translateexpand_more

Hair Brush Cleaning Tips News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu02 Jun, 03:00 am
దువ్వెన మురికిగా మారిందా? 2 నిమిషాల్లో మళ్లీ కొత్తదానిలా మార్చేయచ్చు

ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా ఉండాలని.. పొడవుగా పెరగాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని కోసం ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు. అయితే..మనం ఎంత ఖరీదైన ఉత్పత్తులు వాడినా కూడా.. జుట్టు దువ్వుకునే దువ్వెన మురికిగా ఉంటే..హెయిర్ లాస్ పెరిగే అవకాశం ఉంటుంది. దువ్వెనకు పట్టిన మురికి… మళ్లీ తలలో చేరి.. జుట్టు కుదుళ్లను బలహీనంగా మార్చే ప్రమాదం ఉంది. అందుకే… రెగ్యులర్ గా దువ్వెనను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మరి, మురికి పట్టి నల్లగా మారిన దువ్వెనను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం… మురికి పట్టిన దువ్వెన శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న వస్తువులు సరిపోతాయి. ఒక పాత టూత్ బ్రష్, గోరు వెచ్చని నీళ్లు, ఏదైనా షాంపూ, కొద్దిగా వంట సోడా ఉంటే సరిపోతుంది. ముందుగా దువ్వెనలో చిక్కుకున్న వెంట్రుకలను తొలగించాలి. తర్వాత షాంపూ నీళ్లలో బ్రష్ ని కాసేపు నానపెట్టాలి. ఆ తర్వాత బ్రష్ సహాయంతో దువ్వెన పళ్ల మధ్యలో రుద్దితే చాలు. రెండు నిమిషాల్లో మురికి వదులుతుంది. కొత్త దానిలా కనపడుతుంది. మనం రెగ్యులర్ గా తలకు నూనె రాస్తూ ఉంటాం. ఆ నూనె కూడా దువ్వెనకు అంటుకొని.. జిడ్డుగా మారే అవకాశం ఉంది. ఆ జిడ్డు వదిలించడం కూడా చాలా సింపుల్. నీళ్లలో కొద్దిగా వంట సోడా, ఏదైనా లిక్విడ్ సోప్ లేదంటే షాంపూ వేసి.. ఆ నీళ్లలో దువ్వెనను కాసేపు నానపెట్టాలి. తర్వాత.. నార్మల్ వాటర్ తో శుభ్రం చేస్తే సరిపోతుంది. దువ్వెన కొత్త దానిలా మెరుస్తూ కనపడుతుంది.

Hair Brush Cleaning Tips News Keyword | Telugu Digital