translateexpand_more

Data Centers News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 12:43 pm
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు.ముంబైలోని వర్షా బంగ్లాలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. లోకేష్ ఆయనకు తిరుమల శ్రీవారి ప్రతిమ, మంగళగిరి శాలువా బహూకరించగా, ఫడ్నవీస్ గణేశుడి విగ్రహాన్ని అందజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక అంశాలు, ఏపీలో పెట్టుబడులు, వ్యాపార అనుకూల విధానాలు, విద్యా సంస్కరణలపై వారు చర్చించుకున్నారు.లోకేష్ తన ముంబై పర్యటనలో, ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో లోకేష్ సమావేశమై విశాఖపట్నం ప్రాధాన్యతను వివరించారు. వైజాగ్‌ను ఐటీ, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. విశాఖలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని ఎయిర్‌ట్రంక్‌ను లోకేష్ ప్రత్యేకంగా కోరారు.లోకేష్ ప్రజెంటేషన్, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎయిర్‌ట్రంక్ సీఈఓ సానుకూలంగా స్పందించారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఐటీ రంగంలోకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ ఈ పర్యటనలు చేపడుతున్నారు.

AP7AM01 Jun, 09:17 am
ఎయిర్ ట్రంక్ కు ఆహ్వానం.. విశాఖలో మరో భారీ పెట్టుబడిపై లోకేష్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత సంస్థ ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబయిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో 'ఎయిర్‌ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్'ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేష్ విజ్ఞప్తి చేశారు.ఈ భేటీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, "విశాఖపట్నం వేగంగా ఏఐ, డేటా హైపర్‌స్కేల్ హబ్‌గా ఆవిర్భవిస్తోంది. ఇప్పటికే గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీకనెక్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అన్ని విధాలా అనుకూలమైన నగరం. ఇక్కడ 6 గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పాలన్నది మా లక్ష్యం. మల్టీ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై మేం ప్రత్యేక దృష్టి సారించాం" అని వివరించారు. భారతదేశంలో మరే ఇతర ప్రాంతంలో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయని, డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్ కోసం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు కూడా సిద్ధంగా ఉన్నాయని లోకేష్ తెలిపారు.ఎయిర్‌ట్రంక్‌ను ఏపీకి తీసుకురావాలన్న ప్రయత్నాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తొలిసారి రాబిన్ ఖుదాతో సమావేశమై ఏపీ దార్శనికతను వివరించారు. ఆ తర్వాత ఎయిర్‌ట్రంక్ బృందం, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. అయితే, భారత్‌లో కార్యకలాపాలకు ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు