
Team India : క్రికెట్ ప్రేమికులను రెండు నెలల పాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ లీగ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ అజేయంగా 75 పరుగులు చేసి ఆర్‌సీబీని గెలిపించి తన సత్తా చాటాడు. అయితే ఐపీఎల్ వినోదం ముగియడంతో ఇక ఫ్యాన్స్ అందరి కళ్ళు అంతర్జాతీయ క్రికెట్‌పై పడ్డాయి. గత మార్చి నెలలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో బిజీగా ఉండటం వల్ల ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ ముగియడంతో వారం తిరక్కుండానే జూన్ 6 నుంచి భారత జట్టు మళ్లీ రంగంలోకి దిగుతోంది. రాబోయే రోజుల్లో భారత్ ఆడబోయే నెక్స్ట్ సిరీస్‌ల కంప్లీట్ వివరాలు, ఫుల్ షెడ్యూల్ ఇప్పుడు వివరంగా చూద్దాం. అఫ్గానిస్తాన్‌తో తొలి పోరు.. న్యూ చండీగఢ్‌లో వేదిక ఐపీఎల్ ముగిసిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్లతో కూడిన టీమిండియా జూన్ 6 నుంచి మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. దీనికి న్యూ చండీగఢ్ వేదిక కానుంది. జూన్ 6 నుంచి జూన్ 10 వరకు భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఒకే ఒక్క చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే జూన్ 13 నుంచి జూన్ 20 వరకు ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగబోతోంది. ఈ సిరీస్‌తో భారత్ లాంగ్ ఇంటర్నేషనల్ సీజన్‌కు శ్రీకారం చుట్టనుంది. అఫ్గానిస్తాన్ సిరీస్ పూర్తి కాగానే టీమ్ ఇండియా విదేశీ పర్యటనలకు బయలుదేరుతుంది.