
May 25 2026 7:45 PM | Updated on May 25 2026 7:45 PM A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) A post shared by Bindu Madhavi (@bindu_madhavii) A post shared by Shiva Jyothi (@iam.savithri) గ...
Latest updates from Telugu Digital news sources.

May 25 2026 7:45 PM | Updated on May 25 2026 7:45 PM A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) A post shared by Bindu Madhavi (@bindu_madhavii) A post shared by Shiva Jyothi (@iam.savithri) గ...

Arshdeep Singh Instagram Posts Deleted: భారత క్రికెట్ జట్టు యువ పేసర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జరిగిన ఒక ఊహించని పరిణామం ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైదానంలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ ఎంతో చురుగ్గా ఉంటూ అభిమానులను అలరించే ఈ స్పీడ్‌స్టర్, తాజాగా తన ఖాతా నుంచి ఏకంగా 200కు పైగా పోస్టులను తొలగించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. క్రికెట్ ప్రపంచంలో అర్ష్‌దీప్ సింగ్ ఆటతీరుతో పాటు ఆయన చేసే వినోదాత్మక వీడియోలకు, రీల్స్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. తీరిక సమయం దొరికినప్పుడల్లా తోటి ఆటగాళ్లతో కలిసి సరదాగా వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. అయితే, తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీని పూర్తిగా ప్రక్షాళన చేశాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో కేవలం 44 పోస్టులు మాత్రమే మిగిలాయి. అందులోనూ ఎక్కువ భాగం వివిధ వ్యాపార ప్రకటనలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇది కూడా చదవండి: IPL 2026 Winner: ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే: రికీ పాంటింగ్ గత ఏడాది డిసెంబర్ నెలలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి అర్ష్‌దీప్ చేసిన ఒక ప్రత్యేక వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. దాదాపు 15 మిలియన్లకు పైగా వీక్షణలు (వ్యూస్) సాధించిన ఆ అరుదైన వీడియోను సైతం అర్ష్‌దీప్ ఇప్పుడు తొలగించాడు. దీంతో ఆరాధ్య ఆటగాడికి అసలు ఏమైంది? ఎందుకిలా పాత జ్ఞాపకాలన్నింటినీ చెరిపేస్తున్నాడంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అర్ష్‌దీప్ సోషల్ మీడియాలో ఏ

Facebook: టెక్ దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకటనల ఆదాయంపై దీర్ఘకాలంగా ఆధారపడటాన్ని అధిగమించి, తమ ఆదాయ మార్గాలను విస్తరించుకునేందుకు టెక్ దిగ్గజం మెటా తన ప్రధాన యాప్‌ల కోసం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించింది. నివేదికల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ , ఫేస్‌బుక్ ప్లస్ ధర నెలకు 3.99 డాలర్లు కాగా, వాట్సాప్ ప్లస్ ధర నెలకు 2.99 డాలర్లుగా ఉంటుంది. మెటా ఎట్టకేలకు తన ప్రకటనల ఆధారిత వ్యాపార నమూనాని దాటి ముందుకు వస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఆ కంపెనీకి ఒక పెద్ద మార్పు కావచ్చు. ఈ టెక్ దిగ్గజం తన అతిపెద్ద ప్లాట్‌ఫామ్స్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల కోసం అధికారికంగా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ప్రతి నెలా అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారుల కోసం ప్రీమియం స్థాయి ఫీచర్లను జోడించింది. మెటా ప్రొడక్ట్ హెడ్ నవోమి గ్లీట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ ప్రకటన చేశారు. ఫేస్‌బుక్ ప్లస్, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, వాట్సాప్ ప్లస్‌ల ప్రారంభాన్ని ధృవీకరించడంతో పాటు, భవిష్యత్తులో ముఖ్యంగా క్రియేటర్లు, వ్యాపారాలు, ఏఐ-ఆధారిత సాధనాల కోసం మెటా మరిన్ని సబ్‌స్క్రిప్షన్-ఆధారిత ఉత్పత్తులను ప్లాన్ చేస్తోందని కూడా ఆమె సూచించారు. నివేదికల ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్‌లకు నెలకు 3.99 డాలర్లు ఖర్చవుతుంది. ఇది భారత్ లో సుమారుగా నెలకు 340 రూపాయలకి సమానం. అదే సమయంలో వాట్సాప్ ప్లస్ ధర నెలకు 2.99 డాలర్లు. ఇండియాలో ఇది సుమారుగా 255 రూపాయలకి సమానం. అయితే, దీని అర్థం సాధారణ యాప్స్ త్వరలో మాయం అవుతాయని కాదు. ఉచిత వెర్షన్స్ కొనసాగుతాయి. ఈ కొత్త చెల్లింపు ప్లాన్స్, మరికొంత

