translateexpand_more

Ipl Final Match News

Latest updates from Telugu Digital news sources.

Eenadu01 Jun, 03:25 am
మా ప్లాన్ అదే.. ఈ కప్పూ వారికే అంకితం

ఇంటర్నెట్ డెస్క్‌: వరుసగా రెండోసారి ఐపీఎల్ కప్పును నెగ్గిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. విరాట్ కోహ్లీతోపాటు ఆ జట్టు సారథి రజత్ పాటీదార్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆర్సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. నాకౌట్‌ స్టేజ్‌లోని గత మూడు మ్యాచుల్లో టాస్‌ గెలిచిన టీమ్‌ తొలుత బ్యాటింగ్‌ తీసుకుంది. అందుకు భిన్నంగా ఆర్సీబీ లక్ష్య ఛేదన వైపే మొగ్గుచూపడం గమనార్హం. దీనిపై బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ స్పష్టత ఇచ్చాడు. అలాగే ఈ విజయాన్ని వారి అభిమానులకే మళ్లీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘‘వరుసగా రెండో కప్పును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఫైనల్‌ కోసం ఇక్కడికి వచ్చాక గతేడాది జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు ఎలా ఆడామో.. ఇప్పుడు కూడా అదే దూకుడు ప్రదర్శించాం. ఈ విజయంపై ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. టాస్‌ గెలిస్తే ఏం చేయాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నాం. మా ప్లాన్ ప్రకారమే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ లక్ష్య ఛేదన సులువుగానే ఉంటుందని భావించాం. అందుకే, టాస్ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్నాం. గుజరాత్ టాప్ - 3 బ్యాటర్లను త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్ మా నియంత్రణలోకి వస్తుందని తెలుసు. భువీ, జోష్, రసిఖ్ ఈ సీజన్‌లో చాలా ప్రభావం చూపించిన బౌలర్లు. జట్టులోని ప్రతి బౌలర్‌ను నేను మెన్షన్ చేయాలి. కెప్టెన్‌గా ఇక్కడ నా ప్రయాణం అద్భుతం. వరుసగా రెండోసారి కప్పును సగర్వంగా ఎత్తుకోవడం మరిచిపోలేని సందర్భం. గతేడాది మాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. కానీ, ఈసారి అంచనాలు ఉన్నాసరే ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడాం’’ అని పాటీదార్ తెలిపాడు. ‘‘ఈ

Eenadu01 Jun, 02:15 am
మారింది నా ఆట కాదు.. ఆలోచనా విధానమే

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2026 సీజన్‌ విజేతగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలవడంలో విరాట్ కోహ్లీ పాత్ర కీలకమైందే. బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించిన అతడు.. మైదానంలోనూ దూకుడుగా వ్యవహరించాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై ఫైనల్‌లో 75 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ తన జట్టుకు రెండో కప్పును అందించాడు. ఇప్పుడున్న కుర్రాళ్లే మనల్ని మరింత ముందుకు వెళ్లేలా చేస్తారని విరాట్ వ్యాఖ్యానించాడు. ‘‘ కప్పును అందుకోవాలని ప్రతి ఒక్క ప్లేయర్‌ కలలు కంటాడు. ఇలాంటి క్షణాలను ఎక్కువ సార్లు రావాలని అనుకుంటాడు. ఐపీఎల్ కప్పు గెలిచినప్పుడు ఆ విజయాన్ని ఖాయం చేసే పరుగులు కొడుతూ క్రీజ్‌లో నిలబడి ఉండాలనేది నా కల. అది ఈసారి సాధ్యమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి మేం కొత్తగా ఏమీ చేయలేదు. చాలా రిలాక్స్‌గా ఉన్నాం. కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగాం. మేం ఎలా ఆడాలని అనుకున్నామో.. అదే ఆటతీరును ప్రదర్శించాం. నా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని చేయడం వెనుక కుర్రాళ్లే కారణమని చెబుతా. సూపర్ యంగ్‌ ప్లేయర్లు మనల్ని నిరంతరం ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తారు. ఎప్పటికప్పుడు మన గేమ్‌ను మార్చుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మెరుగ్గా మారాలంటే బాగా శ్రమించాలి. ఇప్పుడు మోడ్రన్ క్రికెట్‌లో ఎప్పుడైనా సరే అదనంగా 20 లేదా 30 పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇప్పుడు నా మైండ్‌సెట్‌ను మాత్రమే మార్చుకున్నా. నా ఆటతీరు కాదు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు భారీగా షాట్లు కొట్టేందుకూ వెనుకాడను. ప్రత్యర్థిగా బెస్ట్ బౌలర్‌ ఉన్నా సరే కొట్టాలనుకుంటే కొట్టేయడమే. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అని విరాట్ అన్నాడు. ‘‘గతేడాది మేం ఛాంపియన్‌గా నిలిచాం. ఈసారి మాపై భారీ అంచనాలు వచ్చాయి. మేం ఒక్కో లక్ష్యం పెట్టుకుని మరీ

Eenadu30 May, 03:15 pm
ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL) 2026 ఫైనల్‌ మ్యాచ్‌.. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా ఆర్సీబీ (Royal Challengers Bengaluru), గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించడం తమ బౌలర్ల చేతుల్లోనే ఉందని కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) అన్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజత్‌ పాటిదార్‌ మాట్లాడాడు. ‘పోటీలో నెగ్గాలంటే.. చక్కటి బౌలింగ్‌ ఎటాక్‌ ఉండాలి. ఈ పిచ్‌పై 200, 220 పరుగులు చేయడం తేలిక. కానీ ఆ స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోవడం కష్టం. అందుకే బౌలింగ్‌ దళం సత్తా చాటాలి’ అని పాటిదార్ అన్నాడు. అలాగే భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌ను అతడు కొనియాడాడు. ‘భువీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడు అనుభవమున్న బౌలర్‌. తుదిపోరులో బౌలింగ్‌ చేయడం బౌలర్లకు అంత తేలికైన విషయం కాదు. అతడికి తన ప్రణాళికలు, శక్తిసామర్థ్యాల మీద పూర్తి అవగాహన ఉంది. అదే కీలక పాత్ర పోషించనుంది’ అని రజత్‌ పాటిదార్‌ అన్నాడు. ‘టాప్‌ బౌలర్లైన భువీ, హేజిల్‌వుడ్‌కు ఇతర బౌలర్ల నుంచీ మద్దతు అవసరం. రసిఖ్‌ సలామ్‌ దార్‌ ఈ విషయంలో జట్టుకు సాయపడ్డాడు. ఇలా బౌలర్ల నుంచి సహాయ సహకారాలు అందడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీరు కేవలం ఒకరిద్దరు బౌలర్లతోనే పోటీలో గెలవలేరు. రసిఖ్‌ ఈ టోర్నమెంట్‌లో చక్కటి పాత్ర పోషించాడు. ప్రధాన బౌలర్ల మీద అదనపు భారం లేదు. జట్టంతా అద్భుతంగా ముందుకు సాగుతోంది’ అని పాటిదార్‌ వివరించాడు. అలాగే చేతివేలి గాయానికి గురైన ఫిల్‌సాల్ట్‌ పునరాగమనం గురించి కూడా అతడు మాట్లాడాడు. ‘ప్రస్తుతం అతడు నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అయితే తుది జట్టులో అతడికి చోటు

