translateexpand_more

Royal Challengers Bengaluru News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 09:32 am
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్

స్పోర్ట్స్ డెస్క్:  ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, వారి అభిమానుల సంబరాలు ఏమాత్రం తగ్గడం లేదు. 17 ఏళ్ల తర్వాత గతేడాది తొలిసారి ఐపీఎల్ కప్పు సాధించడం, అదే ఊపుతూ వరుసగా రెండో సారి కూడా ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీతో సహా మిగిలిన సభ్యులందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కింగ్ కోహ్లీ అయితే ట్రోఫీ అందుకునే సమయంలో చేసిన సందడి అంతాఇంతా కాదు. తాను సీనియర్ ప్లేయర్‌ను అనే సంగతి మర్చి మరీ.. చిన్న పిల్లాడిలా మారిపోయాడు. తనలో ఎవ్వరూ డ్యాన్స్ ఆవహించిన ట్లుగా విరాట్ అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను కూడా పంచుకున్నాడు. అందులో తన సహచరుడు భువనేశ్వర్ కుమార్‌తో కలిసి విరాట్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు . జట్టు విజయోత్సవ వేడుకలో తీసిన ఈ క్లిప్‌లో ఆ ఇద్దరూ ఫ్లోర్‌పై 'కిక్లి' స్టెప్ వేస్తూ కనిపించారు. కిక్లి అనేది పంజాబ్‌కు చెందిన ఓ జానపద నృత్యం. ఈ డ్యాన్స్‌ను భువీ, విరాట్ వేస్తూ.. సహచరులను ఎంటర్ టైన్ చేశారు. దీని చూసిన అభిమానులు సైతం తెగ సంబరపడుతున్నారు.

క్రికెట్ దిగ్గజమైన కోహ్లీ.. ఇలా చిన్న పిల్లాడిలా మారి.. సంబరాల్లో మునిగి తేలడం.. అతడి అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇలా కోహ్లీ డ్యాన్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. రెండు రోజుల క్రితం తన భార్య అనుష్క శర్మతో కలిసి కూడా విరాట్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. మరోవైపు ఆర్సీబీ రెండవ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కోహ్లీ చేసిన అజేయ 75 పరుగులు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో అతడు అద్భుత ప్రదర్శన చేయడం, తన జట్టు ఏకంగా ట్రోఫీని ముద్దాడటం పట్ల విరాట్ ఎంతో సంతోషంగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!

జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్

Andhra Jyothy02 Jun, 01:07 am
ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్ పై సస్పెన్షన్ వేటు

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై వేటు పడింది. టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించి.. 2 డీమెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో వేసింది. దీంతో వచ్చే సీజన్‌లో ఆర్సీబీ తొలి మ్యాచ్‌కు టిమ్ డేవిడ్ నిషేధం ఎదుర్కోనున్నాడు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో వికెట్ పడిన అనంతరం టిమ్ డేవిడ్ ఆగ్రహంతో ఐస్ బ్యాగ్‌ను అంపైర్ నితిన్ మీనన్ వైపు విసిరినట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించారు. ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 ఉల్లంఘనగా తేలింది. ఈ నిబంధన ప్రకారం ప్లేయర్ లేదా మ్యాచ్ అధికారుల వైపు ప్రమాదకరంగా క్రికెట్ సామగ్రి లేదా ఇతర వస్తువులను విసరడం నేరంగా పరిగణిస్తారు. తన తప్పును టిమ్ డేవిడ్ అంగీకరించడంతో పాటు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన శిక్షను స్వీకరించాడు. ఇప్పటికే అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తంగా 5 పాయింట్లకు చేరింది. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. ఫలితంగా టిమ్ డేవిడ్ ఐపీఎల్ 2027లో ఆర్సీబీ తరఫున లేదా తాను ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ తరఫున ఆడే తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

ఇవి కూడా చదవండి:

విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం