translateexpand_more

Inspiration Story News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu02 Jun, 12:48 pm
మూగజీవాల దాహమే తన ధ్యేయం.. 75 ఏళ్ల వృద్ధుడి సేవకు అడవే సాక్ష్యం

మండు వేసవి… మాడు పగులగొడుతున్న ఎండలకు మనుషులే నీళ్ల కోసం అల్లాడుతున్న వేళ, ఇక మూగజీవాలగురించి వేరే చెప్పాలా! అడవులు నరికివేతతో ఆవాసాలు కోల్పోతున్న మూగజీవాలకు ఆహారం నీరు దొరక్క గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వేసవి కాలం కావడంతో వనాల్లో నీటికుంటలు ఎండిపోవడంతో మూగజీవాలు నీటికోసం అల్లాడుతున్నాయి. పశుపక్ష్యాదుల పరిస్థితిని అర్ధం చేసుకున్న ఓ వృద్ధుడు అడవిలోని మూగజీవాల దాహం తీర్చడమే తన జీవిత ఆశయంగా మార్చుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల అటవీ ప్రాంతంలో 75 ఏళ్ల ఆదినారాయణ చేస్తున్న నిరంతర సేవ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తూ, స్ఫూర్తినిస్తోంది. గత ఏడు సంవత్సరాలుగా ప్రతి వేసవిలో నాలుగు నెలల పాటు ఆదినారాయణ సొంత ఖర్చులతో కోతుల కోసం మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా సిమెంట్ కుండీలు ఏర్పాటు చేసి, ప్రతిరోజూ ఉదయాన్నే తన ఆటోలో నీటి డబ్బాలను నింపుకుని అడవి బాట పడతారు. 75 ఏళ్ల వయసు పైబడినా ఎండను లెక్కచేయకుండా, ఆ కుండీల్లో నీళ్లు నింపుతూ కోతుల దాహం తీరుస్తున్నారు. నీటి కోసం అడవుల నుండి రోడ్లపైకి వచ్చి ప్రమాదాల బారిన పడే వన్యప్రాణులకు ఈయన సేవ జీవనాధారంగా మారింది. తన సేవపై ఆదినారాయణ మాట్లాడుతూ.. “మూగజీవాలకు సేవ చేయడం నా అదృష్టం, ఇది దైవ సంకల్పం. ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్లేటప్పుడు ఏమీ పట్టుకుపోను” అంటూ జీవిత తత్వాన్ని చాటిచెప్పారు. స్వార్థంతో మనుషులు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో, మూగ జీవాల కోసం తపిస్తున్న ఈ పెద్దాయన నిజంగా అందరికీ ఆదర్శప్రాయుడు. రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం చెన్నకేశవ స్వామి పాదాల నుంచి ఎర్రని ద్రవం! కలియుగాంతానికి సంకేతమంటూ భక్తుల్లో భయం భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే.. యువ‌త‌లో పెరుగుతున్న పెద్ద పేగు క్యాన్స‌ర్‌.. అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోతే ముప్పే సాధారణ మోడల్.. ‘కొకైన్ క్వీన్’ ఎలా అయింది?