translateexpand_more

Latest Telugu News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 04:22 am
మహిళ పెద్ద కర్మ రోజు ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేసిన కుటుంబసభ్యులు

ఇంటర్‌నెట్ డెస్క్: మహిళ పెద్ద కర్మ రోజు ఆమె కుటుంబసభ్యులు ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేసిన ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. బెగుసరై జిల్లాకు చెందిన మైనా దేవి అలియాస్ జాన్కి దేవి మే 19వ తేదీన చనిపోయింది. మే 30వ తేదీన పెద్ద కర్మ జరిగింది. సాధారణంగా పెద్ద కర్మ రోజు ఆ ప్రాంతంలో భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ, మైనా దేవి కొడుకు మహారాణా ప్రతాప్ పాశ్వాన్ మాత్రం పాడు పనికి తెరతీశాడు. తల్లి పెద్ద కర్మ రోజు రాత్రి ముజ్రా డ్యాన్స్ ఏర్పాటు చేశాడు.

రాత్రి మొదలైన ముజ్రా డ్యాన్స్ కార్యక్రమం ఉదయం వరకు కొనసాగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు మైనా దేవి కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై స్థానికులు మాట్లాడుతూ.. ‘మైనా దేవికి నివాళులు అర్పించడం కోసం జనం అక్కడికి వచ్చారు. కుటుంబసభ్యులు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని పెళ్లి వేడుకలా.. ఆర్కెస్ట్రాలాగా మార్చేశారు. కొంతమంది జనం డ్యాన్స్ చూస్తుంటే.. మరికొంతమంది స్టేజి మీదకు ఎక్కి డ్యాన్స్‌లు చేశారు’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత

Vaartha31 May, 08:04 am
భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ మోదీ అంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

Gajendra Singh Shekhawat:ప్రధాని నరేంద్ర మోదీ భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచ వేదికపై నిలిచారని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ప్రశంసించారు. విదేశాల్లో మన దేశ కీర్తి ప్రతిష్టలు గతంలో కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వం వల్ల ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు ఎంతో గౌరవంతో చూస్తున్నాయని ఆయన వివరించారు. ఈ మార్పు దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లిందని మంత్రి స్పష్టం చేశారు. Read also: Ghaziabad Encounter Asad:ఘజియాబాద్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్: బాలుడి హత్య కేసు నిందితుడు అసద్ హతం! ఒకప్పుడు భారత్ పేరు వినగానే ప్రపంచ దేశాలకు మహాత్మా గాంధీ మాత్రమే గుర్తొచ్చేవారని షెఖావత్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, భారత్ అనగానే ప్రధాని మోదీ ముఖచిత్రం అందరికీ స్ఫురిస్తుందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశ గుర్తింపు పెరగడం వెనుక మోదీ కృషి ఎంతో ఉందని ఆయన తెలిపారు. ఈ పరిణామం భారతీయులందరికీ గర్వకారణమని మంత్రి అభిప్రాయపడ్డారు. భారత్ మీద పెరిగిన ఈ సానుకూల దృష్టి పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతో సహకరిస్తుందని షెఖావత్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇప్పుడు భారత్ ను సందర్శించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. పర్యాటక రంగానికి మోదీ ఇస్తున్న ప్రోత్సాహం వల్ల ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని ఆయన తెలిపారు. తద్వారా రాబోయే రోజుల్లో దేశం పర్యాటక రంగంలో అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. Khammam hospital negligence: విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో 18 రోజుల పసికందు చేయి తొలగింపు! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన

Vaartha31 May, 07:30 am
భర్త కళ్లెదుటే భార్య గొంతుకోసి దారుణ హత్య

Sangareddy Crime: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి అత్యంత పాతకమైన, గుండెలవైచే ఘోర ఉదంతం చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆగిపోవడమే ఆ దంపతులకు శాపంగా మారింది. పొదల్లోంచి వచ్చిన దుండగులు భర్తపై కత్తులతో దాడి చేసి, ఆయన కళ్లెదుటే భార్యను దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. Read Also :Ghaziabad Encounter Asad:ఘజియాబాద్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్: బాలుడి హత్య కేసు నిందితుడు అసద్ హతం! పోలీసులు మరియు స్థానికుల సమాచారం ప్రకారం.. అనిల్ కుమార్, మీనా దేవి (35) దంపతులు శనివారం రాత్రి వేళ బైక్‌పై సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ (IDA) బొల్లారం మీదుగా ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో ఐడీఏ బొల్లారంలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం (ప్లే గ్రౌండ్) సమీపానికి రాగానే వారి బైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ సమయంలో చుట్టుపక్కల చీకటిగా, నిర్మానుష్యంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని.. సమీపంలోని పొదల్లో పొంచి ఉన్న కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చారు. భార్య మీనా దేవిని బలవంతంగా లాక్కుని పొదల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దుండగుల చర్యను గమనించిన భర్త అనిల్ కుమార్ ప్రాణాలకు తెగించి వారిని అడ్డుకున్నారు. తన భార్యను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆగ్రహానికి గురైన దుండగులు తమ వద్దనున్న కత్తులతో అనిల్ కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగని ఆ కిరాతకులు, రక్తపు మడుగులో పడివున్న అనిల్ కుమార్ కళ్లెదుటే.. ఆయన భార్య మీనా దేవి గొంతు కోసి ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం అక్కడి నుంచి చీకట్లోకి పరారయ్యారు. రాత్రి సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న స్థానికులు గమనించేసరికి మీనా దేవి అప్పటికే ప్రాణాలు

Andhra Jyothy31 May, 06:59 am
ఆస్పత్రి సీఈఓకు మమతా బెనర్జీ వార్నింగ్.. దుమారం రేపుతున్న వీడియో

కోల్‌కతా, మే 31: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం సోనార్‌పూర్‌లో స్థానికులు అభిషేక్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను సిబ్బంది కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడి నుంచి బెల్ వ్యూ ఆస్పత్రికి తరలించారు. మేనల్లుడిపై దాడి జరిగిన విషయం తెలియగానే మమతా బెనర్జీ బెల్ వ్యూ ఆస్పత్రికి వెళ్లారు. అభిషేక్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

తీవ్రంగా గాయపడ్డ అభిషేక్‌కు చికిత్స అందించవద్దంటూ డాక్టర్లపై, ఆస్పత్రి యాజమాన్యంపై బీజేపీ ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, హింస, ఆయుధాలు, భయంతో రాజకీయాలకు సమాధానం చెప్పకూడదని హితవు పలికారు. ఆస్పత్రి లోపల బెల్ వ్యూ సీఈఓ ప్రదీప్ టాండన్‌తో మమతా బెనర్జీ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మమతా బెనర్జీ ఆస్పత్రి సీఈఓకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా వాయిస్ ఉంది.

ఆ వీడియోలో.. ‘టాండన్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. మేము మీకు చేసిన సాయాన్ని దయచేసి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని దేవుడు క్షమించడు. మీరు తప్పుదోవపట్టిస్తున్నారు. ఇలా చేయడానికి మీకు సిగ్గుండాలి. ప్రతీ ఒక్కరు మీ దురుసు ప్రవర్తనను గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. రేపు ఉండదు. అప్పుడు మేము చేయాల్సింది చేస్తాం’ అని మమతా అన్నట్లుగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి

స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?

<a target="_blank"

Andhra Jyothy31 May, 02:31 am
పీఎం సేతు’లో ఏపీ ఫస్ట్

దేశంలోని ఐటీఐలకు మహర్దశ పట్టించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పీఎం సేతు పథకానికి రాష్ట్రం ఎంపికైంది. ఈ పథకం కింద విశాఖలోని ఐటీఐలను పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేసేందుకు ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పాన్‌ ఇండియా చేసిన ప్రతిపాదనను జాతీయ స్టీరింగ్‌ కమిటీ ఆమోదించింది. అవసరమైన నిధులను కేంద్రం పీఎం సేతు పథకం కింద అందిస్తుంది. దేశంలోని దాదాపు వెయ్యి ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించేందుకు రూ.60,000 కోట్లతో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

రోజూ 1 కిలోమీటరు నడిస్తే.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

వీడియో కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి.. ఎందుకా సాహసం?..

Andhra Jyothy31 May, 02:00 am
వీడియో కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి.. ఎందుకా సాహసం

ఇంటర్‌నెట్ డెస్క్: ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో తెలీదు కానీ.. ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందటే.. ఓ వ్యక్తి 7వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి వేలాడుతూ .. పక్కింట్లోని దృశ్యాలను వీడియో చిత్రీకరించాడు. ఆ వ్యక్తి ప్రాణాలను రిస్క్ చేసి.. కిటికీని పట్టుకు వేలాడుతూ ఆ వీడియో తీశాడు. వీడియో చిత్రీకరించటం అయిపోగానే.. కిటికీ దగ్గర కూర్చుని వీడియోను చూశాడు. దూరంగా వేరే బిల్డింగ్‌లో ఉన్న వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియోను రుద్ర యాదవ్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.

‘ఈ వ్యక్తిని చూడండి. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా.. పక్కింట్లో జరుగుతున్న గొడవను వీడియో తీయడానికి కిటికీ నుంచి వేలాడుతున్నాడు. నిజానికి పక్కింట్లో గొడవ జరుగుతుండగా, అక్కడి శబ్దాలు స్పష్టంగా వినిపించలేదు. ఆసక్తి ఆపుకోలేక, ఆయన నేరుగా భవనం కిటికీ నుంచి వేలాడుతూ ఆ గొడవను వీడియోగా రికార్డ్ చేయడం ప్రారంభించాడు’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..

తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకన్న ముందు నా సోదరినే అనుకున్నారు..

Vaartha31 May, 07:09 am
దేశ క్రీడాకారులను అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

PM modi: ప్రధాని మోదీ క్రీడాకారుల అభినందన కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్ లో ఆయన దేశ క్రీడా రంగం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. మన అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న తీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రీడల్లో యువత చూపిస్తున్న ఆసక్తి దేశానికి గర్వకారణమని ప్రధాని కొనియాడారు. ఇలాంటి విజయాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు. Read also: New CDS General Raja Subramani:భారత నూతన సీడీఎస్‌గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం! జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు అద్భుతమైన ప్రతిభకు వేదికగా నిలిచాయి. ఈ క్రీడా పోటీలలో ఏకంగా నాలుగు జాతీయ రికార్డులు నమోదయ్యాయి. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్ వంటి క్రీడాకారులు తమ అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. వీరి కృషిని ప్రధాని ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. క్రీడాకారుల విజయం వెనుక ఉన్న పట్టుదల ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించే దిశగా దేశంలో అనేక మార్పులు వస్తున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారని ప్రధాని వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. యువత క్రీడల్లో రాణిస్తే దేశం ప్రపంచ వేదికపై ఖ్యాతి గడిస్తుందని ఆయన తెలిపారు. క్రీడలను కెరీర్ గా ఎంచుకునే వారికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. Ghaziabad Encounter Asad:ఘజియాబాద్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్: బాలుడి హత్య కేసు నిందితుడు అసద్ హతం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా

Andhra Jyothy02 Jun, 01:38 am
ఏళ్ల వృద్ధుడికి ఊహించని షాక్.. 33 ఏళ్ల తర్వాత

పాట్నా, జూన్ 2: 84 ఏళ్ల ఓ వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది. హత్యాయత్నం కేసులో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఘటన జరిగిన 33 ఏళ్ల తర్వాత ఆ వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చటం గమనార్హం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 1992 నవంబర్ 10వ తేదీన వైశాలి జిల్లా, రాఘవ్‌పూర్ గ్రామానికి చెందిన దీప్ రాయ్, ఆయన కుటుంబసభ్యులు అదాలత్ రాయ్ ఇంటి దగ్గర ఉన్న రోడ్డుపై గాజు పెంకులు పేర్చారు.

అదాలత్ రాయ్, ఆయన భార్య రామ్‌శకీ దేవి.. ‘రోడ్డుపై గాజు పెంకులు ఎందుకు పేరుస్తున్నారు’ అని దీప్ రాయ్ కుటుంబాన్ని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన దీప్ రాయ్ కుటుంబం అదాలత్ రాయ్ దంపతులపై దాడికి పాల్పడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 1993, మార్చి 13వ తేదీన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 1999 జూన్ నెలలో కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. దాదాపు 30 ఏళ్ల నుంచి కోర్టులో కేసు విచారణ జరుగుతూనే ఉంది. నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. కోర్టు పది మంది సాక్ష్యులను విచారించింది.

ఆధారాలను రివ్యూ చేసిన తర్వాత కోర్టు తుది తీర్పును వెలువరించింది. 84 ఏళ్ల దీప్ రాయ్‌ని దోషిగా తేల్చింది. జూన్ 2వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈ రోజు దీప్ రాయ్‌కి శిక్ష ఖరారు చేయనుంది. 84 ఏళ్ల దీప్ రాయ్ కేసు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీప్ రాయ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సరిగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

సీబీఎస్ఈ జవాబుపత్రాలు ఫోన్లతో స్కానింగ్‌

6న భారత్‌కు ‘కాక్రోచ్‌’ అధినేత

Andhra Jyothy01 Jun, 05:59 am
పెళ్లై రెండు సంవత్సరాలు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి

లఖ్‌నవూ, జూన్ 1: పెళ్లైన రెండేళ్లకే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లఖ్‌నవూకు చెందిన సాగర్ రాజ్‌పుత్‌కు 2024లో కాన్పూర్‌కు చెందిన మాన్షితో పెళ్లయింది. మాన్షి తల్లిదండ్రులు వరకట్నం కింద 7 లక్షల నగదు, ఇంటి సామాన్లు, ఇతర బహుమతులు ఇచ్చారు. పెళ్లైన కొంతకాలం వీరి కాపురం బాగానే సాగింది. ఇద్దరూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సాగర్‌కు ఇన్‌స్టాలో 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి వీడియోలు చేసే వారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, మాన్షి అత్తింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కూతురి మరణంపై మాన్షి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం తమ కూతురిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ‘పెళ్లి సమయంలో వరకట్నం కింద 7 లక్షల నగదు, ఇంటి సామాన్లు, ఇతర బహుమతులు ఇచ్చాం. అయినా వాళ్లకు సంతృప్తి కలగలేదు. అదనపు కట్నం కోసం నా కూతురిని హింసిస్తున్నారు. కారు కావాలని అడుగుతున్నారు. తక్కువ కట్నం తెచ్చిందని అంటూ మాన్షిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారు’..

‘వేధింపుల గురించి మాతో చెప్పుకుని మాన్షి చాలా ఏడ్చేది. మాన్షి అత్తింటి వారికి సర్ధి చెప్పటం కోసం పలుమార్లు లఖ్‌నవూ వెళ్లి వచ్చాము. మా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని శనివారం ఫోన్ కాల్ వచ్చింది. మా కూతురిది ముమ్మాటికీ హత్యే. మాన్షిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు’ అని అన్నారు. పోలీసులు సాగర్‌తో పాటు మరో ఐదుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను

Andhra Jyothy01 Jun, 02:33 am
బాలుడి తల్లి పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం.. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న బాలుడి హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుడి తల్లి తనతో పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతోనే నిందితుడు విరాజ్ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. రతి, సుమిత్ భార్యాభర్తలు. వీరికి ఒకటిన్నరేళ్ల బాబు ఉన్నాడు. ఆ బాలుడి పేరు ఆరవ్. రతి బంధువుల ఊరికి చెందిన విరాజ్ అనే యువకుడు గత కొంతకాలం నుంచి ఆమెను ప్రేమిస్తున్నాడు. రతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం రతి దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. విరాజ్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో విరాజ్ రాక్షసుడిలా మారిపోయాడు. రతి తనను పెళ్లి చేసుకోవడానికి బాలుడు అడ్డంగా ఉన్నాడని భావించాడు. బాలుడు లేకపోతే తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని, ఎలాగైనా బాలుడి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. రెండు రోజుల క్రితం రతి బంధువు ఇంటికి వచ్చింది. ఈ విషయం విరాజ్‌కు తెలిసింది. వెంటనే రతి బంధువు ఇంటికి వెళ్లాడు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి బాలుడిని బయటకు తీసుకెళ్లాడు.

తర్వాత అతి దారుణంగా హత్య చేసి చంపాడు. బాలుడిని చంపిన తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. చలనం లేకుండా నేలపై పడున్న బాలుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు తేల్చారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసు బృందాలు విరాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు మెయిన్‌పురి రోడ్డులో వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి విరాజ్‌ను చుట్టుముట్టారు.

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి విరాజ్ తుపాకితో కాల్పులు జరిపాడు.

Vaartha30 May, 05:24 am
టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన హీరో నితిన్

Nithin Meets Tdp MLA: టాలీవుడ్ ప్రముఖ యువ హీరో నితిన్, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కలుసుకున్నారు. శుక్రవారం నాడు జరిగిన ఈ స్నేహపూర్వక సమావేశానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఇద్దరు యువ ప్రముఖులు ఇలా కలవడంతో ఉభయ వర్గాల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రియ మిత్రుడైన హీరో నితిన్ తన నివాసానికి రావడంపై శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ఆయన తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంటూ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. read also: Ram Charan – Shivanna: పెద్ది సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, శివరాజ్‌కుమార్..ఫోటో వైరల్ “చాలా కాలం తర్వాత నా ఆప్తమిత్రుడు నితిన్ మా ఇంటికి రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయన కాసేపు ఎంతో సరదాగా సమయం గడిపారు. ఈ కలయికలో మా పాత మధుర జ్ఞాపకాలను, స్నేహాన్ని మరోసారి నెమరువేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది” అని సుధీర్ రెడ్డి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సినిమా షూటింగులతో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి, తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించినందుకు నితిన్‌కు సుధీర్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఇది కేవలం ఇద్దరు పాత స్నేహితుల మధ్య జరిగిన వ్యక్తిగతమైన, ఆత్మీయమైన కలయిక మాత్రమేనని వారి మాటలను బట్టి స్పష్టమవుతోంది. ప్రస్తుతం మెడలో శాలువాతో ఉన్న నితిన్,

Vaartha30 May, 03:07 pm
డీఎస్సీ అక్రమాలకు ఆస్కారమే లేదు

AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన డీఎస్సీ (AP DSC) ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై వస్తున్న అన్ని రకాల అపోహలు, ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా అత్యంత పటిష్టమైన భద్రతా ప్రమాణాలు, పారదర్శకతతో జరిగిందని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎగ్జామ్స్ నిర్వహణ దగ్గర నుంచి రిజల్ట్స్ ప్రకటన వరకు డిపార్ట్‌మెంట్ అనుసరించిన విధివిధానాలను పాయింట్ల వారీగా వివరించారు. ఈసారి డీఎస్సీ పరీక్షలను దేశంలోనే అత్యంత నమ్మకమైన ‘టీసీఎస్ ఐయాన్’ ప్లాట్‌ఫామ్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించినట్లు కోన శశిధర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ మరియు వివిధ రాష్ట్రాల హైకోర్టు పరీక్షలను ఇదే వేదిక ద్వారా నిర్వహిస్తారని ఆయన గుర్తుచేశారు. Read also: Pawan Kalyan: జిందాల్ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌లో పవన్ కల్యాణ్ పర్యటన ఈ ఆన్‌లైన్ విధానంలో ప్రశ్నపత్రాలు 256-బిట్ ఎన్‌క్రిప్షన్ (Encrypted) పద్ధతిలో నేరుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటాయి. అలాగే ప్రతి అభ్యర్థికి ప్రశ్నలు జంబుల్డ్ (మార్పిడి) పద్ధతిలో వస్తాయి. కాబట్టి ఇందులో ఎలాంటి హ్యూమన్ మానిపులేషన్‌కు (మానవ ప్రమేయానికి) ఆస్కారమే ఉండదు. పాత పద్ధతిలో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ లాంటి లోపాలకు తావులేకుండా ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా, పటిష్టంగా సాగిందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కలిపి మొత్తం 154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి చెప్పారు. ప్రభుత్వ మరియు టీసీఎస్ నిపుణుల బృందాలు అన్ని మౌలిక వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే

Vaartha30 May, 03:21 pm
వైసిపికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