Eenadu31 May, 10:04 pm
ఆర్సీబీ 2.0.. గత విజయం గాలివాటం కాదని చాటిచెబుతూ రెండో కప్పు

‘‘ఈ సల కప్‌ నమ్‌దే’’ అన్న నినాదం కాల క్రమంలో కామెడీగా మారిపోయి ఎంతో వేదనను అనుభవించిన ఆర్సీబీ ఫ్యాన్స్‌.. వరుసగా రెండేళ్లు ‘‘ఈ సలనూ కప్‌ నమ్‌దు’’ అంటూ మురిసిపోతున్నారిప్పుడు. గత ఏడాది సాధించిన విజయం గాలివాటం కాదని చాటిచెబుతూ వరుసగా రెండో కప్పుతో తన ఆధిపత్యాన్ని చాటింది బెంగళూరు. రజత్‌ పాటీదార్‌ నేతృత్వంలోని ఈ ఆర్సీబీ.. ఆషామాషీ జట్టు కాదనడానికి ఈ ఏడాది ప్రదర్శన తిరుగులేని రుజువు. వరుసగా తొమ్మిదేళ్ల పాటు కోహ్లి పోరాడాడు.. ఇంకో అరడజను మంది కెప్టెన్లు కలిసి వేర్వేరు సీజన్లలో ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ బెంగళూరుకు కప్పు మాత్రం అందించలేకపోయారు. ఐపీఎల్‌ ఆరంభమైన రెండో ఏడాదే (2009) ఆర్సీబీ ఫైనల్‌ చేరింది. 2011, 2016లోనూ తుది పోరుకు అర్హత సాధించింది. కానీ ఒక్కసారీ ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. కోహ్లి నుంచి పగ్గాలందుకున్న డుప్లెసిస్‌ కూడా జట్టు రాత మార్చలేకపోవడంతో గత ఏడాది రజత్‌ పాటీదార్‌ లాంటి పెద్దగా పేరు లేని ఆటగాడిని కెప్టెన్‌ను చేసింది ఆర్సీబీ. మహా మహా ఆటగాళ్లే ఆర్సీబీ కల నెరవేర్చని నేపథ్యంలో పాటీదార్‌ మాత్రం ఏం చేస్తాడులే అనుకున్నారు చాలామంది. కానీ అతడి సారథ్యంలో బెంగళూరు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. లీగ్‌ దశలో ఆధిపత్యం చలాయించడమే కాక, ఫైనల్లోనూ నెగ్గి కప్పు కల నెరవేర్చుకుంది. అప్పుడు ఆర్సీబీ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే లేక లేక ఓ కప్పు నెగ్గిన ఆర్సీబీ.. ఇంకోసారి ఈ అద్భుతాన్ని పునరావృతం చేస్తుందన్న అంచనాలు ఎక్కువగా లేవు. కానీ గత సీజన్‌ను మించిన ఆటతీరుతో, మరింత ఆధిపత్యంతో ఈసారి కప్పు గెలిచింది బెంగళూరు. లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలవడమే కాక.. రెండో స్థానంలో నిలిచిన గుజరాత్‌ను

Eenadu01 Jun, 09:08 am
తగ్గని విజయ కాంక్ష.. ఇదీ విరాట్ సక్సెస్ మంత్ర

అన్నింటికీ మించి ఓ యోధుడు ఆ జట్టుకు వెన్నెముకగా మారాడు.. ఛేజింగ్‌ కింగ్‌ అని ఎందుకంటారో మరోసారి నిరూపించాడు.. తమ తొలి ఐపీఎల్ టైటిల్‌కు ‘ద్వితీయ’ విఘ్నం లేకుండా చేసేశాడు పైన ఉపోద్ఘాతమంతా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించే.. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో ఒకే ఒక్క జట్టుకు ఆడుతూ నిలకడగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్. విజయమో.. వీరస్వర్గమో కాదు. గెలుపే శ్వాస.. గెలుపే లక్ష్యం. ఆర్సీబీ రెండోసారి కప్పును సొంతం చేసుకోవడంలో విరాట్ అండ్‌ కో పాటించిన సక్సెస్ మంత్ర ఇదే. ఫైనల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పట్టువిడవకుండా 75 పరుగులతో అజేయంగా చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు. ఈ సీజన్‌లో 675 పరుగులు చేశాడు. అత్యుత్తమ యావరేజీ కూడా విరాట్‌దే కావడం గమనార్హం. ఐపీఎల్ జరిగిన దాదాపు రెండు నెలలూ ఎండాకాలమే. ఎక్కువ మ్యాచులు రాత్రి 7 గంటలకు మొదలైనా సరే.. ఆ ఉక్కపోత తట్టుకోవడం కష్టం. 20 ఓవర్లపాటూ మైదానంలో ఉత్సాహంగా ఉండాలంటే ఫిట్‌నెస్ అత్యంత కీలకం. ఈ విషయంలో విరాట్ కోహ్లీపై ఒక్క రిమార్కూ ఉండదు. ఇప్పుడున్న కుర్రాళ్ల కంటే జోష్‌గా పరుగులు పెట్టాడు. బ్యాటింగ్‌ సమయంలోనూ అంతే. సహచరులు ఏమైనా వెనుకడుగు వేస్తే పదమంటూ పరుగులు పెట్టించాడు. సింగిల్‌ వచ్చే దగ్గర కూడా డబుల్‌ తీసిన సందర్భాలెన్నో! ‘‘నా అంత ఫిట్‌నెస్ ఇప్పుడున్న కుర్రాళ్లకూ ఉండదు. మైదానంలో 40 ఓవర్లపాటు ఇటు నుంచి అటు వైపు పరుగులు పెట్టమన్నా పెడతా. సింగిల్‌, డబుల్స్‌ తీస్తూ వెళ్లాలని చెబితే అదీ చేస్తా. ఆట కోసం నేనేమీ ప్రత్యేకంగా తయారుకాను. నా దినచర్య ఇలానే ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు రెడీగా ఉంటా’’ ఐపీఎల్‌ కప్పును సొంతం చేసుకుని

Eenadu01 Jun, 03:49 am
పరిస్థితులకు అనుగుణంగా ఆడా

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2026 సీజన్‌లో హాట్‌ టాపిక్‌ వైభవ్ సూర్యవంశీ. ఈ ఎడిషన్‌లో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్‌లో ఓడి ఇంటిముఖం పట్టినా.. అతడు మాత్రం తన ఆటతో దుమ్మురేపాడు. అత్యధిక పరుగులు (776) చేసి ఆరెంజ్ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు మరి కొన్ని అవార్డులను దక్కించుకున్నాడు. ఎమర్జింగ్‌ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రయిక్‌రేట్ (237.3), సూపర్ సిక్సర్ల (72) అవార్డులు వరించాయి. ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం వాటిని స్వీకరించిన వైభవ్‌.. ఈ టోర్నీలో తన అనుభవాలను పంచుకున్నాడు. ‘‘అవార్డులు వచ్చినందుకు ఆనందంగా ఉన్నా.. ఇలా ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే కాస్త ఒత్తిడిగా అనిపిస్తోంది. నాకు ఇది గర్వపడే క్షణం. వచ్చే సీజన్‌లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. (నిర్భయంగా ఆడేందుకు రోజుకు ఎన్ని గ్లాస్‌ల పాలు తాగుతావు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ) సార్.. నేను ఇవాళ పాలు తాగలేదు (నవ్వుతూ). ఆట కోసం ప్రత్యేకంగా ఏమీ చేయను. సహజసిద్ధంగా ఆడేందుకు ప్రయత్నించా. తొలి బంతి నా జోన్‌లో పడితే భారీ షాట్ కొట్టేందుకే చూస్తా. ఒక్కసారి కనెక్ట్ అయితే అదే దూకుడుతో ఆడతా. నేను ఈ సీజన్‌లో ఓ కీలక విషయం నేర్చుకున్నా. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలనేది తెలుసుకున్నా. అలాగే పరిస్థితికి తగ్గట్టుగా జట్టుకు ఏది అవసరమో తెలుసుకుని ఆడా. నాకౌట్‌ స్టేజ్‌లోనూ అది చేసి చూపించా. ఫిట్‌నెస్‌పైనా దృష్టి పెట్టా. సుదీర్ఘకాలం పాటు ఆడాలంటే అదెంతో కీలకం. గాయాలు కాకుండా చూసుకోవాలి. మా జట్టులోని ప్రతి ఒక్కరూ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. వారంతా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు. జట్టులో చాలా మంచి వాతావరణం ఉంది’’ అని వైభవ్‌ తెలిపాడు.

Eenadu01 Jun, 04:16 am
ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ.. హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB).. గుజరాత్‌ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి క్రీడాభిమానులు సందడి చేశారు. సచివాలయం, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పెద్ద ఎత్తున గుమిగూడి బాణసంచా కాలుస్తూ ఆర్సీబీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ముందు జాగ్రత్తగా కొద్దిసేపు పోలీసులు ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ను మూసివేశారు. ఈ వీడియో చూశారా: ‘చూశావా బంతి నేలను తాకింది’!.. కోహ్లీ, గిల్‌ ఆసక్తికర చర్చ

