translateexpand_more

Sports News News

Latest updates from Telugu Digital news sources.

Vaartha31 May, 07:09 am
దేశ క్రీడాకారులను అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

PM modi: ప్రధాని మోదీ క్రీడాకారుల అభినందన కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్ లో ఆయన దేశ క్రీడా రంగం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. మన అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న తీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రీడల్లో యువత చూపిస్తున్న ఆసక్తి దేశానికి గర్వకారణమని ప్రధాని కొనియాడారు. ఇలాంటి విజయాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు. Read also: New CDS General Raja Subramani:భారత నూతన సీడీఎస్‌గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం! జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు అద్భుతమైన ప్రతిభకు వేదికగా నిలిచాయి. ఈ క్రీడా పోటీలలో ఏకంగా నాలుగు జాతీయ రికార్డులు నమోదయ్యాయి. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్ వంటి క్రీడాకారులు తమ అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. వీరి కృషిని ప్రధాని ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. క్రీడాకారుల విజయం వెనుక ఉన్న పట్టుదల ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించే దిశగా దేశంలో అనేక మార్పులు వస్తున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారని ప్రధాని వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. యువత క్రీడల్లో రాణిస్తే దేశం ప్రపంచ వేదికపై ఖ్యాతి గడిస్తుందని ఆయన తెలిపారు. క్రీడలను కెరీర్ గా ఎంచుకునే వారికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. Ghaziabad Encounter Asad:ఘజియాబాద్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్: బాలుడి హత్య కేసు నిందితుడు అసద్ హతం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా

Eenadu01 Jun, 03:25 am
మా ప్లాన్ అదే.. ఈ కప్పూ వారికే అంకితం

ఇంటర్నెట్ డెస్క్‌: వరుసగా రెండోసారి ఐపీఎల్ కప్పును నెగ్గిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. విరాట్ కోహ్లీతోపాటు ఆ జట్టు సారథి రజత్ పాటీదార్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆర్సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. నాకౌట్‌ స్టేజ్‌లోని గత మూడు మ్యాచుల్లో టాస్‌ గెలిచిన టీమ్‌ తొలుత బ్యాటింగ్‌ తీసుకుంది. అందుకు భిన్నంగా ఆర్సీబీ లక్ష్య ఛేదన వైపే మొగ్గుచూపడం గమనార్హం. దీనిపై బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ స్పష్టత ఇచ్చాడు. అలాగే ఈ విజయాన్ని వారి అభిమానులకే మళ్లీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘‘వరుసగా రెండో కప్పును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఫైనల్‌ కోసం ఇక్కడికి వచ్చాక గతేడాది జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు ఎలా ఆడామో.. ఇప్పుడు కూడా అదే దూకుడు ప్రదర్శించాం. ఈ విజయంపై ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. టాస్‌ గెలిస్తే ఏం చేయాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నాం. మా ప్లాన్ ప్రకారమే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ లక్ష్య ఛేదన సులువుగానే ఉంటుందని భావించాం. అందుకే, టాస్ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్నాం. గుజరాత్ టాప్ - 3 బ్యాటర్లను త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్ మా నియంత్రణలోకి వస్తుందని తెలుసు. భువీ, జోష్, రసిఖ్ ఈ సీజన్‌లో చాలా ప్రభావం చూపించిన బౌలర్లు. జట్టులోని ప్రతి బౌలర్‌ను నేను మెన్షన్ చేయాలి. కెప్టెన్‌గా ఇక్కడ నా ప్రయాణం అద్భుతం. వరుసగా రెండోసారి కప్పును సగర్వంగా ఎత్తుకోవడం మరిచిపోలేని సందర్భం. గతేడాది మాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. కానీ, ఈసారి అంచనాలు ఉన్నాసరే ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడాం’’ అని పాటీదార్ తెలిపాడు. ‘‘ఈ

Eenadu01 Jun, 02:15 am
మారింది నా ఆట కాదు.. ఆలోచనా విధానమే

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2026 సీజన్‌ విజేతగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలవడంలో విరాట్ కోహ్లీ పాత్ర కీలకమైందే. బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించిన అతడు.. మైదానంలోనూ దూకుడుగా వ్యవహరించాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై ఫైనల్‌లో 75 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ తన జట్టుకు రెండో కప్పును అందించాడు. ఇప్పుడున్న కుర్రాళ్లే మనల్ని మరింత ముందుకు వెళ్లేలా చేస్తారని విరాట్ వ్యాఖ్యానించాడు. ‘‘ కప్పును అందుకోవాలని ప్రతి ఒక్క ప్లేయర్‌ కలలు కంటాడు. ఇలాంటి క్షణాలను ఎక్కువ సార్లు రావాలని అనుకుంటాడు. ఐపీఎల్ కప్పు గెలిచినప్పుడు ఆ విజయాన్ని ఖాయం చేసే పరుగులు కొడుతూ క్రీజ్‌లో నిలబడి ఉండాలనేది నా కల. అది ఈసారి సాధ్యమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి మేం కొత్తగా ఏమీ చేయలేదు. చాలా రిలాక్స్‌గా ఉన్నాం. కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగాం. మేం ఎలా ఆడాలని అనుకున్నామో.. అదే ఆటతీరును ప్రదర్శించాం. నా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని చేయడం వెనుక కుర్రాళ్లే కారణమని చెబుతా. సూపర్ యంగ్‌ ప్లేయర్లు మనల్ని నిరంతరం ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తారు. ఎప్పటికప్పుడు మన గేమ్‌ను మార్చుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మెరుగ్గా మారాలంటే బాగా శ్రమించాలి. ఇప్పుడు మోడ్రన్ క్రికెట్‌లో ఎప్పుడైనా సరే అదనంగా 20 లేదా 30 పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇప్పుడు నా మైండ్‌సెట్‌ను మాత్రమే మార్చుకున్నా. నా ఆటతీరు కాదు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు భారీగా షాట్లు కొట్టేందుకూ వెనుకాడను. ప్రత్యర్థిగా బెస్ట్ బౌలర్‌ ఉన్నా సరే కొట్టాలనుకుంటే కొట్టేయడమే. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అని విరాట్ అన్నాడు. ‘‘గతేడాది మేం ఛాంపియన్‌గా నిలిచాం. ఈసారి మాపై భారీ అంచనాలు వచ్చాయి. మేం ఒక్కో లక్ష్యం పెట్టుకుని మరీ

TV9 Telugu01 Jun, 12:10 pm
ఐపీఎల్ముగిసింది.. జూన్ 6 నుంచే నాన్ స్టాప్ క్రికెట్ ధమాకా.. పూర్తి షెడ్యూల్ ఇదే

Team India : క్రికెట్ ప్రేమికులను రెండు నెలల పాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ లీగ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ అజేయంగా 75 పరుగులు చేసి ఆర్‌సీబీని గెలిపించి తన సత్తా చాటాడు. అయితే ఐపీఎల్ వినోదం ముగియడంతో ఇక ఫ్యాన్స్ అందరి కళ్ళు అంతర్జాతీయ క్రికెట్‌పై పడ్డాయి. గత మార్చి నెలలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో బిజీగా ఉండటం వల్ల ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ ముగియడంతో వారం తిరక్కుండానే జూన్ 6 నుంచి భారత జట్టు మళ్లీ రంగంలోకి దిగుతోంది. రాబోయే రోజుల్లో భారత్ ఆడబోయే నెక్స్ట్ సిరీస్‌ల కంప్లీట్ వివరాలు, ఫుల్ షెడ్యూల్ ఇప్పుడు వివరంగా చూద్దాం. అఫ్గానిస్తాన్‌తో తొలి పోరు.. న్యూ చండీగఢ్‌లో వేదిక ఐపీఎల్ ముగిసిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్లతో కూడిన టీమిండియా జూన్ 6 నుంచి మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. దీనికి న్యూ చండీగఢ్ వేదిక కానుంది. జూన్ 6 నుంచి జూన్ 10 వరకు భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఒకే ఒక్క చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే జూన్ 13 నుంచి జూన్ 20 వరకు ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగబోతోంది. ఈ సిరీస్‌తో భారత్ లాంగ్ ఇంటర్నేషనల్ సీజన్‌కు శ్రీకారం చుట్టనుంది. అఫ్గానిస్తాన్ సిరీస్ పూర్తి కాగానే టీమ్ ఇండియా విదేశీ పర్యటనలకు బయలుదేరుతుంది.