Arshdeep Singh Deletes Instagram Posts: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) దారుణ ప్రదర్శన చేసింది. మొదటి 7 మ్యాచ్‌లలో అపజయమే లేని పీబీకేఎస్ ఆపై వరుస ఓటములను ఎదుర్కొని.. లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న పంజాబ్ జట్టుపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీబీకేఎస్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ కేవలం 14 వికెట్లు మాత్రమే తీసుకోగా.. ఎకానమీ రేట్ 10కు పైగానే నమోదైంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అర్ష్‌దీప్ సోషల్ మీడియాలో చేసిన ఓ పని అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టులను తొలగించాడు. కొన్ని రోజుల క్రితం వరకు అతడి అకౌంట్‌లో పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండగా.. ప్రస్తుతం కేవలం 44 పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి చేసిన వైరల్ రీల్ కూడా కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గత ఏడాది డిసెంబర్‌లో అర్ష్‌దీప్, కోహ్లీ కలిసి చేసిన సరదా వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ రీల్‌కు 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ వీడియోలో అర్ష్‌దీప్.. ‘పాజీ, టార్గెట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటే సెంచరీ ఖాయంగా వచ్చేది’ అంటూ కోహ్లీతో సరదాగా అన్నాడు. దీనికి కోహ్లీ నవ్వుతూ.. ‘టాస్ మేం గెలవడం నీ అదృష్టం. లేదంటే డ్యూ పరిస్థితుల్లో నిన్ను కూడా బాగా కొట్టేవాళ్లు’ అంటూ చమత్కరించాడు. ఈ సరదా సంభాషణ అప్పట్లో నెట్టింట బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ వీడియోతో పాటు పలు

