
Food Facts: మాంసంలా కనిపించే ఈ ఫుడ్ అసలు మాంసం కాదు.. సోయా చంక్స్ ఎలా తయారవుతాయో తెలుసా?
ప్రస్తుతం చాలామంది శాకాహారులు ప్రోటీన్ కోసం సోయా చంక్స్‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. సోయా కర్రీ, సోయా ఫ్రై, సోయా బిర్యానీ వంటి ఎన్నో వంటకాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. ఉడికించిన తర్వాత ఇవి కొంతవరకు మాంసంలాంటి ఆకృతిని కలిగి ఉండటంతో కొందరికి అసలు ఇవి శాకాహారమా, మాంసాహారమా అనే సందేహం వస్తుంటుంది. ముఖ్యంగా తక్కువ ధరలో లభిస్తుండటంతో వీటిని ఎలా తయారు చేస్తారనే ఆసక్తి కూడా చాలామందిలో ఉంటుంది.



