translateexpand_more

Chennai Super Kings Record News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu01 Jun, 02:01 am
టైటిల్స్ రికార్డులో సీఎస్కే, ముంబై సరసన ఆర్సీబీ.. ఛాంపియన్స్ అంటార్రా బాబూ

పదిహేడేళ్ల పాటు ఒక్క కప్ కూడా లేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్‌తో హిస్టరీ క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది. హార్దిక్ పాండ్యాకి వెంట్రుక వాసిలో మిస్సయిన ఈ రికార్డును రజత్ పటిదార్ ఈజీగా సొంతం చేసుకున్నాడు. మొత్తానికి ఇన్నేళ్ల ఐపీఎల్ కలలన్నీ ఒక్కొక్కటిగా తీరుతున్నందుకు ఆర్సీబీ అభిమానులు ఫుల్ జోష్‌లో మునిగిపోతున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు రెండు జట్లు మాత్రమే బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలు అందుకుంది. 2021 నుంచి ఏ జట్టు కూడా బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలవలేదు. 2020 వరకు ఐపీఎల్ చరిత్రలో ఓ రెండు జట్లు బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్‌గా అవతరించాయి. ఐపీఎల్‌ను శాసించిన ఆ రెండు జట్లే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు ఆ రెండు జట్ల సరసన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో మొత్తం ఐదు టైటిల్స్ సొంతం చేసుకుంది. 2010లో తొలిసారి ట్రోఫీ సొంతం చేసుకున్న సీఎస్కే 2023 వరకు ఐదు టైటిల్స్ గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021, 2023లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇందులో 2010, 2011లో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ సొంతం చేసుకుని, అప్పట్లో ఈ రికార్డు సృష్టించిన తొలి జట్టుగా నిలిచింది. సీఎస్కేతో పోటీగా ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకున్న మరో జట్టు ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తొలిసారి 2013లో ఛాంపియన్‌గా అవతరించిన