translateexpand_more

Brown Rice Section News

Latest updates from Telugu Digital news sources.

Sakshi28 May, 04:51 am
వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే

ఇటీవలకాలంలో అందరు ఆరోగ్య స్పృహతో పోషకవంతమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా భోజనం విషయంలో వైట్‌రైస్‌ కంటే బ్రౌన్‌రైస్‌ని, చపాతీలను, తాజా పండ్లు, కూరగాయలను వినయోగిస్తున్నారు. కొందరు మితంగా వైట్‌ రైస్‌ తీసుకుంటూ ఆకుకూరలు, నట్స్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ వైట్‌రైస్‌ అసలు తినకపోవడమే మంచిదా?, బ్రౌన్‌ రైస్‌ మాత్రమే ఆరోగ్యానికి మంచిదా? అంటే ఆ ఆలోచనే సరైనది కాదంటున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . బ్రౌన్‌ ఆరోగ్యానికి మంచిదనేది నిజమే అయినప్పటికీ పూర్తిగా వైట్‌ రైస్‌ తీసుకోకూడదని కాదు అంటున్నారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య రీత్యా ఏది తీసుకుంటే మంచిదనేది ఆధారపడి ఉంటుందంటున్నారు. అదెలాగంటే.. తెల్లబియ్యం.. తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల, అది సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో కొంతమందికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తీవ్రమైనప్పుడు, తప్పక ఫైబర్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, తినేందుకు మృదువుగా ఉంటుంది. బ్రౌన్‌రైస్‌ ఇందులో పోషకమైన మొలక, పీచుపదార్థం గల ఊక, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఎండోస్పెర్మ్‌ తదితరాలు ఉంటాయి. దీని గరుకైన ఊక ఉపరితలం కారణంగా నమలడానికి గట్టిగానూ ఉడికేందుకు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది. పోలిస్తే.. సమతుల్య ఆహారంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండూ ఉంటాయి. అయితే, తెల్ల బియ్యంతో పోలిస్తే, బ్రౌన్ రైస్‌లో ఊక, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అనేక బి విటమిన్లు (బి1, బి3, బి6, మరియు బి9)