Ravi Naidu: గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఘోరంగా ఓడించారనే కక్షతోనే నిరుద్యోగ యువతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రతికారేచ్ఛతో వ్యవహరిస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఛైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టిన డీఎస్సీ (AP DSC) నియామకాలపై కేవలం రాజకీయ స్వార్థంతోనే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో “నిరుద్యోగ యువతపై గొడ్డలివేటు” అనే పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సమావేశానికి కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వెయ్యి మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. వైసీపీ చేస్తున్న కుట్రపూరిత ప్రచారం వల్ల రాత్రింబగళ్లు కష్టపడి ఉద్యోగాలు సాధించిన పేద అభ్యర్థులు, వారి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని రవినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. “రాజకీయాలు ఉంటే మాతో తేల్చుకోవాలి గానీ, ఇలా యువత జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం” అని హితవు పలికారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయని జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు తూతూమంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 150 రోజుల్లోనే 15,941 మందికి ఉద్యోగ పత్రాలు అందించిందని, ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఏకంగా 150 కేసులు వేశారని ఆయన గుర్తుచేశారు. Read also: AP DSC: డీఎస్సీ అక్రమాలకు ఆస్కారమే లేదు: కోన శశిధర్ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ వస్తున్న ఆరోపణలను రవినాయుడు పూర్తిగా కొట్టిపారేశారు. క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇచ్చేది ఆయా అసోసియేషన్లు, ఫెడరేషన్లేనని.. వాటిని అన్ని కోణాల్లో

Andhra Jyothy30 May, 01:26 am
క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్.. రూ. 7 కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరో

హాలీవుడ్ సూపర్ స్టార్ జానీ డెప్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్‌లో కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఓ సైబర్ నేరగాడు జానీ డెప్ క్రెడిట్ కార్డ్ నుంచి ఏకంగా 6,90,000 డాలర్లు దోచేశాడు. ఇంటర్‌నెట్ డెస్క్: హాలీవుడ్ సూపర్ స్టార్ జానీ డెప్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్‌లో కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఓ సైబర్ నేరగాడు జానీ డెప్ క్రెడిట్ కార్డ్ నుంచి ఏకంగా 6,90,000 డాలర్లు దోచేశాడు. అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు.. హంగేరియాకు చెందిన ఓ సైబర్ నేరస్థుడు జానీ డెప్‌‌ను టార్గెట్ చేశాడు. ఆయనకు చెందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు వాడుకోవటం మొదలెట్టాడు. 2024 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు 308 ట్రాన్సాక్షన్స్ చేశాడు. హోటళ్లలో స్టే చేయడానికి, ఆన్‌లైన్ షాపింగ్స్, చిన్న చిన్న కొనుగోళ్ల కోసం జానీ డెప్ క్రెడిట్ కార్డు‌ను వాడేవాడు. సైబర్ నేరగాడు ఏకంగా 7 కోట్ల రూపాయలు వాడుకున్నాడు. డబ్బులు చిన్న మొత్తంలో పోతుండటంతో జానీ డెప్ దీన్ని గుర్తించలేకపోయారు. అయితే, బ్యాంకు అధికారులు జానీ డెప్ క్రెడిట్ కార్డు నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరుగుతుండటం గుర్తించారు. వెంటనే క్రెడిట్ కార్డును ఫ్రీజ్ చేశారు. ఎఫ్‌బీఐ బుడాపెస్ట్ ఆఫీస్‌కు సమాచారం అందించారు. అధికారుల దర్యాప్తులో అంగ్యాల్‌ఫోల్డ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ లావాదేవీలు చేసినట్లు తేలింది. డిజిటల్ ఎవిడెన్స్, ఐపీ అడ్రస్, ఈమెయిల్ అకౌంట్స్, ఫోన్ రికార్డ్స్ ద్వారా అధికారులు నిందితుడిని గుర్తించారు. మే 6వ తేదీన హంగేరియన్ పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అతడు చేసిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు చిన్న చిన్న మొత్తాల్లో మాత్రమే లావాదేవీలు చేసేవాడినని పోలీసులకు చెప్పాడు.

Vaartha01 Jun, 09:58 am
ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ అంశం కాదు

Phone Tapping Case:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన వ్యక్తిగత అంశం కాదని, రాజకీయ అంశం అసలే కాదని, ఇది తెలంగాణ ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం అని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నం. 12లో ఉన్న కమీషనర్ ఆఫ్ పోలీస్, ఐసీసీసీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) అధికారుల ఎదుట ఆయన హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తన మొబైల్ ఫోన్ అనుమానాస్పదంగా ట్యాపింగ్‌కు గురైందని, దీనిపై తొలిసారిగా తాను డిఐజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. Read also: Aadhaar Update: కొత్త ఆధార్ యాప్.. మీ డిజిటల్ గుర్తింపు ఇక మరింత సురక్షితం అనంతరం చాలామంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాముఖ్యతతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం సంభాషణలను వినడమే కాకుండా, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత స్వేచ్ఛలో అక్రమ జోక్యం చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గోప్యత హక్కు కల్పించబడిందని, సుప్రీంకోర్టు పుట్టస్వామి తీర్పు ద్వారా గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఉందని, ఫోన్లు ట్యాప్

Vaartha30 May, 02:52 pm
స్మోకింగ్ కేవలం ఊపిరితిత్తులకే హాని చేస్తుందా? వైద్యులు ఏమంటున్నారంటే

Smoking: ధూమపానం (Smoking) అనగానే చాలామందికి కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా గుండె జబ్బులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, పొగాకు అలవాటు మీ అస్థిపంజర వ్యవస్థను (Skeletal System) లోపలి నుంచే గుల్ల చేస్తుందనే చేదు నిజం చాలామందికి తెలియదు. అవును, సిగరెట్లు లేదా పొగాకు ఉత్పత్తులు మీ ఎముకల బలాన్ని, వెన్నెముక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో పాత ఎముక కణజాలం స్థానంలో కొత్త కణజాలం ఏర్పడే ప్రక్రియ నిరంతరం సాగుతుంది. అయితే, పొగాకులో ఉండే ప్రమాదకరమైన ‘నికోటిన్’ రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల ఎముకలకు అందాల్సిన ఆక్సిజన్, కాల్షియం మరియు ఇతర ముఖ్యమైన పోషకాల సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా, ఎముకలు తమను తాము మరమ్మత్తు చేసుకునే సహజ సామర్థ్యాన్ని కోల్పోతాయి. Read also: Fiber in Food: రోజూ తినే ఫుడ్‌లో ఫైబర్ సరిపోతోందా? లేకపోతే వచ్చే ప్రమాదకర జబ్బులివే! ఏదైనా ప్రమాదం జరిగి ఎముక విరిగినప్పుడు లేదా ఆర్థోపెడిక్ సర్జరీలు జరిగినప్పుడు గాయం త్వరగా మానాలంటే సక్రమమైన రక్త ప్రసరణ చాలా అవసరం. కానీ, ధూమపానం చేసేవారిలో రక్త ప్రసరణ మందగించడం వల్ల ఎముకలు అతుక్కోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని తీవ్రమైన కేసుల్లో ఎముకలు అస్సలు అతుక్కోవు. వైద్య పరిభాషలో ఈ స్థితిని ‘నాన్-యూనియన్’ (Non-union) అంటారు. మీరు ఎంత ఖరీదైన మందులు వాడినా, పొగాకు అలవాటు ఉంటే సర్జరీల తర్వాత రికవరీ కావడం చాలా కష్టమవుతుంది. మన వెన్నెముకలోని పూసల మధ్య ఉండే ‘డిస్కులు’ (Spinal Discs) షాక్ అబ్జార్బర్లుగా పనిచేస్తూ మనల్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతాయి. పొగాకు వాడకం వల్ల ఈ డిస్కులకు అందాల్సిన నీటి శాతం (Hydration) మరియు