Eenadu02 Jun, 10:20 am
ఏకపక్ష మ్యాచ్ లతో ఐపీఎల్ ప్రభ తగ్గుతోందా

ఆర్థికంగా ప్రతి ఏడాదీ ఐపీఎల్ స్థాయి ఇంతింతై అన్నట్లు ఎదిగిపోతోంది. ప్రస్తుతం ఈ క్రికెట్ లీగ్ విలువ రూ.లక్షన్నర కోట్ల పైమాటే! ప్రపంచంలో ఉన్న మిగతా క్రికెట్ లీగ్‌లన్నీ కలిపినా.. ఇంత విలువ చేయవంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్ రికార్డులు ఎప్పటికప్పుడు బద్దలవుతూనే ఉన్నాయి. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఈ లీగ్ అంత ఆసక్తికరంగా సాగుతోందా? అభిమానులను అలరిస్తోందా? అంటే మాత్రం ఔనని సమాధానం చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఈ 2026 ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అనాసక్తికర సీజన్ అనదగ్గట్లుగా సాగింది. భారీ అంచనాలున్న పెద్ద జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి. స్టార్ ఆటగాళ్ల మెరుపులు ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా ఉత్కంఠభరిత మ్యాచ్‌లు సరిపడా లేక లీగ్ కళ తప్పింది. హోరాహోరీ సమరాలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు పట్టుమని పది కూడా లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ టై అయి, సూపర్ ఓవర్‌కు మళ్లినా.. మ్యాచ్‌కు చప్పటి ముగింపే లభించింది. సూపర్ ఓవర్‌లో లఖ్‌నవూ ఒక్క పరుగే చేయడంతో కోల్‌కతా సునాయాసంగా గెలిచేసింది. ముంబయిపై బెంగళూరు చివరి బంతికి గెలిచిన మ్యాచ్ లాంటి కొన్ని మాత్రమే అభిమానులను అలరించాయి. ఐపీఎల్‌లో లీగ్ దశ అంతా ఒకెత్తయితే.. ప్లేఆఫ్స్ ఇంకో ఎత్తు. అవి ఎంతో హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగాలని అభిమానులు ఆశిస్తారు. కానీ ఈసారి ప్లేఆఫ్స్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఉత్కంఠ లేదు. నాలుగు మ్యాచ్‌లూ ఏకపక్షంగానే సాగాయి. క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ ఏకంగా 254 పరుగులు చేయడంతో ముందే మ్యాచ్ ఫలితం మీద ఒక అంచనా వచ్చేసింది. గుజరాత్ కనీస పోటీ ఇవ్వకుండా 162 పరుగులకే కుప్పకూలింది. ఎలిమినేటర్‌ మ్యాచ్ కూడా దాదాపు ఇలాగే సాగింది. రాజస్థాన్ రాయల్స్ 243 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 196కే పరిమితమైంది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ 214 పరుగులు చేయడంతో మ్యాచ్ పోటాపోటీగా ఉంటుందనుకుంటే.. గుజరాత్ 3 వికెట్లే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఫైనల్లో మొదట గుజరాత్‌ 155 పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్ మీద ఆసక్తి సన్నగిల్లింది. మరీ ఏకపక్షంగా కాకపోయినా.. బెంగళూరు సులువుగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇలా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లన్నింట్లోనూ వార్ వన్ సైడ్ అయిపోయి ఐపీఎల్-19కు పేలవ ముగింపు దక్కింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లయిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేయడం ఈ సీజన్ మీద ఆసక్తిని బాగా తగ్గించింది. ముంబయి కేవలం నాలుగే విజయాలు సాధించింది. చాలా ముందే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసుకు దూరమైంది. చెన్నై ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. లీగ్‌ను పేలవంగా ఆరంభించి, మధ్యలో పుంజుకున్న చెన్నై, చివరికి ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. ముంబయి జట్టులో సూపర్ స్టార్లయిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా తీవ్రంగా నిరాశపరిచారు. రోహిత్ గాయంతో అయిదు మ్యా‌చ్‌లకు దూరమయ్యాడు. మిగతా మ్యాచ్‌ల్లో చాలా వరకు ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా బరిలోకి దిగాడు. 9 మ్యాచ్‌ల్లో 2 అర్ధశతకాలతో 283 పరుగులే చేశాడు హిట్ మ్యాన్. 360 డిగ్రీల్లో అదిరిపోయే షాట్లు ఆడే సూర్యకుమార్ 13 మ్యాచ్‌ల్లో 2 అర్ధశతకాలతో 270 పరుగులే చేశాడు. హార్దిక్ పాండ్య (206 పరుగులు, 4 వికెట్లు), బుమ్రా (4 వికెట్లు) సైతం అంచనాలను అందుకోలేకపోయారు. ఇక చెన్నై జట్టు తరఫున ఎం.ఎస్.ధోని అసలు బరిలోకే దిగకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. లఖ్‌నవూ జట్టులో రిషబ్ పంత్ తేలిపోయాడు. దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాయి. పంజాబ్ ప్రథమార్ధంలో అదరగొట్టి, ద్వితీయార్ధంలో తుస్సుమనిపించింది. పెద్ద జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడితే.. సన్‌రైజర్స్ మెరుగైన ప్రదర్శనే చేసింది. స్టార్ ఆటగాళ్లలో కోహ్లి, శుభ్‌మన్ గిల్ మాత్రమే అభిమానుల అంచనాలను అందుకున్నారు. 2026 ఐపీఎల్ పూర్తిగా కళ తప్పకుండా చూసిన ఘనత 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకే దక్కుతుంది. గత సీజన్లో 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి 35 బంతుల్లో శతకంతో ఔరా అనిపించిన వైభవ్.. తాను వన్ సీజన్ వండర్ కాదని రుజువు చేస్తూ, ఈ సీజన్‌లో ఉత్తమ బ్యాటర్‌గా అవతరించాడు. 776 పరుగులతో అతనే ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఎంతో కీలకమైన చివరి రెండు మ్యాచ్‌ల్లో 97, 96 పరుగుల ఇన్నింగ్స్‌లతో అతను బ్యాటర్‌గా ఎన్నో మెట్లు ఎక్కేశాడు. వైభవ్ కోసమే లక్షల మంది స్టేడియాలకు వచ్చారు! అతడి కోసమే కోట్ల మంది టీవీలు, మొబైళ్లలో మ్యాచ్‌లు చూశారు. కోహ్లీ సహా సూపర్ స్టార్లను మించి ఈ సీజన్‌లో ఆకర్షణ సంపాదించి, ఐపీఎల్ అభిమానుల దృష్టినంతా తన వైపు తిప్పుకొన్న ఘనత వైభవ్ సొంతం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి

Eenadu01 Jun, 04:46 pm
బ్యాటర్ పై సస్పెన్షన్ వేటు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్సీబీ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌పై వేటు పడింది. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో లెవల్‌ 1 ఉల్లంఘన చేసినందుకు గాను బీసీసీఐ అతడికి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించింది. 2 డీమెరిట్‌ పాయింట్లు అతడి ఖాతాలో వేసింది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ వైపు ఐస్‌ బ్యాగ్‌ను ప్రమాదకరంగా విసిరినట్లు తేలింది. డేవిడ్ తన తప్పును ఒప్పుకొని, మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన శిక్షను అంగీకరించాడు. ఇప్పటికే అతడి ఖాతాలో 3 డీమెరిట్‌ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తంగా 5 పాయింట్లకు చేరడంతో 2027లో ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు పడింది. వచ్చే సంవత్సరం ఆర్సీబీ మొదటి మ్యాచ్‌ను టిమ్‌ డేవిడ్‌ ఆడలేడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ తన బౌలింగ్‌లో స్విచ్‌ హిట్‌తో సిక్సర్‌ కొడితే చాలా కోపమొచ్చేదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ చెప్పాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) ఐపీఎల్‌(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ టీమ్‌ సంబరాలు చేసుకుంది. ఐపీఎల్‌-19 ఫైనల్లో విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అర్షద్‌ ఖాన్‌ వేసిన ఇన్సింగ్స్‌ 16వ ఓవర్‌ చివరి బంతికి విరాట్‌ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శుభ్‌మన్‌ గిల్‌ డైవ్‌ చేసి క్యాచ్‌ అందుకున్నాడు. విరాట్‌ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌-19 ఫైనల్లో సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా విరాట్‌ కోహ్లీ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్‌ వీడియో మీరూ చూడండి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) ఐపీఎల్‌(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది.

