translateexpand_more

Karuppu Box Office Collection News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu31 May, 09:07 am
కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ‘సింగం-2’ తర్వాత దాదాపు 13 ఏళ్లుగా థియేట్రికల్ పరంగా సరైన కమర్షియల్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇటీవల వచ్చిన ‘కరుప్పు’ సినిమా ఊహించని భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 320 కోట్ల గ్రాస్ మార్కును దాటి సంచలనం సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సూర్య తనకు హిట్ ఇచ్చిన దర్శకులను నమ్మి వరుసగా మరో ఛాన్స్ ఇస్తూ క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇందులో భాగంగానే ‘కరుప్పు’ చిత్రంతో తనకు బిగ్గెస్ట్ థియేట్రికల్ సక్సెస్ అందించిన క్రేజీ డైరెక్టర్ RJ బాలాజీకి సూర్య మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. సూర్య కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 50వ సినిమాకు ఆర్‌జే బాలాజీనే దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే గతంలో తనకు ఓటిటిలో ‘జై భీమ్’ లాంటి క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కు కూడా సూర్య మరో క్రేజీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, సూర్య లైనప్ ప్రస్తుతం విభిన్నమైన ప్రాజెక్టులతో సాలిడ్ గా కనిపిస్తోంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఇప్పటికే సెట్స్‌పై ఉండగా మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జీతు మాధవన్ తో కూడా సూర్య ఒక సినిమా చేయబోతున్నారు. మొత్తానికి హిట్ కాంబినేషన్లను రిపీట్ చేస్తూ సరికొత్త దర్శకులతో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సూర్య బాక్సాఫీస్ వద్ద తన సునామీని కంటిన్యూ చేయడానికి పక్కా ప్లాన్‌తో దూసుకుపోతున్నారు.

Chitrajyothy01 Jun, 02:16 pm
సూర్య థింకింగే వేరు.. అసలిలా ఎవరూ ఊహించి ఉండరు

<p>కోలీవుడ్‌లో తనను ఎందుకు అందరూ అంతగా అభిమానిస్తారో నటుడు సూర్య (Suriya) మరోసారి నిరూపించారు. చాలా కాలంగా హిట్టు కోసం సూర్య వేచి చూస్తున్నారు. వరుస పరాజయాలతో డీలా పడిన సూర్యపై ఆ మధ్య రకరకాల వార్తలు వచ్చాయి. ఇక సూర్య సినిమాలు మానేస్తే బెటర్ అనేలా కూడా కొందరు కామెంట్స్ చేశారు. అలాంటి వారందరి నోళ్లకూ తాళం వేస్తూ.. ‘కరుప్పు’ (Karuppu)తో సెన్సేషనల్ సక్సెస్‌ని అందుకున్నారు సూర్య. చాలా గ్యాప్ తర్వాత తనకు వచ్చిన ఈ సక్సెస్‌‌కు కారణమైన వారిని సర్‌ప్రైజ్ చేస్తూ.. సూర్య తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన చిత్ర కీలక సభ్యులకు సూర్య ఊహించని గిఫ్ట్‌తో కృతజ్ఞతను చాటుకుంటున్నారు. సినిమా కోసం వారు పడిన కష్టానికి, అంకితభావానికి గుర్తింపుగా.. ఎవరూ ఊహించని విధంగా చిత్ర సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్‌లకు సరికొత్త లగ్జరీ కార్లను కానుకగా ఇచ్చారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>సాధారణంగా ఒక సినిమా విజయం సాధిస్తే కేవలం దర్శకుడిని మాత్రమే సత్కరించి, తెర వెనుక కీలక పాత్ర పోషించే ఇతర సాంకేతిక నిపుణులను పెద్దగా పట్టించుకోని ఆనవాయితీ ఇండస్ట్రీలో ఉంది. అలాగే నిర్మాతకు భారీగా లాభాలు వస్తే.. హీరో, సంగీత దర్శకులకు కార్లు ఇవ్వడం ఇప్పటి వరకు అంతా చూశారు. కానీ, ఫస్ట్ టైమ్ సూర్య మాత్రం అలా కాకుండా, తెర వెనుక శ్రమించే టెక్నీషియన్ల శ్రమను గుర్తించి గౌరవించడంపై ఇండస్ట్రీ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాములుగా అయితే.. సినిమా విజయాన్ని తమ అభిమానులు లేదా తోటి నటీనటులతో సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఇలా సాంకేతిక బృందంలోని ముఖ్య సభ్యులకు పర్సనల్‌గా ఇంత విలువైన బహుమతులు అందించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.</p><iframe width="100%" height="415" src="