RCB హిస్టరీ వరుసగా 2వ సారి ఐపీఎల్ టైటిల్ | RCB Makes History in IPL 2026 | Asianet News Telugu ఈ వార్తకు సంబంధించిన
Latest updates from Telugu Digital news sources.

RCB హిస్టరీ వరుసగా 2వ సారి ఐపీఎల్ టైటిల్ | RCB Makes History in IPL 2026 | Asianet News Telugu ఈ వార్తకు సంబంధించిన

స్పోర్ట్ డెస్క్: ఐపీఎల్ 2026 టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. రేపు (మే 31) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ కీలక పోరు జరగనుంది. ఈ క్రమంలోనే వరుసగా రెండో సారి ఐపీఎల్ కప్‌ను ముద్దాడి సరికొత్త రికార్డు సృష్టించాలని ఆర్సీబీ కసిగా ఉంది. అయితే ఈ మహాసంగ్రామానికి ముందే ఆర్సీబీ అభిమానులకు బెంగళూరు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. నగరంలో బహిరంగంగా ఐపీఎల్ వేడుకలు జరుపుకోవడంపై పూర్తిగా నిషేధం విధిస్తూ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బెంగళూరు పోలీసులు ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటనే ప్రధాన కారణమని సమాచారం. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలిచినప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో స్టేడియం బయట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది మరణించారు. ఈ ఘటనకు కారణంగా ఆర్సీబీ యాజమాన్యం వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం అంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావించిన బెంగళూరు పోలీసులు ముందస్తుగానే కఠినమైన ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బెంగళూరు నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్ జామ్‌లు, అవాంఛనీయ సంఘటనలను అరికట్టడానికి ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలలో సాధారణ ప్రజల కోసం లైవ్ బ్రాడ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేయవద్దని యాజమాన్యాలను కోరారు. అలాగే రోడ్లపై బైక్ ర్యాలీలు తీయడం, పటాకులు కాల్చడంపై కూడా పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. దీంతో పాటు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, గొడవలకు దిగడం వంటి పనులు

ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL 2026) టైటిల్ గెలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి టైటిల్ పోరుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి ఘట్టాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కసిగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బెంగళూరు జట్టు నాయకత్వ బృందానికి కీలక సూచన చేశాడు. గుజరాత్‌తో ఫైనల్లో రొమారియో షెఫర్డ్ బౌలింగ్ వేయించొద్దని సూచించాడు. అదే విధంగా ఫిల్ సాల్ట్ తిరిగి వచ్చినా వెంకటేశ్ అయ్యర్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని క్రిష్ పేర్కొన్నాడు. ‘ఫిల్ సాల్ట్ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉన్నా వెంకటేశ్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతడినే ఓపెనర్‌గా కొనసాగిస్తే ఆర్సీబీకి మేలు. బౌలింగ్ విషయంలో ఒకవేళ రొమారియో షెఫర్డ్‌తో కనీసం మూడు ఓవర్లు బౌలింగ్ చేయించినా సరే ఆర్సీబీ ఓడిపోవడం ఖాయం. షెఫర్డ్ చేతికి అస్సలు బంతిని ఇవ్వకండి. నా అభిప్రాయం ప్రకారం.. అతడికి తుది జట్టులో కూడా చోటు ఇవ్వకపోవడం ఉత్తమం’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ గతేడాది కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తాజా ఎడిషన్‌కు కూడా బెంగళూరు జట్టు రొమారియో షెఫర్డ్‌ను అట్టి పెట్టుకుంది. ఇక ఈ

RCB vs GT Pace Bowling Battle Worth RS 68.75 Crore: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ సీజన్ మొత్తం బ్యాటర్ల హవా కొనసాగినా.. ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని మాత్రం రెండు జట్ల పేస్ బౌలింగ్ దళాలే నిర్ణయించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2026 ఫైనల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న అంశం రెండు జట్ల పేస్ బౌలింగ్ యూనిట్ల మధ్య జరిగే పోరు. మహ్మద్ సిరాజ్ (రూ.12.25 కోట్లు), కగిసో రబాడా (రూ.10.75 కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (రూ.9.5 కోట్లు)తో గుజరాత్ టైటాన్స్ బలమైన పేస్ దాడిని కలిగి ఉంది. వీరితో పాటు ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ (రూ.7 కోట్లు) కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ (రూ.12.5 కోట్లు) జట్టుకు బలంగా నిలిచారు. యువ పేసర్ రసిఖ్ సలామ్ దార్ (రూ.6 కోట్లు) ఈ సీజన్‌లో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ కీలక పేసర్ల మొత్తం విలువ రూ.68.75 కోట్లకు చేరడం విశేషం. ఫైనల్‌లో మరో ఆసక్తికర అంశం పర్పుల్ క్యాప్ రేసు. ప్రస్తుతం 28 వికెట్లతో కగిసో రబాడా అగ్రస్థానంలో ఉండగా.. 26 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ 18 వికెట్లు, జేసన్ హోల్డర్ 17 వికెట్లతో టాప్ బౌలర్ల జాబితాలో కొనసాగుతున్నారు. రసిఖ్ సలామ్ 16 వికెట్లతో బ్రేక్‌త్రూ సీజన్‌ను నమోదు చేశాడు.

క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో సారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. కెప్టెన్ రజత్ పాటీదార్(93*) విధ్వంసానికి నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్లు.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఏకంగా 38 బౌండరీలు నమోదు చేసింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. 2012లో చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన 33 బౌండరీల రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్! కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్, 5 ఫోర్లు ఉన్నాయి. దీంతో 15 ఇన్నింగ్స్‌లో కోహ్లీ 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వరుసగా నాలుగు సీజన్లలో(2023-2026) 600 లేదా 600కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉండేది. కేఎల్ రాహుల్ (2020, 2021, 2022), క్రిస్ గేల్(2011, 2012, 2013) సీజన్లలో వరుసగా మూడుసార్లు ఈ ఘనత సాధించగా.. తాజాగా వారి రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్! కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రజత్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఇంటర్నెట్ డెస్క్: క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 9 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. పాటీదార్ పవర్ షో కారణంగా.. ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యఛేదనలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలడంతో.. ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో పాటీదార్ అరుదైన టీ20 ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆడిన 14 ఇన్నింగ్స్‌లో పాటీదార్ 486 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతడు 41 సిక్సర్లు బాదాడు. దీంతో ఒక టీ20 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్.. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(2023-2024)లో 40 సిక్సర్లు కొట్టాడు. తాజాగా రజత్.. రియాన్ పరాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. రజత్ పాటీదార్- 41 సిక్సర్లు (ఐపీఎల్ 2026) రియాన్ పరాగ్- 40 సిక్సర్లు (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24) శ్రేయస్ అయ్యర్- 39 సిక్సర్లు (ఐపీఎల్ 2025) విరాట్ కోహ్లీ- 38 సిక్సర్లు (ఐపీఎల్ 2016) గుజరాత్ టైటాన్స్‌పై విజయంతో రజత్ పాటీదార్ కెప్టెన్సీ పరంగానూ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి రెండు సీజన్లలోనే.. వరుసగా రెండు సార్లు జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన రెండో