Vaartha01 Jun, 12:04 pm
జూన్ 6న భారత్ కు రానున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

Cockroach Janata Party: దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై వివాదాలు రేగుతున్న తరుణంలో, నూతనంగా ఏర్పాటైన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. దేశంలోని విద్యావ్యవస్థలో జరుగుతున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై దేశంలో శాంతియుత ఆందోళనలు చేపట్టేందుకు తాను జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు స్పష్టం చేశారు. Read also: JEE Advanced results Topper: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టాపర్‌గా శుభమ్ కుమార్, అరోహి దేశ్‌పాండే ఫస్ట్ ఈ నిరసనలకు సంబంధించిన వివరాలను అభిజీత్ దీప్కే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ద్వారా వెల్లడించారు. జూన్ 6వ తేదీ (శనివారం) ఉదయం తాను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల గందరగోళం వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, యువత మరియు తమ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా మరియు శాంతియుత మార్గంలో దేశ విద్యార్థుల గొంతుకను ప్రభుత్వం వినేలా చేస్తామని దీప్కే ధీమా వ్యక్తం చేశారు. విమానాశ్రయం నుంచి తామంతా నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటామని, అక్కడ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి అధికారికంగా అనుమతి కోరతామని ఆయన ఈ వీడియోలో వివరించారు. JEE Advanced results Topper: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టాపర్‌గా శుభమ్ కుమార్, అరోహి దేశ్‌పాండే ఫస్ట్ Anganwadi Centers: చిన్నారులను నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడి కేంద్రాల పాత్ర

Vaartha01 Jun, 11:50 am
జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో టాపర్ గా శుభమ్ కుమార్, అరోహి దేశ్ పాండే ఫస్ట్

JEE Advanced results Topper: దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026) ఫలితాలను ఐఐటీ రూర్కీ సోమవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ దేశంలోనే టాప్ ర్యాంకర్ (All India Topper) గా నిలిచి సంచలనం సృష్టించారు. ఇక విద్యార్థినుల విభాగంలో అరోహి దేశ్‌పాండే జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకును కైవసం చేసుకున్నారు. Read also: JEE Advanced 2026 Results:జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. ఐఐటీ రూర్కీ ర్యాంక్ కార్డ్ లింక్ ఇదే! ఈ ఏడాది ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థులు క్లీన్ స్వీప్ చేశారు. కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL)లో శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా అదే జోన్‌కు చెందిన కబీర్ చిల్లార్ ద్వితీయ స్థానాన్ని, జతైన్ చాహర్ తృతీయ స్థానాన్ని సాధించి రికార్డు సృష్టించారు. శుభమ్ కుమార్ సాధించిన ఈ అద్భుత విజయంతో దేశంలోనే ఐఐటీ శిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజస్థాన్‌లోని ‘కోటా’ కోచింగ్ సెంటర్ల హవా మరోసారి నిరూపితమైంది. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై శుభమ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఐఐటీ లక్ష్యంగా సాగిన తన ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, భవిష్యత్తులో ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థులు కఠోర శ్రమ, పట్టుదల, నిరంతర సాధనను నమ్ముకుంటే విజయం తథ్యమని సూచించారు. శుభమ్ తల్లిదండ్రులు కంచన్ మరియు అతని తండ్రి మాట్లాడుతూ.. తమ కుమారుడు మొదటి నుంచి చదువుపై ఎంతో అంకితభావంతో ఉండేవాడని, అధ్యాపకుల సహకారంతోనే ఈ రోజు జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్‌గా నిలిచాడని గర్వంగా

Vaartha01 Jun, 11:47 am
ఆధార్ జిరాక్స్ కాపీలకు గుడ్ బై.. క్యూఆర్ కోడ్ ద్వారానే వెరిఫికేషన్

Aadhaar Card: యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌ను అప్‌గ్రేడ్ చేసి పూర్తిస్థాయి వెర్షన్ ప్రారంభించింది. అయితే ఈ యాప్‌లో అనేక అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఆధార్ అవసరమైన చోట క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు పంచుకోవచ్చు. ఇప్పటివరకు ఎక్కడైనా ఆధార్ అవసరమైతే ఆధార్ ఒరిజినల్ చూపించడం లేదా ఆధార్ జిరాక్స్ కాపీ అందించడం లాంటివి చేయాల్సి వచ్చేది. కానీ దీని వల్ల ఆధార్ దుర్వినియోగం అవుతుంది. జిరాక్స్ కాపీ ద్వారా కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత వివరాలను ఉపయోగించి అక్రమాలకు పాల్పుడుతు న్నారు. దీంతో ప్రజల వ్యక్తిగత వివరాలకు రక్షణ కల్పించేందుకు, ఆధార్‌ను ప్రజలు సురక్షితంగా వాడుకునేందుకు కొత్త యాప్‌లో అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చింది. Read Also: Aadhaar Housing Finance: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ భారీ టార్గెట్.. ఈ ఏడాది 45 కొత్త శాఖలు! ఇక నుంచి ఆధార్ జిరాక్స్ కాపీ ఇవ్వాల్సిన పనే లేదు. ఆధార్ అవసరమైన చోట క్యూఆర్ కోడ్‌తో ధృవీకరణ పూర్తి చేయవచ్చు. మీరు యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను పంచుకుంటే సరిపోతుంది. మీరు ఏయే వివరాలు పంచుకుంటున్నారనేది ఎంపిక చేసుకుని క్యూఆర్ కోడ్ షేర్ చేయాలి. దీంతో ఆయా వివరాలు మాత్రమే ఎదుటి వ్యక్తికి కనిపిస్తాయి. హోటళ్లు, పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు లేదా ఆధార్ ధృవీకరణ అవసరమైన చోట ఫొటో కాపీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇలా క్యూఆక్ కోడ్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేవయవచ్చు. మీ ఆధార్ వ్యక్తిగత వివరాలు ఇతర వ్యక్తులకు తెలియకుండా ఇది భద్రత కల్పి్స్తుంది. ఇక కొత్త ఆధార్ యాప్‌లో ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ కూడా ఉంది.