Eenadu01 Jun, 09:08 am
తగ్గని విజయ కాంక్ష.. ఇదీ విరాట్ సక్సెస్ మంత్ర

అన్నింటికీ మించి ఓ యోధుడు ఆ జట్టుకు వెన్నెముకగా మారాడు.. ఛేజింగ్‌ కింగ్‌ అని ఎందుకంటారో మరోసారి నిరూపించాడు.. తమ తొలి ఐపీఎల్ టైటిల్‌కు ‘ద్వితీయ’ విఘ్నం లేకుండా చేసేశాడు పైన ఉపోద్ఘాతమంతా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించే.. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో ఒకే ఒక్క జట్టుకు ఆడుతూ నిలకడగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్. విజయమో.. వీరస్వర్గమో కాదు. గెలుపే శ్వాస.. గెలుపే లక్ష్యం. ఆర్సీబీ రెండోసారి కప్పును సొంతం చేసుకోవడంలో విరాట్ అండ్‌ కో పాటించిన సక్సెస్ మంత్ర ఇదే. ఫైనల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పట్టువిడవకుండా 75 పరుగులతో అజేయంగా చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు. ఈ సీజన్‌లో 675 పరుగులు చేశాడు. అత్యుత్తమ యావరేజీ కూడా విరాట్‌దే కావడం గమనార్హం. ఐపీఎల్ జరిగిన దాదాపు రెండు నెలలూ ఎండాకాలమే. ఎక్కువ మ్యాచులు రాత్రి 7 గంటలకు మొదలైనా సరే.. ఆ ఉక్కపోత తట్టుకోవడం కష్టం. 20 ఓవర్లపాటూ మైదానంలో ఉత్సాహంగా ఉండాలంటే ఫిట్‌నెస్ అత్యంత కీలకం. ఈ విషయంలో విరాట్ కోహ్లీపై ఒక్క రిమార్కూ ఉండదు. ఇప్పుడున్న కుర్రాళ్ల కంటే జోష్‌గా పరుగులు పెట్టాడు. బ్యాటింగ్‌ సమయంలోనూ అంతే. సహచరులు ఏమైనా వెనుకడుగు వేస్తే పదమంటూ పరుగులు పెట్టించాడు. సింగిల్‌ వచ్చే దగ్గర కూడా డబుల్‌ తీసిన సందర్భాలెన్నో! ‘‘నా అంత ఫిట్‌నెస్ ఇప్పుడున్న కుర్రాళ్లకూ ఉండదు. మైదానంలో 40 ఓవర్లపాటు ఇటు నుంచి అటు వైపు పరుగులు పెట్టమన్నా పెడతా. సింగిల్‌, డబుల్స్‌ తీస్తూ వెళ్లాలని చెబితే అదీ చేస్తా. ఆట కోసం నేనేమీ ప్రత్యేకంగా తయారుకాను. నా దినచర్య ఇలానే ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు రెడీగా ఉంటా’’ ఐపీఎల్‌ కప్పును సొంతం చేసుకుని

Eenadu01 Jun, 03:49 am
పరిస్థితులకు అనుగుణంగా ఆడా

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2026 సీజన్‌లో హాట్‌ టాపిక్‌ వైభవ్ సూర్యవంశీ. ఈ ఎడిషన్‌లో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్‌లో ఓడి ఇంటిముఖం పట్టినా.. అతడు మాత్రం తన ఆటతో దుమ్మురేపాడు. అత్యధిక పరుగులు (776) చేసి ఆరెంజ్ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు మరి కొన్ని అవార్డులను దక్కించుకున్నాడు. ఎమర్జింగ్‌ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రయిక్‌రేట్ (237.3), సూపర్ సిక్సర్ల (72) అవార్డులు వరించాయి. ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం వాటిని స్వీకరించిన వైభవ్‌.. ఈ టోర్నీలో తన అనుభవాలను పంచుకున్నాడు. ‘‘అవార్డులు వచ్చినందుకు ఆనందంగా ఉన్నా.. ఇలా ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే కాస్త ఒత్తిడిగా అనిపిస్తోంది. నాకు ఇది గర్వపడే క్షణం. వచ్చే సీజన్‌లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. (నిర్భయంగా ఆడేందుకు రోజుకు ఎన్ని గ్లాస్‌ల పాలు తాగుతావు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ) సార్.. నేను ఇవాళ పాలు తాగలేదు (నవ్వుతూ). ఆట కోసం ప్రత్యేకంగా ఏమీ చేయను. సహజసిద్ధంగా ఆడేందుకు ప్రయత్నించా. తొలి బంతి నా జోన్‌లో పడితే భారీ షాట్ కొట్టేందుకే చూస్తా. ఒక్కసారి కనెక్ట్ అయితే అదే దూకుడుతో ఆడతా. నేను ఈ సీజన్‌లో ఓ కీలక విషయం నేర్చుకున్నా. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలనేది తెలుసుకున్నా. అలాగే పరిస్థితికి తగ్గట్టుగా జట్టుకు ఏది అవసరమో తెలుసుకుని ఆడా. నాకౌట్‌ స్టేజ్‌లోనూ అది చేసి చూపించా. ఫిట్‌నెస్‌పైనా దృష్టి పెట్టా. సుదీర్ఘకాలం పాటు ఆడాలంటే అదెంతో కీలకం. గాయాలు కాకుండా చూసుకోవాలి. మా జట్టులోని ప్రతి ఒక్కరూ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. వారంతా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు. జట్టులో చాలా మంచి వాతావరణం ఉంది’’ అని వైభవ్‌ తెలిపాడు.

Eenadu01 Jun, 04:16 am
ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ.. హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB).. గుజరాత్‌ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి క్రీడాభిమానులు సందడి చేశారు. సచివాలయం, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పెద్ద ఎత్తున గుమిగూడి బాణసంచా కాలుస్తూ ఆర్సీబీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ముందు జాగ్రత్తగా కొద్దిసేపు పోలీసులు ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ను మూసివేశారు. ఈ వీడియో చూశారా: ‘చూశావా బంతి నేలను తాకింది’!.. కోహ్లీ, గిల్‌ ఆసక్తికర చర్చ

AP7AM02 Jun, 02:55 am
నా అస లు టార్గెట్ వేరే... నా నుంచి మీరు త ర్వాత చూసేది ఆ క్రికెటే

