translateexpand_more

British Mp Rupert Lowe News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 02:53 am
యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక

బ్రిటన్‌ను దశాబ్దాలుగా కుదిపేస్తున్న 'గ్రామింగ్ గ్యాంగ్స్' (వ్యవస్థీకృత బాలల లైంగిక వేధింపుల ముఠాలు) వివాదంపై బ్రిటిష్ ఎంపీ రూపెర్ట్ లోవ్ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. ఒక స్వతంత్ర రేప్ గ్యాంగ్ విచారణ కమిటీ సేకరించిన బాధితుల అత్యంత భయానక, బాధాకరమైన వాంగ్మూలాలను ఆయన హౌస్ ఆఫ్ కామన్స్‌లో చదివి వినిపించారు. ఈ క్రూరమైన దాడుల గురించి ప్రపంచమంతా వినాలని, ఇప్పటికైనా ఎంపీలంతా కేవలం చర్చలతో సరిపెట్టకుండా బాధితుల కోసం తక్షణమే రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎంపీ లోవ్ గత ఏడాది జరిపిన ఒక ప్రైవేట్ పరిశోధనలో బ్రిటన్‌లోని కనీసం 85 ప్రాంతాలలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దశాబ్దాలుగా క్రియాశీలంగా ఉన్న ఈ రేప్ గ్యాంగులలో ప్రధానంగా పాకిస్ధానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నారని, ప్రభుత్వ యంత్రాంగాల తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ అరాచకాలు ఇంతలా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు.ఎంపీ లోవ్ చదివిన నివేదికలలో బాధితులు తాము ఎదుర్కొన్న నరకాన్ని వివరించారు. ఒక బాధితురాలు తాను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తనపై అత్యాచారం చేసి, ఆపై ఖాళీ మద్యం సీసాతో అంతర్గత అవయవాలు దెబ్బతినేలా దాడి చేశాడని పేర్కొంది. మరొక బాధితురాలు తను 13 ఏళ్ల వయసు నుంచి మూడు సంవత్సరాల పాటు దాదాపు 600 నుండి 700 మంది వేర్వేరు పురుషుల చేతిలో అత్యాచారానికి గురయ్యానని వాపోయింది. పండుగలు, ఈద్ (రంజాన్) సెలవుల సమయంలో ఈ దాడులు, పార్టీలు మరింత హింసాత్మకంగా మారేవని