translateexpand_more

Royal Challengers Bengaluru Vs Gujarat Titans News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 01:14 pm
ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

ఐపీఎల్ ఫైనల్: ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ IPL 2026: అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరులో తలపడనున్నాయి. మరి సమీకరణాల ప్రకారం.. ఏ జట్టు గెలిచే అవకాశం ఉందంటే.. అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ-జీటీ ఫైనల్ పోరు

Samayam Telugu31 May, 03:11 am
ఆర్సీబీకి షాకిచ్చేలా గుజరాత్ పెద్ద ప్లాన్.. ఫైనల్ కోసం ఓడిపోయిన పిచ్ సిద్ధం

రెండు నెలలు పాటు సాగిన ఐపీఎల్ 2026 సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. లీగ్ స్టేజ్‌లు, ప్లే ఆఫ్స్‌లో నువ్వా నేనా అన్నట్టు తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ బరిలో నిలిచాయి. గుజరాత్ హోం గ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి షాకిచ్చేలా పెద్ద ప్లానే రెడీ చేశారు. ఐపీఎల్ 2026‌లో ఈ రెండు జట్లు మొత్తం మూడు మ్యాచ్‌లలో తపడ్డాయి. లీగ్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లలో బెంగళూరు ఆర్సీబీ, అహ్మదాబాద్‌లో గుజరాత్ ఘన విజయాలు సాధించాయి. ఫైనల్ బెర్త్ కోసం ఈ రెండు జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఫైనల్ మాత్రం అహ్మదాబాద్‌లో జరగనుండటం గుజరాత్‌కు కలిసొచ్చే అంశం. ఫైనల్ మ్యాచ్‌కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు షాకిచ్చేలా గుజరాత్ పెద్ద ప్లానే సిద్ధం చేసింది. లీగ్ స్టేజ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పిచ్‌నే ఇప్పుడు ఫైనల్‌కీ సిద్ధం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో లీగ్ మ్యాచ్ ఆడిన పిచ్ నెంబర్ 6నే ఫైనల్‌కూ సిద్ధం చేశారు. ఈ పిచ్‌పై ఆర్సీబీ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కేవలం 155 పరుగులకే ఆలౌట్ అయింది. అర్షద్ ఖాన్ మూడు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు, జేసన్ హోల్డర్ రెడు వికెట్లు తీసుకుని మ్యాచ్ విజయంలో కీలకంగా మారారు. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ బౌలింగ్‌కి సహకరించగా.. సెకండ్ బ్యాటింగ్ సమయంలో బ్యాటర్లకు కొంత అనుకూలంగా మారింది. దాంతో గుజరాత్ ఆ మ్యాచ్‌లో 15.5 ఓవర్లలోనే విజయం సాధించింది. మొత్తానికి ఈ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండే

TV9 Telugu31 May, 03:25 pm
నాడు ఔట్.. నేడు నాటౌట్.. ఫైనల్ మ్యాచ్ లో వివాదాస్పద క్యాచ్.. అంపైర్ నిర్ణయంతో మైదానంలో హైడ్రామా

Washington Sundar Not Out: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మహా సంగ్రామంలో ఊహించని వివాదం రేగింది. వాషింగ్టన్ సుందర్ అవుట్ చుట్టూ తిరిగిన ఒక హైడ్రామా మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. థర్డ్ అంపైర్ ఇచ్చిన వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. మైదానాన్ని ఊపేసిన క్యాచ్ వివాదం.. అసలేం జరిగింది? ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ. అలాంటి ఈ కీలక పోరులో గుజరాత్ బ్యాటర్లను దెబ్బకొట్టేందుకు బెంగళూరు జట్టు పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులతో ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టాలనే బెంగళూరు ప్రణాళిక అద్భుతంగా పాలుపంచుతోంది. ఇదే క్రమంలో జేకబ్ డఫీ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్ ఆఖరి బంతికి ఒక పెద్ద నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. డఫీ లెగ్ స్టంప్ వైపు వేగంగా విసిరిన షార్ట్ పిచ్ బంతిని, గుజరాత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాదాలని ప్రయత్నించాడు. కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జోర్డాన్ కాక్స్ గాల్లోకి దూకుతూ అద్భుతమైన డైవ్‌తో ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. అంపైర్ల తడబాటు.. ఊపిరి పీల్చుకున్న సుందర్.. జోర్డాన్ కాక్స్ క్యాచ్ పట్టగానే బెంగళూరు ఆటగాళ్లు ఆనందంతో గాల్లోకి లేచారు. వికెట్ పడిపోయిందనే సంబరాల్లో మునిగిపోయారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న అంపైర్ నితిన్ మీనన్‌కు క్యాచ్‌పై కొంత అనుమానం రావడంతో, బ్యాటర్ వాషింగ్టన్ సుందర్‌ను మైదానం వీడకుండా అక్కడే వేచి ఉండమని కోరారు. వెంటనే ఈ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ జయరామన్ మదనగోపాల్‌కు బదిలీ చేశారు. పెద్ద తెరపై పునరావృత దృశ్యాలను (రీప్లే) పరిశీలించినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

NTV Telugu31 May, 02:28 pm
నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్ కు చేరిన ఓపెనర్స్

ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ జట్టును ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తీశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ కెప్టెన్ నిర్ణయాన్ని నిజం చేస్తూ, బెంగళూరు పేసర్లు నిప్పలు చెరిగే బంతులతో గుజరాత్ ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. 3.4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. కీలక వికెట్లు పడగొట్టిన ఆర్‌సీబీ బౌలర్లు గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే బెంగళూరు బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను కట్టడి చేశారు. శుభ్‌మన్ గిల్ అవుట్: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 8 బంతుల్లో 2 ఫోర్ల సహాయంతో 10 పరుగులు చేసి జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. గిల్ అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోరు 22 పరుగులు. సాయి సుదర్శన్ అవుట్: ఆ తర్వాత కొద్దిసేపటికే నిలకడగా ఆడుతున్న మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా అవుట్ అయ్యాడు. సుదర్శన్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి, భువనేశ్వర్ కుమార్ వేసిన అద్భుతమైన బంతికి జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీనితో 26 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. క్రీజులో నిషాంత్ సింధు, జోస్ బట్లర్ ఓపెనర్లు ఇద్దరూ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం క్రీజులో నిషాంత్ సింధు (1 రన్), స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (0 రన్స్)

Samayam Telugu31 May, 04:00 pm
ఆర్సీబీ బౌలర్ల జోరు.. ఫైనల్ లో తక్కువ స్కోరుకే గుజరాత్ పరిమితం

ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌లో కట్టడి చేసింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అయితే ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది.ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ వరకూ వచ్చిందంటే.. అందుకు ప్రధాన కారణం టాప్-3 బ్యాటర్లు. గిల్, సుదర్శన్, బట్లర్ ఈ ముగ్గురిట్లో ఇద్దరు ఆడినా.. ఆ జట్టుకు విజయం ఖరారైంది. కానీ ఈ మ్యాచులో అది జరగలేదు. ఆర్సీబీ బౌలర్లు పవర్ ప్లే ముగిసే లోపే శుభ్‌మన్ గిల్ (10), సాయి సుదర్శన్ (12)ను పెవిలియన్ పంపించారు. జోస్ బట్లర్ (19) కూడా విఫలమయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌లో వెనకబడి పోయింది.కాగా ఈ మ్యాచులో గెలవాలన్నా.. రెండో ఐపీఎల్ టైటిల్ గెలవాలన్నా.. ఆర్సీబీ 156 పరుగులు చేయాల్సి ఉంది. ఈ రెండు జట్ల మధ్య లీగ్ స్టేజ్‌లో ఇక్కడే జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. సరిగ్గా ఇన్నే పరుగులు చేసింది. ఆ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ సునాయసంగా గెలిచింది. మరి ఈ మ్యాచులో ఎలాంటి ఫలితం వస్తుందో తేలాల్సి ఉంది.ఈ సమయంలో వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతంగా ఆడాడు. 37 బంతుల్లో 50 రన్స్ స్కోరు చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ స్కోరు 150 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో 155 రన్స్ చేసింది. నిషాంత్ సింధు 18 బంతుల్లో 20 రన్స్ చేసి.. ఈ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఆర్సీబీ

Samayam Telugu31 May, 04:38 pm
ఆర్సీబీ టార్గెట్ 156 రన్స్.. ఐపీఎల్ ఫైనల్ లో డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోర్లు ఎంతో తెలుసా