Eenadu01 Jun, 06:47 am
వయసులో చిన్న.. ఆర్జనలో మిన్న

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదిహేనేళ్ల టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధికంగా 776 పరుగులు చేసి, ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే 72 సిక్సర్లతో అభిమానులను అలరించి పలు అవార్డులను అందుకున్నాడు. మరి ఈ చిన్నోడు తాజా ఐపీఎల్‌ సీజన్‌లో ఎంత డబ్బును తన జేబులో వేసుకున్నాడో తెలుసా..! వైభవ్‌ సూర్యవంశీని రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాంఛైజీ రూ.1.10 కోట్లకు వేలంపాటలో దక్కించుకుంది. ఈ మొత్తంతో పాటు మ్యాచ్‌ ఫీజులు, పలు రివార్డులూ అతడు సొంతం చేసుకున్నాడు. మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌గా రూ.15 లక్షలు, టోర్నమెంట్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నందుకు గాను రూ.10 లక్షలు, సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌గా నిలిచినందుకు రూ.10 లక్షలతో పాటు టాటా సియెరా వాహనం, సూపర్‌ సిక్సెస్‌ ఆఫ్‌ ది సీజన్‌గా నిలిచినందుకు రూ.10 లక్షలు, అలాగే ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌ అవార్డ్‌ సొంతం చేసుకున్నందుకు రూ.10 లక్షలు అందుకున్నాడు. అలాగే అతడి ఒక మ్యాచ్‌ ఫీజు రూ.7.5 లక్షలు. వైభవ్‌ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడాడు. ఇలా అతడు రూ.1.20 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ఎలక్ట్రిక్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మోస్ట్‌ సిక్సెస్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రివార్డుల ద్వారా మరికొంత నజరానా పొందాడు. ఇలా మొత్తంగా వైభవ్‌ సూర్యవంశీ రూ.2.85 కోట్ల కంటే ఎక్కువ మొత్తమే తన ఖాతాలో వేసుకున్నాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు

Eenadu31 May, 04:43 am
రజత్ పాటీదార్ .. ది సైలెంట్ కిల్లర్

ఐపీఎల్‌లో ఆర్సీబీ అనగానే అందరికీ విరాట్‌ కోహ్లి గుర్తుకొస్తాడు. ఐపీఎల్‌ ఆరంభం నుంచి అదే జట్టుకు ఆడుతూ ఆ ఫ్రాంఛైజీకి కోహ్లి తీసుకొచ్చిన ఆకర్షణ, విలువే వేరు. ఇప్పటికీ కింగ్‌ నిలకడను కొనసాగిస్తున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కానీ కెప్టెన్‌గా ఆర్సీబీ రాత మార్చి, బ్యాటర్‌గా ఆ జట్టును ఎంతో ప్రమాదకరంగా తీర్చిదిద్దుతున్న ఘనత మాత్రం రజత్‌ పాటీదార్‌కే చెందుతుంది. అతడికి స్టార్‌ ఇమేజ్‌ లేదు. తన గురించి సోషల్‌ మీడియాలో పెద్దగా చర్చ జరగదు. మైదానంలో, బయట అతను కూడా పెద్దగా హడావుడి చేయడు. కానీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ప్రశాంతంగా పని చేసుకుపోతూ ఆర్సీబీని మేటి జట్టుగా నిలబెడుతున్నాడు పాటీదార్‌. ఈ ఏడాది ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోరు అనగానే.. ఇది సమవుజ్జీల పోరు అని, ఎంతో హోరాహోరీగా సాగుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ఆర్సీబీ దూకుడు ముందు జీటీ ఏమాత్రం నిలవలేకపోయింది. ఒక ఇన్నింగ్స్‌ అయ్యేసరికే మ్యాచ్‌ ఫలితంపై ఒక అంచనా వచ్చేసింది. ఆర్సీబీ ఆల్‌రౌండ్‌ మెరుపుల ధాటికి బెంబేలెత్తిన టైటాన్స్‌.. ఏకంగా 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు పాటీదార్‌. అతడి ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు ఉండటం విశేషం. తర్వాత తన బౌలింగ్, ఫీల్డింగ్‌ వ్యూహాలతోనూ అతను తన ప్రత్యేకతను చాటాడు. గుజరాత్‌ లాంటి బలమైన బ్యాటింగ్‌ ఉన్న జట్టు కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్‌లో కీలకమైన ప్లేఆఫ్స్‌లో చెలరేగిపోవడం పాటీదార్‌కు ఇది కొత్తేమీ కాదు. ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభ దశలోనే అతను 2022

Andhra Jyothy31 May, 10:17 am
కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. గతేడాది ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. జట్టుకు వరుసగా రెండో కిరీటం అందించాలనే లక్ష్యంతో ఉన్నాడు. మరి విరాట్ గత ఐపీఎల్ ఫైనల్‌ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది ఐదోసారి. గతంలో 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఫైనల్ పోరులో పరాజయం పాలైంది. 2016లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలో ఎస్ఆర్‌హెచ్‌ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్న విరాట్.. 54 పరుగులతో పోరాడినా జట్టు టైటిల్ గెలవలేకపోయింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రజత్ పాటీదార్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. 2025 ఐపీఎల్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది.

ఫైనల్‌లో కోహ్లీ గణాంకాలు..

