translateexpand_more

Gujarat Titans News

Latest updates from Telugu Digital news sources.

Eenadu02 Jun, 10:20 am
ఏకపక్ష మ్యాచ్ లతో ఐపీఎల్ ప్రభ తగ్గుతోందా

ఆర్థికంగా ప్రతి ఏడాదీ ఐపీఎల్ స్థాయి ఇంతింతై అన్నట్లు ఎదిగిపోతోంది. ప్రస్తుతం ఈ క్రికెట్ లీగ్ విలువ రూ.లక్షన్నర కోట్ల పైమాటే! ప్రపంచంలో ఉన్న మిగతా క్రికెట్ లీగ్‌లన్నీ కలిపినా.. ఇంత విలువ చేయవంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్ రికార్డులు ఎప్పటికప్పుడు బద్దలవుతూనే ఉన్నాయి. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఈ లీగ్ అంత ఆసక్తికరంగా సాగుతోందా? అభిమానులను అలరిస్తోందా? అంటే మాత్రం ఔనని సమాధానం చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఈ 2026 ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అనాసక్తికర సీజన్ అనదగ్గట్లుగా సాగింది. భారీ అంచనాలున్న పెద్ద జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి. స్టార్ ఆటగాళ్ల మెరుపులు ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా ఉత్కంఠభరిత మ్యాచ్‌లు సరిపడా లేక లీగ్ కళ తప్పింది. హోరాహోరీ సమరాలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు పట్టుమని పది కూడా లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ టై అయి, సూపర్ ఓవర్‌కు మళ్లినా.. మ్యాచ్‌కు చప్పటి ముగింపే లభించింది. సూపర్ ఓవర్‌లో లఖ్‌నవూ ఒక్క పరుగే చేయడంతో కోల్‌కతా సునాయాసంగా గెలిచేసింది. ముంబయిపై బెంగళూరు చివరి బంతికి గెలిచిన మ్యాచ్ లాంటి కొన్ని మాత్రమే అభిమానులను అలరించాయి. ఐపీఎల్‌లో లీగ్ దశ అంతా ఒకెత్తయితే.. ప్లేఆఫ్స్ ఇంకో ఎత్తు. అవి ఎంతో హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగాలని అభిమానులు ఆశిస్తారు. కానీ ఈసారి ప్లేఆఫ్స్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఉత్కంఠ లేదు. నాలుగు మ్యాచ్‌లూ ఏకపక్షంగానే సాగాయి. క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ ఏకంగా 254 పరుగులు చేయడంతో ముందే మ్యాచ్ ఫలితం మీద ఒక అంచనా వచ్చేసింది. గుజరాత్ కనీస పోటీ ఇవ్వకుండా 162 పరుగులకే కుప్పకూలింది. ఎలిమినేటర్‌ మ్యాచ్ కూడా దాదాపు ఇలాగే సాగింది. రాజస్థాన్ రాయల్స్ 243 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 196కే పరిమితమైంది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ 214 పరుగులు చేయడంతో మ్యాచ్ పోటాపోటీగా ఉంటుందనుకుంటే.. గుజరాత్ 3 వికెట్లే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఫైనల్లో మొదట గుజరాత్‌ 155 పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్ మీద ఆసక్తి సన్నగిల్లింది. మరీ ఏకపక్షంగా కాకపోయినా.. బెంగళూరు సులువుగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇలా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లన్నింట్లోనూ వార్ వన్ సైడ్ అయిపోయి ఐపీఎల్-19కు పేలవ ముగింపు దక్కింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లయిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేయడం ఈ సీజన్ మీద ఆసక్తిని బాగా తగ్గించింది. ముంబయి కేవలం నాలుగే విజయాలు సాధించింది. చాలా ముందే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసుకు దూరమైంది. చెన్నై ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. లీగ్‌ను పేలవంగా ఆరంభించి, మధ్యలో పుంజుకున్న చెన్నై, చివరికి ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. ముంబయి జట్టులో సూపర్ స్టార్లయిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా తీవ్రంగా నిరాశపరిచారు. రోహిత్ గాయంతో అయిదు మ్యా‌చ్‌లకు దూరమయ్యాడు. మిగతా మ్యాచ్‌ల్లో చాలా వరకు ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా బరిలోకి దిగాడు. 9 మ్యాచ్‌ల్లో 2 అర్ధశతకాలతో 283 పరుగులే చేశాడు హిట్ మ్యాన్. 360 డిగ్రీల్లో అదిరిపోయే షాట్లు ఆడే సూర్యకుమార్ 13 మ్యాచ్‌ల్లో 2 అర్ధశతకాలతో 270 పరుగులే చేశాడు. హార్దిక్ పాండ్య (206 పరుగులు, 4 వికెట్లు), బుమ్రా (4 వికెట్లు) సైతం అంచనాలను అందుకోలేకపోయారు. ఇక చెన్నై జట్టు తరఫున ఎం.ఎస్.ధోని అసలు బరిలోకే దిగకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. లఖ్‌నవూ జట్టులో రిషబ్ పంత్ తేలిపోయాడు. దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాయి. పంజాబ్ ప్రథమార్ధంలో అదరగొట్టి, ద్వితీయార్ధంలో తుస్సుమనిపించింది. పెద్ద జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడితే.. సన్‌రైజర్స్ మెరుగైన ప్రదర్శనే చేసింది. స్టార్ ఆటగాళ్లలో కోహ్లి, శుభ్‌మన్ గిల్ మాత్రమే అభిమానుల అంచనాలను అందుకున్నారు. 2026 ఐపీఎల్ పూర్తిగా కళ తప్పకుండా చూసిన ఘనత 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకే దక్కుతుంది. గత సీజన్లో 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి 35 బంతుల్లో శతకంతో ఔరా అనిపించిన వైభవ్.. తాను వన్ సీజన్ వండర్ కాదని రుజువు చేస్తూ, ఈ సీజన్‌లో ఉత్తమ బ్యాటర్‌గా అవతరించాడు. 776 పరుగులతో అతనే ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఎంతో కీలకమైన చివరి రెండు మ్యాచ్‌ల్లో 97, 96 పరుగుల ఇన్నింగ్స్‌లతో అతను బ్యాటర్‌గా ఎన్నో మెట్లు ఎక్కేశాడు. వైభవ్ కోసమే లక్షల మంది స్టేడియాలకు వచ్చారు! అతడి కోసమే కోట్ల మంది టీవీలు, మొబైళ్లలో మ్యాచ్‌లు చూశారు. కోహ్లీ సహా సూపర్ స్టార్లను మించి ఈ సీజన్‌లో ఆకర్షణ సంపాదించి, ఐపీఎల్ అభిమానుల దృష్టినంతా తన వైపు తిప్పుకొన్న ఘనత వైభవ్ సొంతం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి

