translateexpand_more

Grace Cancer Foundation News

Latest updates from Telugu Digital news sources.

Telugu Times03 Jun, 11:04 am
జూన్ 6న 5కే రన్/వాక్

TAGDV: అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘం ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ‘ (TAGDV) యూత్ విభాగం, ‘యంగ్ అంబాసిడర్స్ ఆఫ్ గ్లోబల్ గ్రేస్ హెల్త్’ (YAGGH) సంస్థతో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా 9వ ఎడిషన్ “TAGDV 5K RUN/WALK” , “గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్” ను నిర్వహించనున్నారు. తేదీ , సమయం.. ఈ గ్రాండ్ ఈవెంట్ 2026, జూన్ 6వ తేదీ శనివారం ఉదయం 8:00 గంటల నుండి 10:00 గంటల వరకు పెన్సిల్వేనియాలోని ప్రసిద్ధ ‘ఎక్స్టన్ పార్క్’ (800 Swedesford Rd, Exton, PA 19341) లో జరగనుంది. విశేషాలు.. ఈ పరుగు పందెం ‘ఎవర్‌నార్త్ హెల్త్ సర్వీసెస్’ (Evernorth) సౌజన్యంతో, ‘క్వాంబియంట్ డెవలపర్స్’ (Quambiant Developers) , ‘గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్’ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంది. ప్రవేశ రుసుము: ఈ రన్‌లో పాల్గొనేందుకు ఒక వ్యక్తికి $10, అలాగే కుటుంబం మొత్తానికి కలిపి $25 గా ఎంట్రీ ఫీజును నిర్ణయించారు. పిల్లల భాగస్వామ్యం: తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ అనుమతితో పిల్లలు కూడా ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొనవచ్చు. ప్రత్యేక ఆకర్షణలు: రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొనే వారందరికీ ఉచితంగా టీ-షర్ట్, పండ్లు , మంచినీరు (Get Free T-Shirt, Fruits & Water) అందించనున్నారు. నిర్వాహక కమిటీ.. సురేష్ బొందుగుల (వైస్ ప్రెసిడెంట్), శివ అనంతూని (సెక్రటరీ), మధు బూదాటి (ట్రెజరర్), లావ ఇనాంపూడి (జాయింట్ సెక్రటరీ), స్వాతి కొండేటి (జాయింట్ ట్రెజరర్). యూత్ కమిటీ.. అద్వైత్ బొందుగుల (చైర్), కో-చైర్స్ శ్రీయ గొర్రెపాటి, లిఖిత ఇనాంపూడి, తనిష్క కర్రోతు, ధృతి బూదాటి, అనీష్ గరిమళ్ల , ఇతర సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం TAGDV ప్రెసిడెంట్ హరీష్ అన్నబత్తిన +1 (484) 885-8915 నంబర్ ద్వారా ఫోన్ చేసి సంప్రదించవచ్చు. క్యాన్సర్ పై అవగాహన కల్పించే ఈ సత్సంకల్పంలో ప్రవాస తెలుగువారంతా భాగస్వాములు కావాలని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు ఇమేజ్ లో ఇచ్చిన క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

Grace Cancer Foundation News Keyword | Telugu Digital