translateexpand_more

Laddoo Sales News

Latest updates from Telugu Digital news sources.

TeluguOne03 Jun, 12:39 pm
శ్రీవారి లడ్డుల విక్రయాల్లో ఆల్ టైమ్ రికార్డ్

పవిత్రమైన శ్రీవారి లడ్డూల అమ్మకాల్లో ఆల్‌టైమ్ రికార్డ్ నమోదైంది. సాధారణంగా వేసవి సెలవుల్లో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. విశ్వ దైవమైన ఏడుకొండల స్వామి దర్శనం అనంతరం భక్తులు ప్రగాఢ విశ్వాసంతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదానికి తిరుమలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నిరంతరం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, టీటీడీ లడ్డూల ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. నాణ్యతతో పాటు పారదర్శకతను మెరుగుపరచడానికి అత్యాధునిక పరికరాలను ఉపయోగించడం ద్వారా భక్తులకు టీటీడీ నిరంతరాయ సరఫరా చేస్తోంది. ఆ క్రమంలో ఈ ఏడాది మేలో 'లడ్డూ' ప్రసాదం రికార్డు స్థాయిలో విక్రయించినట్లు టీటీడీ సీపీఆర్ఓ వెల్లడించారు. ఈ మే నెలలో రికార్డు స్థాయిలో 1,21,35,528 లడ్డూలు అమ్ముడయ్యాయి. 2024లో ఇదే నెలలో 1.01 కోట్లు, 2025లో 1.10 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే గతేడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.

Laddoo Sales News Keyword | Telugu Digital