ఐపీఎల్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ రికార్డులు చెప్పుకోదగినట్లుగా లేవు. లీగ్ దశలో అద్భుతంగా రాణించే కోహ్లీ.. ప్లే ఆఫ్స్, ఫైనల్‌లో మాత్రం తడబడుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ నాలుగు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 126.36 స్ట్రైక్ రేట్‌తో 139 పరుగులు మాత్రమే చేశాడు. ఇది విరాట్ ఐపీఎల్ కెరీర్ రికార్డు కంటే తక్కువ. ఫైనల్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 54. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 2016లో ఈ స్కోర్ నమోదు చేశాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో

Eenadu31 May, 09:17 am
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ రికార్డు ఇలా

ఐపీఎల్‌-19 ఫైనల్‌ మ్యాచ్‌ నేడు అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ఆర్సీబీ ఐదోసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గతంలో నాలుగుసార్లు ఫైనల్‌కి వెళ్లినా ఒక్కసారే ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రెండో టైటిల్‌పై గురిపెట్టింది ఆ జట్టు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ఫైనల్స్‌లో ఆర్సీబీ రికార్డు ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వార్త చదివారా: రజత్ పాటీదార్‌.. ది సైలెంట్‌ కిల్లర్‌: కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదుర్స్‌

Eenadu31 May, 09:49 pm
వైభవ్ సిక్సర్లవంశీ

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా వైభవ్‌ నిలిచాడు. అతడు మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేశాడు. ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల ఘనత అతడిదే. మొత్తం 72 సిక్సర్లు కొట్టాడు. 63 ఫోర్లు బాదాడు. సూర్యవంశీ ఈ టోర్నీలో ప్రతి 4.5 బంతులకు ఒక సిక్స్‌ రాబట్టాడు. అతడు మూడు శతకాలు (93, 97, 96) చేజార్చుకున్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 1000 పరుగులు (440 బంతుల్లో) సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మొత్తం సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు (521) చేసిన మొదటి ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. డేవిడ్‌ వార్నర్‌ (467 పరుగులు, 2016లో)ను వైభవ్‌ అధిగమించాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu01 Jun, 09:30 am
గాలి వాటం కాదు.. అది ఆర్సీబీ ప్రజ్ఞాపాటవం

ఏళ్లకు ఏళ్లు చకోర పక్షిలా నిరీక్షణ తప్పలేదు నిరుడు గెలిచినా.. తొక్కిసలాట ఘటన మిగిల్చిన చేదు అనుభవం తప్పలేదు.. 17 ఏళ్ల తర్వాత గతేడాది తొలిసారి టైటిల్‌ దక్కినా.. తనివితీరా సంబరాలు చేసుకోలేని పరిస్థితి! ఆ లోటును పూడ్చుకోవడం కోసమేనా అన్నట్లు ఆ జట్టు మరోసారి ఐపీఎల్‌ కప్పును ముద్దాడింది తమ విజయం గాలి వాటం కాదని.. అది తమ ఆటగాళ్ల ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనమని.. నలు చెరుగులా చాటి చెప్పింది.. ఆ జట్టే.. ఆర్సీబీ.. ఐపీఎల్‌ 2026లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సత్తా చాటింది. ప్లేఆఫ్స్‌నకు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అలాగే, క్వాలిఫయర్‌ -1లో గుజరాత్‌ టైటాన్స్‌పై పైచేయి సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో అదే జట్టును మరోసారి మట్టికరిపించి.. అ‘ద్వితీయం’గా కప్పును సొంతం చేసుకుంది. ఆర్సీబీ జట్టు కూర్పు అదిరిపోయింది. బ్యాటర్లు, బౌలర్ల సమతూకంగా ఉంది. విరాట్‌ కోహ్లీ, వెంకటేశ్‌ అయ్యర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటీదార్‌, జితేశ్‌ శర్మ, టిమ్‌ డేవిడ్‌, కృనాల్‌ పాండ్య ఇలా.. ఏడో స్థానం వరకు లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. జోష్‌ హేజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జాకబ్‌ డఫీ, రొమారియో షెఫర్డ్‌, రసిఖ్‌ సలామ్‌ దార్‌.. ఇలా బౌలింగ్‌ దళమూ భేష్‌గా ఉంది. కృనాల్‌ పాండ్య రూపంలో చక్కటి ఆల్‌రౌండర్‌ కూడా ఉన్నాడు. దీంతో ఆ జట్టు కూర్పు అద్భుతంగా కుదిరింది. అందుకే ఫిల్‌ సాల్ట్‌ లాంటి స్టార్‌ బ్యాటర్‌ గాయంతో దూరమైనా.. ఆ ప్రభావం జట్టుపై పడలేదు. ఈ సీజన్‌లో ఆర్సీబీ తమ హోం గ్రౌండైన చిన్నస్వామి స్టేడియంలో లీగ్‌ స్టేజిలో కేవలం అయిదు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. మిగతా రెండు మ్యాచ్‌లను రాయ్‌పుర్‌లో ఆడింది. అయినప్పటికీ మెరుగ్గా రాణించి ఫ్లేఆఫ్స్‌నకు చేరుకున్న తొలి

Eenadu31 May, 08:05 am
ఆర్సీబీ ఫైనల్’ గేమ్ .. బెంగళూరులో కఠిన ఆంక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది ఐపీఎల్‌కు సంబంధించిన చివరి మ్యాచ్‌ ఆదివారం జరగనుంది (IPL 2026 final). అహ్మదాబాద్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు నగరవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. గతేడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ (RCB) ఛాంపియన్‌గా నిలవగా.. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంబరాల్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి కప్పు కొట్టేందుకు ఆర్సీబీ ఉత్సాహంతో ఉంది. ఆర్సీబీ మరోసారి టైటిల్‌ గెలిచినా.. ఒకవేళ ఓడిపోయినా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా విధించారు. అభిమానులకు పలు కఠిన ఆంక్షలు విధించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 05:58 pm
వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా ఆర్సీబీ

అహ్మదాబాద్: ఐపీఎల్‌-19 సీజన్‌ విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో గుజరాత్‌పై ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గి వరుసగా రెండోసారి టైటిల్‌ సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో విరాట్‌ కోహ్లీ (75*; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. వెంకటేశ్‌ అయ్యర్ (32; 16 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (24; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. రజత్ పాటీదార్ (15), జితేశ్‌ శర్మ (11) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. లక్ష్యఛేదనలో ఆర్సీబీకి శుభారంభం దక్కింది. వెంకటేశ్‌ అయ్యర్ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. రబాడ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదేశాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచిన కోహ్లీ (Virat Kohli) .. తర్వాత చెలరేగాడు. రబాడ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాదేయడంతో 4 ఓవర్లకే స్కోరు 50 దాటింది. తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌ను సిరాజ్‌, పడిక్కల్ (1)ని రబాడ పెవిలియన్‌కు పంపారు. కాసేపటికే రషీద్ ఖాన్‌ ఒకే ఓవర్‌లో పాటీదార్, కృనాల్ పాండ్య (1)ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో 10 ఓవర్లకు ఆర్సీబీ 100/4తో నిలిచింది. దూకుడుగా ఆడిన కోహ్లీ అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ బాది 25 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో విరాట్‌కు ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ ఇదే. నిలకడగా