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫయర్ 2లోనే వెనుదిరిగినప్పటికీ, ఆ జట్టులోని ఓ యువ సంచలనం మాత్రం క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 16 మ్యాచ్‌లలో ఏకంగా 776 పరుగుల రికార్డు స్కోరుతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఇంతటి విజయం సాధించినా, తన అసలు లక్ష్యం భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమేనని ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత భారత మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో వైభవ్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు. "అవును, నా తర్వాతి టోర్నీ వన్డే ఫార్మాట్‌లో ఉంది. దానికోసం నేను గ్రౌండ్‌లో కష్టపడాలి. నేను రెడ్ బాల్‌తో చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియదు. త్వరలోనే అందరూ చూస్తారు" అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.తన దూకుడైన బ్యాటింగ్ శైలి గురించి మాట్లాడుతూ.. "ప్రతి బంతిని బాదడమంటే నాకు ఇష్టమని అందరూ అనుకుంటారు. కానీ, ఇది టీ20 ఫార్మాట్. స్వేచ్ఛగా ఆడమని కోచ్‌లు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బంతిని నేను బాదగలనని నమ్మకం ఉన్నప్పుడే షాట్ ఆడతాను. అంతేగానీ, బలవంతంగా ప్రతి బంతినీ కొట్టాలని చూడను" అని తెలిపాడు.అంతేగాక‌ "టెస్ట్ క్రికెట్టే అసలైన ఫార్మాట్ అని మా

TV9 Telugu02 Jun, 02:05 am
తోపులుగా వచ్చి తుస్సుమన్న ఐదుగురు.. పద్ధతిగా రిటైర్మెంట్ చేస్తే పరువైనా మిగిలేనుగా

Indian Cricketers Retirement Rumors: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే ఐపీఎల్, కేవలం వినోదానికి మాత్రమే వేదిక కాదు. ఆటగాళ్ల భవిష్యత్తును, వారి ఫామ్‌ను అంచనా వేసేందుకు బీసీసీఐ సెలెక్టర్లకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఇక్కడ అద్భుతంగా రాణిస్తే జాతీయ జట్టులో స్థానం ఖాయమవుతుంది, అదే తడబడితే కెరీర్‌కే ఎండ్ కార్డ్ పడుతుంది. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్ కొంతమంది దిగ్గజ భారత ఆటగాళ్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది. గాయాలు, పేలవమైన ఫామ్, వయసు భారంతో సతమతమవుతున్న ఐదుగురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఐదుగురు ఆటగాళ్ల కెరీర్ పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. 4. అజింక్య రహానే (రెడ్-బాల్, వైట్-బాల్ క్రికెట్‌లో నిరాశ): సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు వచ్చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్‌కతా జట్టు కెప్టెన్‌గా ఉన్న రహానే ఈ సీజన్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రతి మ్యాచ్‌లోనూ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 14 మ్యాచ్‌లు ఆడిన ఆయన కేవలం 335 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు దేశీవాళీ క్రికెట్లోనూ గత 12 నెలలుగా ఎలాంటి అద్భుత ప్రదర్శన చేయలేదు. అంతర్జాతీయ జట్టులో ఇప్పటికే స్థానం కోల్పోయిన రహానే, ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 3. యుజ్వేంద్ర చహల్ (తగ్గిన పాత పదును): భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు కూడా ఈ ఐపీఎల్ సీజన్ ఆశించిన స్థాయిలో సాగలేదు. పంజాబ్ జట్టు తరపున ఆడిన చహల్ 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టారు. అయితే పరుగులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన రికార్డు చహల్ పేరిట ఉన్నప్పటికీ, ఈసారి అతడి బౌలింగ్‌లో మునుపటి మ్యాజిక్ కనిపించలేదు. ప్రస్తుతం భారత జట్టులోకి వరుణ్ చక్రవర్తి లాంటి యువ స్పిన్నర్లు దూసుకురావడంతో, చహల్ మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యంగా మారింది. 2. మహమ్మద్ షమీ (ఫిట్‌నెస్ సమస్యలతో సతమతం): ఒకప్పుడు టీమిండియా నమ్మకమైన వికెట్ టేకర్ అయిన మహమ్మద్ షమీని సెలెక్టర్లు క్రమంగా పక్కన పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో అతనికి చోటు దక్కకపోవడమే దీనికి ఉదాహరణ. లక్నో జట్టు తరఫున కొత్త బంతితో ఇన్నింగ్స్ అద్భుతంగా ప్రారంభించినా, టోర్నమెంట్ ముగిసేసరికి ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. 13 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు నష్టాన్ని చేకూర్చింది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న షమీ, సుదీర్ఘమైన స్పెల్స్ వేయడానికి శరీరం సహకరించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 1. రోహిత్ శర్మ (హిట్‌మ్యాన్ ప్రయాణం ముగింపునకు చేరిందా?): భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఐపీఎల్ సీజన్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముంబా ఇన్నింగ్స్ ఆరంభంలో కోల్‌కతాపై 38 బంతుల్లో 78 పరుగులు చేసి మెరిసినా, ఆ తర్వాత తగిలిన గాయం అతడి ఆటను పూర్తిగా దెబ్బతీసింది. గాయం నుంచి కోలుకున్నాక రోహిత్ పాత లయను అందుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రోహిత్, చివరి దశలో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే మైదానంలోకి రావడం అతడి ఫిట్‌నెస్‌పై ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. 9 మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రాబోయే వన్డే ప్రపంచ కప్ నాటికి శరీరం సహకరించడం కష్టమని భావిస్తే, యువ ఆటగాళ్ల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకునే అవకాశం ఉంది. సమయం ఎవరి కోసమూ ఆగదు, క్రీడా రంగంలో వయసు అనేది అత్యంత కీలకమైన అంశం. ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన ఈ దిగ్గజాలు, యువ రక్తం జట్టులోకి దూసుకువస్తున్న తరుణంలో గౌరవప్రదంగా వీడ్కోలు పలకడమే ఉత్తమమని భావిస్తున్నారు. అభిమానులకు ఇది బాధాకరమైన విషయమే అయినప్పటికీ, భారత క్రికెట్ సుదీర్ఘ భవిష్యత్తు కోసం ఈ మార్పులు అనివార్యం.

Vaartha01 Jun, 05:52 am
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి

DK Shivakumar On IPL : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుండి గుజరాత్‌కు మార్చడంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం బెంగళూరులో జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను చివరి నిమిషంలో మార్చడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం కర్ణాటకకు మరియు ఇక్కడి క్రికెట్ అభిమానులకు జరిగిన ముమ్మాటికీ అన్యాయమని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, మైదానంలో ఆటగాళ్లు చూపిన ప్రతిభను వేదిక మార్పు ప్రభావితం చేయలేకపోయిందని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. రాజకీయ వ్యూహాలతో వేదిక మారినా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మాత్రం లీగ్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. గుజరాత్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసి, ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ చారిత్రాత్మక విజయంపై డీకే శివకుమార్ స్పందిస్తూ, సోషల్ మీడియా వేదికగా జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. “వేదిక ఏదైనా, విజేత మాత్రం మనమే! పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఛాంపియన్లకు ఉండే పోరాటస్ఫూర్తితో ఆర్సీబీ మరోసారి బెంగళూరుకు గర్వకారణంగా నిలిచింది. ఈ ఏడాది కూడా కప్ మనదే!” అని ఆయన ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు ఫ్రాంచైజీ చరిత్రలోనే ఒక స్వర్ణాక్షర ఘట్టమని కొనియాడారు. Read Also: RCB vs GT Final: ఆ ఒక్క క్యాచ్‌తో మారిన మ్యాచ్ తలరాత! కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆర్సీబీ జట్టు అద్భుత ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించారు. టోర్నమెంట్ అంతటా ఆర్సీబీ ఆడిన దూకుడైన క్రికెట్, ప్రత్యర్థి జట్లకు కోలుకునే అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు. ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా, పూర్తి

