translateexpand_more

Bhuvneshwar Kumar News

Latest updates from Telugu Digital news sources.

Eenadu30 May, 03:15 pm
ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL) 2026 ఫైనల్‌ మ్యాచ్‌.. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా ఆర్సీబీ (Royal Challengers Bengaluru), గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించడం తమ బౌలర్ల చేతుల్లోనే ఉందని కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) అన్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజత్‌ పాటిదార్‌ మాట్లాడాడు. ‘పోటీలో నెగ్గాలంటే.. చక్కటి బౌలింగ్‌ ఎటాక్‌ ఉండాలి. ఈ పిచ్‌పై 200, 220 పరుగులు చేయడం తేలిక. కానీ ఆ స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోవడం కష్టం. అందుకే బౌలింగ్‌ దళం సత్తా చాటాలి’ అని పాటిదార్ అన్నాడు. అలాగే భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌ను అతడు కొనియాడాడు. ‘భువీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడు అనుభవమున్న బౌలర్‌. తుదిపోరులో బౌలింగ్‌ చేయడం బౌలర్లకు అంత తేలికైన విషయం కాదు. అతడికి తన ప్రణాళికలు, శక్తిసామర్థ్యాల మీద పూర్తి అవగాహన ఉంది. అదే కీలక పాత్ర పోషించనుంది’ అని రజత్‌ పాటిదార్‌ అన్నాడు. ‘టాప్‌ బౌలర్లైన భువీ, హేజిల్‌వుడ్‌కు ఇతర బౌలర్ల నుంచీ మద్దతు అవసరం. రసిఖ్‌ సలామ్‌ దార్‌ ఈ విషయంలో జట్టుకు సాయపడ్డాడు. ఇలా బౌలర్ల నుంచి సహాయ సహకారాలు అందడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీరు కేవలం ఒకరిద్దరు బౌలర్లతోనే పోటీలో గెలవలేరు. రసిఖ్‌ ఈ టోర్నమెంట్‌లో చక్కటి పాత్ర పోషించాడు. ప్రధాన బౌలర్ల మీద అదనపు భారం లేదు. జట్టంతా అద్భుతంగా ముందుకు సాగుతోంది’ అని పాటిదార్‌ వివరించాడు. అలాగే చేతివేలి గాయానికి గురైన ఫిల్‌సాల్ట్‌ పునరాగమనం గురించి కూడా అతడు మాట్లాడాడు. ‘ప్రస్తుతం అతడు నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అయితే తుది జట్టులో అతడికి చోటు

AP7AM31 May, 03:57 pm
గుజరాత్ 155/8... ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ఫైనల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు సత్తా చాటారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న తుదిపోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు. వాషింగ్టన్ సుందర్ (50*) ఒంటరి పోరాటంతో హాఫ్ సెంచరీ చేయడంతో, గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ మూడు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలోనే గుజరాత్ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపారు. ప్రమాదకర బ్యాటర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ కాగా, సాయి సుదర్శన్ (12) ను భువనేశ్వర్ కుమార్ వెనక్కి పంపాడు. దీంతో గుజరాత్ 26 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధు (20), జోస్ బట్లర్ (19) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, ఆర్సీబీ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు వేగంగా ఆడలేకపోయారు. రసిఖ్ సలాం, కృనాల్ పాండ్య వీరిద్దరినీ ఔట్ చేయడంతో గుజరాత్ స్కోరు బోర్డు నెమ్మదించింది. అర్షద్ ఖాన్ (6 బంతుల్లో 15) రెండు సిక్సర్లతో మెరుపులు మెరిపించినా ఎక్కువసేపు నిలవలేదు.ఒకవైపు వికెట్లు పడుతున్నా, వాషింగ్టన్ సుందర్ మాత్రం మరో ఎండ్‌లో ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరకు క్రీజులో నిలిచి

NTV Telugu31 May, 02:28 pm
నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్ కు చేరిన ఓపెనర్స్

ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ జట్టును ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తీశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ కెప్టెన్ నిర్ణయాన్ని నిజం చేస్తూ, బెంగళూరు పేసర్లు నిప్పలు చెరిగే బంతులతో గుజరాత్ ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. 3.4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. కీలక వికెట్లు పడగొట్టిన ఆర్‌సీబీ బౌలర్లు గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే బెంగళూరు బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను కట్టడి చేశారు. శుభ్‌మన్ గిల్ అవుట్: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 8 బంతుల్లో 2 ఫోర్ల సహాయంతో 10 పరుగులు చేసి జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. గిల్ అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోరు 22 పరుగులు. సాయి సుదర్శన్ అవుట్: ఆ తర్వాత కొద్దిసేపటికే నిలకడగా ఆడుతున్న మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా అవుట్ అయ్యాడు. సుదర్శన్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి, భువనేశ్వర్ కుమార్ వేసిన అద్భుతమైన బంతికి జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీనితో 26 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. క్రీజులో నిషాంత్ సింధు, జోస్ బట్లర్ ఓపెనర్లు ఇద్దరూ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం క్రీజులో నిషాంత్ సింధు (1 రన్), స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (0 రన్స్)

AP7AM31 May, 12:33 pm
కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్... భువీపై సచిన్ ప్రశంసలు

ఐపీఎల్ 2026 ఫైనల్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సీజన్‌లో భువీ విజయ రహస్యం 'వొబ్లీ సీమ్' బౌలింగేనని, ఈ కొత్త ఆయుధంతో అతను బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేస్తున్నాడని విశ్లేషించారు.ఈ సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్ చేరడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌లలో 26 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు సచిన్ తన 'ఎక్స్' ఖాతాలో విడుదల చేసిన వీడియోలో భువీ బౌలింగ్‌పై మాట్లాడారు. "ఈ సీజన్‌లో భువీ బౌలింగ్‌ను గమనిస్తే, అతను 'వొబ్లీ సీమ్' ఉపయోగిస్తున్నాడు. దానివల్ల బంతి లోపలికి వస్తుందో, బయటకు వెళుతుందో బ్యాటర్లు అంచనా వేయలేకపోతున్నారు. భువీ చేస్తున్నది అదే" అని సచిన్ వివరించారు.గతంలో భువీ ఎక్కువగా సంప్రదాయ స్వింగ్‌పై ఆధారపడేవాడని, కానీ ఇప్పుడు ఆ పద్ధతిని స్పృహతోనే మార్చుకున్నాడని సచిన్ అన్నారు. "గతంలో భువీ బంతిని ఎక్కువగా అవుట్ స్వింగ్ లేదా ఇన్ స్వింగ్ చేసేవాడు. కానీ ఇప్పుడు అతను సాధ్యమైనంత నిటారుగా బౌలింగ్ చేస్తున్నాడు. 'వొబ్లీ సీమ్' కారణంగా బంతి పిచ్‌పై పడ్డాక ఎలా కదులుతుందో చెప్పడం కష్టం. ఇదే ఈ సీజన్‌లో భువీ సక్సెస్ మంత్రం," అని టెండూల్కర్ తెలిపారు.భువనేశ్వర్ కచ్చితత్వాన్ని కూడా సచిన్ మెచ్చుకున్నారు. ఆఫ్-స్టంప్ లేదా నాలుగో స్టంప్ లైన్‌పై బౌలింగ్ చేస్తూ, అక్కడి నుంచి

Asianet News Telugu01 Jun, 09:40 am
రబాడ చేతికి పర్పుల్ క్యాప్.. హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న భువనేశ్వర్

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌తో పర్పుల్ క్యాప్ రేస్‌కు ఎండ్ కార్డ్ పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన గ్రాండ్ ఫైనల్‌లో ఈ సస్పెన్స్‌కు తెరపడింది. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ నిలిచాడు. దాంతో పర్పుల్ క్యాప్ రబాడ సొంతమైంది. కాగా, ఈ రేసులో సెకండ్ ప్లేస్‌లో నిలిచిన ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఒక హిస్టారికల్ రికార్డును క్రియేట్ చేసే గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌కంటే ముందే రబాడ ఖాతాలో 28 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భువి 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ సీజన్‌లో అతని టోటల్ వికెట్ల సంఖ్య 28కి చేరింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో గుజరాత్ బౌలింగ్‌కు వచ్చినప్పుడు కగిసో రబాడ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను అవుట్ చేయడం ద్వారా రబాడ ఈ సీజన్‌లో తన 29వ వికెట్ పూర్తి చేసుకున్నాడు. దీంతో భువీని దాటేసి రబాడ పర్పుల్ క్యాప్‌ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. క్వాలిఫైయర్-1 లో ఆర్సీబీ ఓడిపోవడం వల్ల రబాడకు ఒక ఎక్స్‌ట్రా మ్యాచ్ ఆడే అవకాశం లభించింది, అది అతనికి ప్లస్ అయింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలిచిన రికార్డ్ భువనేశ్వర్ కుమార్, డ్వేన్ బ్రావో, హర్షల్ పటేల్ పేరిట ఉంది. ఒకవేళ ఈ సీజన్‌లో భువి పర్పుల్ క్యాప్ గెలిచి

