translateexpand_more

Hyderabad Traffic News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu02 Jun, 01:24 am
నేడు హైదరాబాద్ లో ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు..  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. 13వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది తెలంగాణ. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు మిన్నంటనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు జిల్లాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటోన్నారు. రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో ఈ వేడుకలకు హాజరు కానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే వేడుకల్లో రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పిస్తారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, భవిష్యత్ కార్యాచరణ, ఫ్యూచర్ సిటీ గురించి వివరించనున్నారు.ఈ వేడుకల నేపథ్యంలో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. ఈ తెల్లవారు జామున 6 గంటలకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా రద్దీని బట్టి పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లే మార్గాలు, పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి. వాహనదారుల సౌలభ్యం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.బేగంపేట నుండి సంగీత్ జంక్షన్ వెళ్లేవారు ప్యారడైజ్-పాట్నీ-క్లాక్ టవర్ మార్గాన్ని ఎంచుకోవాలి. ట్రిముల్‌ఘేరీకి వెళ్లేవారు సెయింట్ జాన్స్ రోటరీ, షెనాయ్ నర్సింగ్ హోమ్, ఏఓసీ, కేవీ క్రాస్ రోడ్స్ మీదుగా ప్రయాణించాలి.సంగీత్ క్రాస్ రోడ్స్ నుండి పంజాగుట్ట వైపు వెళ్లేవారు ప్యాట్నీ, ఘాస్ మండీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ మీదుగా వెళ్ళాలి. సికింద్రాబాద్ నుండి బోయినపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యారడైజ్, సీటీఓ గుండా ద్వారా మళ్లించారు. బోయినపల్లి నుండి సికిందరాబాద్‌కు బ్రూక్ బాండ్, తివోలి, వైఎంసీఏ మార్గాల గుండా వెళ్లాలి.తెల్లవారుజాము 6 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో భారీ వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు మెట్రో రైలును వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రోడ్డు పక్కన వాహనాల పార్కింగ్ పై నిషేధం ఉంది. అనధికారిక వాహనాలను టో చేస్తారు. అత్యవసర వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది.డ్రోన్లు సహా ఇతర రిమోట్‌ కంట్రోల్డ్ వైమానిక పరికరాల వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు బెగంపేట్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధులలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, అలాగే రిమోట్‌ కంట్రోల్డ్‌ మైక్రోలైట్ విమానాలను ఎగురవేయడానికి అనుమతి లేదు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. 

Hyderabad Traffic News Keyword | Telugu Digital