translateexpand_more

India Vs New Zealand News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 12:24 pm
న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమైన భారత జట్టు..కోహ్లీ, రోహిత్ శర్మతో 5 మ్యాచ్ లు..ఎప్పుడంటే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. India Vs New Zealand 2026 Schedule: క్రికెట్ అభిమానులకు పండగే! టీమిండియా ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్‌లో సుదీర్ఘంగా పర్యటించనుంది. దాదాపు 40 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇరు జట్లు అన్ని ఫార్మాట్లలో తలపడనున్నాయి. ఇందులో భాగంగా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ విధంగా కివీస్ పర్యటనలో టీమ్ఇండియా మొత్తంగా 12 మ్యాచ్‌ల్లో ఆడనుంది. వందేళ్ల బంధం, చారిత్రాత్మక పర్యటన.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోని ఇంత సుదీర్ఘ పర్యటన జరగటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో ఏ దేశ జట్టు కూడా కివీస్ గడ్డపై ఇన్ని మ్యాచ్‌లు సుదీర్ఘ సిరీస్ ఆడిన సందర్భాలు లేవు. పైగా భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నెలకొన్న వందేళ్ళ క్రీడా సంబంధాలను ఈ పర్యటన ఒక చారిత్రాత్మక ప్రత్యేకంగా నిలవనుంది. భారత్ చివరిసారిగా 2019-20 సీజన్లో న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఆడింది. అయితే ఆ సిరీస్ తర్వాత కివీస్ జట్టు రెండుసార్లు భారత్‌లో పర్యటించింది. ముఖ్యంగా 2024-25 భారత పర్యటనలో కివిస్ జట్టు 3-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను క్లీన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి బదులుగా తీర్చుకునేందుకు టీమ్ఇండియా రెడీ అవుతుంది. వన్డే సిరీస్‌లో భాగంగా టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 5 వన్డేలు ఆడనున్నారు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పూర్తి షెడ్యూల్ అక్టోబర్ 22న టీ20 సిరీస్ తో పర్యటన ప్రారంభమై నవంబర్ 4న వన్డే సిరీస్, నవంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ జరగనున్నాయి. 1) టీ20 సిరీస్ షెడ్యూల్ (5 మ్యాచ్‌లు) మొదటి టీ20 మ్యాచ్: అక్టోబర్‌ 22 (క్రైస్ట్‌చర్చ్‌) రెండో టీ20 మ్యాచ్ : అక్టోబర్ 24 (క్రైస్ట్‌చర్స్) మూడో టీ20 మ్యాచ్: అక్టోబర్ 27 (వెల్లింగ్టన్) నాలుగో టీ20 మ్యాచ్: అక్టోబర్ 30 (ఆక్లాండ్) 2) వన్డే సిరీస్ షెడ్యూల్ (5 మ్యాచ్‌లు) తొలి వన్డే మ్యాచ్: నవంబర్ 4 (ఆక్లాండ్) రెండో వన్డే మ్యాచ్: నవంబర్ 7 (వెల్లింగ్టన్) నాలుగో వన్డే మ్యాచ్: నవంబర్ 13 (మౌంట్ మాంగనూయి) అయిదో వన్డే మ్యాచ్: నవంబర్ 15 (మౌంట్ మాంగనూయి) 3) టెస్ట్ సిరీస్ షెడ్యూల్ (2 మ్యాచ్‌లు) మొదటి టెస్ట్‌ నవంబర్‌ 19 నుండి 23 వరకు వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. రెండో టెస్ట్‌ నవంబర్‌ 27 నుండి డిసెంబర్‌ 1 వరకు క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగనుంది. Also Read: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఇవి గమనించారా? ఆర్సీబీ Vs జీటీ మ్యాచ్‌లో 5 వింత ఘటనలు! Also REad: వైభవ్ సూర్యవంశీకి తప్పిన ప్రమాదం..గుజరాత్ బౌలర్లపై మాజీ క్రికెటర్ పఠాన్ ఆగ్రహం స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

India Vs New Zealand News Keyword | Telugu Digital