Eenadu01 Jun, 09:30 am
గాలి వాటం కాదు.. అది ఆర్సీబీ ప్రజ్ఞాపాటవం

ఏళ్లకు ఏళ్లు చకోర పక్షిలా నిరీక్షణ తప్పలేదు నిరుడు గెలిచినా.. తొక్కిసలాట ఘటన మిగిల్చిన చేదు అనుభవం తప్పలేదు.. 17 ఏళ్ల తర్వాత గతేడాది తొలిసారి టైటిల్‌ దక్కినా.. తనివితీరా సంబరాలు చేసుకోలేని పరిస్థితి! ఆ లోటును పూడ్చుకోవడం కోసమేనా అన్నట్లు ఆ జట్టు మరోసారి ఐపీఎల్‌ కప్పును ముద్దాడింది తమ విజయం గాలి వాటం కాదని.. అది తమ ఆటగాళ్ల ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనమని.. నలు చెరుగులా చాటి చెప్పింది.. ఆ జట్టే.. ఆర్సీబీ.. ఐపీఎల్‌ 2026లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సత్తా చాటింది. ప్లేఆఫ్స్‌నకు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అలాగే, క్వాలిఫయర్‌ -1లో గుజరాత్‌ టైటాన్స్‌పై పైచేయి సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో అదే జట్టును మరోసారి మట్టికరిపించి.. అ‘ద్వితీయం’గా కప్పును సొంతం చేసుకుంది. ఆర్సీబీ జట్టు కూర్పు అదిరిపోయింది. బ్యాటర్లు, బౌలర్ల సమతూకంగా ఉంది. విరాట్‌ కోహ్లీ, వెంకటేశ్‌ అయ్యర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటీదార్‌, జితేశ్‌ శర్మ, టిమ్‌ డేవిడ్‌, కృనాల్‌ పాండ్య ఇలా.. ఏడో స్థానం వరకు లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. జోష్‌ హేజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జాకబ్‌ డఫీ, రొమారియో షెఫర్డ్‌, రసిఖ్‌ సలామ్‌ దార్‌.. ఇలా బౌలింగ్‌ దళమూ భేష్‌గా ఉంది. కృనాల్‌ పాండ్య రూపంలో చక్కటి ఆల్‌రౌండర్‌ కూడా ఉన్నాడు. దీంతో ఆ జట్టు కూర్పు అద్భుతంగా కుదిరింది. అందుకే ఫిల్‌ సాల్ట్‌ లాంటి స్టార్‌ బ్యాటర్‌ గాయంతో దూరమైనా.. ఆ ప్రభావం జట్టుపై పడలేదు. ఈ సీజన్‌లో ఆర్సీబీ తమ హోం గ్రౌండైన చిన్నస్వామి స్టేడియంలో లీగ్‌ స్టేజిలో కేవలం అయిదు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. మిగతా రెండు మ్యాచ్‌లను రాయ్‌పుర్‌లో ఆడింది. అయినప్పటికీ మెరుగ్గా రాణించి ఫ్లేఆఫ్స్‌నకు చేరుకున్న తొలి

AP7AM01 Jun, 09:57 am
ఆండీ 'ఫ్లవర్' అనుకుంటిరా... ఫైర్! ఆర్సీబీకి 2 టైటిళ్లు తెచ్చిన తెరవెనుక హీరో

