translateexpand_more

Ipl 2026 Most Sixes News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu01 Jun, 02:00 pm
ఐపీఎల్ 2026లో రికార్డుల సునామీ.. 27 వేలకు పైగా రన్స్, 1426 సిక్సర్లు

ఐపీఎల్ 2026 సీజన్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ట్రోఫీని ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ 19వ సీజన్‌లో బ్యాటర్లు రేపిన అలజడి అంతా ఇంతా కాదు. గ్రౌండ్‌లోకి దిగితే చాలు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. ఒక టీమ్ 200 ప్లస్ స్కోరు బోర్డు మీద పెడితే, అవతలి టీమ్ చాలా ఈజీగా దాన్ని అందుకుంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా 200 ప్లస్ స్కోర్లు నమోదైన సీజన్‌గా ఇది నిలిచిపోయింది. ఫోర్లు, సిక్సర్ల రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఐపీఎల్ చరిత్రలో ముగ్గురు బ్యాటర్లు ఒకే సీజన్‌లో 700 కంటే ఎక్కువ రన్స్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. టోటల్‌గా చూస్తే ఈ సీజన్ ఒక రికార్డ్ బ్రేకర్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ సీజన్ ఎందుకు అంత స్పెషల్‌గా నిలిచింది? ఎలాంటి రికార్డులు క్రియేట్ అయ్యాయో మీకు తెలుసా? ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో బ్యాటర్ల హవా నడిచింది. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. గత 18 సీజన్లలో ఉన్న అన్ని రికార్డులను ఈ ఏడాది బ్రేక్ చేశారు. ఐపీఎల్ 2026లో మొత్తం 74 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లన్నింటిలో కలిపి ఏకంగా 27,450 రన్స్ వచ్చాయి. ఐపీఎల్ హిస్టరీలో ఒకే సీజన్‌లో ఇన్ని రన్స్ రావడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ముగ్గురు బ్యాటర్లు 700 పరుగుల మార్క్‌ను దాటి సరికొత్త మైలురాయిని అందుకున్నారు. అందులో వైభవ్ సూర్యవంశీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు. ఈ ముగ్గురు టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో దుమ్మురేపారు. ఈ సీజన్‌లో బ్యాటర్లు బాల్‌ను బౌండరీ లైన్ దాటించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంలను హోరెత్తించారు.