translateexpand_more

Hyderabad Fake Ias Gang News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy03 Jun, 09:44 am
హైదరాబాద్ లో నకిలీ ఐఏఎస్ ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్‌ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కానిస్టేబుల్ ద్వారా 6 మంది టీంతో ముఠా ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఐఏఎస్ అధికారులమంటూ పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని ఈ ముఠా బెదిరించింది. హైదరాబాద్, జూన్ 3: హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్‌ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కానిస్టేబుల్ ద్వారా 6 మంది టీంతో ముఠా ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఐఏఎస్ అధికారులమంటూ పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని ఈ ముఠా బెదిరించింది. ఫేక్ పోలీస్ కార్‌లో పూర్ణచంద్రరావును సూర్యాపేటకు తీసుకెళ్లి దాదాపు రూ.6.26 లక్షల నగదును వసూలు చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు నాగరాజ్‌తో పాటు మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు నాగరాజుపై రెండు పీడీయాక్ట్‌లు, 12 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి రెండు గన్స్, ల్యాప్‌టాప్‌లు, రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి ఇంట్లో ఏసీబీ సోదాలు తెలంగాణకు నా మద్దతు సిద్ధాంతపరమే: పవన్ కల్యాణ్

Hyderabad Fake Ias Gang News Keyword | Telugu Digital