 "ఈ సాలా కప్ నమదే"... ప్రతి ఐపీఎల్ సీజన్‌లో వినిపించే నినాదం. కానీ దశాబ్దానికి పైగా ఆ నినాదం మాటలకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు నిరాశే మిగిలింది. అలాంటి జట్టు ఇప్పుడు వరుసగా రెండుసార్లు (2025, 2026) ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిందంటే, దాని వెనుక ఉన్నది ఒకే ఒక్క పేరు... ఆండీ ఫ్లవర్! పేరులో 'ఫ్లవర్' (పువ్వు) ఉన్నా, అతను చేసింది మాత్రం పెను విధ్వంసం. ఆర్సీబీ తలరాతను మార్చేసిన నిశ్శబ్ద విప్లవకారుడు అతడు.ఆగస్టు 2023లో ఫ్లవర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి ఆర్సీబీ పరిస్థితి వేరు. వ్యక్తిగత ప్రతిభకు, స్టార్ డమ్‌కు ప్రాధాన్యత ఇచ్చే జట్టుగా పేరుంది. కాగితంపై బలంగా ఉన్నా మైదానంలో ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ సంస్కృతిని మార్చడమే ఫ్లవర్ తన మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాడు. స్టార్ ఆటగాళ్ల కన్నా, జట్టుగా గెలవడం ముఖ్యమని చాటిచెప్పాడు. టీమ్ స్ట్రక్చర్, సమష్టితత్వం, జట్టు సంస్కృతిపై దృష్టి సారించాడు.ఆయన మార్పులు మాటలతో కాదు, చేతలతో మొదలయ్యాయి. ఏళ్ల తరబడి ఆర్సీబీని వేధిస్తున్న బలహీనమైన బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేయడంపై దృష్టి పెట్టాడు. 2025 వేలానికి ముందు రూ.10.75 కోట్లకు అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకురావడం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ భువీ గత రెండు సీజన్లలో 45 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో, రసిఖ్

TV9 Telugu31 May, 01:35 am
ఆ ఒక్కటి జరిగితే కప్పు దే..! కానీ హోమ్ గ్రౌండ్ లో తప్పు చేస్తుందా

ఐపీఎల్‌ 2026 మెగా సమరానికి సర్వంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌ మొదలుకానుంది. రెండో టైటిల్‌ కోసం రెండు జట్లు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ రంకెలు వేస్తున్నాయి. మరి ఆ రెండో కప్పు ఎవరికి దక్కుతుందో ఈ రోజు తేలిపోనుంది. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే కప్పు కొట్టిన టీమ్‌ గుజరాత్‌ అయితే, 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పును ముద్దాడిన టీమ్‌ ఆర్సీబీ. అలాంటి జట్ల మధ్య జరిగే ఈ పోరు కచ్చితంగా హోరాహోరీగా సాగనుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో తొలి క్వాలిఫైయర్‌లో ఈ రెండు టీమ్స్‌ పోటీ పడగా ఆర్సీబీ విజయం సాధించి నేరుగా ఫైనల్‌గా దూసుకెళ్లింది. మరోవైపు గుజరాత్‌ తొలి క్వాలిఫైయర్‌లో ఓడి గాయపడ్డ సింహాంలా రెండో క్వాలిఫైయర్‌లో ఆర్‌ఆర్‌ను చిత్తుచేసి మరోసారి ఆర్సీబీతో ఫైట్‌కు రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీనే హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పైగా ఆ జట్టు ఒక్క విషయంలో మాత్రం గట్టి నమ్మకంగా ఉంది. అదేంటంటే.. గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్లలో టాప్‌3ని వీలైనంత త్వరగా అవుట్‌ చేయగలిగితే కప్పు తమదే అనే ధీమాతో ఉంది. నిజానికి ఈ విషయాన్ని తొలి క్వాలిఫైయర్‌లోనే చేసి చూపింది. గుజరాత్‌ బలం మొత్తం ఓపెనర్లు సాయి సుదర్శన్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జోష్‌ బట్లర్‌తోనే ఉంది. ఈ ముగ్గురు ఆడితేనే గుజరాత్‌ గెలుస్తుంది. వీరు విఫలం అయితే గుజరాత్‌కు ఓటమి ఖాయంలా కనిపిస్తోంది. తొలి క్వాలిఫైయర్‌లో అదే జరిగింది. ఆర్సీబీ బౌలర్లు చెలరేగి పవర్‌ప్లేలోనే వీరిని పెవిలియన్‌ చేర్చడంతో చాలా ఈజీగా మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ చేస్తే

NTV Telugu31 May, 08:36 am
రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా

RCB vs GT Pace Bowling Battle Worth RS 68.75 Crore: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ సీజన్ మొత్తం బ్యాటర్ల హవా కొనసాగినా.. ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని మాత్రం రెండు జట్ల పేస్ బౌలింగ్ దళాలే నిర్ణయించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2026 ఫైనల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న అంశం రెండు జట్ల పేస్ బౌలింగ్ యూనిట్ల మధ్య జరిగే పోరు. మహ్మద్ సిరాజ్ (రూ.12.25 కోట్లు), కగిసో రబాడా (రూ.10.75 కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (రూ.9.5 కోట్లు)తో గుజరాత్ టైటాన్స్ బలమైన పేస్ దాడిని కలిగి ఉంది. వీరితో పాటు ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ (రూ.7 కోట్లు) కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ (రూ.12.5 కోట్లు) జట్టుకు బలంగా నిలిచారు. యువ పేసర్ రసిఖ్ సలామ్ దార్ (రూ.6 కోట్లు) ఈ సీజన్‌లో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ కీలక పేసర్ల మొత్తం విలువ రూ.68.75 కోట్లకు చేరడం విశేషం. ఫైనల్‌లో మరో ఆసక్తికర అంశం పర్పుల్ క్యాప్ రేసు. ప్రస్తుతం 28 వికెట్లతో కగిసో రబాడా అగ్రస్థానంలో ఉండగా.. 26 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ 18 వికెట్లు, జేసన్ హోల్డర్ 17 వికెట్లతో టాప్ బౌలర్ల జాబితాలో కొనసాగుతున్నారు. రసిఖ్ సలామ్ 16 వికెట్లతో బ్రేక్‌త్రూ సీజన్‌ను నమోదు చేశాడు.

AP7AM31 May, 05:47 am
పేసర్ల వార్ .. ఐపీఎల్ ఫైనల్ విజేతను తేల్చేది ఇదే

ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించిన ఈ సీజన్‌లో తమ పటిష్ఠ‌మైన బౌలింగ్ ప్రదర్శనలతో రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు జరిగే టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి. ఈ మెగా ఫైనల్‌లో ఇరు జట్ల పేస్ బౌలింగ్ దళాల మధ్య జరిగే పోరే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.ఈ ఫైనల్ కేవలం టైటిల్ పోరు మాత్రమే కాదు, పర్పుల్ క్యాప్ కోసం ఇద్దరు స్టార్ పేసర్ల మధ్య జరిగే ఆసక్తికర సమరం కూడా. ప్రస్తుతం 28 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ బౌలర్ కగిసో రబడా, 26 వికెట్లతో అతడి వెనుకే ఉన్న ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ మధ్య ఈ పోటీ నెలకొంది. అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండటంతో ఈ సమరం మరింత ఆసక్తికరంగా మారింది. బ్యాటర్లకు స్వర్గధామంగా మారిన ఈ సీజన్‌లో బౌలింగ్‌నే నమ్ముకుని ఫైనల్ చేరడం ఈ రెండు జట్ల ప్రత్యేకత.గుజరాత్ టైటాన్స్ జట్టులో అనుభవం, యువత కలగలిసిన పటిష్ఠ‌మైన పేస్ దళం ఉంది. కగిసో రబడా (రూ. 10.75 కోట్లు), మహమ్మద్ సిరాజ్ (రూ. 12.25 కోట్లు), ప్రసిధ్ కృష్ణ (రూ. 9.5 కోట్లు) వంటి స్టార్లతో పాటు ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ (రూ. 7 కోట్లు) జట్టుకు అదనపు బలం. ఈ సీజన్‌లో సిరాజ్ 18, హోల్డర్ 17 వికెట్లు పడగొట్టి

TV9 Telugu29 May, 01:40 am
విరాట్ కోహ్లీ ముసలోడు.. నేను ఇంకా యంగ్.. ఐపీఎల్ ఫైనల్ కు ముందు భువి షాకింగ్ కామెంట్స్

