translateexpand_more

K Annamalai Resigns News

Latest updates from Telugu Digital news sources.

Vaartha02 Jun, 11:50 am
బీజేపీకి అన్నామలై రాజీనామా.. కొత్త పార్టీ వైపు అడుగులు

Tamil Nadu BJP Leader: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ కీలక నేత, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై ఆ పార్టీకి మంగళవారం (జూన్ 2) రాజీనామా చేశారు. గత రెండు రోజులుగా ఆయన పార్టీ మారుతున్నారనే ఊహగానాలు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసిన అనంతరం అన్నామలై తన రాజీనామా లేఖను సమర్పించారు. నితిన్ నబీన్‌తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లకు ఐదు పేజీలతో కూడిన సుదీర్ఘ లేఖను ఆయన అందజేశారు. అయితే, అన్నామలై రాజీనామాను బీజేపీ అధిష్ఠానం మాత్రం ఇప్పటివరకు ఆమోదించలేదు. Read Also : IMD On Monsoon : వేగంగా కదులుతున్న రుతుపవనాలు..పలు రాష్ట్రాల్లో వర్షాలు బీజేపీని వీడిన అన్నామలై.. భవిష్యత్తులో కొత్తగా ఒక రాజకీయ వేదికను ఏర్పాటుచేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 4న తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన తన రాజకీయ భవిష్యత్తు మరియు కొత్త ప్రణాళికలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మాజీ ఐపీఎస్ అయిన అన్నామలై ‘లౌకిక’, ‘తమిళ-కేంద్రీకృత’ దృక్పథంతో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని ప్రారంభించాలని గట్టిగా యోచిస్తున్నారు. ప్రతిపాదిత ఈ కొత్త పార్టీని రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల్లోగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. తమిళనాడులోని అధికార డీఎంకే, అన్నాడీఎంకే ద్రావిడ పార్టీలతో పాటు బీజేపీకి కూడా ప్రత్యామ్నాయంగా ఈ పార్టీని నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తమిళ గుర్తింపును జాతీయ దృక్పథంతో మేళవించి, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలను సమస్యల ఆధారంగా గట్టిగా వ్యతిరేకించే ఒక బలమైన రాజకీయ వేదికను అన్నామలై ఊహించుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తమిళనాడులో పార్టీ రాజకీయ వ్యూహాలు, విధానాల విషయంలో అన్నామలైకి, బీజేపీ కేంద్ర నాయకత్వానికి కొన్నాళ్లుగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యమే ఆయన రాజీనామాకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే తో పొత్తును పునరుద్ధరించడం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపికతో సహా పలు కీలక అంశాలపై కేంద్ర నాయకత్వం వ్యవహరించిన తీరుపై అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పొత్తులపై పదే పదే ఆధారపడటం కంటే తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి ఒక స్వతంత్ర సంస్థాగత పునాదిని నిర్మించుకోవడంపైనే దృష్టి పెట్టాలని అన్నామలై గట్టిగా వాదించారు. కానీ, జాతీయ నాయకత్వం మాత్రం విస్తృతమైన డీఎంకే (DMK) వ్యతిరేక వ్యూహానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే సమయంలో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నాయకత్వంలోని టీవీకే (TVK) పార్టీ సాధించిన పనితీరు తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నామలై సహచరులు పేర్కొంటున్నారు. సాంప్రదాయ ద్రావిడ పార్టీలకు భిన్నంగా కొత్త రాజకీయ శక్తులకు తమిళనాడులో ఇప్పుడు స్పష్టమైన ఆస్కారం ఏర్పడిందని, అందుకే అన్నామలై ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Swimming: స్విమ్మింగ్ చేస్తున్నారా? చర్మం పాడవకుండా ఉండాలా.. గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. CM Yogi : స్నేహం ముసుగులో దాడులా? సహించేది లేదు:: సీఎం ఆదిత్య‌నాథ్‌ Generation Z: సమాజంలో మార్పు జనరేషన్ జెడ్తోనే సాధ్యం IMD On Monsoon : వేగంగా కదులుతున్న రుతుపవనాలు..పలు రాష్ట్రాల్లో వర్షాలు Examination system : నమ్మకం సడలుతున్న పరీక్షా వ్యవస్థ! DK Shivakumar to take oath : కర్ణాటక సీఎంగా రేపు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం Weather Update: కేరళను తాకనున్న రుతుపవనాలు..భారీ నుంచి అతి భారీ వర్షాలు: IMD తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అమిత వేగమే ఇద్దరి ప్రాణాలను... పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్... భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. నేపాల్ ప్రధాని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు... పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు... తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (జూన్ 2, 2026) రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా... రాశి ఫలాలు – 02 జూన్ 2026 మేష రాశి మీరు లాభాలు వస్తాయని ఆశించి... రానున్న ఐదేళ్లలో భూమిపై భరించలేని వేడి పెరగనుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.... తెలంగాణలోని అంగన్‌వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించేందుకు కసరత్తు చేస్తోంది.