Eenadu31 May, 04:43 am
రజత్ పాటీదార్ .. ది సైలెంట్ కిల్లర్

ఐపీఎల్‌లో ఆర్సీబీ అనగానే అందరికీ విరాట్‌ కోహ్లి గుర్తుకొస్తాడు. ఐపీఎల్‌ ఆరంభం నుంచి అదే జట్టుకు ఆడుతూ ఆ ఫ్రాంఛైజీకి కోహ్లి తీసుకొచ్చిన ఆకర్షణ, విలువే వేరు. ఇప్పటికీ కింగ్‌ నిలకడను కొనసాగిస్తున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కానీ కెప్టెన్‌గా ఆర్సీబీ రాత మార్చి, బ్యాటర్‌గా ఆ జట్టును ఎంతో ప్రమాదకరంగా తీర్చిదిద్దుతున్న ఘనత మాత్రం రజత్‌ పాటీదార్‌కే చెందుతుంది. అతడికి స్టార్‌ ఇమేజ్‌ లేదు. తన గురించి సోషల్‌ మీడియాలో పెద్దగా చర్చ జరగదు. మైదానంలో, బయట అతను కూడా పెద్దగా హడావుడి చేయడు. కానీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ప్రశాంతంగా పని చేసుకుపోతూ ఆర్సీబీని మేటి జట్టుగా నిలబెడుతున్నాడు పాటీదార్‌. ఈ ఏడాది ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోరు అనగానే.. ఇది సమవుజ్జీల పోరు అని, ఎంతో హోరాహోరీగా సాగుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ఆర్సీబీ దూకుడు ముందు జీటీ ఏమాత్రం నిలవలేకపోయింది. ఒక ఇన్నింగ్స్‌ అయ్యేసరికే మ్యాచ్‌ ఫలితంపై ఒక అంచనా వచ్చేసింది. ఆర్సీబీ ఆల్‌రౌండ్‌ మెరుపుల ధాటికి బెంబేలెత్తిన టైటాన్స్‌.. ఏకంగా 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు పాటీదార్‌. అతడి ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు ఉండటం విశేషం. తర్వాత తన బౌలింగ్, ఫీల్డింగ్‌ వ్యూహాలతోనూ అతను తన ప్రత్యేకతను చాటాడు. గుజరాత్‌ లాంటి బలమైన బ్యాటింగ్‌ ఉన్న జట్టు కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్‌లో కీలకమైన ప్లేఆఫ్స్‌లో చెలరేగిపోవడం పాటీదార్‌కు ఇది కొత్తేమీ కాదు. ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభ దశలోనే అతను 2022

Eenadu31 May, 10:33 am
ఐపీఎల్ విజేతకు రూ. 20 కోట్లు.. మరి మిగతా టీమ్ ల పరిస్థితేంటి

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగుల్లో ఐపీఎల్‌ ఒకటి. మరి 19వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా నేడు ఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకు కప్పు సొంతమవుతుంది. దాంతోపాటు భారీ మొత్తం ప్రైజ్‌మనీ కూడా దక్కనుంది. మరి అదెంత? రన్నరప్‌ అయిన టీమ్‌కు ఎంత లభిస్తుంది? మిగతా జట్ల పరిస్థితి? వ్యక్తిగతంగా ప్లేయర్లకూ ఎంత వస్తుందో చూద్దాం.. బీసీసీఐ వర్గాల ప్రకారం ఐపీఎల్ 2026 సీజన్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 46 కోట్లు. 2008లో తొలిసారి ఐపీఎల్ ప్రారంభమైంది. అప్పుడు విజేతకు రూ. 4.8 కోట్లు దక్కేవి. తర్వాత సీజన్‌లోనూ అంతే మొత్తం. అయితే, 2010 నుంచి 2013 వరకు రూ. 10 కోట్లు చొప్పున అందించారు. 2014, 2015లో రూ. 15 కోట్లు.. 2016 నుంచి 2019 వరకు రూ.20 కోట్లు విజేతకు దక్కింది. కొవిడ్‌ కారణంగా 2020లో ప్రైజ్‌మనీని రూ. 10 కోట్లకు తగ్గించింది. ఇక 2021 నుంచి ప్రస్తుత సీజన్‌ వరకూ రూ. 20 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీని విజేతకు ఇస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 03:50 pm
గుజరాత్ ను ఆదుకున్న వాషింగ్టన్ సుందర్.. ఆర్సీబీ లక్ష్యం 156

అహ్మదాబాద్‌: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50*; 37 బంతుల్లో) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), శుభ్‌మన్ గిల్ (10) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన నిశాంత్ సింధు (20) పరుగులు చేసి వెనుదిరిగాడు. జోస్ బట్లర్ (19) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అర్షద్ ఖాన్ (15) రన్స్ చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3, జోష్‌ హేజిల్‌వుడ్ 2, భువనేశ్వర్ కుమార్ 2, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి రెండు ఓవర్లలో గుజరాత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. ఈ క్రమంలో బంతిని అందుకున్న హేజిల్‌వుడ్ తన తొలి ఓవర్‌లోనే శుభ్‌మన్‌ను వెనక్కి పంపాడు. తర్వాత భువీ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ భారీ షాట్‌కు యత్నించి వికెట్‌కీపర్‌ జితేశ్‌కు చిక్కాడు. బట్లర్, నిశాంత్ సింధు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయడంతో గుజరాత్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ, ఎనిమిదో ఓవర్లో రసిఖ్ సలామ్ నిశాంత్‌ను ఔట్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. 9-12 ఓవర్ల మధ్య 18 పరుగులు మాత్రమే వచ్చాయి. దూకుడుగా ఆడలేకపోయిన బట్లర్.. కృనాల్ వేసిన 13 ఓవర్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అర్షద్ ఖాన్‌ను హేజిల్‌వుడ్ వెనక్కి పంపడంతో గుజరాత్ 14.1 ఓవర్లకు 99/5తో మరింత కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన రాహుల్ తెవాతియా (7) కూడా విఫలమయ్యాడు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ 34 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే

Eenadu30 May, 02:14 am
సాయి సుదర్శన్ చేతికి టేప్ వేయాలేమో

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్‌ దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను అలవోకగా చిత్తు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతకంతో మెరిశాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ తలపడనుంది. వరుసగా రెండోసారి సాయి సుదర్శన్ హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌కు చేరడం గమనార్హం. దీనిపై కెప్టెన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే తమ జట్టు ప్రదర్శనపైనా మాట్లాడాడు. ‘‘టాస్ సమయంలో కాస్త అయోమయానికి గురయ్యాం. అందులో ఓడినా.. మ్యాచ్‌లో గెలవడం ఆనందంగా ఉంది. సాయి సుదర్శన్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం ఎప్పుడూ బాగుంటుంది. మేమిద్దరం ఆటను అర్థం చేసుకొనే విధానం ఒకేలా ఉంటుంది. ఏ బౌలర్‌ను ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. ఈ మ్యాచ్‌లోనూ సాయి హిట్‌వికెట్‌ అయ్యాడు. సోషల్ మీడియాలో ఓ వీడియో చూశా. అందులో అతడి చేతులకు టేప్‌ వేసి ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లో నేనూ అదే చేయాలేమో (నవ్వుతూ)’’ అని గిల్ తెలిపాడు. ‘‘ఒక దశలో మేం వారిని 180 లేదా 190 పరుగులకే కట్టడి చేయాలని భావించాం. కానీ, 214 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో మాకు మంచి ఆరంభం దక్కింది. నేను చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నా. అలాగే జరిగింది. మాకు చాలా బౌలింగ్‌ ఆప్షన్లు ఉన్నాయి. కానీ, వాటిని వినియోగించే అవసరం రాలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా లోతైంది. ఫైనల్‌ మ్యాచ్‌ హోం గ్రౌండ్‌లో ఆడనుండటం మాకు కలిసొస్తుంది. అయితే, మరో గొప్ప జట్టుతో తలపడనున్నామనే విషయాన్ని మరువకూడదు. నాణ్యమైన క్రికెట్ ఆడితే విజయం ఆటోమేటిక్‌గా దరిచేరుతుంది’’ అని గిల్ వెల్లడించాడు. రాజస్థాన్‌పై హాఫ్ సెంచరీ సాధించిన సాయి సుదర్శన్

Eenadu29 May, 07:35 am
హిట్ మ్యాన్ చెప్పిన ప్లేయరే ముంబయికి కొత్త సారథి

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ప్రదర్శన దారుణంగా ఉంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి నుంచి అభిమానులు ఇలాంటి ఆటతీరును ఆశించలేదు. స్టార్ ప్లేయర్లున్నా విజయాలు దక్కలేదు. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరు వల్లేనని ఫ్యాన్స్‌ కూడా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వచ్చే సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ సారథ్యం నుంచి హార్దిక్‌ వైదొలుగుతాడని.. అందుకు ఇటీవల పెట్టిన పోస్టులే సాక్ష్యమని నెట్టింట చర్చ సాగుతోంది. తాజాగా మరొక అంశం కూడా బయటకు వచ్చింది. రోహిత్ శర్మ చెప్పిన ప్లేయర్‌కే ముంబయి సారథ్యం దక్కే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ముంబయి ఐదు టైటిళ్లను సొంతం చేసుకుంది. కానీ, రెండేళ్ల కిందట రోహిత్‌కు బదులు హార్దిక్‌ పాండ్యను సారథిగా నియమించింది. ఆ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. వచ్చే సీజన్‌కు కొత్త సారథిని నియమించే అవకాశాలు ఎక్కువే. గతంలో చేసిన పొరపాట్లను ముంబయి సరిచేసుకొనేలా నిర్ణయం తీసుకోనుంది. రోహిత్ మళ్లీ సారథిగా రాడు. కానీ, కొత్త కెప్టెన్‌కు రోహిత్ శర్మ ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలి’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ‘‘హార్దిక్ పాండ్య వచ్చే సీజన్‌లో జట్టు మారేందుకూ మొగ్గు చూపిస్తున్నాడు. కేవలం సారథ్యం మాత్రమే కాకుండా.. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోనున్నాడు. ఏదైనా కంపెనీలో మేనేజ్‌మెంట్‌తో సరైన అనుబంధం లేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు హార్దిక్‌ పరిస్థితి కూడా ఇంతే’’ అని ముంబయి క్రికెట్ వర్గాలు తెలిపాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో

Eenadu27 May, 04:08 pm
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు

ముల్లన్‌పుర్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ 97 (29 బంతుల్లో, 5 ఫోర్లు, 12 సిక్స్‌లు), ధ్రువ్‌ జురెల్ 50 పరుగులు (21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసి సత్తా చాటారు. యశస్వి జైస్వాల్‌ 29, రియాన్‌ పరాగ్‌ 26, ఫెరీరా 12, జడేజా 12*, జోఫ్రా ఆర్చర్‌ 4, శనక 5, నాంద్రె బర్గర్‌ 1, సుశాంత్‌ మిశ్రా 1* రన్స్‌ చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో ప్రఫుల్‌ హింగే 3 వికెట్లు పడగొట్టాడు. ఎషాన్‌ మలింగ, శివాంగ్‌ కుమార్‌, నితీశ్‌రెడ్డి తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులు చేసి ప్రఫుల్‌ హింగే బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రిస్‌ గేల్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డ్‌ను (30 బంతుల్లో) అధిగమించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రాజస్థాన్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ సిక్సర్లతో చెలరేగాడు. 29 బంతుల్లో 97 పరుగులు సాధించాడు.

Eenadu27 May, 01:02 am
ముందుకెవరో.. ఇంటికెవరో

ఎలిమినేటర్‌లో నేడు హైదరాబాద్‌ × రాజస్థాన్‌ ముల్లాన్‌పుర్‌ ఐపీఎల్‌లో మరో రసవత్తర సమరానికి వేళైంది. బుధవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ ఢీకొంటుంది. లీగ్‌ దశలో నిలకడగా రాణించిన సన్‌రైజర్స్‌ భీకరంగా కనిపిస్తుంటే.. తన చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో ప్లేఆఫ్స్‌ చేరిన రాజస్థాన్, ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లో ఆడుతుంది. ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడతాయనడంలో సందేహం లేదు. గత సీజన్‌ పేలవ ప్రదర్శనను మరిపిస్తూ, ఈసారి ప్లేఆఫ్స్‌ చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. బుధవారం రాజస్థాన్‌ను ఇంటిముఖం పట్టించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది. లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించింది. ఆర్సీబీ, గుజరాత్‌లతో సమానంగా 18 పాయింట్లు సంపాదించినా.. రన్‌రేట్‌ వల్ల పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు రాజస్థాన్‌ 8 విజయాలతో నాలుగో స్థానం దక్కించుకుంది. రెండూ బలమైన జట్లే. ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తికరం. జోరుమీద సన్‌రైజర్స్‌: సన్‌రైజర్స్‌ సూపర్‌ ఫామ్‌లో ఉంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోన్న ఆ జట్టుదే ఈ ఎలిమినేటర్‌లో కాస్త పైచేయిగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు. టోర్నీని నెమ్మదిగా ఆరంభించిన ఎస్‌ఆర్‌హెచ్‌.. తర్వాత జోరందుకుంది. తన చివరి పది మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఎనిమిది గెలిచింది. చివరి ఏడు గేములకు కెప్టెన్‌ కమిన్స్‌ అందుబాటులోకి రావడం ఆ జట్టుపై సానుకూల ప్రభావం చూపింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం హైదరాబాద్‌ను మానసికంగా పైచేయిలో నిలుపుతోంది. ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ భీకరంగా కనిపిస్తోంది. టాప్‌-4 బ్యాటర్లు అభిషేక్‌ శర్మ (563 పరుగులు),

TV9 Telugu29 May, 03:31 am
చరిత్ర సృష్టించిన స్టార్ ఓపెనర్.. కెప్టెన్ స్మృతి మంధాన ఖాతాలో అత్యంత దారుణమైన రికార్డు

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధానకు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో గురువారం రాత్రి జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆమె ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చేదు జ్ఞాపకాలతో కూడిన ఈ సరికొత్త రికార్డుతో భారత క్రికెట్ చరిత్రలోనే ఒక అప్రతిష్టాత్మకమైన మైలురాయిని అందుకున్న మొదటి మహిళా ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఇప్పటివరకు తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ స్టార్ ప్లేయర్.. ఈసారి మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ మ్యాచ్ ప్రారంభమైన మొదటి బంతికే పెవిలియన్ చేరింది. చెల్మ్స్‌ఫోర్డ్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో స్మృతి మంధాన జట్టును ముందుండి నడిపించింది. టాస్ గెలిచి ఇన్నింగ్స్ ప్రారంభించడానికి షఫాలీ వర్మతో కలిసి క్రీజులోకి వచ్చిన మంధాన.. మ్యాచ్ ఫస్ట్ బాల్‌కే అవుటైపోయింది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ లారెన్ బెల్ వేసిన అద్భుతమైన బంతిని ఆడబోయి చార్లీ డీన్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి దొరికిపోయింది. ఇలా మ్యాచ్‌లోనే మొదటి బంతికి అవుటైన తొలి భారతీయ మహిళా బ్యాటర్‌గా స్మృతి మంధాన అన్వాంటెడ్ రికార్డ్ సృష్టించింది. భారత టీ20 క్రికెట్ చరిత్రలో పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన రికార్డు 29 ఏళ్ల స్మృతి మంధాన పేరిట ఉంది. కానీ ప్రస్తుత మ్యాచ్‌లో ఆమె ఎదుర్కొన్న ఈ డకౌట్.. కెరీర్‌లో ఆమెకు 6వ టీ20 డకౌట్ కావడం గమనార్హం. భారత్ తరఫున అంతర్జాతీయ మహిళా టీ20ల్లో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుటైన

Eenadu31 May, 01:08 pm
ముక్కోణపు సిరీస్ .. టీమ్ ఇండియా ఎ’ వైస్ కెప్టెన్ మార్పు

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌కు భారత్‌-ఎ టీమ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన రియాన్‌ పరాగ్‌.. గాయం కారణంతో వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌కు చోటు కల్పించిన బీసీసీఐ.. వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలూ అప్పగించింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ ట్రై సిరీస్‌లో భారత్ ఎ, శ్రీలంక ఎ, అఫ్గానిస్థాన్ ఎ జట్లు తలపడనున్నాయి. ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి.మ్యాచ్‌లన్నింటికీ దంబుల్లా ఆతిథ్యమివ్వనుంది. ముక్కోణపు సిరీస్‌కి భారత్‌-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్‌ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్జే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్‌కీపర్), కుమార్ కుషాగ్రా (వికెట్‌కీపర్), విప్రాజ్‌ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్విర్ సింగ్, అంశుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్‌ రాయ్. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu29 May, 02:36 pm
ఆ ఇద్దరిని ట్రాన్స్ ఫర్ చేసి.. సీఎస్ కే హార్దిక్ ను తీసుకోవాలి

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చే ఐపీఎల్ సీజన్‌ నాటికి హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్‌ వీడి బయటకు వస్తాడని ప్రచారం సాగుతోంది. దీంతో అతడిని సొంతం చేసుకొనేందుకు పోటీ తప్పకుండా ఉంటుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. ఇలా కెప్టెన్ అవసరమున్న టీమ్‌లు ఉన్నాయి. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌కు తీసుకోవాలనే వారూ లేకపోలేదు. రుతురాజ్‌ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో ఇబ్బంది పడింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్‌కు పాండ్యను సీఎస్‌కేలోకి తీసుకోవాలని సూచించాడు. ట్రేడింగ్‌లో ఇద్దరు సీఎస్‌కే ఆటగాళ్లను ట్రాన్స్‌ఫర్ చేయాలని తెలిపాడు. ‘‘ఒకవేళ నేనే మంబయి ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ అయి ఉంటే.. సీఎస్‌కే నుంచి శివమ్‌ దూబే, ఆయుష్ మాత్రేను తీసుకొనేవాడిని. హార్దిక్‌ పాండ్యను వారికి ఇచ్చేవాడిని. హార్దిక్ రాకతో చెన్నై సూపర్ కింగ్స్‌ బ్రాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే సంజు శాంసన్‌ను సారథిగా చేయాలని రూల్‌ ఏమీ లేదు. ఒకవేళ పాండ్య వచ్చి కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. అతడికే అవకాశం ఇస్తా. ఎంఎస్ ధోనితో పాండ్యకు మంచి అనుబంధం ఉంది. సీఎస్‌కేకు అతడు వస్తే సమతుల్యం అవుతుంది’’ అని బద్రీనాథ్‌ విశ్లేషించాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu29 May, 05:42 am
నా జీవితంలో ఇలాంటివి రెండే సందర్భాలు

ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే క్రికెట్ అభిమానులకు తెలిసింది. అతడికి మాజీ క్రికెటర్లూ ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఈ జాబితాలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఉన్నాడు. వైభవ్‌ సూర్యవంశీతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇలా వేరే అథ్లెట్‌తో సెల్ఫీ తీసుకోవడం తన జీవితంలో రెండోసారి మాత్రమేనని తెలిపాడు. ‘‘వారం రోజుల కిందట.. నా జీవితంలో రెండోసారి మాత్రమే ఓ పని చేశా. అదేంటంటే.. మరొక క్రీడాకారుడిని సెల్ఫీ అడిగి తీసుకున్నా. తొలిసారి నా చిన్ననాటి హీరో అయిన ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లీగ్ లెజెండ్ స్టీఫెన్ మైకెల్‌తో కొద్ది రోజుల కిందట సెల్ఫీ దిగా. ఇప్పుడు రెండోసారి బిహార్‌లోని ఓ గ్రామం నుంచి వచ్చిన 15 ఏళ్ల పిల్లాడితో దిగా. ఇదేదో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై బాగా ఆడినందుకు కాదు. ఇప్పటికే టీ20 టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే సెంచరీ కొట్టిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్‌ రికార్డు సృష్టించాడు. దాదాపు 35 ఏళ్లుగా క్రికెట్‌తో నాకు అనుబంధం ఉంది. ఓ పదిహేనేళ్ల కుర్రాడు ఇలా ఎలా ఆడుతున్నాడనేది నేను నమ్మలేకపోతున్నా. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. వైభవ్‌ను చూస్తుంటే ‘టాలెంట్’ గురించి ఆలోచింపచేస్తోంది. మనం తరచూ ఉపయోగించే.. అతి తక్కువగా అర్థం చేసుకొనే పదం అదే. వైభవ్‌కు ఆస్ట్రేలియా ఫుట్‌బాల్‌ లీగ్‌లో అద్భుతంగా ఆడిన స్కాట్ పెండల్‌బరీకి సారూప్యత ఉంది. వీరద్దరూ తమ క్రీడల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు’’ అని లాంగర్‌ వివరించాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు

Eenadu28 May, 07:03 am
యార్కర్ మిస్ అయితే.. వైభవ్ కు దొరికిపోయినట్లే

ఇంటర్నెట్ డెస్క్‌: కీలకమైన పోరులో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ధారాళంగా పరుగులు సమర్పించాడు. ఐపీఎల్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ దెబ్బకు తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు ఇవ్వడం గమనార్హం. ఇటు బ్యాటింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే, ఈ పిచ్‌పై 240+ లక్ష్యం ఛేదించడం పెద్ద కష్టమేం కాదని.. త్వరగా వికెట్లను కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని వెల్లడించాడు. ఇక, వైభవ్‌ను ఎదుర్కొనేటప్పుడు తమ వద్ద ఎక్కువ ఆప్షన్లు ఉన్నట్లు అనిపించలేదని కమిన్స్ అంగీకరించాడు. ‘‘వైభవ్‌ చాలా అద్భుతంగా ఆడాడు. అతడు అలా ఆడుతుంటే మా వద్ద మరిన్ని ఆప్షన్లు లేవని అనిపించింది. పిచ్ చాలా బాగుంది. కానీ, మార్జిన్స్‌ కాస్త చిన్నవే. ఒకవేళ యార్కర్‌ వేయడం మిస్‌ అయితే.. వైభవ్‌ ఏమాత్రం ఉపేక్షించడు. చాలా మంచి గేమ్. మా జట్టు ఇప్పుడు కుర్రాళ్లతో అద్భుతంగా ఉంది. ప్రఫుల్, సకిబ్ బాగా ఆడారు. అయితే, యువ ప్లేయర్లలో చాలా మందికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లలో మాదే యంగెస్ట్‌ టీమ్‌ అనుకుంటా. మా కోచింగ్‌ గ్రూప్‌ బాగా పనిచేసింది. వారిందరిని నడిపించడం కెప్టెన్‌గా ఆనందంగా ఉంది’’ అని కమిన్స్‌ తెలిపాడు. ‘‘ఛేజింగ్‌ తీసుకున్నందుకు చింతించడం లేదు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమే. కానీ, త్వరగా వికెట్లను కోల్పోవడంతో మాకు ఛేదన కష్టమైంది. స్కోరు బోర్డుపై 240+ లక్ష్యం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉండాలి. చివరి వరకూ మేం రన్‌రేట్‌ను బాగానే కొనసాగించినా.. వికెట్లను కోల్పోవడం దెబ్బతీసింది. మూడేళ్లలో మేం రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాం. మా కుర్రాళ్ల ప్రతిభ వల్లే ఇదంతా. ఈసారి కూడా టాప్‌-2లోకి వచ్చేందుకు ప్రయత్నించాం. కానీ,

