషుల్లో 26.2 శాతం మంది, మహిళల్లో 23.5 శాతం మంది అధిక రక్తపోటుతో సతమతమవుతున్నారు.గుండెకు పొంచి ఉన్న ముప్పుఅధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రాణాంతక అవయవాలను దెబ్బతీసే వరకు ఎలాంటి లక్షణాలను బయటకు చూపించదు. రక్తప్రవాహం బలంగా నెట్టడం వల్ల గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే మెదడులోని రక్తనాళాలు పగిలిపోయి పక్షవాతం రావచ్చు. దీనివల్ల కంటిచూపు కోల్పోవడంతో పాటు కిడ్నీలు పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది.అలవాట్లే అసలు కారణంమనం తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బీపీ పెరుగుతోంది. జంక్ ఫుడ్స్ తినడం, బరువు పెరగడం, ధూమపానం, మద్యపానం వంటి