
ధర్మసాగర్ : పోరాటాల ఫలితమే తెలంగాణ స్వరాష్ట్ర సాధన అని పీఏసీఎస్ ఛైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రాజేశ్వర్ రెడ్డి, తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సదానందం, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అనిల్ కుమార్, పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీధర్ రావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆలపించారు. అనంతరం మండల ప్రజలకు అధికారులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ యాద కుమారస్వామి, సీఈవో రాజిరెడ్డి, ఎస్సైలు జానీ పాషా, రవీందర్ చారి, డీటీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.