Eenadu30 May, 06:35 am
కామ్ అండ్ కూల్ ప్రిన్స్ ’.. కెప్టెన్ ’ రేసులోకి శుభ్ మన్ గిల్

ఐపీఎల్ 2026 సీజన్‌ మొదలైనప్పుడు అందరి చూపు వైభవ్‌ సూర్యవంశీపైనే.. ఈ కుర్రాడు ఎలా ఆడతాడు? ఎవరిపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడనే చర్చ. అందరి అంచనాలకు తగ్గట్టుగానే విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వంతు.. ఈ టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడంతో ఎలా బ్యాటింగ్‌ చేస్తాడోనని అంతా ఆసక్తిగా తిలకించారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్ ఆటతీరుపైనా అభిమానులు మాట్లాడుకున్నారు. ఆఖరికి హార్దిక్‌ పాండ్య గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడిచింది. పైన పేర్కొన్న ప్లేయర్ల జాబితాలో ఒకే ఒక్క స్టార్‌ ప్లేయర్ పేరు మొదట్లో మిస్‌ అయింది. కానీ, అతడు మాత్రం చాపకింద నీరులా ఏమాత్రం హడావుడి లేకుండా కామ్‌గా ఉంటూ పరుగుల వరద పారించాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడెవరో ఈపాటికే అర్థమై ఉంటుందిగా.. అభిమానులు ముద్దుగా ‘ప్రిన్స్‌’ అని పిలుచుకొనే శుభ్‌మన్ గిల్. గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్. వైభవ్‌ సూర్యవంశీలా భారీ హిట్టింగ్‌ ఉండదు. విరాట్ కోహ్లీలా దూకుడుగా కనిపించడు. సూర్యకుమార్ యాదవ్‌లా ‘మిస్టర్ 360’ కాదు. కానీ, శుభ్‌మన్‌ గిల్‌ను చూస్తుంటే వీరందరి కలబోతగా ఉంటాడనడంలో సందేహంలేదు. ముందు ఇన్నింగ్స్‌ను నిర్మించడంపై దృష్టిపెడతాడు. ఒక్కసారి కుదురుకున్నాక దూకుడు పెంచుతాడు. మళ్లీ ఏవైనా కుదుపులు వస్తే తట్టుకొని నిలబడతాడు. ఇప్పుడీ సీజన్‌లో 441 బంతులు ఎదుర్కొని 160కిపైగా స్ట్రైక్‌రేట్‌తో 722 పరుగులు చేశాడు. ఇందులో 75 ఫోర్లు, 33 సిక్స్‌లు ఉన్నాయి. అంటే స్టాండ్స్‌లో బంతిని పెట్టడం కంటే ఫోర్లుగా మలిచి పరుగులు రాబట్టేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతాడు. ఇప్పుడు రాజస్థాన్‌పైనా ఇలాగే సెంచరీతో (104) తన జట్టును గెలిపించాడు. నాకౌట్‌కు చేరుకునే జట్లు ఏవో మాజీలు,

TV9 Telugu27 May, 03:41 am
పరుగులతో ఆర్ సీబీ హిస్టారికల్ రికార్డ్.. వెస్టిండీస్ నే వెనక్కి నెట్టేసిన కోహ్లీ సేన

IPL 2026 : ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సృష్టించిన పరుగుల సునామీ అంతా ఇంతా కాదు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 254 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాకుండా.. ఆ తర్వాత గుజరాత్‌ను 162 పరుగులకే కుప్పకూల్చి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ఫైనల్స్ టికెట్ ఖరారు చేసుకోవడంతో పాటు, టీ20 క్రికెట్ చరిత్రలోనే ఆర్‌సీబీ ఒక అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఓవరాల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్ల జాబితాలో వెస్టిండీస్, జింబాబ్వే లాంటి అంతర్జాతీయ జట్లనే ఆర్‌సీబీ దాటేసింది. ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ (అంతర్జాతీయ టీ20లతో పాటు డొమెస్టిక్ లీగ్‌లు) చరిత్రలో అత్యధిక సార్లు 250+ స్కోర్లు సాధించిన రికార్డు ప్రస్తుతం మన భారత జాతీయ క్రికెట్ జట్టు పేరిట ఉంది. టీమిండియా ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రికార్డు స్థాయిలో 7 సార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసి ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది ఏ దేశమో కాదు.. ఐపీఎల్‌లో పరుగుల విధ్వంసానికి మారుపేరైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH). కావ్యమారన్ ఆరెంజ్ ఆర్మీ ఇప్పటివరకు టీ20ల్లో 6 సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేసి రెండో స్థానంలో రికార్డు సృష్టించింది. గుజరాత్‌పై చేసిన 254 పరుగుల విధ్వంసంతో ఆర్‌సీబీ జట్టు తన టీ20 చరిత్రలో 4వ సార్లు 250+ మార్కును దాటి మూడో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ డొమెస్టిక్ జట్టు సర్రే, అంతర్జాతీయ జట్లయిన వెస్టిండీస్, జింబాబ్వేలతో పాటు

Eenadu27 May, 04:19 am
నా వికెట్ గురించి పట్టించుకోను.. ఆ ప్లాన్ సక్సెస్ అయింది

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్‌ అనంతరం పాటీదార్ మాట్లాడాడు. తాను వికెట్‌ గురించి పట్టించుకోనని, బౌలర్లపై ఒత్తిడి పెంచడమే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. ‘‘ఇది మాకు ఒక అద్భుతమైన మ్యాచ్‌. మా బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. ప్రతిఒక్కరూ పట్టుదలతో దూకుడుగా ఆడటం మాకు బాగా ఉపయోగపడింది. గుజరాత్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాలనే కచ్చితమైన ప్రణాళికతో రాలేదు. కానీ, మేం దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ‘మేం అటాకింగ్‌ గేమ్ ఆడబోతున్నామని మా బాడీ లాంగ్వేజ్‌తో వారికి తెలియజేయాలి. అది ప్రతి బ్యాటర్‌లోనూ కనిపించిందని నేను అనుకుంటున్నాను. మేం జట్టు సమావేశంలో దీని గురించి చర్చించుకున్నాం. ఇది చాలా కీలకమైన దశ. ఈ మ్యాచ్‌లో మేం ఆడిన తీరు, ఆధిపత్యం చెలాయించిన విధానం అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను. నా బ్యాటింగ్ శైలి జట్టులోని మిగతా వారి శైలికి దాదాపు సమానంగానే ఉంటుందని నేను భావిస్తాను. ఇన్నింగ్స్ ఆరంభంలో పిచ్‌ ఎలా స్పందిస్తోందోనని గమనించడానికి 8 నుంచి 10 బంతులు నెమ్మదిగా ఆడతా. ఆ తర్వాత నేను ఎలా ముందుకుసాగాలనే విషయంపై నాకు పూర్తి స్పష్టత లభిస్తుంది. అప్పుడు నా వికెట్ గురించి నేను అస్సలు ఆందోళన చెందను. బౌలర్‌పై ఒత్తిడి పెంచడాన్ని ఇష్టపడతాను. గిల్, సుదర్శన్, బట్లర్‌ను పవర్‌ ప్లేలో ఔట్‌ చేయాలనుకున్నాం. ఆ ప్లాన్ సక్సెస్ అయింది’’ అని రజత్ పాటీదార్ వివరించాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని

Eenadu25 May, 12:16 pm
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్ తలపడనున్నాయి. మే 26న జరగనున్న ఈ మ్యాచ్‌కు ధర్మశాల ఆతిథ్యమివ్వనుంది. ఇందులో గెలిస్తే...