TV9 Telugu02 Jun, 01:24 am
ఆర్సీబీకి దిమ్మతిరిగే షాక్.. స్టార్ ప్లేయర్ పై నిషేధంతోపాటు జరిమానా

Tim David Suspended: ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని ముద్దాడి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ మహా ఆనందంలో ఉన్న ఆర్సీబీ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి షాక్ ఇచ్చింది. మైదానంలో దురుసు ప్రవర్తన కారణంగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అంపైర్‌పై ఆగ్రహం: అసలేం జరిగిందంటే? అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 31, ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, ఇన్నింగ్స్ 10వ ఓవర్ వద్ద టిమ్ డేవిడ్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. మైదానంలో విధుల్లో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్ బ్యాగ్‌ను అత్యంత కోపంగా, ప్రమాదకర రీతిలో విసిరాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా సాగిన ఈ ప్రవర్తన సాక్షాత్తూ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. బీసీసీఐ నిబంధనావళిలోని ఆర్టికల్ 2.9 ప్రకారం.. మైదానంలో ఆటగాళ్లు, అంపైర్లు లేదా ఇతర అధికారులపై బంతిని కానీ, వాటర్ బాటిళ్లు, ఐస్ బ్యాగ్‌ల వంటి ఇతర క్రీడా పరికరాలను కానీ కోపంతో విసరడం తీవ్రమైన నేరం. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు గాను మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించారు. భారీ జరిమానా.. వచ్చే ఏడాది ఒక మ్యాచ్‌పై నిషేధం.. ఈ దురుసు ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ, టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో ఏకంగా 50 శాతం కోత విధిస్తూ జరిమానా విధించింది. దీనితో పాటు అతని ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను చేర్చింది. మ్యాచ్ అనంతరం టిమ్ డేవిడ్ కూడా తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ విధించిన శిక్షను స్వీకరించాడు. అయితే, ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో టిమ్ డేవిడ్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. ఈ సీజన్‌లో ఇది అతనికి మూడవ తప్పు. గతంలో ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకసారి, రాయ్‌పూర్‌లో అదే జట్టుతో జరిగిన 54వ మ్యాచ్‌లో రెండోసారి అతను నిబంధనలను ఉల్లంఘించాడు. అంతేకాకుండా, ధరమ్‌శాలాలో పంజాబ్ కింగ్స్‌పై గెలిచిన తర్వాత ఆ జట్టు యజమాని ప్రీతి జింటా ముందే శృతిమించి సంబరాలు చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఈ సీజన్ మొత్తం మీద ఐదు డీమెరిట్ పాయింట్లు రావడంతో, వచ్చే ఏడాది (ఐపీఎల్ 2027) జరగబోయే మొదటి మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ఆడకుండా బీసీసీఐ నిషేధం విధించింది. ఈ సీజన్‌లో టిమ్ డేవిడ్ ప్రదర్శన.. మైదానంలో ప్రవర్తన ఎలా ఉన్నా, ఈ సీజన్‌లో ఆర్సీబీ తరపున ఆడిన 16 మ్యాచ్‌ల్లోనూ టిమ్ డేవిడ్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 188.27 స్ట్రైక్ రేట్‌తో 305 పరుగులు చేశాడు. ముఖ్యంగా బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 25 బంతుల్లోనే 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం 17 బంతుల్లో 24 పరుగులు చేసి అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఈ వివాదాన్ని పక్కన పెడితే, ఆర్సీబీ సాధించిన విజయం క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి, మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. రసిఖ్ సలామ్ అద్భుత బౌలింగ్‌తో గుజరాత్‌ను కట్టడి చేయగా, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ సిక్సర్‌తో మ్యాచ్ ముగించడంతో స్టేడియం మార్మోగిపోయింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలిచిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త రికార్డు లిఖించింది. మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Andhra Jyothy02 Jun, 01:07 am
ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్ పై సస్పెన్షన్ వేటు

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై వేటు పడింది. టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించి.. 2 డీమెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో వేసింది. దీంతో వచ్చే సీజన్‌లో ఆర్సీబీ తొలి మ్యాచ్‌కు టిమ్ డేవిడ్ నిషేధం ఎదుర్కోనున్నాడు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో వికెట్ పడిన అనంతరం టిమ్ డేవిడ్ ఆగ్రహంతో ఐస్ బ్యాగ్‌ను అంపైర్ నితిన్ మీనన్ వైపు విసిరినట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించారు. ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 ఉల్లంఘనగా తేలింది. ఈ నిబంధన ప్రకారం ప్లేయర్ లేదా మ్యాచ్ అధికారుల వైపు ప్రమాదకరంగా క్రికెట్ సామగ్రి లేదా ఇతర వస్తువులను విసరడం నేరంగా పరిగణిస్తారు. తన తప్పును టిమ్ డేవిడ్ అంగీకరించడంతో పాటు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన శిక్షను స్వీకరించాడు. ఇప్పటికే అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తంగా 5 పాయింట్లకు చేరింది. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. ఫలితంగా టిమ్ డేవిడ్ ఐపీఎల్ 2027లో ఆర్సీబీ తరఫున లేదా తాను ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ తరఫున ఆడే తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

ఇవి కూడా చదవండి:

విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం