translateexpand_more

Madhubala News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu28 May, 06:13 am
పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్ లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు

చిత్రసీమలో అందం, నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటి అందాల భామ మధుబాల. ఆమె జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె సినీ ప్రస్థానంతో పాటు అనేక వ్యక్తిగత సవాళ్లతో నిండి ఉంది. మధుబాల అసలుపేరు ముంతాజ్ జహాన్ బేగం దెహల్వి. 1933లో జన్మించిన మధుబాల జీవితంలో అదృష్టం, దురదృష్టం పక్కపక్కనే పెరిగాయని చెప్పవచ్చు. ఆమె తండ్రి అతావుల్లా ఖాన్, తల్లి ఆయేషా బేగం దంపతులకు 11 మంది సంతానంలో ఆమె ఐదవ సంతానం. తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో, కుటుంబ పోషణ భారం మధుబాల చిన్నతనం నుంచే మోయాల్సి వచ్చింది. ఎనిమిదేళ్ల వయస్సులోనే బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, ఐదేళ్ల పాటు బాలనటిగా నటించి కుటుంబాన్ని పోషించారు మధుబాల. ఆమె తండ్రి అతావుల్లా ఖాన్ స్వభావం మధుబాల జీవితంపై, కెరీర్‌పై చాల ప్రభావాన్ని చూపింది. ఆయన తొందరపాటు, దురుసు స్వభావం కారణంగా ఉద్యోగం కోల్పోవడమే కాకుండా, తన కుమార్తె సినిమాలకు అధిక పారితోషికం ఆశించి కొన్ని మంచి అవకాశాలను కోల్పోయేలా చేశారు. ‘తరానా’ సినిమా షూటింగ్ సమయంలో లొకేషన్ మార్చమని డిమాండ్ చేయడం వల్ల దిలీప్ కుమార్‌తో కలిసి కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. 1947లో కేదార్ శర్మ దర్శకత్వంలో రాజ్ కపూర్‌తో కలిసి ‘నీల్ కమల్’ చిత్రంలో 14 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందారు మధుబాల. ఆ తర్వాత కమల్ ఆమ్రోహి దర్శకత్వంలో వచ్చిన ‘మహల్’ చిత్రంతో అగ్రతారగా ఎదిగారు. దిలీప్ కుమార్‌తో కలిసి ‘తరానా’, ‘మొఘల్-ఎ-ఆజం’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. ‘మొఘల్-ఎ-ఆజం’ సమయంలో దిలీప్ కుమార్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నప్పటికీ, మధుబాల తండ్రి ఈ సంబంధాన్ని వ్యతిరేకించారు. దిలీప్ కుమార్ మధుబాలను తన కుటుంబం

TV9 Telugu25 May, 08:09 am
సినీ రంగం రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో గొప్ప పేరు, అపారమైన ప్రజాదరణ, లక్షలాది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నప్పటికీ కొంతమంది నటీమణుల జీవితాలు అత్యంత విషాదకరంగా...

సినీ రంగం రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో గొప్ప పేరు, అపారమైన ప్రజాదరణ, లక్షలాది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నప్పటికీ కొంతమంది నటీమణుల జీవితాలు అత్యంత విషాదకరంగా ముగిశాయి. వీరి బాధాకరమైన మరణం యావత్ వినోద ప్రపంచాన్ని కుదిపేస...

Madhubala News Keyword | Telugu Digital