ఫొటో–షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ‘ఇన్‌స్టంట్స్’ అనే కొత్త ఫీచర్‌ని ప్రారంభించింది. ‘ఆ క్షణంలో తీసిన ఫొటోలను, ఫిల్టర్ చేయని, సహజమైన ఫొటోల రూపంలో స్నేహితులతో షేర్ చేసుకోవడానికి కొత్త మార్గం’ అని ‘ఇన్‌స్టంట్స్’ గురించి అభివర్ణించింది ఇన్‌స్టాగ్రామ్. యాప్ ఇన్‌బాక్స్ ద్వారా నేరుగా తాత్కాలిక ఫొటోలను పంపడానికి యూజర్‌లను ఈ ఫీచర్ అనుమతిస్తుంది. సాధారణ, రోజువారీ ఫొటోలు మీ స్నేహితులు చూడడానికి ఇది ఒక కొత్త మార్గం. వారు చూసిన తరువాత ఫొటోలు మాయమైపోతాయి. ఇన్‌స్టంట్స్ మీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్ బాటమ్ రైట్ కార్నర్‌లో ఉంటుంది. కెమెరాపై టాప్ చేయడం ద్వారా ఫ్రెండ్స్, మ్యూచువల్స్ (మీరు ఫాలో అయ్యే ఫాలోవర్స్) ఫొటోలను షేర్ చేసుకోవచ్చు. ‘ఇన్‌స్టంట్స్’ని నచ్చిన వారితో పాటు నచ్చనివారు కూడా ఉన్నారు. నచ్చకపోతే... ‘ఇన్‌స్టంట్స్’ను టర్న్ ఆఫ్ చేయడానికి... ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్స్‌లోకి వెళ్లాలి. టాప్ రైట్ కార్నర్‌లోని 3 లైన్స్‌పై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్’ ఓపెన్ చేయాలి. ‘హైడ్ ఇన్‌స్టంట్స్ ఇన్ ఇన్‌బాక్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. ‘హైడ్ ఇన్‌స్టంట్స్ ఇన్ బాక్స్’ టర్న్ ఆఫ్ చేయడం ద్వారా ఇన్‌బాక్స్ నుంచి ఇన్‌స్టంట్స్ తొలగించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ క్యారెసెల్.. ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్‌ని తీసుకువచ్చింది. దీని ద్వారా క్యారెసెల్స్ క్రియేట్ చేయవచ్చు. వాటికి మ్యూజిక్ యాడ్ చేయవచ్చు. ఇమేజ్ ఎడిట్ చేయవచ్చు. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఈ కొత్త ఫీచర్ ‘ఫీడ్’ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుంది. ఎలా చేయాలంటే... ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ లెఫ్ట్ కార్నర్‌లోని ‘ప్లస్’ ఐకాన్ క్లిక్ చేయాలి. మినిమమ్ రెండు పిక్చర్‌లను సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఎడిటింగ్ టూల్స్ కనిపిస్తాయి. మీ చిత్రాలు నిలువుగా (పోర్ట్రెయిట్) చతురస్రాకారంలో ఉండడానికి అవసరమైన టూల్స్ ఎంచుకోవచ్చు. ఫొటోలను ఓవర్‌లే చేయవచ్చు. టెక్ట్స్,

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కొంతకాలంగా బాలీవుడ్ సెలబ్రిటీలను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కావడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan johar)కొంతకాలంగా బాలీవుడ్ సెలబ్రిటీలను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కావడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! దీంతో సోషల్ మీడియాలో రకరకాలు రూమార్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఆయా హీరోలు, హీరోయిన్‌లు, మేకర్స్‌తో కరణ్‌కు చెడిందని, ఇతర వ్యాపార లావాదేవీలు అందుకు కారణమని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. కొంతకాలంగా ఆయన షారుక్‌ఖాన్, అనన్యాపాండే, అలియాభట్ వంటి స్టార్‌లను ఫాలో కావడం లేదు. తాజాగా దీనిపై కరణ్ క్లారిటీ ఇచ్చారు. ‘సినీ సెలబ్రిటీలను అన్‌ఫాలో చేయడం నేషనల్ న్యూస్‌గా మార్చాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒకరిని ఫాలో కాకపోవడం, కావడం అనేది పెద్ద వార్తేమీ కాదు. దీనిని సోషల్ మీడియా పెద్దది చేసి చూపిస్తుంది. ఇది కేవలం డిజిటల్ డిటాక్స్ మాత్రమే. ఈ మధ్యన నేను ఇన్‌స్టా మీద ఎక్కువ సమయం గడుపుతున్నా. దాంతో నా విలువైన సమయం చాలా వేస్ట్ అవుతుందని గ్రహించా. దీనిని తగ్గించుకోవడానికి చాలామందిని అన్‌ఫాలో చేశా. ఇదేమీ పెద్ద న్యూస్ కాదు. దయచేసి మీ క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం సంచలనంగా మార్చవద్దు. మీకు వ్యూవర్‌షిప్ కావాలంటే ఇంకేదైనా చేసుకోండి. ఇది మీకు అనవసరమైన విషయం’ అని అన్నారు. ప్రస్తుతం కరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కేవలం 48 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రాతోపాటు పలు నిర్మాణ సంస్థలు, సేవా సంస్థలు ఉన్నారు.