translateexpand_more

Guntur Tobacco Board Maha Dharna Marripadu Farmers Protest 2026 News

Latest updates from Telugu Digital news sources.

HMTV01 Jun, 04:27 pm
గుంటూరులో పొగాకు రైతుల మహాధర్నా

గుంటూరు: పొగాకు మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు, గిట్టుబాటు ధర సాధన కోసం దక్షిణాదిలోని పలు వేలం కేంద్రాలకు చెందిన సాగుదారులు సోమవారం గుంటూరు పొగాకు బోర్డులో జరిగిన మహాధర్నా లో పాల్గొన్నారు.ఈ మహాధర్నా కు మర్రిపాడు మండలానికి చెందిన డీసీపల్లి పొగాకు బోర్డు పరిధిలోని డీసీ పల్లి రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మూలి.వెంగయ్య,కార్యదర్శి చండ్ర. నారాయణ స్వామి,జాయింట్ సెక్రటరీ గంగినేని. రవీంద్రబాబు, ఉపాధ్యక్షులు ఓబులు రెడ్డి,శ్రీనువాసులు రెడ్డి, పార్లపలి.జనార్దన్ రెడ్డి,రాటకొండరాములు,నరసింహరెడ్డి, బారెడ్డి.వెంకటసుబ్బారెడ్డి,ఆరికట్ల.శ్రీనువాసులు తదితర క్లస్టర్ సభ్యులు,రైతు నాయకులు,రైతులు 75 మంది పాల్గొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ సంక్షోభానికి కారణాలు, రైతులను గట్టెక్కించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, పొగాకు బోర్డు వ్యవహరించాల్సిన తీరును వివరించారు.ప్రధానంగా ప్రస్తుత మార్కెట్లో వ్యాపారులు గిట్టుబాటు ధరలు ఇచ్చి త్వరితగతిన కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వాలు, పొగాకు బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్‌ చేశారు.