Vaartha30 May, 01:28 pm
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం

DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 3వ తేదీ సాయంత్రం 5:15 గంటలకు ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రముఖ వాస్తు, జ్యోతిష్య నిపుణులు గురూజీ ఆరాధ్య స్వయంగా ఈ శుభ ముహూర్తాన్ని నిర్ణయించినట్లు శనివారం అధికారికంగా వెల్లడించారు. Read also: Patanjali Products Seize: బాబా రాందేవ్‌కు భారీ షాక్..పతంజలి ఉత్పత్తులను సీజ్ చేసిన ఎఫ్‌డీఏ అధికారులు డీకే శివకుమార్ నివాసం వద్ద గురూజీ ఆరాధ్య మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 3 (బుధవారం) నాటి వృశ్చిక లగ్నం ప్రమాణ స్వీకారానికి అత్యంత శుభప్రదంగా ఉందని పేర్కొన్నారు. నిజానికి జూన్ 5వ తేదీని కూడా పరిశీలించినప్పటికీ, ఆ రోజున ఒక ముఖ్యనేత అందుబాటులో ఉండరనే కారణంతో జూన్ 3వ తేదీనే ఫైనల్ చేసినట్లు ఆయన వివరించారు. డీకేఎస్ జాతక చక్రం, జ్యోతిష్య గణాంకాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముహూర్తం ఖరారైన నేపథ్యంలో డీకే శివకుమార్ బెంగళూరులోని ప్రసిద్ధ అజ్జయ్య మఠాన్ని సందర్శించి, అక్కడి స్వామీజీ ప్రత్యేక ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు ఆయన రాజ్ భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు, కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా సీఎల్పీ నేతగా డీకేఎస్ పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ దాన్ని ఏకగ్రీవంగా బలపరిచారు. Pawan Kalyan: జిందాల్ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌లో పవన్ కల్యాణ్ పర్యటన Addanki Dayakar: బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్ గమనిక: ఈ వెబ్

Vaartha31 May, 06:14 pm
ఈ సాలా కప్ నమ్దే.. వరుసగా రెండోసారి ఛాంపియన్ గా ఆర్ సీబీ

RCB IPL Champion : ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ అజేయంగా 75 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో బాధ్యతాయుతంగా ఆడిన కోహ్లీ మరోసారి తన అనుభవాన్ని నిరూపించాడు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లను త్వరగా ఔట్ చేసి గుజరాత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. రసిఖ్ సలామ్ మూడు వికెట్లతో మెరిసిపోగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటంతో అజేయ అర్ధశతకం సాధించినప్పటికీ గుజరాత్ 155/8 స్కోరుకే పరిమితమైంది. Read Also :Samsung: ఏఐతో పెరిగిన లాభాలు.. ఉద్యోగులతో పంచుకుంటున్న శాంసంగ్ 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి వెంకటేశ్ అయ్యర్ వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. అనంతరం కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించాడు. మధ్యలో కొన్ని వికెట్లు పడినప్పటికీ టిమ్ డేవిడ్, జితేష్ శర్మల సహకారంతో లక్ష్యాన్ని 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా టైటిల్‌ను నిలబెట్టుకున్న మూడో జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే ఈ ఘనత సాధించాయి. తొలి టైటిల్ కోసం 18 సీజన్లు ఎదురుచూసిన బెంగళూరు, ఇప్పుడు రెండేళ్లలో రెండు కప్పులు గెలిచి తన శకాన్ని కొనసాగిస్తోంది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో ఓడిపోయినా మొత్తం సీజన్‌లో అద్భుత

Vaartha30 May, 06:16 pm
ఆసియా గేమ్స్ జాబితాలో వైభవ్.. స్టార్ లకు షాక్

India Cricket Team : 2026లో జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఆసియా గేమ్స్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక చర్యలు చేపట్టింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌కు మరోసారి పతకం అందించాలనే లక్ష్యంతో బీసీసీఐ 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జాబితాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు పంపించింది. ఈ జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషంగా మారింది. మరోవైపు భారత జట్టు స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ పేర్లు లేకపోవడం అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల మధ్య చర్చకు కారణమైంది. ఆసియా గేమ్స్ క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. ఇదే సమయంలో భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు జట్లను సిద్ధం చేయాలనే ప్రణాళికతో బీసీసీఐ ముందుకెళ్తోంది. వెస్టిండీస్ సిరీస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉన్న శుభ్‌మన్ గిల్‌ను ఆ సిరీస్ కోసమే ఉంచాలని నిర్ణయించడంతో అతడిని ఆసియా గేమ్స్ ఎంపికకు పరిగణించలేదు. సూర్యకుమార్ యాదవ్ విషయంలో కూడా సెలక్టర్లు దీర్ఘకాలిక ప్రణాళికలను దృష్టిలో ఉంచుకున్నారు. రాబోయే ప్రపంచకప్‌లు, ఒలింపిక్స్ వంటి ప్రధాన టోర్నీలను లక్ష్యంగా చేసుకుని అతడి పనిభారాన్ని నియంత్రించాలని భావించారు. అదే సమయంలో యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో వైభవ్ సూర్యవంశీ వంటి ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించారు. భవిష్యత్ భారత జట్టుకు బలమైన ఆటగాళ్లను తయారుచేయాలనే ఆలోచన ఈ ఎంపికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. Read Also : హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ వేటు? ఆసియా

Vaartha01 Jun, 05:52 am
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి

DK Shivakumar On IPL : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుండి గుజరాత్‌కు మార్చడంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం బెంగళూరులో జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను చివరి నిమిషంలో మార్చడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం కర్ణాటకకు మరియు ఇక్కడి క్రికెట్ అభిమానులకు జరిగిన ముమ్మాటికీ అన్యాయమని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, మైదానంలో ఆటగాళ్లు చూపిన ప్రతిభను వేదిక మార్పు ప్రభావితం చేయలేకపోయిందని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. రాజకీయ వ్యూహాలతో వేదిక మారినా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మాత్రం లీగ్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. గుజరాత్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసి, ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ చారిత్రాత్మక విజయంపై డీకే శివకుమార్ స్పందిస్తూ, సోషల్ మీడియా వేదికగా జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. “వేదిక ఏదైనా, విజేత మాత్రం మనమే! పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఛాంపియన్లకు ఉండే పోరాటస్ఫూర్తితో ఆర్సీబీ మరోసారి బెంగళూరుకు గర్వకారణంగా నిలిచింది. ఈ ఏడాది కూడా కప్ మనదే!” అని ఆయన ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు ఫ్రాంచైజీ చరిత్రలోనే ఒక స్వర్ణాక్షర ఘట్టమని కొనియాడారు. Read Also: RCB vs GT Final: ఆ ఒక్క క్యాచ్‌తో మారిన మ్యాచ్ తలరాత! కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆర్సీబీ జట్టు అద్భుత ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించారు. టోర్నమెంట్ అంతటా ఆర్సీబీ ఆడిన దూకుడైన క్రికెట్, ప్రత్యర్థి జట్లకు కోలుకునే అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు. ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా, పూర్తి

