translateexpand_more

Movies News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu02 Jun, 11:41 am
నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా.. తన సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగానూ టాలీవుడ్‌లో సరికొత్త మైలురాళ్లను అందుకుంటున్నారు. ఇటీవలే ఈ బ్యానర్ నుండి వచ్చిన ‘కోర్టు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించడంతో, నాని తన ప్రొడక్షన్ హౌస్‌లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే, నాని లైనప్ మరియు వాల్ పోస్టర్ సినిమా రాబోయే చిత్రాల గురించి నెట్టింట ప్రచారంలో ఉన్న వార్తలపై నిర్మాణ సంస్థ స్పందిస్తూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. నాని ప్రస్తుతం నటుడిగా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారని, ఈ చిత్రం ఆగస్టు విడుదలకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. దీని తర్వాత రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్లు టాక్. ఇక నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై మూడు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ‘బ్యాండ్ మేళం’ (హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు) చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సతీష్ జవ్వాజి చెప్పిన ఒక సరికొత్త ఐడియా నానికి నచ్చిందని, రీసెంట్‌గా ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసి లీడ్ యాక్టర్ల కోసం అన్వేషణ మొదలుపెట్టారని ప్రచారం సాగుతోంది. ‘కోర్టు’ చిత్రంతో నానికి సాలిడ్ హిట్ అందించిన డైరెక్టర్ రామ్ జగదీష్ మరో స్క్రిప్ట్ పూర్తి చేశారని, వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని బజ్. నాని తన సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పైనే మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ రకమైన వార్తలు ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్న తరుణంలో.. ‘వాల్ పోస్టర్ సినిమా’ టీమ్ ఈ అప్‌డేట్స్‌పై స్పష్టతనిస్తూ అఫీషియల్ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేసింది. "మా తదుపరి సినిమాలకి సంబంధించి ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న నివేదికలు మరియు వార్తలు అన్నీ అవాస్తవం, వాటిలో ఎలాంటి నిజం లేదు. మా బ్యానర్ నుండి రాబోయే అన్ని రకాల అధికారిక అప్‌డేట్‌లను కేవలం మా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే మీతో పంచుకుంటాము. కాబట్టి, వెరిఫై కాని ఎలాంటి సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని, అలాగే ప్రచారం చేయవద్దని కోరుతున్నాము." అని ప్రకటించారు. ఇక ఈ ప్రకటనతో నాని ప్రొడక్షన్ హౌస్ నుండి రాబోయే సినిమాలపై వస్తున్న రూమర్లకు తాత్కాలికంగా తెరపడింది.

Chitrajyothy02 Jun, 09:27 am
బ్లాస్ట్.. ఏం సినిమారా బాబు.. మెంటలెక్కించేస్తోంది

ఈమధ్యకాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉంటేనే సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తీసిపడేస్తున్నారు. కంటెంటే ఇప్పుడు కింగ్ అని నిరూపించిన సినిమాల్లో బ్లాస్ట్ జోన్ (Blast Zone) ఒకటి. ఈమధ్యకాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉంటేనే సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తీసిపడేస్తున్నారు. కంటెంటే ఇప్పుడు కింగ్ అని నిరూపించిన సినిమాల్లో బ్లాస్ట్ జోన్ (Blast Zone) ఒకటి. అర్జున్ సర్జా (Arjun Sarja), అభిరామి, ప్రీతీ ముకుందన్ (Preity Mukundhan) కీలక పాత్రల్లో డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కె. రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్లాస్ట్. తెలుగులో బ్లాస్ట్ జోన్ పేరుతో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కేవలం ₹7 కోట్ల పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన బ్లాస్ట్ చిత్రం, ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది. యావత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, కేవలం ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.58 కోట్ల నుండి రూ.25 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.3.09 కోట్ల షేర్ సాధించడమే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో ఊహించని విధంగా రూ.5.55 కోట్లు కొల్లగొట్టింది. భారీ ప్రమోషన్లు లేకపోయినా, కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపిస్తూ బ్లాస్ట్ జోన్ బాక్సాఫీస్ వద్ద నిజమైన బ్లాస్ట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏం సినిమా రా బాబు.. మెంటలెక్కించేస్తోంది.. అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాస్ట్ జోన్ కథ విషయానికొస్తే.. రాజారామన్ (అర్జున్ సర్జా) అనే ఒక సాధారణ కరాటే మాస్టర్. ఆయన భార్య (అభిరామి), కూతురు నీల (ప్రీతి ముకుందన్) కూడా మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన నిపుణులు. సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా, క్రమశిక్షణతో బ్రతికే ఒక ఆదర్శవంతమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీరిది. ఇక నగరంలో ఒక పెద్ద ఇల్లీగల్ బిజినెస్ డీల్‌కు సంబంధించిన రూ. 1000 కోట్ల భారీ లంచం సొమ్ము చేతులు మారుతుంది. ఈ భారీ స్కామ్ వెనుక ఒక పవర్‌ఫుల్ అండర్ వరల్డ్ డాన్ (జాన్ కొక్కెన్) ఉంటాడు. అయితే, ఊహించని కొన్ని పరిస్థితుల వల్ల ఆ రూ. 1000 కోట్ల అక్రమ సొమ్ము మరియు దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఈ కరాటే మాస్టర్ రాజారామన్ చేతికి చిక్కుతాయి. ఆ డబ్బును ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని ఆ క్రూరమైన క్రిమినల్ గ్యాంగ్ రాజారామన్ కుటుంబంపై దాడికి దిగుతుంది. తన సామ్రాజ్యానికి అడ్డువచ్చిన ఈ చిన్న కుటుంబాన్ని సర్వనాశనం చేయాలన్న డాన్ ప్రయత్నాలు ఫలించాయా .. ? కరాటే మాస్టర్ కుటుంబం.. విలన్స్ కి చుక్కలు చూపించిందా.. ? లేక వారే డాన్ చేతిలో బలయ్యారా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Telugu Times02 Jun, 01:50 am
హైదరాబాద్ లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో తెలుగు రాష్ట్రాలలో తొలి, ఏకైక ఐమాక్స్ స్క్రీన్ ను లాంచ్ చేయనున్న

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని ప్రేక్షకులకు అందించడంలో ఎప్పుడూ ముందుండే ఏఎంబీ సినిమాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్‌ల భాగస్వామ్యంతో ఏర్పడిన సంస్థ, దక్షిణ భారతదేశంలో తొలి డాల్బీ సినిమాను ప్రారంభించడం నుంచి, హైదరాబాద్‌లో తొలి HDR by Barco స్క్రీన్‌లలో ఒకదాన్ని అందించడం వరకు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఇప్పుడు ఆ లెగసీని కొనసాగిస్తూ, ఏషియన్ గ్రూప్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటిలతో కలిసి తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త మల్టీప్లెక్స్, తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుదర్శన్ 70 ఎంఎం వద్ద నిర్మితమవుతోంది. దశాబ్దాలుగా సినీ వేడుకలకు, ఎన్నో చారిత్రాత్మక బ్లాక్‌బస్టర్ విజయాలకు వేదికగా నిలిచిన ఈ ప్రదేశం, ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ విక్టరీ రూపంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. సినిమా వారసత్వాన్ని, అత్యాధునిక సాంకేతికతను ఒకే వేదికపై కలిపే ఈ మల్టీప్లెక్స్, హైదరాబాద్ ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ త్వరలోనే ప్రారంభం కానుండగా, ప్రీమియం మూవీ-గోయింగ్ అనుభూతికి ఇది హైదరాబాద్‌లో కొత్త గమ్యస్థానంగా మారనుంది.