Video : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపునకు వస్తున్న వేళ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఆర్‌సీబీ ఈ రేంజ్ సక్సెస్ సాధించడంలో బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా ప్రాణం పెట్టి ఆడారు. ముఖ్యంగా టీమిండియా సీనియర్ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లో ఆర్‌సీబీ తరఫున నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను వణికించాడు. అయితే, ఐపీఎల్ ఫైనల్ మహాసంగ్రామానికి ముందు భువనేశ్వర్ కుమార్ తన తోటి ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కోహ్లీని ముసలోడు అంటూ భువి కామెంట్ చేయడంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ సోషల్ మీడియా హ్యాండిల్ విడుదల చేసిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ వీడియోలో భువనేశ్వర్ కుమార్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ టాక్ షోలో యాంకర్ భువిని ఒక ఫన్నీ ప్రశ్న అడిగాడు. “భువి.. అందరూ ఈ వయసులో కూడా నువ్వు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నావని పొగుడుతున్నారు కదా.. నీకేమైనా ముసలితనం వచ్చేసినట్లు అనిపిస్తోందా?” అని యాంకర్ ప్రశ్నించాడు. దానికి భువి నవ్వుతూ “అస్సలు లేదు.. నేను ఇంకా ముసలాడిని కాలేదు” అని సమాధానమిచ్చాడు. యాంకర్ అంతటితో వదలకుండా.. “కానీ నువ్వు, విరాట్ కోహ్లీ ఒకే వయసు వాళ్లు కదా భయ్యా?” అంటూ మరో ప్రశ్న వేశాడు. దానికి భువనేశ్వర్ కుమార్ కౌంటర్ ఇస్తూ.. “అవును, మేమిద్దరం ఒకే వయసు వాళ్లమే.. కానీ బహుశా విరాట్ కోహ్లీకి ముసలితనం వచ్చేసిందేమో, నాకైతే ఇంకా రాలేదు!” అని చాలా సరదాగా నవ్వుతూ జవాబిచ్చాడు. ఈ ఇద్దరు

Eenadu27 May, 07:10 am
ఆర్సీబీ సక్సెస్ సీక్రెట్ ఇదే

ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. బెంగళూరు పేసర్ భువనేశ్వర్ సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. గుజరాత్‌తో క్వాలిఫయర్‌లో రెండు వికెట్లు పడగొట్టిన భువీ మ్యాచ్‌ అనంతరం మాట్లాడాడు. బ్యాటర్లను ఎలా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవాలి, ఏవిధంగా క్లీన్‌బౌల్డ్ చేయాలనే తమ బౌలింగ్ ప్రణాళికల గురించి వివరించాడు. తమ విజయంలో డేటా (గణాంకాలు) ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలిపాడు. ‘‘తెర వెనుక జరిగిన ప్రణాళికకు చాలావరకు ఘనత దక్కుతుంది. మేం (నేను, జోష్ హేజిల్‌వుడ్) మా అనుభవాన్ని రంగరించాం. సపోర్టింగ్ స్టాఫ్‌ అందిస్తున్న సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. మేం డేటా (గణాంకాల) ఆధారంగా పనిచేస్తాం. ఆటగాళ్లు ఏదైనా కొత్త పద్ధతులను అనుసరిస్తుంటే వాటిని నిశితంగా పరిశీలిస్తాం. అయితే, కేవలం గణాంకాల పైనే 100 శాతం ఆధారపడం. కానీ, అవి మాకు కచ్చితంగా సహాయపడతాయి’’ అని భువీ పేర్కొన్నాడు. తన, జట్టు బౌలింగ్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. షార్ట్ లేదా ఫుల్లర్ బంతులు సంధిస్తే బౌండరీకి వెళ్తాయి. కానీ, మేం బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వారిని ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాం’’ అని భువనేశ్వర్ తెలిపాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర

Sakshi26 May, 07:02 am
వాళ్లిద్దరు తేలిపోతే ఆర్సీబీకి కష్టమే: సెహ్వాగ్‌

ఐపీఎల్‌-2026 ఫైనల్‌ తొలి బెర్తు కోసం రాయల్‌ చాలెంజర్స్‌ (ఆర్సీబీ)- గుజరాత్‌ టైటాన్స్‌ రేసులో నిలిచాయి. ఇరుజట్ల మధ్య మంగళవారం నాటి క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌కు ధర్మశాల వేదిక. హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో ఆర్సీబీ- గుజరాత్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. ఆర్సీబీకి కీలక సూచనలు కాగా ఈ మైదానం బౌండరీలు చిన్నగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ ఆర్సీబీకి కీలక సూచనలు చేశాడు. లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడ్డ ఆర్సీబీ.. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నాడు. ఆర్సీబీ బౌలింగ్‌ యూనిట్‌ కంటే బలంగా ప్రస్తుతం గుజరాత్‌ బౌలింగ్‌ విభాగం.. ఆర్సీబీ బౌలింగ్‌ యూనిట్‌ కంటే బలంగా కనిపిస్తోందని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, గత చేదు అనుభవాన్ని మరిచి ఆర్సీబీ బౌలర్లు క్వాలిఫయర్‌-1పై దృష్టి సారిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు. తేలిపోయిన భువీ, హాజిల్‌వుడ్‌ కాగా ఆర్సీబీ లీగ్‌ దశలో చివరగా సన్‌రైజర్స్‌తో తలపడి.. 55 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ప్రధాన పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ ఈ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. నాలుగు ఓవర్ల కోటాలో భువీ 51, హాజిల్‌వుడ్‌ 55 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు. ఇక రసిఖ్‌ సలామ్‌ దర్‌ 52 పరుగులు ఇచ్చినప్పటికీ రెండు వికెట్లు తీయగలిగాడు. మిగిలిన వారిలో సూయశ్‌ శర్మ మూడు ఓవర్లలో 36 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీయగా.. కృనాల్‌ పాండ్యా రెండు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. ఇక రొమారియో షెఫర్డ్‌ మూడు ఓవర్లలో

AP7AM01 Jun, 02:36 pm
ఆర్సీబీ వరుస టైటిళ్ల రహస్యం ఇదే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలవడం వెనుక ఉన్న రహస్యాన్ని హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ వివరించాడు. 2025లో తొలి టైటిల్ గెలిచినప్పటి ఉద్విగ్నభరిత వాతావరణానికి, 2026లో టైటిల్‌ను నిలబెట్టుకున్నప్పటి నిలకడైన ప్రదర్శనకు మధ్య ఉన్న తేడాను ఫ్లవర్ విశ్లేషించాడు. ఈసారి జట్టులో ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఉండటమే తమ విజయానికి ప్రధాన కారణమని స్పష్టం చేశాడు. సోమవారం జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో ఫ్లవర్ మాట్లాడుతూ, 2024 సీజన్‌లో ఎదురైన కఠిన సవాళ్లే తమను బలోపేతం చేశాయని అన్నాడు."2025, 2026 టైటిల్ విజయాల మధ్య కచ్చితంగా తేడాలు ఉన్నాయి. అయితే నేను 2024 సీజన్‌ను కూడా గుర్తుచేసుకోవాలి. ఆ ఏడాది తొలి అర్ధభాగంలో ఎదురైన పరాజయాలు మాలో పట్టుదలను పెంచాయి. వ్యూహాత్మకంగా కొన్ని మార్పులు చేసుకోవడానికి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆ పరిస్థితులే కారణం" అని ఫ్లవర్ తెలిపాడు.ఫ్లవర్ ఇంకా వివరిస్తూ, "2025లో తొలిసారి టైటిల్ గెలిచాం. అయితే, ఆర్సీబీకి గతంలో టైటిల్ గెలిచిన అనుభవం లేకపోవడంతో ఆ సీజన్ లో చాలా ఒత్తిడి, అనిశ్చితి ఉండేవి. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఏడాది టైటిల్ గెలిచిన తర్వాత జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉండటం కోచింగ్ సిబ్బందిగా మా పనిని సులభతరం చేసింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లేటప్పుడు వారిలో కనిపించిన ఆ నమ్మకమే మమ్మల్ని గెలిపించింది" అని అన్నాడు.జట్టు సంస్కృతే విజయానికి

Samayam Telugu27 May, 06:18 am
లో ఇంత కాన్ఫిడెన్స్ లేదు.. లోకి వచ్చాకే సత్తా బయటకొచ్చిందన్న భువనేశ్వర్ కుమార్

రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వరరావు (మహేష్ గోనె) సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణ, స్పోర్ట్స్‌కు సంబంధించిన తాజా సమాచారం, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ముఖ్యంగా ఐపీఎల్, వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లో ప్రత్యేక వార్తలను కవర్ చేయడంలో మహేష్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో వెబ్ స్టోరీల కోసం కూడా పని చేశారు. మహేష్ గోనె.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఎస్‌జే) నుంచి జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి మీడియా సంస్థలో ఆరేళ్లపాటు పని చేశారు. సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఇక్కడే కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు చూడటం, పుస్తకాలు చదవడం ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు.... ఇంకా చదవండి