Vaartha01 Jun, 05:43 am
ఆ ఒక్క క్యాచ్ తో మారిన మ్యాచ్ తలరాత

RCB vs GT Final: ఐపీఎల్ 2026 (IPL 2026) ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించి ట్రోఫీ గెలిచినప్పటికీ.. మ్యాచ్ ముగింపు దశలో విరాట్ కోహ్లీ (Virat Kohli), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మధ్య చోటుచేసుకున్న హై-వోల్టేజ్ డ్రామా హైలైట్‌గా నిలిచింది. మైదానంలో టీమిండియా సీనియర్, జూనియర్ స్టార్ల మధ్య జరిగిన ఈ ‘క్యాచ్’ యుద్ధం క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. Read Also :IPL 2026 Winner : కప్ గెలిచిన తర్వాత కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్! గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన రసవత్తర ఫైనల్ పోరులో ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేళ ఈ ఘటన జరిగింది. గుజరాత్ బౌలర్ అర్షద్ ఖాన్ వేసిన ఆఖరి బంతిని విరాట్ కోహ్లీ గాల్లోకి లేపాడు. మిడ్-ఆఫ్ దిశగా పరిగెత్తుకుంటూ వచ్చిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు వెంటనే దానిని అవుట్‌గా ప్రకటించడంతో గుజరాత్ క్యాంప్ సంబరాల్లో మునిగిపోగా, కోహ్లీ నిరాశగా వెనుతిరిగాడు. పెవిలియన్ వైపు కొద్ది దూరం నడిచిన కోహ్లీ, గిల్ పట్టిన క్యాచ్‌పై అనుమానంతో వెనక్కి తిరిగాడు. బంతి డైవ్ చేసే క్రమంలో నేలకు తాకినట్లు భావించిన విరాట్.. వెంటనే ఆన్-ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వద్దకు వెళ్లి, థర్డ్ అంపైర్ (TV అంపైర్) రివ్యూ కోరాలని తీవ్రంగా డిమాండ్ చేశాడు. కోహ్లీ గట్టిగా నిలదీయడంతో అంపైర్లు ఆ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు బదిలీ చేయక తప్పలేదు. టీవీ రీప్లేలో విభిన్న కోణాల నుంచి ఆ క్యాచ్‌ను థర్డ్ అంపైర్ చాలా నిమిషాల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు.

Vaartha31 May, 06:04 am
చార్ ధామ్ యాత్రలో 8 కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు

Char Dham Yatra: ఉత్తరాఖండ్ పుణ్యక్షేత్రాలకు వెళ్లే చార్‌ధామ్ యాత్ర ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ప్రధాన రహదారులు కిటకిటలాడుతున్నాయి. జోషీమఠ్ నుండి మార్వారీ వరకు దాదాపు 8 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. యాత్రికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల సమయం పడుతుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. Read also: Mausam : రైతుల కోసం ‘మౌసమ్’ యాప్ ..ఎలా ఉపయోగపడుతుందంటే !! వారాంతపు సెలవులు మరియు వరుస సెలవు దినాలు కావడంతో భక్తుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గోవింద్‌ఘాట్, సోన్‌ప్రయాగ్ వంటి ప్రముఖ ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ విపరీతంగా ఉంది. రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో గమ్యస్థానాలకు చేరుకోలేక భక్తులు ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా మార్గమధ్యంలో ఆహారం, తాగునీటి సదుపాయాలు సరిగ్గా అందడం లేదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలతో ప్రయాణించే వారికి ఈ పరిస్థితి కష్టంగా మారింది. దీనిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు వేగవంతం చేశారు. Allu Arjun Political Entry:టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం..అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Char Dham Yatra: బద్రీనాథ్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్..గంటల తరబడి రోడ్లపైనే వేలాది మంది భక్తులు Mausam : రైతుల కోసం ‘మౌసమ్’ యాప్ ..ఎలా ఉపయోగపడుతుందంటే

Vaartha31 May, 11:43 am
కేదార్ నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి

Kedarnath Yatra: ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లో అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కేదార్‌నాథ్ యాత్రలో (Kedarnath Yatra) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హిమాలయ పర్వత ప్రాంతాలలో ఒక్కసారిగా వాతావరణం క్షీణించడం, విపరీతమైన చలి మరియు అనారోగ్య సమస్యల కారణంగా ముగ్గురు భక్తులు మరణించారు. ఈ మృతులలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన బలగాని బలరాజ్ (49) అనే భక్తుడు ఉన్నట్లు అధికారిక సమాచారం అందింది. Read Also :Char Dham Yatra: బద్రీనాథ్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్..గంటల తరబడి రోడ్లపైనే వేలాది మంది భక్తులు గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ వ్యాప్తంగా, ముఖ్యంగా రుద్రప్రయాగ్ (Rudraprayag) పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి కేదార్‌నాథ్ వెళ్లే కాలినడక మార్గాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి (Landslides). భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యాత్ర నిలిచిపోవడంతో మార్గమధ్యంలో చిక్కుకుపోయిన వేలాది మంది భక్తులను అధికారులు అప్రమత్తం చేశారు. రుద్రప్రయాగ్, గుప్తకాశీ, సోన్‌ప్రయాగ్ ప్రాంతాలలోని సురక్షిత ప్రాంతాలు మరియు యాత్రికుల వసతి గృహాలకు (Shelter Homes) వారిని తరలించి, అవసరమైన ఆహార, వైద్య సదుపాయాలను కల్పిస్తున్నారు. హిమాలయాల్లో సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే కేదార్‌నాథ్‌లో వాతావరణం హఠాత్తుగా మారిపోవడం వల్ల ఆక్సిజన్ శాతం (Oxygen Levels) పడిపోతుంది. భారీ వర్షాల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో, శ్వాసకోశ ఇబ్బందులు మరియు గుండెపోటు వంటి అనారోగ్య సమస్యల బారిన పడి ఈ ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ బృందాలు (SDRF) మరియు స్థానిక యంత్రాంగం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన

Andhra Jyothy30 May, 04:14 am
సీబీఎస్ఈ పోర్టల్ పై సైబర్ దాడి.. పేమెంట్ సిస్టమ్ సేవలు నిలిపివేత

న్యూఢిల్లీ, మే 30: ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ) పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. రీవాల్యుయేషన్ పోర్టల్స్‌ పేమెంట్ సిస్టమ్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 50 మంది విద్యార్థులు అనధికారిక యాక్సెస్ పొందినట్లు తెలిపాయి. సైబర్ దాడి నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పేమెంట్ సిస్టమ్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మరింత సురక్షితంగా సేవలందించేందుకు జూన్ 1వ తేదీ నుంచి పేమెంట్ సిస్టమ్‌ను తిరిగి ప్రారంభించనుంది.

పీటీఐ తెలిపిన వివరాల మేరకు.. రీవాల్యుయేషన్ పోర్టల్స్‌ పేమెంట్ సిస్టమ్‌పై సైబర్ దాడులు జరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన పేమెంట్ గేట్‌వేలోకి 50 మందికి పైగా విద్యార్థులు చొరబడ్డారు. లోపలికి ప్రవేశించిన ఆ విద్యార్థులు పేమెంట్ సిస్టమ్‌ను మానిప్యులేట్ చేసి, ఫీజుల ధరలను మార్చేశారు. వారు చేసిన పని కారణంగా స్క్రీన్‌పై ఫీజు ధరలు తారుమారై కనిపించాయి. ఫీజులు ఒక రూపాయి నుంచి 68,000 వేల రూపాయ వరకు చూపించాయి. సరదా కోసమో లేదా నష్టం కలిగించాలన్న ఉద్దేశ్యంతో విద్యార్థులు ఆ పని చేసి ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పీటీఐకి తెలిపాయి.

ఇవి కూడా చదవండి

లింగంపల్లి ఆర్‌ఓబీ పనులకు మోక్షం

నల్గొండ జిల్లాలో ప్రమాదం.. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు దగ్ధం!

Vaartha31 May, 01:21 pm
కోహ్లీని ఆపడం కష్టం.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ప్రత్యర్థి జట్టు వ్యూహాలను అర్థం చేసుకుని వాటికి తగిన విధంగా స్పందించే సామర్థ్యం కోహ్లీని ప్రత్యేకంగా నిలబెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే టైటిల్ పోరులో కూడా కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని అశ్విన్ విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు గత కొంతకాలంగా కోహ్లీపై ఒకే తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అశ్విన్ వివరించారు. ముఖ్యంగా ఆఫ్‌సైడ్ వైపు వెడల్పుగా బంతులు వేస్తూ కోహ్లీని తప్పిదానికి గురిచేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గత రెండు సీజన్లలో అలాంటి బంతులకు కోహ్లీ వికెట్ కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో కోహ్లీ ఆ వ్యూహాన్ని బాగా అర్థం చేసుకుని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. Read Also :Samsung: ఏఐతో పెరిగిన లాభాలు.. ఉద్యోగులతో పంచుకుంటున్న శాంసంగ్ ఆర్‌సీబీ బ్యాటింగ్ క్రమంలో కోహ్లీ పాత్ర అత్యంత ముఖ్యమని అశ్విన్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ క్రీజులో ఎక్కువసేపు ఉంటే మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా దూకుడుగా ఆడే అవకాశం ఉంటుందని చెప్పారు. అదే జట్టుకు పెద్ద బలమని వివరించారు. ఫైనల్‌లో కూడా కోహ్లీ ఇన్నింగ్స్‌కు పునాది వేస్తే ఆర్‌సీబీకి విజయం సాధించే అవకాశాలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌పై కూడా అశ్విన్ ప్రశంసలు కురిపించారు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అతను అత్యంత ప్రమాదకర బ్యాటర్లలో ఒకడని అన్నారు. తన కాళ్ల కదలికతో స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించే అరుదైన బ్యాటర్‌గా పాటిదార్‌ను అభివర్ణించారు. ఫైనల్‌లో అతడిని అడ్డుకోవాలంటే గుజరాత్

Vaartha29 May, 05:23 pm
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

Governor Shiv Pratap Shukla: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మే 29, ప్రభాతవార్త: ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్‌తో కలిసి వందేమాతరం గీతం ఆలపించి జ్యోతి ప్రజ్వలన చేశారు. Read Also: Retired Employees: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ జిల్లాలో 464 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారిని అధికారులు దత్తత తీసుకుని నెలకు సరిపడా మందులు, పౌష్టికాహారం అందించాలని గవర్నర్ సూచించారు. చాలామంది దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలను బయటకు చెప్పకుండా బాధపడుతుంటారని, అలాంటి వారిని గుర్తించి సరైన వైద్య చికిత్సలు అందించాలని తెలిపారు. చికిత్స ద్వారా క్షయవ్యాధి పూర్తిగా నయం అవుతుందనే అవగాహన ప్రజల్లో కల్పించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని గవర్నర్ సూచించారు. ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. జిల్లాలో శాఖల వారీగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ హరిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. ఎస్పీ నితికా పంత్ జిల్లాలో శాంతిభద్రతలు, మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలపై వివరాలు వెల్లడించారు.

Vaartha01 Jun, 05:50 am
కెప్టెన్ గా ట్రోఫీ అందుకుంటానని ఊహించలేదు

Rajat Patidar Captaincy: ఐపీఎల్ 2026 (IPL 2026) ముగింపు వేడుకలు సరికొత్త చరిత్రకు వేదికయ్యాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) పై ఘనవిజయం సాధించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). ఈ చారిత్రక బ్యాక్-టు-బ్యాక్ టైటిల్ విజయం అనంతరం ఆర్సీబీ నయా కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. Read Also :RCB vs GT Final: ఆ ఒక్క క్యాచ్‌తో మారిన మ్యాచ్ తలరాత! విజయం అనంతరం ప్రెజెంటేషన్ సెర్మనీలో మాట్లాడిన రజత్ పాటిదార్ అత్యంత ఎమోషనల్‌గా కనిపించాడు. “ఆర్సీబీ లాంటి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుకు కెప్టెన్‌గా ఉండి, ఐపీఎల్ ట్రోఫీని అందుకుంటానని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఇది నా కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన క్షణం. అంతా విధి రాసినట్లు (Destiny) అనిపిస్తోంది” అని తెలిపాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు గత ఏడాది జ్ఞాపకాలు గుర్తొచ్చాయని, అయితే గతంలో మునిగిపోకుండా ప్రస్తుత మ్యాచ్‌పైనే దృష్టి పెట్టడం ప్లస్ అయిందని చెప్పాడు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడం వెనుక స్పష్టమైన ప్రణాళిక ఉందని పాటిదార్ వెల్లడించాడు. బలమైన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్‌ను పవర్‌ప్లేలోనే దెబ్బతీయడమే తమ వ్యూహమని, బౌలర్లు దానిని అద్భుతంగా అమలు చేశారని కొనియాడాడు. ఈ టోర్నమెంట్‌లో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి సీనియర్లతో పాటు రసిఖ్ సలామ్, కృనాల్ పాండ్యా, సుయశ్ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి ఆటగాళ్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును విజేతగా నిలిపారని ప్రశంసించాడు. తన బ్యాటింగ్ మరియు కెప్టెన్సీ మెరుగుపడటానికి విరాట్