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్ తలపడనున్నాయి. మే 26న జరగనున్న ఈ మ్యాచ్‌కు ధర్మశాల ఆతిథ్యమివ్వనుంది. ఇందులో గెలిస్తే నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లొచ్చు. దీంతో ఈ మ్యాచ్‌తోనే టైటిల్‌ పోరుకు అర్...

Eenadu25 May, 11:01 am
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. మంగళవారం (మే 26) నుంచి ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ధర్మశాల వేదికగా మంగళవారం...

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. మంగళవారం (మే 26) నుంచి ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ధర్మశాల వేదికగా మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌ (RCB vs GT) తలపడనున్నాయి. ఇందులో...

Eenadu28 May, 02:14 pm
వేలంలోకి వైభవ్ సూర్యవంశీ.. రూ.30 కోట్లు చెల్లిస్తానన్న సెహ్వాగ్

ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లు బాది 97 పరుగులు చేశాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్‌ గేల్ (59) పేరిట ఉన్న రికార్డును వైభవ్ (65) బ్రేక్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాళ్లు వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ కామెంటెటరీ చేశారు. వీరి మధ్య వైభవ్ టాపిక్‌ వచ్చింది. ఒకవేళ సూర్యవంశీ వేలంలోకి వస్తే ఎంత డబ్బు చెల్లిస్తారని సెహ్వాగ్‌ని హర్భజన్ అడిగాడు. సెహ్వాగ్ ఏ మాత్రం ఆలోచించకుండా తాను రూ.30 కోట్లు చెల్లిస్తానని చెప్పాడు. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్ కూడా వైభవ్‌పై ప్రశంసలు కురిపించారు. అతనిలో ‘స్పెషల్ టాలెంట్’ ఉందని.. ఈ కుర్రాడు మరింత రాటుదేలడానికి బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ మార్గదర్శకత్వం అందిస్తాయని పేర్కొన్నారు. ‘‘వైభవ్ టెంపర్‌మెంట్ ఇలానే కొనసాగేందుకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని బీసీసీఐ, రాజస్థాన్ ఫ్రాంఛైజీ అందిస్తాయి. క్రీడల్లో కేవలం శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢత్వం అవసరం. అతను రాబోయే మరెన్నో సంవత్సరాలపాటు టీమ్ఇండియా తరపున రాణించేలా చూడటంలో మా వంతు కృషిని మేం తప్పకకుండా చేస్తాం’’ అని అరుణ్‌ ధుమాల్ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత

TV9 Telugu27 May, 02:22 am
ఆరెంజ్ క్యాప్ రేసులో ఆ ఐదుగురు.. ప్లేఆఫ్స్ వేళ హీటెక్కుతున్న పరుగుల వేట

IPL 2026 Orange Cap : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగిసి, ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభమవడంతో టోర్నమెంట్ అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌తో అసలు సిసలైన నాకౌట్ ఫైట్ మొదలైంది. ఈ ఏడాది ఐపీఎల్ 19వ ఎడిషన్‌లో భారీ స్కోర్లు, సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తుండటంతో అభిమానులకు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఒకవైపు జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతుంటే.. మరోవైపు టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ కోసం బ్యాటర్ల మధ్య పోరు క్లైమాక్స్‌కు చేరింది. ఈ సీజన్‌లో ఇప్పటికే బ్యాటర్లు ఏకంగా 9 సెంచరీలు బాదడం విశేషం. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో ఉంటూ, ఆరెంజ్ క్యాప్ కొట్టే అవకాశం ఉన్న ఆ టాప్-5 రేసర్స్ ఎవరో చూద్దాం. 5. వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) – 583 పరుగులు ఈ జాబితాలో అందరినీ అత్యంత ఆశ్చర్యపరిచిన పేరు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. బీహార్‌కు చెందిన ఈ అద్భుతమైన యువ బ్యాటర్ తన డెబ్యూ సీజన్‌లోనే క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టేలా ప్రదర్శన చేశాడు. లీగ్ దశ ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ 583 పరుగులు సాధించాడు. టాప్-5 లో ఉన్న బ్యాటర్లందరి కంటే ఇతని స్ట్రైక్ రేట్ (232.27) అత్యధికంగా ఉండటం విశేషం. ఈ సీజన్‌లో అతను ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు బాదడమే కాకుండా కొద్దిరోజుల పాటు ఆరెంజ్ క్యాప్‌ను కూడా తన వద్దే ఉంచుకున్నాడు. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడనుండటంతో ఇతను ఈ రేసులో మరింత

TV9 Telugu26 May, 09:41 am
అర్ష్‌దీప్ సింగ్‌కు ఏమైంది.. ఏకంగా 200లకుపైగా పోస్ట్‌లు డిలీట్.. అసలు రీజన్ అదేనా..?

Arshdeep Singh Instagram Posts Deleted: భారత క్రికెట్ జట్టు యువ పేసర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జరిగిన ఒక ఊహించని పరిణామం ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైదానంలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ ఎంతో చురుగ్గా ఉంటూ అభిమానులను అలరించే ఈ స్పీడ్‌స్టర్, తాజాగా తన ఖాతా నుంచి ఏకంగా 200కు పైగా పోస్టులను తొలగించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. క్రికెట్ ప్రపంచంలో అర్ష్‌దీప్ సింగ్ ఆటతీరుతో పాటు ఆయన చేసే వినోదాత్మక వీడియోలకు, రీల్స్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. తీరిక సమయం దొరికినప్పుడల్లా తోటి ఆటగాళ్లతో కలిసి సరదాగా వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. అయితే, తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీని పూర్తిగా ప్రక్షాళన చేశాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో కేవలం 44 పోస్టులు మాత్రమే మిగిలాయి. అందులోనూ ఎక్కువ భాగం వివిధ వ్యాపార ప్రకటనలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇది కూడా చదవండి: IPL 2026 Winner: ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే: రికీ పాంటింగ్ గత ఏడాది డిసెంబర్ నెలలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి అర్ష్‌దీప్ చేసిన ఒక ప్రత్యేక వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. దాదాపు 15 మిలియన్లకు పైగా వీక్షణలు (వ్యూస్) సాధించిన ఆ అరుదైన వీడియోను సైతం అర్ష్‌దీప్ ఇప్పుడు తొలగించాడు. దీంతో ఆరాధ్య ఆటగాడికి అసలు ఏమైంది? ఎందుకిలా పాత జ్ఞాపకాలన్నింటినీ చెరిపేస్తున్నాడంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అర్ష్‌దీప్ సోషల్ మీడియాలో ఏ