translateexpand_more

Diamond Harbor Model News

Latest updates from Telugu Digital news sources.

AP7AM02 Jun, 03:08 am
టీఎంసీలో ముసలం.. ఐప్యాక్’ వల్లే ఓటమి అంటూ అభిషేక్ బెనర్జీపై సీనియర్ల ఫైర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘోర పరాజయం తర్వాత పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన నివాసం వద్ద నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. అభిషేక్ ఫొటో ముసుగు ధరించిన ఓ వ్యక్తి, తాను బొగ్గు, కార్లు దొంగిలించానని, సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు కారణమయ్యానంటూ నకిలీ ఒప్పుకోలు వాంగ్మూలం ఇచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పడం కలకలం రేపింది. ఒకప్పుడు టీఎంసీ విజయానికి బ్లూప్రింట్‌గా భావించిన అభిషేక్ 'డైమండ్ హార్బర్ మోడల్' కుప్పకూలడమే ఈ ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఫల్తా అసెంబ్లీ స్థానంలో అక్రమాల ఆరోపణలతో ఎన్నికల సంఘం రీ-పోలింగ్ ఆదేశించింది. దీంతో టీఎంసీ అభ్యర్థి, అభిషేక్ సన్నిహితుడైన జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఓటమిని అభిషేక్ పతనానికి సంకేతంగా భావిస్తున్నారు. దీని తర్వాత డైమండ్ హార్బర్ మున్సిపాలిటీకి చెందిన తొమ్మిది మంది టీఎంసీ కౌన్సిలర్లు అవినీతిని నిరసిస్తూ రాజీనామా చేయడం కలకలం రేపింది.టీఎంసీ ఓటమికి అభిషేక్ బెనర్జీ, ఆయన అతిగా ఆధారపడిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కారణమంటూ పలువురు సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఐప్యాక్ జోక్యంతో పార్టీలో కార్పొరేట్ సంస్కృతి పెరిగిపోయిందని, దశాబ్దాలుగా పనిచేస్తున్న క్షేత్రస్థాయి నేతలను పక్కన పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. 74 మంది సిట్టింగ్