Eenadu31 May, 10:33 am
ఐపీఎల్ విజేతకు రూ. 20 కోట్లు.. మరి మిగతా టీమ్ ల పరిస్థితేంటి

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగుల్లో ఐపీఎల్‌ ఒకటి. మరి 19వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా నేడు ఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకు కప్పు సొంతమవుతుంది. దాంతోపాటు భారీ మొత్తం ప్రైజ్‌మనీ కూడా దక్కనుంది. మరి అదెంత? రన్నరప్‌ అయిన టీమ్‌కు ఎంత లభిస్తుంది? మిగతా జట్ల పరిస్థితి? వ్యక్తిగతంగా ప్లేయర్లకూ ఎంత వస్తుందో చూద్దాం.. బీసీసీఐ వర్గాల ప్రకారం ఐపీఎల్ 2026 సీజన్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 46 కోట్లు. 2008లో తొలిసారి ఐపీఎల్ ప్రారంభమైంది. అప్పుడు విజేతకు రూ. 4.8 కోట్లు దక్కేవి. తర్వాత సీజన్‌లోనూ అంతే మొత్తం. అయితే, 2010 నుంచి 2013 వరకు రూ. 10 కోట్లు చొప్పున అందించారు. 2014, 2015లో రూ. 15 కోట్లు.. 2016 నుంచి 2019 వరకు రూ.20 కోట్లు విజేతకు దక్కింది. కొవిడ్‌ కారణంగా 2020లో ప్రైజ్‌మనీని రూ. 10 కోట్లకు తగ్గించింది. ఇక 2021 నుంచి ప్రస్తుత సీజన్‌ వరకూ రూ. 20 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీని విజేతకు ఇస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu01 Jun, 01:46 am
బస్సులో మంటలు.. గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే ఆటగాళ్లు అలర్ట్ అయిపోయారు. బస్సు దిగిన తర్వాత మంటలు రేగాయి. కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న ప్లేయర్లు మరో బస్సులో తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోయారు. ఐపీఎల్ 2026 సీజన్‌ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం గుజరాత్ ఆటగాళ్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu30 May, 11:42 am
వయసులో చిన్న.. పరిణతిలో మిన్న

అతడి వయసు పట్టుమని పదిహేనేళ్లే.. ఇంకా పాలబుగ్గల పసితనమే పోలేదు.. తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాల్సిన వయసు.. కానీ అతడు ప్రస్తుతం హేమాహేమీ బౌలర్లనే మైదానంలో ఓ ఆట ఆడుకుంటున్నాడు..! బ్యాటింగ్‌ అంటే.. బండ బాదుడే కాదు.. తనకు బాధ్యతగా ఆడటమూ తెలుసంటున్నాడు.. మీకీపాటికే అర్థమై ఉంటుంది ఆ బ్యాటర్‌ మరెవరో కాదు.. వైభవ్‌ సూర్యవంశీ అని! ఐపీఎల్‌ (IPL) 2026లో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) ప్రస్థానం ముగిసింది. క్వాలిఫయర్‌-2లో ఆ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) చేతిలో పరాజయం పాలైంది. అయినప్పటికీ రాజస్థాన్‌ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) క్రికెట్‌ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. తనకిది రెండో సీజనే అయినప్పటికీ 16 మ్యాచుల్లో 776 పరుగులతో ప్రస్తుతానికి అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ (722), సాయి సుదర్శన్‌ (710), హెన్రిచ్‌ క్లాసెన్‌ (624), ఇషాన్‌ కిషన్‌ (602), విరాట్‌ కోహ్లీ (602) ఉన్నారు. ఇలా మహామహులనే దాటి వైభవ్‌ టాప్‌-1లో నిలవడం నిజంగా అద్భుతం. రాజస్థాన్‌ రాయల్స్‌ ఇప్పటి వరకు కేవలం ఒక్కసారే ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకుంది. అది కూడా అప్పుడెప్పుడో 2008 ప్రారంభ సీజన్‌లో షేన్‌వార్న్‌ సారథ్యంలో. తర్వాత మధ్యలో అప్పుడప్పుడు కాస్త మెరుగైన ప్రదర్శనలు చేసినప్పటికీ ఎప్పుడూ విన్నర్‌గా నిలవలేదు. ఈ సీజన్‌లో మాత్రం రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్స్‌లో నాలుగో బెర్త్‌ను సొంతం చేసుకుంది. క్వాలిఫయర్‌ -2లో ఓటమితో వెనుదిరిగింది. ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌కు పోటీ ఇచ్చిందంటే దానికి గల కారణం వైభవ్‌ సూర్యవంశీనే! వైభవ్‌ సూర్యవంశీ పేరు చెప్పగానే సిక్సర్ల వర్షం.. ఫోర్ల ప్రవాహం.. గుర్తుకు వస్తాయి. అలా అని అతడు కేవలం

Eenadu31 May, 11:26 am
ఈ మూడు మార్పులు చేస్తే.. ఐపీఎల్ మరింత ఆసక్తికరం

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలకు సమప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ వ్యాఖ్యానించారు. 200+ స్కోర్లు అలవోకగా వచ్చేస్తున్న వేళ బౌలర్లకు ఏమాత్రం అడ్వాంటేజ్‌ లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు మూడు కీలక మార్పులు చేస్తే బాగుంటుందని సచిన్ సూచించారు. తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో సచిన్ పాల్గొన్నారు. మరి ఆయన చెప్పిన ఛేంజెస్‌ ఏంటో మనమూ చూద్దాం.. ‘‘నేను వ్యక్తిగతంగా గమనించిన పలు విషయాలను మీతో పంచుకుంటున్నా. ఐపీఎల్‌లో వినియోగిస్తున్న ఇంపాక్ట్ రూల్‌ను తీసేయాల్సిన అవసరం ఉంది. టీ20 అంటేనే కేవలం 20 ఓవర్ల ఆట. ఇప్పటికే ఉన్న బ్యాటింగ్ లైనప్‌కు అదనంగా మరొకరిని తీసుకుంటున్నారు. ఇప్పటికే బౌలర్లకు పెనుసవాల్‌గా మారింది. ఇప్పుడు మరొక బ్యాటర్‌ అంటే బౌలర్లకు మరింత కష్టమైపోయింది. నాకు అక్కడ సమతుల్యత లేదనిపించింది’’ అని సచిన్ వెల్లడించారు. ‘‘ఇప్పుడు టీ20ల్లో తొలి ఆరు ఓవర్లను పవర్‌ప్లేగా పిలుస్తున్నాం. కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే రింగ్‌ బయట ఉండాలి. ఇప్పుడున్న నిబంధనలతోనే తొలి నాలుగు ఓవర్ల గేమ్‌ నిర్వహించాలి. ఇక మిగిలిన రెండు పవర్‌ప్లే ఓవర్లను బౌలింగ్ టీమ్‌ సారథి నిర్ణయం మేరకు వదిలేయాలి. అతడు ఎప్పుడు వాడుకోవాలనేది అతడి ఇష్టం. కానీ, ఫీల్డింగ్ నిబంధనల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండక్కర్లేదు. ఇలా చేయడం వల్ల మ్యాచ్‌ ఇరు జట్లకూ నియంత్రణలోనే ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని సచిన్ అభిప్రాయపడ్డారు. పైన రెండింటితోపాటు మరో కీలక మార్పు తీసుకొస్తే బాగుంటుందని సచిన్ చెప్పారు. టీ20ల్లో ఒక బౌలర్‌కు ఐదు ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం.. గరిష్ఠంగా ఒకరు నాలుగు ఓవర్లు

Eenadu31 May, 08:48 am
ఐపీఎల్ 2026 ఫైనల్.. బరిలోకి రూ.70 కోట్ల పేస్ ఎటాక్

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2026 సీజన్‌ ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదిక. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌ కప్పు కోసం బరిలోకి దిగుతున్న వేళ.. నెంబర్ 6 పిచ్‌ సిద్ధమైంది. బ్యాటింగ్‌ ఫ్రెండ్లీ పిచ్ అని విశ్లేషకుల అంచనా. గత టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ ఇక్కడ భారీ స్కోరు నమోదు కావడం గమనార్హం. దీంతో ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఏ జట్టు పేసర్లు ప్రభావం చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్యాటింగ్‌తోపాటు ఫాస్ట్ బౌలింగ్‌ కూడా బలమే. మరీ ముఖ్యంగా సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ దెబ్బకు ప్రత్యర్థులు కుదేలు కావడం ఈ సీజన్‌లో చూశాం. భువీని రూ. 10.75 కోట్లు, హేజిల్‌వుడ్‌ను రూ. 12.5 కోట్లకు ఆర్సీబీ తీసుకుంది. వీరితోపాటు యువ పేసర్ రసిఖ్ సలామ్‌ దార్ (రూ.6 కోట్లు), జాకబ్ డఫీ (రూ.2 కోట్లు) కూడా అప్పుడప్పుడు వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆర్సీబీ పేస్ విలువ దాదాపు రూ. 31 కోట్లు. పర్పుల్ క్యాప్‌ రేసులో భువనేశ్వర్ (26 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. రసిఖ్ దార్ (16), జోష్ హేజిల్ వుడ్ (13), జాకబ్ డఫీ (9) వికెట్లు పడగొట్టారు. అంటే ఈ నలుగురు తీసిన వికెట్లు 64 వికెట్లు. గుజరాత్ టైటాన్స్‌కు టాప్ -3 బ్యాటర్లు ఎలానో.. ఆ జట్టు నలుగురు పేసర్లు కూడా అదే స్థాయిలో ప్రభావం చూపించారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ సంగతి సరేసరి. కానీ, పవర్‌ ప్లేలోనే వికెట్లు తీస్తూ సిరాజ్, రబాడ మంచి ఆరంభం ఇచ్చారు. అనుభవంతోపాటు యువ పేసర్ల కలబోతగా జీటీ ఫాస్ట్ బౌలిగ్‌ యూనిట్ ఉంది. ప్రస్తుతం పర్పుల్ క్యాప్

Eenadu31 May, 07:42 am
ఐపీఎల్ 2026 ఫైనల్.. కింగ్ ప్రిన్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్. కానీ, ఆ జట్టుకు ఆకర్షణ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ కూడా అతడే. ఇప్పుడు ఫైనల్‌లోనూ తమ ‘కింగ్‌’ విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు ఆ జట్టు అభిమానులు. నాయకుడిగా, బ్యాటర్‌గా తన జట్టు గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్‌కు చేర్చడంలో శుభ్‌మన్‌ గిల్‌దే కీలక పాత్ర. కప్పును అందిస్తే ఆ లోటూ తీరిపోతుందనేది గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్‌ ఆకాంక్ష. భారత క్రికెట్‌లో విరాట్ తర్వాత అంతటి ప్రాచుర్యం దక్కించుకున్న ‘ప్రిన్స్‌’ గిల్‌ ఫైనల్‌లోనూ విరుచుకుపడితే జీటీకి తిరుగుండదు. ఐపీఎల్ 2026 సీజన్‌ విజేతను తేల్చే ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తుది పోరు జరగనుంది. ఇటు ‘ప్రిన్స్‌’ సొంత మైదానం కావడం.. అటు ‘కింగ్‌’ దూకుడు మీద ఉండటంతో ‘రెండో’ కప్పు ఎవరి సొంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరికీ ఇక్కడ అత్యుత్తమ గణాంకాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా నాకౌట్‌ మ్యాచుల్లో కోహ్లీ, గిల్ ఉత్తమ ఆటతీరు ప్రదర్శించారు. విరాట్, శుభ్‌మన్‌ గిల్ ఇద్దరూ మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఆర్సీబీ, గుజరాత్‌ జట్ల మధ్యే తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో విరాట్ కోహ్లీ (43) దూకుడుగానే ఆడాడు. శుభ్‌మన్ గిల్ మాత్రం తేలిపోయాడు. కేవలం రెండే పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కానీ, రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌పై అతడు సెంచరీతో (104*) మెరిశాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ప్రస్తుతం అత్యధిక పరుగులు జాబితాలో గిల్ (722) రెండో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (600) ఆరో ప్లేస్‌లో ఉన్నాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో