translateexpand_more

West Bengal News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 03:08 pm
మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు

కోల్‌కతా: 'పోరాటమో.. మరణమో' తేల్చుకుంటామంటూ టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మంగళవారంనాడు కోల్‌కతాలో భారీ ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి రోడ్లపైకి వచ్చారు. పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయినప్పటికీ 80 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలను మమతా బెనర్జీ ఇటీవల సస్పెండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 78కి చేరింది. వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు... నయన దాస్ బెనర్జీ, మదన్ మిత్రా, ఫిర్హాద్ హకీమ్, బిమన్ బెనర్జీ, అశోక్ దేబ్, సోవన్‌దేబ్ చటోపాధ్యాయ్ మాత్రమే మమతా బెనర్జీ నిరసన దీక్షలో పాల్గొన్నారు. టీఎంసీకి పార్లమెంటు ఉభయసభల్లో 41 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఐదుగురు ఎంపీలు..డెరిక్ ఒబ్రెయిన్, సమీరుల్ ఇస్లామ్, దోలా సేన్, మాలా రాయ్, కల్యాణ్ బెనర్జీ మాత్రమే నిరసన వేదిక వద్ద కనిపించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన చాంద్రిమ భట్టాచార్య, అఖిల్ గిరి, తన్మయ్ ఘోస్‌లు పార్టీ అధినేత్రి పక్కనే నిరనన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంక్షోభంలో..?

కాగా, అభిషేక్ బెనర్జీపై దాడి అనంతరం మమతాబెనర్జీ నివాసంలో గత ఆదివారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో 80 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 20 మందే హాజరయ్యారు. దీంతో ఆ సమావేశం రద్దయింది. ఎంపీలపై దాడి నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేరంటూ పార్టీ వివరణ ఇచ్చింది. అయితే పార్టీలో పెరుగుతున్న విభేదాలు, అంసతృప్తులే మెజారిటీ ఎమ్మెల్యేల గైర్హాజరుకు కారణమని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు కోల్‌కతాలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో సమావేశం కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. తమదే అసలు పార్టీ అంటూ 'అస్లీ తృణమూల్' పేరిట కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. టీఎంసీ అధికారిక సమావేశానికి గైర్హాజరైన 60 మంది ఎమ్మెల్యేలలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు 'అస్లీ తృణమూల్' వైపు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. తాజాగా మమతా బెనర్జీ నిరసన దీక్షలో కేవలం వేళ్లపై లెక్కపెట్టుకునే సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ పరిణామం సైతం పార్టీ సంక్షోభం దిశగా పయనిస్తోందనే సంకేతాలనిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

10 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయనున్న డీకే.. కొలిక్కి వచ్చిన మంత్రివర్గ కూర్పు

అమిత్‌షాను కలిసిన అన్నామలై.. ఊపందుకున్న కొత్త పార్టీ ప్రచారం

AP7AM02 Jun, 03:08 am
టీఎంసీలో ముసలం.. ఐప్యాక్’ వల్లే ఓటమి అంటూ అభిషేక్ బెనర్జీపై సీనియర్ల ఫైర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘోర పరాజయం తర్వాత పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన నివాసం వద్ద నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. అభిషేక్ ఫొటో ముసుగు ధరించిన ఓ వ్యక్తి, తాను బొగ్గు, కార్లు దొంగిలించానని, సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు కారణమయ్యానంటూ నకిలీ ఒప్పుకోలు వాంగ్మూలం ఇచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పడం కలకలం రేపింది. ఒకప్పుడు టీఎంసీ విజయానికి బ్లూప్రింట్‌గా భావించిన అభిషేక్ 'డైమండ్ హార్బర్ మోడల్' కుప్పకూలడమే ఈ ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఫల్తా అసెంబ్లీ స్థానంలో అక్రమాల ఆరోపణలతో ఎన్నికల సంఘం రీ-పోలింగ్ ఆదేశించింది. దీంతో టీఎంసీ అభ్యర్థి, అభిషేక్ సన్నిహితుడైన జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఓటమిని అభిషేక్ పతనానికి సంకేతంగా భావిస్తున్నారు. దీని తర్వాత డైమండ్ హార్బర్ మున్సిపాలిటీకి చెందిన తొమ్మిది మంది టీఎంసీ కౌన్సిలర్లు అవినీతిని నిరసిస్తూ రాజీనామా చేయడం కలకలం రేపింది.టీఎంసీ ఓటమికి అభిషేక్ బెనర్జీ, ఆయన అతిగా ఆధారపడిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కారణమంటూ పలువురు సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఐప్యాక్ జోక్యంతో పార్టీలో కార్పొరేట్ సంస్కృతి పెరిగిపోయిందని, దశాబ్దాలుగా పనిచేస్తున్న క్షేత్రస్థాయి నేతలను పక్కన పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. 74 మంది సిట్టింగ్

Sakshi02 Jun, 01:50 am
బీజేపీ అంత సాహసం చేస్తుందా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను శాసించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ).. ఇప్పుడు తన అస్తిత్వానికే పోరాడుతోందా? వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు సంకేతాలు, వేటులు, పార్టీ అంతర్గత విభేదాలు, బీజేపీ ప్రభావం.. ఈ పరిణామాలన్నీ టీఎంసీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని కాపాడగలిగేది మమతా బెనర్జీ ఒక్కరేనా? లేదంటే టీఎంసీ ఆమె చేతుల్లో నుంచి కూడా జారిపోతుందా? అనే చర్చ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 294 స్థానాల్లో 208 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా.. టీఎంసీ కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. దాదాపు పదిహేనేళ్ల అధికారాన్ని కోల్పోయిన పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఫలితాల తర్వాతే టీఎంసీలో అసంతృప్తి బయటపడటం మొదలైంది. ఇటీవల మమతా నిర్వహించిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది హాజరుకాకపోవడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా చూపించింది. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడించింది. బహిరంగంగానే అంగీకారం పార్టీలో చీలిక తీసుకురావడానికి కుట్ర జరుగుతోందని మమతా బెనర్జీ స్వయంగా ఫేస్‌బుక్ లైవ్‌లో అంగీకరించారు. కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తెచ్చి పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “నాయకులు భయపడవచ్చు.. కానీ కార్యకర్తలు భయపడరు. కార్యకర్తలు ఉన్నంతకాలం నేను పార్టీని మళ్లీ నిర్మిస్తా” అని ఆమె ప్రకటించారు. అభిషేక్‌పై అసంతృప్తి? పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలిపై కూడా టీఎంసీ సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పాత తరం నాయకులను పక్కనపెట్టి కొత్త బృందానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు అధిక ప్రాధాన్యం కల్పించడం వల్ల మధ్యస్థాయి నాయకత్వం పార్టీకి దూరమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మంది నేతలు ఎన్నికల ఓటమికి ఐ-ప్యాక్ వ్యూహాలే కారణమని కూడా ఆరోపిస్తున్నారు. పార్టీ నుంచి నిష్క్రమణల పరంపర ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ పార్టీ పదవులకు రాజీనామా చేయడం పెద్ద చర్చకు దారితీసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు శంతను సేన్‌, సీనియర్ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తి కూడా పదవులు వీడారు. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, సినీ దర్శకుడు రాజ్ చక్రవర్తి, అసోం యూనిట్ మాజీ అధ్యక్షుడు అభిజిత్ మజుందార్ వంటి ప్రముఖులు పార్టీని పూర్తిగా విడిచిపెట్టారు. మరోవైపు వందకు పైగా కార్పొరేటర్లు కూడా టీఎంసీకి రాజీనామా చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎందుకు దూరమవుతున్నారు? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. టీఎంసీలో సిద్ధాంతపరమైన బలం ఎప్పటినుంచో బలహీనంగానే ఉంది. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను గెలుపు అవకాశాల కోసం పార్టీలోకి తీసుకువచ్చారు. వారు మమతా ఇమేజ్‌, టీఎంసీ బలంతో గెలిచినా.. పార్టీతో భావోద్వేగ అనుబంధం లేదంటే సిద్ధాంతపరమైన నిబద్ధత మాత్రం ఎక్కువగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత అలాంటి నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు వెతకడం సహజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ అంత సాహసం చేస్తుందా? టీఎంసీ నేతల్లో చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఎంసీలో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు ప్రత్యామ్నాయ రాజకీయ ఆశ్రయాల కోసం ప్రయత్నిస్తున్నారనే

Andhra Jyothy02 Jun, 01:46 am
కోల్ కతాలో మెస్సి విగ్రహం తొలగింపు.. ఎందుకంటే

ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా లేక్‌టౌన్ ప్రాంతంలో ఆరునెలల క్రితం స్వయంగా మెస్సినే వచ్చి ఈ విగ్రహావిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. ఈదురుగాలులకు విగ్రహం ఊగిపోతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

గతేడాది డిసెంబర్‌లో మెస్సి ‘గోట్ టూర్’ సందర్భంగా 27 రోజుల వ్యవధిలో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని చేతబట్టి ఉన్న మెస్సి విగ్రహం వీఐపీ రోడ్డు పక్కన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇటీవల బలమైన గాలులు వీచినప్పుడు విగ్రహం ఊగిపోతున్నట్లు స్థానికులు గమనించి ప్రజా పనుల శాఖ (PWD) అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పరిశీలన చేపట్టగా, విగ్రహ నిర్మాణ స్థిరత్వంలో లోపాలు ఉన్నట్లు తేలింది. ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో వెంటనే దానిని తొలగించాలని నిర్ణయించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే శరద్వాత్ ముఖర్జీ స్పందించారు. ‘మెస్సి విగ్రహం సురక్షితంగా లేదని గుర్తించాం. గాలులకు అది ఊగిపోతున్నట్లు కనిపించింది” అని తెలిపారు. అయితే ఈ విగ్రహాన్ని పూర్తిగా తొలగించడం లేదని.. మరో అనువైన ప్రదేశంలో మళ్లీ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ స్థలాల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.

అన్నీ వివాదాలే..

మెస్సి భారత పర్యటన నిర్వహణపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్’ ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్త, మాజీ క్రీడాశాఖ మంత్రి అరుప్ బిస్వాస్‌పై టికెట్ల దుర్వినియోగం, యాక్సెస్ కార్డుల జారీ విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు కోల్‌కతాలో మెస్సి కార్యక్రమం కూడా గందరగోళానికి దారితీసింది. భారీ ధరలకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానుల్లో పలువురు మెస్సిని దగ్గరగా చూడలేకపోయామని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బాటిళ్లు విసరడంతో పాటు స్టేడియంలోని గేట్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. మరికొందరు నిషేధిత ప్రాంతాల్లోకి చొరబడేందుకు యత్నించగా, టెంట్లు, గోల్‌పోస్టులు కూడా ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం

West Bengal News Keyword | Telugu Digital