translateexpand_more

Gold Price Update News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu03 Jun, 06:57 am
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ముదిరిన యుద్ధం..ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బంగారం, వెండి ధరలు

గోల్డ్, సిల్వర్ రేట్లు అనేవి ప్రపంచ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. అందుకే ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది నిపుణులు అంచనా వేస్తారు తప్ప...కచ్చితంగా చెప్పలేరు. పరిస్థితులు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి...రేపు పెరగొచ్చు, లేదా తగ్గొచ్చని చెప్తారు. సో కొనుగోలుదారులు కూడా ఎవరేం చెప్పినా గుడ్డిగా వినకుండా.....అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఇవాళ పొద్దుపొద్దున్నే...స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమవుతుందన్న వార్తలు రావడంతో బుల్ కుదేలైంది. సెన్సెక్స్ ఏకంగా 785 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పతనమైంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించింది. ఇవాళ 95. 55 పైసల వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ ఊగిసలాడిన పసిడి, సిల్వర్ ధరలు..కొనుగోలుదారులకు ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిన్నటి నుంచి మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. మరి ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయానికొస్తే...ఇవాళ కూడా స్థిరంగానే కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం తగ్గిన ధరలు...మళ్లీ అప్పటినుంచి యథావిధిగానే ఉన్నాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,43,200 వద్ద కొనసాగుతోంది. వెండి మార్కెట్ కూడా ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. మంగళవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. కిలో వెండి రూ.2,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశవ్యాప్తంగా కొంచెం ధరల్లో మార్పులు ఉన్నా...స్థిరంగానే ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య వైమానిక దాడులు ప్రారంభమవడంతో ఆ ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే చమురు ధరలు, నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు బేజారెత్తిపోయారు. ఇప్పుడు మరోసారి యుద్ధమంటే...ఇక పరిస్థితులు ఏ స్థాయికి చేరుతాయో ఊహించడానికే భయంగా ఉందని మదనపడుతున్నారు. బంగారం, వెండి ధరలు ఇప్పుడు స్థిరంగా ఉండటం...భారీ పెరుగుదలకు సంకేతాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.

Gold Price Update News Keyword | Telugu Digital