
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hyderabad Real Estate: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో భూముల మార్కెట్ విలువ పెంపును అమలు చేయనుంది. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల ప్రభుత్వ మార్కెట్ విలువలను భారీగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ మార్కెట్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ పెంపుదల కార్యక్రమం చేపట్టిందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ పెంపుదల వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఒక రకంగా బూస్ట్ అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ పెంపుదల కనీసం ఐదు శాతం నుంచి గరిష్టంగా 100శాతం వరకు ఉండేలా సీలింగ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భూములు ధరలు ఎక్కడెక్కడ ఎంత పెరుగుతున్నాయి..: హైదరాబాద్ పరిధిని 350 ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల మార్కెట్ ట్రెండ్ మరియు డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రేట్లను ఖరారు చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఎకరా కనిష్ట విలువ 1.75 లక్షల నుంచి 2.75 లక్షలకు పెరగనుంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ట విలువ 15 లక్షలకు, ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల సగానికి