translateexpand_more

Entry News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy23 May, 02:18 pm
రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయ్ టీవీకే

- Home » National » Tamil Nadu Vijay TVK Set For Rajya Sabha Entry AVR ABN , Publish Date - May 23 , 2026 | 07:48 PM తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే త్వరలో రాజ్యసభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవు... - రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 26 సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది. - ఇందులో తమిళనాడు కూడా ఉంది.

Sakshi27 May, 08:43 am
శ్రీనగర్ లో ఎనిమిదో ఏటా ఈద్ ప్రార్థనలకు నో ఎంట్రీ

శ్రీనగర్‌: శ్రీనగర్‌లోని చరిత్రాత్మక ఈద్గా, జమా మసీదులో ఈద్ ప్రార్థనలను నిర్వహించేందుకు స్థానిక అధికారులు ఈసారి కూడా అనుమతి నిరాకరించారు. వరుసగా ఎనిమిదో ఏడాది కూడా ఈ ఆంక్షలు కొనసాగాయి. మరోవైపు ఈద్ పండుగ రోజున తనను గృహ నిర్బంధం చేశారని మత పెద్ద మీర్వాజ్ ఉమర్ ఫరూక్ వెల్లడించారు. ప్రార్థనల కోసం బయటకు వెళ్లేందుకు కూడా అధికారులు అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటూ, గత ఎనిమిది ఏళ్లుగా కశ్మీరీ ముస్లింలు తమ సంప్రదాయబద్ధమైన ప్రార్థనా స్థలాలను వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బారికేడ్లు, తాళాలు.. ఆంక్షల నీడలో పండుగ పండుగ వేళల్లో ప్రార్థనల కంటే భద్రతాపరమైన ఆంక్షలే కనిపిస్తున్నాయని మీర్వాజ్ విమర్శించారు. మసీదుల ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడం, తాళాలు వేయడం ద్వారా ప్రజలను అడ్డుకోవడం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇది పరిపాలన కాదని, ప్రజల మతపరమైన హక్కులపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడిగా ఆయన అభివర్ణించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆంక్షల వల్ల కశ్మీర్‌లోని పిల్లలు, యువత పండుగలోని అసలైన ఆధ్యాత్మిక అనుభూతికి దూరమవుతున్నారని మీర్వాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈద్గా వంటి చారిత్రక ప్రదేశాల్లో సామూహిక ప్రార్థనల సంప్రదాయం కనుమరుగవుతుండటం బాధాకరమని అన్నారు. చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు) మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్ సొంత ఊరు జాతరలో స్టెప్పులు వేసిన దేవిశ్రీ ప్రసాద్ (ఫొటోలు) ఎలిమినేట‌ర్ పోరు.. నితీశ్ రెడ్డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ (ఫొటోలు) నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..? భగీరథ్ కు పోలీస్ కస్టడీ.. మూడు రోజులు సిట్ విచారణ

TeluguOne01 Jun, 12:29 pm
నాదెండ్ల వెన్నుపోటు.. చంద్రబాబు ఎంట్రీ.. తీగల వెల్లడించిన సంచలనా వాస్తవాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ స్థాపన, ఆనాటి రాజకీయ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వాస్తవాలు వెల్లడించారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఎన్టీఆర్ ప్రభంజనం, నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు, పార్టీలోకి చంద్రబాబు నాయుడు ఎంట్రీ తదితర అంశాలపై మాట్లాడారు. టిడిపి తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆర్థికంగా పుంజుకున్న విధానాన్ని ఆయన వివరించారు. 1983 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ చైతన్య రథంపై దిల్ సుఖ్ నగర్ వచ్చినప్పుడు తన తండ్రితో కలిసి తాను ఆయనను కలిశానని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో మలక్‌పేట నియోజకవర్గంలో టిడిపి ఓడిపోతుందని తాను ముందే చెప్పానని.. కానీ రాష్ట్రవ్యాప్తంగా 200 సీట్లు వస్తాయని అంచనా వేశానని పేర్కొన్నారు. తాను చెప్పినట్టుగానే సరిగ్గా 202 సీట్లతో ఎన్టీఆర్ ఘనవిజయం సాధించారని, ఆ నమ్మకంతోనే ఎన్టీఆర్ తనను ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు. అప్పుడు ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబుకు తన గురించి చెప్పి మలక్‌పేట ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించారని తీగల వివరించారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే నాదెండ్ల భాస్కరరావు సంక్షోభం సృష్టించినప్పుడు పార్టీలో తీవ్ర అల్లకల్లోలం నెలకొందని తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ క్లిష్ట సమయంలో తాను, మాజీ ఎమ్మెల్యే గోపాల్ సహా నలుగురు నేతలు ఎన్టీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమించామని చెప్పారు. ఆ సంక్షోభం ముగిసిన తర్వాత ఎన్టీఆర్ నమ్మకమైన

Entry News Keyword | Telugu Digital