ఐపీఎల్ 2026లో ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు 156 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. విధ్వంసకర బ్యాటింగ్ యూనిట్ ఉన్న ఆర్సీబీకి.. ఇది తక్కువ స్కోరే అన్నట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచులో టాప్-3 బ్యాటర్లు తక్కువ స్కోరు చేయడంతో గుజరాత్ టైటాన్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. గత మ్యాచులో 160 రన్స్‌కు పైగా గుజరాత్ ఓపెనర్లు భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ ఈ మ్యాచ్‌లో సీన్ రివర్స్ అయింది. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ బ్యాటర్లు తేలిపోయారు.156 రన్స్ అనేది తక్కువ స్కోరులానే కనిపిస్తోంది. అయితే ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్‌లో ఓ జట్టు డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోరు ఎంత అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ 155 రన్స్ మాత్రమే చేయడంతో ఫైనల్‌లో ఓ జట్టు నిర్దేశించిన అత్యల్ప స్కోరు ఎంత అని తెలుసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యల్ప స్కోరు డిఫెండ్ చేసుకున్న జట్లు ఇవే..129/8 ముంబై ఇండియన్స్ vs రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, ఐపీఎల్ 2017143/6 దక్కన్ ఛార్జర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2009148/9 ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2013149/8 ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2019168/5 చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2010కాగా.. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. 2025లో ఛాంపియన్‌గా అవతరించింది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్‌గా మిగిలింది. ఐపీఎల్ 2026లోనూ వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి

Samayam Telugu31 May, 02:11 am
సమయం లేదు మిత్రమా సమరమే.. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్, ఎవరూ గెలిచినా చరిత్రే

ఐపీఎల్ 2026 అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లలో ఏదీ కూడా రెండు టైటిల్స్ సొంతం చేసుకోలేదు. దాంతో ఇవాళ గెలిచిన జట్టు చరిత్రలో నిలవబోతోంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. 2025లో ఛాంపియన్‌గా అవతరించింది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్‌గా మిగిలింది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచింది. 2002లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌ను అదే ఏడాది హార్దిక్ పాండ్యా ఛాంపియన్‌గా నిలపగా.. 2023లో మళ్లీ ఫైనల్‌కు వెళ్లి ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు మూడో సారి ఫైనల్ బరిలో నిలిచింది. ఈ ఐపీఎల్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ వేదికగానే జరగనుంది. దాంతో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాసాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, నిశాంత్ సింధూ, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ,

Samayam Telugu26 May, 04:22 pm
ధర్మశాలలో సిక్సర్ల సునామీ.. గుజరాత్‌కు చుక్కలు చూపించిన ఆర్సీబీ కెప్టెన్..!

క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ భారీ స్కోరు 5 వికెట్ల నష్టానికి 254 రన్స్ చేసిన ఆర్సీబీ జీటీకి చుక్కలు చూపించిన పటీదార్ రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన రవి కుమార్.. ఏపీ, తెలంగాణ వార్తలు, అంతర్జాతీయ కథనాలు, విశ్లేషణలతోపాటు స్పోర్ట్స్ న్యూస్ రాస్తున్నారు. సోషల్ మీడియా పట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం రవి కుమార్‌కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ ‘సజగ్’ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను రవి కుమార్ ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. రవి కుమార్ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. 2014 ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. 2019, 2024 ఎన్నికలకు ముందు పొలిటికల్ పోల్స్ నిర్వహించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, క్రికెట్ చూడటం, ప్రకృతిలో గడపడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Samayam Telugu26 May, 02:36 am
రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వరరావు (మహేష్ గోనె) సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఇక్కడ...

రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వరరావు (మహేష్ గోనె) సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణ, స్పోర్ట్స్‌కు సంబంధించిన తాజా సమాచారం, రాజకీయ వార్తలు...

Samayam Telugu27 May, 12:41 am
గుజరాత్ ను చితక్కొట్టి ఐదోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన ఆర్సీబీ

ఐపీఎల్ 2026 ఫైనల్ చేరిన ఆర్సీబీ క్వాలిఫయర్-1లో గుజరాత్‌ టైటాన్స్ చిత్తు ఐదోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన ఆర్సీబీ రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన రవి కుమార్.. ఏపీ, తెలంగాణ వార్తలు, అంతర్జాతీయ కథనాలు, విశ్లేషణలతోపాటు స్పోర్ట్స్ న్యూస్ రాస్తున్నారు. సోషల్ మీడియా పట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం రవి కుమార్‌కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ ‘సజగ్’ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను రవి కుమార్ ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. రవి కుమార్ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. 2014 ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. 2019, 2024 ఎన్నికలకు ముందు పొలిటికల్ పోల్స్ నిర్వహించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, క్రికెట్ చూడటం, ప్రకృతిలో గడపడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Samayam Telugu31 May, 01:53 pm
ఐపీఎల్ 2026లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. కీలక కామెంట్స్ చేసిన గిల్

ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. మరోవైపు తాము టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. తుది జట్టులో ఒక మార్పుతో గుజరాత్ బరిలోకి దిగుతోంది.ఇక ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. క్వాలిఫయర్ 1లో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ చిత్తుచిత్తుగా పరాజయం పాలైంది. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారనే తేలాల్సి ఉంది.మరోవైపు.. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. 2025లో ఛాంపియన్‌గా అవతరించింది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్‌గా మిగిలింది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచింది. 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌ను అదే ఏడాది హార్దిక్ పాండ్యా ఛాంపియన్‌గా నిలపగా.. 2023లో మళ్లీ ఫైనల్‌కు వెళ్లి ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు మూడో సారి ఫైనల్ బరిలో నిలిచింది.తుది జట్లు ఇవే..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిక్ సలామ్ దార్ఇంపాక్ట్

Samayam Telugu26 May, 03:47 pm
ఆర్సీబీని భయపెడుతున్న విచిత్రమైన రికార్డ్.. అదే జరిగితే ఫైనల్‌కు గుజరాత్..!

ఆర్సీబీని భయపెడుతున్న విచిత్రమైన రికార్డు రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన రవి కుమార్.. ఏపీ, తెలంగాణ వార్తలు, అంతర్జాతీయ కథనాలు, విశ్లేషణలతోపాటు స్పోర్ట్స్ న్యూస్ రాస్తున్నారు. సోషల్ మీడియా పట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం రవి కుమార్‌కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ ‘సజగ్’ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను రవి కుమార్ ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. రవి కుమార్ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. 2014 ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. 2019, 2024 ఎన్నికలకు ముందు పొలిటికల్ పోల్స్ నిర్వహించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, క్రికెట్ చూడటం, ప్రకృతిలో గడపడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Zee Telugu31 May, 01:33 pm
బెంగుళురు గుజరాత్ మ్యాచ్ అప్ డేట్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

IPL 2026 Final RCB Vs GT Live Score Updates: ఫైనల్ పోరులో టాస్ గెలిచి ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట ఇన్నింగ్స్ ఆరంభించనుంది. అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Royal Challengers Bengaluru vs Gujarat Titans Live Score Updates: ఐపీఎల్ 2026 సీజన్‌కు క్లైమాక్స్‌కు చేరింది. ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడుతున్నాయి. రెండు టీమ్‌లలో ఎవరు గెలిచినా.. రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలుస్తారు. క్వాలిఫైయర్‌-1 గెలిచి ఆర్‌సీబీ నేరుగా ఫైనల్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. క్వాలిఫైయర్‌-2లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్ తుది పోరుకు అర్హత సాధించింది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించి.. క్వాలిఫైయర్‌-1 ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు.. తమ ఫ్యాన్స్‌కు ట్రోఫీని గిఫ్ట్‌గా ఇవ్వాలని గుజరాత్ భావిస్తోంది. అద్భుతమైన ఆటతీరులో ఫైనల్‌కు చేరిన బెంగుళూరు.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించి వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలవాలని చూస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. RCB vs GT Live Score Updates కోసం ఇక్కడ ఫాలో చేయండి.

Samayam Telugu26 May, 02:05 pm
క్వాలిఫయర్-1లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీకి షాక్..!

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ సమరం షురూ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన రవి కుమార్.. ఏపీ, తెలంగాణ వార్తలు, అంతర్జాతీయ కథనాలు, విశ్లేషణలతోపాటు స్పోర్ట్స్ న్యూస్ రాస్తున్నారు. సోషల్ మీడియా పట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం రవి కుమార్‌కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ ‘సజగ్’ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను రవి కుమార్ ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. రవి కుమార్ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. 2014 ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. 2019, 2024 ఎన్నికలకు ముందు పొలిటికల్ పోల్స్ నిర్వహించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, క్రికెట్ చూడటం, ప్రకృతిలో గడపడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Royal Challengers Bengaluru Vs Gujarat Titans News Keyword | Telugu Digital