translateexpand_more

Ipl Records News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu30 May, 01:30 am
ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ జోడీ ఇదే.. కట్ చేస్తే.. కోహ్లీ, డివిలియర్స్ రికార్డ్ బ్రేక్

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త చరిత్రను రచిస్తూ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సంచలనం సృష్టించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ పేరిట దశాబ్ద కాలంగా ఉన్న అత్యంత అరుదైన భాగస్వామ్య రికార్డులను ఈ యువ జోడీ బద్దలు కొట్టింది. ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఐపీఎల్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న గుజరాత్ ఓపెనర్లు.. క్రికెట్‌లో మ్యాచ్‌లు గెలవాలంటే కేవలం ఒకే ఒక్కరు మెరిస్తే సరిపోదు, ఇద్దరు ఆటగాళ్ల మధ్య బలమైన బంధం, అవగాహన ఎంతో ముఖ్యం. అలాంటి ఒక అద్భుతమైన కెమిస్ట్రీతో గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపిస్తున్నారు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్. చాలా తక్కువ కాలంలోనే ఈ జోడీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత స్థిరమైన ప్రదర్శన చేసే జంటగా అవతరించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1 పోరులో 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఈ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగి శుభారంభాన్ని ఇచ్చారు. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ కనురెప్ప మూసి తెరిచేలోపు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ సామ్రాజ్యానికి గండి.. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక యాభై ప్లస్ (50+) పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పిన రికార్డు ఆర్సీబీ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ పేరిట ఉండేది. వీరిద్దరు కలిసి 21 సార్లు ఈ ఘనత సాధించారు. అయితే రాజస్థాన్ రాయల్స్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో గిల్, సాయి సుదర్శన్ జోడీ ఏకంగా 22వ సారి యాభై పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించి కోహ్లీ-డివిలియర్స్ జోడీని రెండో స్థానానికి నెట్టేసింది. ఈ

NTV Telugu31 May, 05:00 pm
ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో ఆర్‌సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీ కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలోనే ఇదే అత్యంత వేగవంతమైన టీమ్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు 2023లో ఇదే అహ్మదాబాద్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 4 ఓవర్లలో 50 పరుగులు సాధించిన రికార్డును కోహ్లీ, అయ్యర్ జోడి బద్దలు కొట్టింది. మొదటిసారి ఓపెనింగ్ పార్టనర్‌షిప్.. ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించడం ఇదే మొదటిసారి. తొలి మ్యాచ్‌లోనే ఈ జోడి అద్భుతమైన సమన్వయంతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి అవుట్ అవ్వగా, వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 4.3 ఓవర్లలోనే 62 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విరాట్ కోహ్లీ కేవలం 13 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి క్రీజులో నాటౌట్‌గా ఉన్నాడు. ఫైనల్ లాంటి హై-ప్రెజర్ మ్యాచ్‌లో తొలిసారి జతకట్టినప్పటికీ, ఈ ఓపెనింగ్ జోడి సృష్టించిన విధ్వంసం ఆర్‌సీబీకి మ్యాచ్‌పై పూర్తి పట్టును తెచ్చిపెట్టింది.

TV9 Telugu31 May, 03:54 pm
ఆరెంజ్ క్యాప్ విజేతగా బాస్ బేబీ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా

Orange Cap Winner: భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ 2026 టోర్నీలో కేవలం పదిహేనేళ్ల ప్రాయంలోనే ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించి ప్రతిష్టాత్మక ‘ఆరెంజ్ క్యాప్’ కైవసం చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డును ఈ చిన్నారి సంచలనం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆరెంజ్ క్యాప్ విజేత రూ. 10 లక్షల ప్రైజ్ మనీ అందించనున్నారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పరుగుల వేట.. ఐపీఎల్ అంటేనే అనుభవం, ఒత్తిడిని తట్టుకునే సత్తా ఉన్న ఆటగాళ్ల వేదిక. అలాంటి చోట 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ మైదానంలో అడుగుపెట్టి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం క్వాలిఫైయర్-2 లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముగిసినప్పటికీ, వైభవ్ సృష్టించిన పరుగుల సునామీ మాత్రం క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. టోర్నీ అంతటా అద్భుతమైన స్థిరత్వం, భయం లేని బ్యాటింగ్ శైలితో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా అగ్రస్థానంలో నిలిచాడు. రికార్డుల రారాజు.. విధ్వంసకర బ్యాటింగ్.. ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆడిన 16 మ్యాచుల్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇందులో అతడి సగటు 48.50 కాగా, స్ట్రైక్ రేట్ 237.30 గా నమోదవడం విశేషం. లీగ్ దశలోనే కాకుండా అత్యంత ఒత్తిడి ఉండే ప్లేఆఫ్స్ మ్యాచుల్లోనూ ఈ కుర్రాడు రెచ్చిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 97 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన, విధ్వంసకర ఇన్నింగ్స్‌లలో

TV9 Telugu01 Jun, 01:31 am
వామ్మో.. 2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే

కోట్లాది మంది అభిమానుల దశాబ్దాల నిరీక్షణను గతేడాది పటాపంచలు చేస్తూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), ఈ ఏడాది కూడా అదే జోరును రిపీట్ చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఏకపక్ష ఫైనల్ పోరులో రజత్ పటీదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని అందుకొని వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా అవతరించింది. కోహ్లీ ‘కింగ్’ క్లాస్.. తిరుగులేని డిఫెండింగ్ ఛాంపియన్స్.. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి పిచ్ సహకరించకపోయినా ఆరంభంలో బౌండరీల వర్షం కురిపించింది. అయితే, ఒకదశలో వరుసగా మూడు కీలక వికెట్లు కోల్పోయి జట్టు కాస్త ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. కానీ క్రీజులో ఉన్నది 'కింగ్' విరాట్ కోహ్లీ కాబట్టి అభిమానుల్లో ధీమా తగ్గలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటిచేత్తో ఇన్నింగ్స్‌ను నడిపించిన కోహ్లీ, తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించి ఆర్‌సీబీకి వరుసగా రెండో ఐపీఎల్ కీర్తి కిరీటాన్ని అందించాడు. ఈ చారిత్రాత్మక విజయంతో బెంగళూరు జట్టు కేవలం ట్రోఫీని మాత్రమే గెలవలేదు, టోర్నీ చరిత్రలోనే పలు అరుదైన రికార్డులను సైతం బద్దలు కొట్టింది. బ్యాక్-టు-బ్యాక్ ట్రోఫీలు.. ధోనీ, రోహిత్ సరసన రజత్ పటీదార్.. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎంఎస్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్ - 2010, 2011), మరొకరు రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ - 2019, 2020). ఇప్పుడు ఈ దిగ్గజాల సరసన ఆర్‌సీబీ యువ కెప్టెన్ రజత్ పటీదార్ (2025, 2026) చేరిపోయాడు. కెప్టెన్సీ చేపట్టిన అనతికాలంలోనే జట్టును వరుసగా రెండుసార్లు విజేతగా నిలిపి చరిత్ర సృష్టించాడు.

Asianet News Telugu01 Jun, 02:00 pm
ఐపీఎల్ 2026లో రికార్డుల సునామీ.. 27 వేలకు పైగా రన్స్, 1426 సిక్సర్లు

ఐపీఎల్ 2026 సీజన్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ట్రోఫీని ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ 19వ సీజన్‌లో బ్యాటర్లు రేపిన అలజడి అంతా ఇంతా కాదు. గ్రౌండ్‌లోకి దిగితే చాలు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. ఒక టీమ్ 200 ప్లస్ స్కోరు బోర్డు మీద పెడితే, అవతలి టీమ్ చాలా ఈజీగా దాన్ని అందుకుంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా 200 ప్లస్ స్కోర్లు నమోదైన సీజన్‌గా ఇది నిలిచిపోయింది. ఫోర్లు, సిక్సర్ల రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఐపీఎల్ చరిత్రలో ముగ్గురు బ్యాటర్లు ఒకే సీజన్‌లో 700 కంటే ఎక్కువ రన్స్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. టోటల్‌గా చూస్తే ఈ సీజన్ ఒక రికార్డ్ బ్రేకర్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ సీజన్ ఎందుకు అంత స్పెషల్‌గా నిలిచింది? ఎలాంటి రికార్డులు క్రియేట్ అయ్యాయో మీకు తెలుసా? ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో బ్యాటర్ల హవా నడిచింది. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. గత 18 సీజన్లలో ఉన్న అన్ని రికార్డులను ఈ ఏడాది బ్రేక్ చేశారు. ఐపీఎల్ 2026లో మొత్తం 74 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లన్నింటిలో కలిపి ఏకంగా 27,450 రన్స్ వచ్చాయి. ఐపీఎల్ హిస్టరీలో ఒకే సీజన్‌లో ఇన్ని రన్స్ రావడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ముగ్గురు బ్యాటర్లు 700 పరుగుల మార్క్‌ను దాటి సరికొత్త మైలురాయిని అందుకున్నారు. అందులో వైభవ్ సూర్యవంశీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు. ఈ ముగ్గురు టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో దుమ్మురేపారు. ఈ సీజన్‌లో బ్యాటర్లు బాల్‌ను బౌండరీ లైన్ దాటించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంలను హోరెత్తించారు.

TV9 Telugu01 Jun, 01:01 pm
ఆర్ సీబీలో 17 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఆడిన ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని లక్కీ హ్యాండ్

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును మట్టికరిపించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. అయితే ఈ భారీ టోర్నమెంట్‌లో ఆర్‌సీబీ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన మిరాకిల్ దాగి ఉంది. ఆ జట్టుకు చెందిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ ఈ సీజన్‌లో ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్‌లో అతను మైదానంలోకి దిగిన ఏ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆర్‌సీబీ ఓడిపోలేదు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఆర్‌సీబీ జట్టు తిరుగులేని పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. లీగ్ స్టేజ్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 9 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గెలిచి, ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి కప్ కొట్టేసింది. అయితే ఈ సీజన్ మొత్తంలో ఆర్‌సీబీ 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కానీ జాకబ్ డఫీ ఆడిన మ్యాచ్‌ల్లో మాత్రం జట్టుకు అసలు ఓటమనేదే ఎదురుకాలేదు. జాకబ్ డఫీకి ఇది మొట్టమొదటి ఐపీఎల్ సీజన్. తొలిసారి బరిలోకి దిగిన ఈ కివీస్ బౌలర్ ఆర్‌సీబీ తరఫున ఫైనల్‌తో కలిపి మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు. విచిత్రం ఏంటంటే, అతను ఆడిన ఆరుకు ఆరు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఐపీఎల్ కప్ గెలిచిన ఆర్‌సీబీ తొలి ప్లేయర్‌గా డఫీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి ఒక మ్యాజిక్ జరిగి సరిగ్గా 17 ఏళ్లు అవుతోంది. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఒకే సీజన్‌లో 100 శాతం మ్యాచ్‌లు

Andhra Jyothy30 May, 05:29 am
రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే

<p><strong><span style="color: rgb(255, 0, 0)">ఇంటర్నెట్ డెస్క్: </span></strong>ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ మరోసారి సత్తాచాటింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, బెంగళూరుతో తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో జీటీ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన తీరే చర్చనీయాంశమవుతోంది. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ వైపు బౌండరీ కొట్టిన అనంతరం అతడి చేతిలోని బ్యాట్ జారి నేరుగా వికెట్లను తాకడంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు క్వాలిఫయర్-1లో జరిగిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీపై ఇదే తరహాలో ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో వరుసగా 2 ఇన్నింగ్స్‌ల్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాటర్‌గా కోరుకుని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు సాయి సుదర్శన్.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>మ్యాచ్ అనంతరం తాను ఔటైన తీరుపై సాయి సుదర్శన్‌కు ఓ ప్రశ్న ఎదురవగా దానికి అతడు సరదాగా స్పందించాడు. 'ఇకపై బ్యాట్ చేతికి అతుక్కుని ఉండేలా గ్రిప్ టెక్నిక్‌లు ఏవైనా ఉన్నాయేమో ప్రయత్నించాలి' అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన సాయి సుదర్శన్.. తొలి వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధికం. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మైక్ హస్సీ, మురళీ విజయ్ 159 పరుగులు జోడించగా.. ఆ రికార్డును వీరు అధిగమించారు. అంతేకాకుండా గిల్-సుదర్శన్ జోడీ మరో ఘనతనూ సొంతం చేసుకుంది. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 100కు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా అవతరించింది. వీరిరువురూ 11 సెంచరీ భాగస్వామ్యాలతో.. క్రిస్ గేల్-కోహ్లీ, బాబర్ ఆజమ్-మహ్మద్ రిజ్వాన్, డివిలియర్స్-కోహ్లీ జోడీలను వెనక్కి నెట్టారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 215 పరుగుల

NTV Telugu31 May, 06:50 am
ఆర్సీబీ ఫ్యాన్స్ కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు

IPL 2026 Final: టాటా ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు (మే 31) డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా, ఈ మ్యాచ్‌కు ముందు ఒక ఆసక్తికరమైన రికార్డు ఆర్‌సీబీ అభిమానుల్లో జోష్ నింపుతోంది. అదే సమయంలో గుజరాత్ క్యాంప్‌లో ఆందోళన కలిగిస్తోంది. నిజానికి, ఐపీఎల్‌లో 2018 సీజన్ నుంచి ఒక విచిత్రమైన సెంటిమెంట్ (ట్రెండ్) బలంగా కొనసాగుతోంది. అదేంటంటే.. క్వాలిఫయర్-1 లో గెలిచిన జట్టే ప్రతిసారీ ఫైనల్‌లోనూ విజయం సాధించి ట్రోఫీని ముద్దాడుతోంది. గత ఎనిమిదేళ్లుగా ఇదే తరహా ట్రెండ్ కొనసాగింది. 2018: చెన్నై సూపర్ కింగ్స్ (క్వాలిఫయర్-1 విజేత, టైటిల్ విజేత) 2019: ముంబై ఇండియన్స్ 2020: ముంబై ఇండియన్స్ 2021: చెన్నై సూపర్ కింగ్స్ 2022: గుజరాత్ టైటాన్స్ 2023: చెన్నై సూపర్ కింగ్స్ 2024: కోల్‌కతా నైట్ రైడర్స్ 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ ప్లేఆఫ్ ఫార్మాట్ జట్లకు రెండో అవకాశం ఇచ్చినప్పటికీ, గత కొన్నేళ్లుగా క్వాలిఫయర్-1 విజేతలే ఆ ఆధిక్యతను పూర్తిగా వాడుకుని ఛాంపియన్లుగా నిలిచారు. ఈ సీజన్ క్వాలిఫయర్-1 లో ఆర్‌సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను ఏకపక్షంగా ఓడించి నేరుగా ఫైనల్ చేరింది కాబట్టి, చరిత్ర ప్రకారం బెంగళూరుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చరిత్ర ఆర్‌సీబీ వైపు ఉంటే, ప్రస్తుత హోమ్ రికార్డ్ మాత్రం గుజరాత్ టైటాన్స్ వైపు ఉంది. నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్‌కు సొంత మైదానం కావడం, ఇక్కడ ఆ జట్టు వరుసగా 4 మ్యాచ్‌ల్లో

TV9 Telugu27 May, 02:27 pm
సిక్స్ లతో విధ్వంసం.. క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సిక్సర్ల కింగ్ క్రిస్ గేల్ నెలకొల్పిన ఒక అసాధ్యమైన రికార్డును పట్టుమని 16 ఏళ్లు కూడా నిండని ఒక పసివాడు సమం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలో సిక్సర్ల సునామీ సృష్టిస్తూ, ఒకే సీజన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన గేల్ రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వినాశకరమైన బ్యాటింగ్‌కు మారుపేరు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ గేల్ 2012 సీజన్‌లో ఏకంగా 59 సిక్సర్లు బాది సరికొత్త రికార్డు సృష్టించాడు. గత పద్నాలుగేళ్లుగా ఆ రికార్డును తాకడం ఎవరికీ సాధ్యం కాలేదు. కానీ, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న 15 ఏళ్ల 61 రోజుల వయసున్న వైభవ్ సూర్యవంశీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో తన 60వ సిక్సర్ బాదాడు. దీనితో గేల్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును ఈ కుర్రాడు బద్దలు కొట్టాడు. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న కీలకమైన పోరులో వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం లెక్కచేయకుండా మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం కొన్ని బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, సాకిబ్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో అద్భుతమైన ఇన్-సైడ్ అవుట్ షాట్‌తో కవర్స్ మీదుగా భారీ సిక్సర్ సాధించాడు. ఈ సిక్సర్‌తోనే అతడు ఈ సీజన్‌లో 60 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. సాధారణంగా అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లే ఐపీఎల్ లాంటి ఒత్తిడితో కూడిన లీగ్‌లో రాణించడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది వైభవ్ ఈ సీజన్‌లో కేవలం

Sakshi26 May, 02:01 pm
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్‌ సూర్యవంశీ

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న కెరీర్‌లో తొలిసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మయ్యాడు. ఐపీఎల్‌-2026 ఎలిమినేట‌ర్‌లో భాగంగా బుధ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజస్తాన్ రాయల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో సత్తాచాటాలని 15 ఏళ్ల వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో కనీసం 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో వైభవ్ రెండో స్ధానంలో న్నాడు. ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ 232.27 స్ట్రైక్ రేట్‌తో 583 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా యువ ఆటగాడు జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ పేరిట ఉంది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో మెక్‌గర్క్ 234.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇప్పుడు సన్‌రైజర్స్‌పై వైభవ్ డబుల్ డిజిట్ స్కోర్ సాధిస్తే స్ట్రైక్ రేట్ పరంగా మెక్‌గర్క్‌ను అధిగమించే అవకాశముంది. 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లను పరిగణనలోకి తీసుకుంటే, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ (232.27) నమోదు చేసిన రికార్డు వైభవ్ పేరిటే ఉంది. గేల్ రికార్డుపై కన్ను కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డుపై కూడా వైభవ్ కన్నేశాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (59 సిక్సర్లు - 2012) పేరిట ఉంది. వైభవ్ మరో 7 సిక్సర్లు కొడితే క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల సుదీర్ఘ రికార్డు బద్దలవుతుంది. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు క్రిస్ గేల్: 59 సిక్సర్లు (14 ఇన్నింగ్స్ -ఐపీఎల్‌

Andhra Jyothy27 May, 01:24 am
ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ సరికొత్త రికార్డు

క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో సారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. కెప్టెన్ రజత్ పాటీదార్(93*) విధ్వంసానికి నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్లు.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఏకంగా 38 బౌండరీలు నమోదు చేసింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. 2012లో చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన 33 బౌండరీల రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్! కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

NTV Telugu29 May, 04:16 am
గేల్ రికార్డును తుడిచేసి.. ఇప్పుడు ఆండ్రీ రస్సెల్ ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన వైభవ్

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. మరో అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. శుక్రవారం (మే 29) న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ ఈ మైలురాయిని అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌లలో ఎవరూ ఊహించని విధంగా 242.86 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేసిన వైభవ్, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఒకే టీ20 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఈ ‘యూనివర్స్ బేబీ బాస్’.. ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా, అతి పిన్న వయసులో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు కేవలం 68 పరుగుల దూరంలో ఉన్నాడు. 2025లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో మొత్తం 932 పరుగులు సాధించాడు. ఈ 932 పరుగుల కోసం అతను ఎదుర్కొన్నది కేవలం 402 బంతులు మాత్రమే. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ స్టార్ ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానంలో టిమ్ డేవిడ్ (560 బంతులు) ఉన్నాడు. వైభవ్ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా 142 బంతుల లీడ్ ఉంది. అతని ప్రస్తుత ఫామ్, స్ట్రైక్ రేట్ చూస్తుంటే.. రస్సెల్ రికార్డు కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. ఏజ్ విషయానికి వస్తే.. ఐపీఎల్‌లో అతి పిన్న

TV9 Telugu27 May, 03:00 pm
ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. మైదానంలోనే కన్నీరు పెట్టిన సూర్యవంశీ

ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.. మరెన్నో కొత్త చరిత్రలు లిఖించబడ్డాయి. కానీ, నిన్న రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో మాత్రం గుండెల్ని పిండేసే ఒక అద్భుతమైన, భావోద్వేగ సన్నివేశం ఆవిష్కృతమైంది. కేవలం కొన్ని పరుగుల దూరంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకుని, రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలోనే తీవ్ర నిరాశకు లోనయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఊపు చూస్తే సూర్యవంశీ సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. చరిత్ర సృష్టించే ముంగిట బోల్తా పడ్డాడు. ప్రఫుల్ హింగే విసిరిన ఒక షార్ట్ పిచ్ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీ దాటించేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. అయితే, ఊహించిన దానికంటే బంతి కాస్త ఎత్తుగా రావడంతో కనెక్ట్ కాలేకపోయింది. డీప్ థర్డ్ స్థానంలో ఉన్న ఫీల్డర్ చేతుల్లోకి బంతి నేరుగా వెళ్లడంతో ఆకాశమే హద్దుగా సాగుతున్న ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ సీజన్‌లో ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో సూర్యవంశీ అవుట్ కావడం ఇది మొదటిసారి కాదు, కానీ ఈ వికెట్ మాత్రం అతడిని కోలుకోలేని దెబ్బ తీసింది. అవుట్ అయిన వెంటనే సూర్యవంశీ నమ్మలేనట్టు అక్కడే నిలబడిపోయాడు. కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు ఆగిపోయినంత పనైంది. సెంచరీ మిస్ అయిందనే బాధతో, తీవ్రమైన కోపంతో తన బ్యాట్‌ను గాల్లోనే గుద్దుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచాడు. ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న ఆవేదన, కళ్లల్లో కదిలాడిన నీళ్లు చూసి స్టేడియంలోని ప్రేక్షకులంతా భావోద్వేగానికి లోనయ్యారు. శత్రువులైనా సరే సూర్యవంశీ ఆడిన

NTV Telugu28 May, 02:25 am
ఆ రెండే కారణం.. క్వాలిఫయర్ -2లోకి రాజస్థాన్ , ఇంటికి హైదరాబాద్

RR vs SRH: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లింది. ముల్లన్‌పూర్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో చెలరేగగా, జోఫ్రా ఆర్చర్ తన వేగంతో హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు.. దీంతో, ఐపీఎల్‌ క్వాలిఫయర్‌ రేస్‌ నుంచి SRH తప్పుకోవాల్సి వచ్చింది.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో రాజస్థాన్ ఇప్పుడు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్ విజేత ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను ఐపీఎల్ వేదికపై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్, తన ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని అతను కేవలం మూడు పరుగుల దూరంలో కోల్పోయాడు. ప్రస్తుతం ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. మ్యాచ్ ఆరంభం నుంచే వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా కెప్టెన్ కమిన్స్ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. ఫుల్ లెంగ్త్ బంతులను సైట్ స్క్రీన్ మీదుగా పంపించడమే కాకుండా, షార్ట్

Andhra Jyothy27 May, 06:03 am
పాటీదార్ పవర్ షో.. ప్రపంచ రికార్డు బద్దలు

క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రజత్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఇంటర్నెట్ డెస్క్: క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 9 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. పాటీదార్ పవర్ షో కారణంగా.. ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యఛేదనలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలడంతో.. ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో పాటీదార్ అరుదైన టీ20 ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆడిన 14 ఇన్నింగ్స్‌లో పాటీదార్ 486 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతడు 41 సిక్సర్లు బాదాడు. దీంతో ఒక టీ20 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్.. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(2023-2024)లో 40 సిక్సర్లు కొట్టాడు. తాజాగా రజత్.. రియాన్ పరాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. రజత్ పాటీదార్- 41 సిక్సర్లు (ఐపీఎల్ 2026) రియాన్ పరాగ్- 40 సిక్సర్లు (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24) శ్రేయస్ అయ్యర్- 39 సిక్సర్లు (ఐపీఎల్ 2025) విరాట్ కోహ్లీ- 38 సిక్సర్లు (ఐపీఎల్ 2016) గుజరాత్ టైటాన్స్‌పై విజయంతో రజత్ పాటీదార్ కెప్టెన్సీ పరంగానూ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి రెండు సీజన్లలోనే.. వరుసగా రెండు సార్లు జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన రెండో

TV9 Telugu31 May, 01:24 am
ఇది బ్యాటింగ్ కాదు విధ్వంసం.. 200 స్ట్రైక్ రేట్ తో బౌలర్లను ఉతికేసిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే

IPL 2026 : క్రికెట్ లవర్స్‎ను గత కొన్ని వారాలుగా ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంది. మే 31న జరగబోయే గ్రాండ్ ఫైనల్ పోరుతో ఈ సీజన్‌కు తెరపడనుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో మునుపెన్నడూ లేని విధంగా బ్యాటర్లు బౌలర్లపై విరుచుకుపడ్డారు. టీ20 క్రికెట్ అంటేనే బౌండరీల వర్షం.. అలాంటిది ఈ సీజన్‌లో కొందరు బ్యాటర్లు అసలు సిసలైన టీ20 మోడ్ చూపిస్తూ ఏకంగా 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించారు. ఈ ఐపీఎల్ 19వ సీజన్ మొత్తంలో 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌ను మైంటైన్ చేసిన ఆ ఐదుగురు బ్యాటర్లు ఎవరో తెలుసుకుందాం. ఈ సీజన్‌లో అందరికంటే అత్యధిక స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి మొదటి స్థానంలో నిలిచాడు రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. ఈ లెఫ్ట్ హ్యాండ్ విద్వంసక ప్లేయర్ క్రీజులోకి వస్తే చాలు స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ మొత్తం 16 ఇన్నింగ్స్‌లు ఆడి ఏకంగా 237.31 మైండ్ బ్లాకింగ్ స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతని బ్యాటింగ్ యావరేజ్ 48.50గా నమోదైంది. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ రేసులోనూ తన పవర్‌ను చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడీ కుర్రాడు. రెండో స్థానంలో కేకేఆర్ పవర్ హిట్టర్ ఫిన్ అలెన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడిన ఫిన్ అలెన్ ఈ జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌లో వచ్చి బౌలర్లపై కౌంటర్ ఎటాక్ చేయడంలో అలెన్ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశాడు. ఈ సీజన్‌లో మొత్తం 11