translateexpand_more

Iowa Shooting News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 04:15 am
దారుణం.. ఆరుగురు కుటుంబసభ్యులను కాల్చి చంపిన వ్యక్తి

న్యూయార్క్, జూన్ 2: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆరుగురు కుటుంబసభ్యులను అతి కిరాతకంగా తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం మధ్యాహ్నం 12.12 గంటల సమయంలో మస్కటిన్‌, పార్క్ ఎవెన్యూలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు మస్కటిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు.

ఇంట్లో నలుగురు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ నలుగురిని కాల్చి చంపిన వ్యక్తిని 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్‌ఫార్‌లాండ్‌గా గుర్తించారు. పోలీసులు ఇంటి దగ్గరకు రావడానికి ముందే అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. మిల్ స్ట్రీట్‌లోని ఓ ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తిని చంపేశాడు. తర్వాత గ్రాండ్‌వ్యూ ఎవెన్యూలో మరో వ్యక్తిని కాల్చి చంపాడు. అనంతరం ఓ బ్రిడ్జి దగ్గర తుపాకితో కాల్చుకుని ర్యాన్ విల్లిస్ ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు అతడి శవాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ర్యాన్ విల్లిస్‌ చేతిలో హత్యకు గురైన వారందరూ అతడి కుటుంబసభ్యులేనని తేలింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని వెల్లడైంది. నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి

సీబీఎస్‌ఈ వివాదం.. బోర్డు నుంచి నివేదిక కోరిన కేంద్రం..

Eenadu02 Jun, 01:59 am
అమెరికాలో కాల్పులు.. ఏడుగురు మృతి

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా (USA)లో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్‌లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్‌ పోలీసులు తెలిపారు. 210 పార్క్‌ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు జరిగాయని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు, వైద్యసిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అక్కడ తుపాకీ గాయాలతో ఉన్న నలుగురిని గుర్తించారు. వారిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. మస్కటీన్‌కు చెందిన ర్యాన్‌ విల్లీస్‌ (52)ను నిందితుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొనేలోపే అతడు అక్కడినుంచి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తుండగా.. మరో ప్రాంతంలో విల్లీస్‌ తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఇక, మస్కటీన్‌లోని ఓ నివాసంలో, గ్రాండ్‌వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒక కుటుంబంలోని వివాదం వల్ల ఈ కాల్పులు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.